
తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖీషా పటేల్ 2010లో వచ్చిన కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో ఆమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. కొమురం పులి తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆమెకు అవి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో ఆమె ఆఫర్లు కరువయ్యాయి. ఫలితంగా ఆమె తెలుగు తెరకు దూరమైంది. కొమురం పులి మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు తమిళ, కన్నడ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్క వరుస సినిమాలు చేసింది. అయితే ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఆమె సినిమాలకు బై చెప్పేసింది.
చదవండి: నన్ను అల అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి
ప్రస్తుతం నిఖీషా విదేశాల్లో ఉంటుంది. ఈ క్రమంలో తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో బాయ్‌ఫ్రెండ్ ఎవరని, అతడి చూపించాలంటూ ఫ్యాన్స్ నుంచి సందేశాలు రావడంతో తన ప్రియుడిని చూపింది నిఖీషా పటేల్. దీపావళి పండగ సందర్భంగా తన కాబోయే భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.
చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..!
Comments
Please login to add a commentAdd a comment