అరబ్ దేశాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలిసిందే. అక్కడ స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. ఆఖరికి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అలాంటి సౌదీలో ఇటీల కొంతకొంత మార్పులు సంతరించుకుంటున్నాయి.
మొన్నటకీ మొన్నఅందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడమే గాక అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడూ ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాద్యాయులందరికి సంగీత విద్యలో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్ నూర్ అల్-దబాగ్ రియాద్‌లో జరిగిన లెర్న్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు.
ఎందుకంటే..ప్రాథమిక తరగతుల నుంచి పాఠ్యాంశాల్లో సంగీత విద్యను చేర్చాలనే యోచనలో ఉండటంతో ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులందరికీ సంగీతంలో శిక్షణ ఇస్తున్నట్లు నూర్ పేర్కొంది. దాదాపు 9 వేల మంది మహిళా ఉపాధ్యాయులకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు సదరు శాఖ ప్లానింగ్ డైరెక్టర్ నూర్ తెలిపారు. అలాగే కళలు, సంస్కృతిని కూడా విద్యా పాఠ్యాంశాల్లో విలీనం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అంతేగాదు విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించి తద్వారా సౌదీని సుసంపన్న దేశంగా మలచాలన్న దిశవైపుకు అడుగులు వేస్తోంది. ఇది నిజంగా సౌదీ ప్రగతి శిలకు సూచనగా చెప్పొచ్చు. కాగా, 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా డ్రైవర్లపై నిషేధం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం వరకు పలు మార్పులు తీసుకురావడం విశేషం.
(చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు)
Comments
Please login to add a commentAdd a comment