న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వవద్దని సుప్రీంకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదించింది. లిక్కర్‌స్కామ్‌లో మనీష్‌సిసోడియా పీకల్లోతు కూరుకుపోయారని ఈడీ తెలిపింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌విరాజు వాదనలు వినిపించారు.
మనీష్‌సిసోడియాపై పెట్టిన కేసులు కల్పితం కాదని, ఆయనకు వ్యతిరేకంగా చాలా సాక్షాధారాలున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మనీష్‌సిసోడియా ఈ కేసులో 17 నెలలుగా ఎందుకు జైలులో ఉండాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్‌మనుసింఘ్వి వాదించారు.
వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాది లిక్కర్ పాలసీ రూపకల్పన అని ప్రస్తావించినపుడు సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుంది. పాలసీ రూపకల్పనకు నేరం చేయడానికి మధ్య తేడా ఏంటో చెప్పాలని కోరింది. కాగా, మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment