
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రికార్డ్ స్థాయిలో ట్వీట్లు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్‌కు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. కొంతమంది నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌లను కూడా గట్టిగానే ట్రెండ్ చేశారు. దీంతో ఓ హీరోయిన్ ఇబ్బందుల పాలయ్యారు.
పవన్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచిన సినిమా కొమరం పులి. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నటించిన నికీషా పటేల్, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఓ పొరపాటు చేశారు. హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్ (#HappyBirthdayPawanKalyan) అనే హ్యాష్ ట్యాగ్‌కు పోటిగా.., హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్ (#HappyBirthdayPawalaKalyan) అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో ఉండటంతో నికీషా పొరపాటున పావలా కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో విషెస్‌ను ట్వీట్ చేశారు.
దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కొద్దిసేపటికి జరిగిన పొరపాటును గమనించిన ఈ భామ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన మరోసారి సరైన హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే నికీషా చేసిన పావలా కల్యాణ్ ట్వీట్ వైరల్ అయ్యింది. దీంతో అభిమానులను శాంతింప చేసేందుకు క్షమాపణ కూడా కోరారు. (ఇది చదవండి: మాట తప్పిన పవన్ కల్యాణ్)
Comments
Please login to add a commentAdd a comment