onwards
-
రూ.6 చిల్లర ఇవ్వనందుకు 26 ఏళ్లుగా శిక్ష..
ముంబయి: ఆరు రూపాయలు చిల్లర తిరిగి ఇవ్వనందుకు ఓ రైల్వే క్లర్కుకు గత 26 ఏళ్లుగా ఉపశమనం లభించలేదు. విజిలెన్స్ టీం పంపిన వ్యక్తికి చిల్లర ఇవ్వని కారణంగా 26 ఏళ్ల క్రితం విధుల నుంచి తొలగించబడ్డారు. అనంతరం అప్పీలుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. రైల్వే టికెట్ క్లర్క్ రాజేశ్ వర్మ ముంబయి కుర్లా టెర్మినల్ జంక్షన్ వద్ద పనిచేసేవారు. 1997 ఆగష్టు 30న విజిలెన్స్ టీం ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌ను ప్యాసింజర్‌గా పంపి టికెట్ కొనుగోలు చేయించగా.. వర్మ బుక్కయ్యారు. సదరు ప్యాసింజర్ రూ.500 ఇవ్వగా.. టికెట్టు ధర రూ.214 పోగా మిగిలిన రూ.286 ఇవ్వాల్సి ఉంది. కానీ రాజేశ్ వర్మ రూ.280 ఇచ్చి చిల్లర ఇవ్వలేదు. విజిలెన్స్ అధికారులు చెక్ చేయగా.. ఆ రోజు వసూళ్లలో రూ. 58 మిస్ అయ్యాయి. అంతేకాకుండా ఆ క్లర్క్ వెనక ఉన్న అల్మారాలో రూ.450 ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాజేశ్ వర్మ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు ఓ అంచనాకు వచ్చారు. క్రమశిక్షణా చర్యల కింద రాజేశ్ వర్మను జనవరి 31, 2002న విధుల నుంచి తప్పించారు. అయితే.. ఆ నిర్ణయాన్ని రాజేశ్ వర్మ సవాలు చేస్తూ అప్పీలుకు వెళ్లారు. చిల్లర రూ.6 లేనందుకే ఇవ్వలేకపోయాడని రాజేశ్ వర్మ తరుపున లాయర్ మిహిర్ దేశాయ్ కోర్టుకు విన్నవించారు. అల్మారాను రాజేశ్ వర్మతో పాటు ఉద్యోగులందరూ ఉపయోగిస్తారని తెలిపారు. చిల్లర ఇవ్వలేదనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ అల్మారాకు ప్రవేశం ఉందని, అధిక ఛార్జీలు వసూలు చేశారనడానికి రుజువు ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజేశ్ వర్మ అప్పీలును తిరస్కరించింది. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. -
నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలకు రత్నగిరి ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులకు దీక్షావస్త్రాలు బహూకరిస్తారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఆయుష్య హోమానికి అంకురార్పణ చేస్తారు. ఈ ఏడాది కొత్తగా పవిత్రోత్సవాలను కూడా ప్రారంభించనున్నారు. స్వామివారికి వివిధ కూరగాయలు, సుగంధద్రవ్యాలతో వండిన పిండివంట ‘కాయం’ నివేదిస్తారు. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. రెండో రోజు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం చేతికి కట్టుకునే కంకణాలను భక్తులకు బహూకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు రత్నగిరి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికపై సూర్యనమస్కారాలు ప్రతి ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని కల్యాణ వేదిక మీద నిర్వహిస్తున్న సూర్య నమస్కారాలు ఈ వారం కూడా కొనసాగాయి. ఆకొండి కృష్ణ, రేపాక రామదాసు, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
వేసవి సెలవులిచ్చారోచ్..
