సాక్షి,ఢిల్లీ: లిక్కర్‌స్కామ్‌కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ సీనియర్‌నేత మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. లిక్కర్ కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు రెండింటిలో సిసోడియాకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం(ఆగస్టు9) ఉదయం తీర్పు వెలువరించింది. బెయిల్‌పై ఉన్నంత కాలం దేశం విడిచి వెళ్లకూడదని, పాస్‌పోర్టు సరెండర్ చేయాలని కోర్టు షరతు విధించింది.
ఇటీవలే సిసోడియా బెయిల్‌పై వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కె.వి విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. వాదనల సందర్భంగా బెయిల్‌ను ఈడీ,సీబీఐ వ్యతిరేకించినప్పటికీ సిసోడియాకు దేశ అత్యున్నత కోర్టు బెయిల్ విషయంలో ఉపశమనం కల్పించింది.
కేసులో విచారణ ఆలస్యమవుతున్నందునే బెయిల్ ఇస్తున్నామని కోర్టు తెలిపింది. బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ కాలం నిందితుడిని జైలులో ఉంచడం అతడి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా 17 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment