ముంబై: ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ కొత్త వడ్డీ రేటు ఫ్యూచర్స్ (ఐఆర్ఎఫ్) ను పరిచయం చేస్తోంది. డిసెంబర్ 30 నుంచి ఇంటరెస్ట్ రేట్ ఫ్యూచర్స్(ఐఆర్‌ఎఫ్)లో ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 19,2022నాటికి గడువు తీరే(మెచ్యూర్) 6 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ బాండ్ల కాంట్రాక్టులను ప్రవేశపెడుతోంది. 6.84శాతం ఆధారంగా ఈ బాండ్లలో ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేసింది. ఎఫ్‌పీఐలు, ట్రేడింగ్ హౌస్‌లు, సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా వీటిలో పార్టిసిపేట్ చేసేందుకు వీలుంటుందని బీఎస్‌ఈ జారీ చేసిన ఒక సర్క్యులర్ లో తెలిపింది. ఆర్బీఐ పాలసీ, విదేశీ నిధుల ప్రవాహం, లిక్విడిటీ డిమాండ్ సహా వివిధ అంశాలపై ఆధారపడి ఈ బాండ్లపై క్యాష్ సెటిల్డ్ ట్రేడింగ్ నిర్వహిస్తారు.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) కూడా ఐఆర్ ఎఫ్ కాంట్రాక్టు ఆధారిత కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల ట్రేడింగ్‌ను నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ సంవత్సరం మే 2030 లో గడువు తీరే ప్రభుత్వ బాండ్లపై ఐఆర్ఎఫ్ ఒప్పందాలు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
బీఎస్ఈలో కొత్త బాండ్ ఫ్యూచర్స్
Published Mon, Dec 26 2016 4:02 PM | Last Updated on Mon, Sep 4 2017 11:39 PM
Advertisement
Advertisement