ముంబయి: ఆరు రూపాయలు చిల్లర తిరిగి ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్కుకు గత 26 ఏళ్లుగా ఉపశమనం లభించలేదు. విజిలెన్స్ టీం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వని కారణంగా 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. అనంతరం అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద పనిచేసేవారు. 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్యాసింజర్‌గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ బుక్కయ్యారు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ వర్మ రూ.280 ఇచ్చి చిల్లర ఇవ్వలేదు.
విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనక ఉన్న అల్మారాలో రూ.450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ వర్మ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు.
చిల్లర రూ.6 లేనందుకే ఇవ్వలేకపోయాడని రాజేశ్ వర్మ తరుపున లాయర్ మిహిర్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. అల్మారాను రాజేశ్ వర్మతో పాటు ఉద్యోగులందరూ ఉపయోగిస్తారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది.
ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ..
Comments
Please login to add a commentAdd a comment