నేటి నుంచి జూన్ 11 వరకూ విద్యార్థుల్లో వెల్లివిరిసిన ఆనందం వేసవి సెలవులు వచ్చేశాయి.. బడిగంటకు విరామం దొరికింది.. విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. సెలవుల తర్వాత మళ్లీ కలుద్దామంటూ మిత్రులు వీడ్కోలు చెప్పుకున్నారు. రాయవరం : పరీక్షలు ముగిశాయి..ఫలితాలు ప్రకటించారు..ప్రోగ్రెస్ కార్డులు చేతపట్టుకొని ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు విద్యార్థులు వేసవి సెలవులిచ్చారంటూ ఆనందంగా ఇళ్లబాట పట్టారు. పొరుగు గ్రామాల స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ శనివారం మధ్యాహ్నం వరకూ పాఠశాలలో గడిపారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు పెట్టే, బేడా సర్దుకొని స్వగ్రామాలకు బయల్దేరారు. సాధారణంగా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 23 ఆదివారం కావడంతో 22 చివరి పనిదినమైంది. 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది ప్రస్తుత విద్యా సంవత్సరం ( 2016–17) ముగియగానే కొత్త విద్యా సంవత్సరం (2017–18 ) ప్రారంభించారు. గత నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల కింద 4,412 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 1,506 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో ఎనిమిది లక్షల మంది చదువుకుంటున్నారు. వీరందరికీ నేటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దాంతో ఏడాది పాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు పట్టరాని సంతోషం కలిగింది. పాఠశాలలకు చివరి పనిదినం కావడంతో ఉపాధ్యాయులు పలు చోట్ల విద్యార్థులకు స్వీటు, హాట్‌తో పాటు రస్నా అందజేశారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచనలిచ్చారు. విద్యార్థులకు సెలవులు ఇచ్చినా ఉపాధ్యాయులు మాత్రం ప్రమోషన్ జాబితా తయారీలో తలమునకలయ్యారు. -
అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యకలాపాలు
విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్‌లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్‌గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్‌స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్‌స్పాట్‌కు వంద మీటర్ల రేడియస్‌లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు. -
అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యకలాపాలు
విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్‌లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్‌గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్‌స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్‌స్పాట్‌కు వంద మీటర్ల రేడియస్‌లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు. -
30 నుంచి ఆర్మీ ర్యాలీలు
సామర్లకోట: యువకులు ఆర్మీలో చేరడానికి ఈనెల 30వ తేదీ నుంచి ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీఓ బి. నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీన కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని క్రీడా మైదానంలోను, 31న అమలాపురం టీటీడీసీలోను ఈ ర్యాలీలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన రాజమహేంద్రవరంలో ధవిళేశ్వరం రోడ్డులోని క్వాయర్ బోర్డులో ఎంపిక జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో సెంటర్లకు ఉదయం 9.30 గంటలకు హాజరు కావాలన్నారు. 166 మీటర్ల ఎత్తు, 76–81 మధ్య ఛాతీ, 50 కేజీల బరువు ఉన్న, 10వ తరగతి చదివిన వారు (21 ఏళ్లు), ఇంటర్ పూర్తి చేసిన వారు (23 ఏళ్లు) అర్హులని ఆయన తెలిపారు. -
వచ్చే ఏడాదికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ ఇన్చార్జి జీఎం వెల్లడి ఎన్జీఎన్ను ప్రారంభించిన కలెక్టర్ ల్యాండ్‌లైన్‌తో వీడియో కాలింగ్, వాయిస్, మల్టీమీడియా సేవలు అందుబాటులోకి.. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వచ్చే ఏడాది మార్చి తరువాత జిల్లాలో 4జీ సేవలు అందుబాటులోకి తేనున్నట్టు జిల్లా ఇన్చార్జి జీఎం ఎం.జాన్ క్రిసోస్టమ్ తెలిపారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నెక్ట్స్ జనరేషన్ నెట్వర్క్ (ఎన్జీఎన్) ఎక్సే్ఛంజిని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో క్రిసోస్టమ్ మాట్లాడుతూ, మొదటి దశలో 4జీ సేవలను కాకినాడలో అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తగా ప్రారంభించిన ఎన్జీఎన్ ఎక్సే్ఛంజి వల్ల ఒకే లైనుపై వాయిస్, వీడియో కాలింగ్, డేటా, మల్టీమీడియా సర్వీసులు పని చేస్తాయన్నారు. ల్యాండ్‌లైన్‌కు కూడా ప్రీపెయిడ్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 25 తరువాత నుంచి ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్ ద్వారా రోజంతా ఉచిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి రానున్నదని చెప్పారు. నూతనంగా రూ.49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్, దీంతోపాటు ఒక ప్రీపెయిడ్ సిమ్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.470కే అన్ లిమిటెడ్ ప్లానులో 10 జీబీ వరకు 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ను పొందవచ్చని క్రిసోస్టమ్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు దీటుగా సేవలందించి ప్రజలకు బీఎస్ఎన్ఎల్ మరింత చేరువ కావాలని అన్నారు. కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఉచిత వైఫై అందిస్తే తాము సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఐటీఎస్ అ«ధికారి ఎ.శ్రీనివాసరావు, డీజీఎంలు రమేష్‌బాబు, డి.సుబ్బారావు, ఏవీ కృష్ణారావు, విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
23రోజుల నుండి పాఠాల్లేవు