​Heroine Nikesha Patel Responds To Marraige Rumours - Sakshi
Sakshi News home page

Nikesha Patel : విదేశియుడితో పెళ్లిపై స్పందించిన నిఖీషా పటేల్‌

Published Thu, Oct 27 2022 3:50 PM | Last Updated on Thu, Oct 27 2022 5:04 PM

​Heroine Nikesha Patel Responds To Marraige Rumours - Sakshi

కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భామ నిఖీషా పటేల్‌. ఈ సినిమా నిరాశపచడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన సక్సెస్‌ రాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పేసి విదేశాల్లో సెటిల్‌ అయింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది.

ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తనకు నచ్చలేదంటూ వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా ఓ విదేశియుడితో ప్రేమలో ఉన్నానంటూ వెల్లడించింది.

అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఓ వ్యక్తితో క్లోజ్‌గా దిగిన ఫోటోను సైతం షేర్‌ చేయడంతో నిఖీషా పటేల్‌  త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఓ ఫోటోను డిలీట్‌ చేసిన ఆమె తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఇది ఫేక్‌ న్యూస్‌ అంటూ క్లారిటీ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement