![No Supreme Court Relief To Manish Sisodia - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/15/sisodia_img.jpg.webp?itok=OSli-94L)
ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అక్టోబర్ 4కు వాయిదా వేసింది న్యాయస్థానం. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది.
అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమాను కలుసుకునేందుకు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భార్య ఆరోగ్యం క్షీణిస్తోందని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సిసోడియా తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. తన తరుపున వాదనలకు రెండు గంటల సమయం ఇవ్వాలని బెంచ్‌ను కోరారు. తమ క్లయింట్ అభ్యర్ధనపై తక్షణం ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం..
ఢిల్లీ ఎక్సైజ్ పోర్టుఫోలియోను నిర్వహించే క్రమంలో మధ్యం కుంభకోణం జరిగిందని సీబీఐ మనీష్ సిసోడియాను అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వర్తించారు. అయితే.. మద్యం కుంభకోణంలో ఫిబ్రవరి 26న సీబీఐ ఆయన్ని అరెస్టు చేసింది. అప్పటి నుంచీ కస్టడీలోనే ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో ఈడీ కూడా సిసోడియాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ ప్రభుత్వంలో తన పదవులకు సిసోడియా రాజీనామా చేశారు.
ఇదీ చదవండి: Nuh Violence: కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు.. ఇంటర్నెట్ బంద్..
Comments
Please login to add a commentAdd a comment