
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సిబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో కేసులో కేజ్రీవాల్‌కు ఇటీవలే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్‌జైలులోనే ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత మనీష్‌సిసోడియాకు లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.