బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ భారీ బడ్జెట్ మూవీ 'షెహజాదా'తో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత 'సత్యప్రేమ్‌కి కథ'తో ప్రేక్షకుల మన్ననలను పొంది నెమ్మది నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకునే యత్నం చేశాడు. మళ్లీ అలానే మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రఖ్యాత దర్శకుడు కబీర్ ఖాన్ నిర్మిస్తున్న 'చందు ఛాంపియన్' మూవీతో మన ముందుకొస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈ మూవీ షూటింగ్ ఒక ఏడాదికి పైగా పట్టింది. పగలు, రాత్రి అనక జరిగిన నిర్విరామ షూటింగ్‌లో హీరో ఆర్యన్ చక్కెర జోలికే పోలేదట. ఈ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి అవ్వడంతో దర్శకుడు కబీర్ సింగ్ ఇప్పుడైన నోరీ తీపి చేసుకోమంటూ రసమమలై తీసుకొచ్చి హీరో ఆర్యన్‌కి తినిపించాడు. ఈ మూవీ షూటింగ్ ఎంతలా విజయవంతంగా పూర్తి అయ్యిందో, అలానే ఈ మూవీ నీకు మంచి పేరు తెచ్చిపెడుతుందంటూ ఆర్యన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్యన్ తన కొత్త సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే..దాదాపు ఏడాదికి పైగా చక్కెర లేని ఆహారమే తీసుకున్నాడు. పైగా చక్కెరకు బదులు తాను సహజ ఉత్పత్తుల తీసుకున్నట్లు కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఆ హీరోలా చేస్తే శరీరంలో సంభవించే మార్పేలేంటి తదితరాల గురించి తెలుసుకుందామా!.
ఒక ఏడాది పాటు ఆ హీరోలా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎవ్వరైన దీన్ని ప్రయ్నతించవచ్చా?. ఈ డైట్ కారణంగా శరీరంలో ఎలా ప్రభావితమవ్వుతుంది, ఇది మంచిదేనా? అంటే..పూర్తిగా చక్కెరకు దూరంగా ఉండటం లేదా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరం అనేక సానుకూల మార్పులకు దారితీస్తుంది. మొదట్లో ఈ డైట్ పాటించటం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. క్రమేణ మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ సమ స్థాయిల్లో ఉండటం జరగుతుంది. తద్వారా మానసికోల్లాసం ఏర్పడి జీవక్రియ మెరుగుపడుతుంది. ఒబెసిటీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గి నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ డైట్ వల్లే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో సవివిరంగా చూద్దాం!.
హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది:
ఒక టీస్పూన్ చక్కెరలో 20 కిలో కేలరీలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కెరను పూర్తిగా దూరంగ పెట్టగలిగితే ఇన్సులిన్ సెన్సిటివిటీకీ సహాయపడుతుంది. టైప్ 2 డయబెటిస్ రాకుండా చేస్తుంది. ఒక రకంగా దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దరిచేరవు. ఎప్పుడైతే పరిమిత కేలరీలు తీసుకుంటామో అప్పుడూ ఆటోమెటిక్‌గా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది:
చక్కెర వినియోగం ఎప్పుడైతే తగ్గిస్తామో.. ముందుగా మానసిక స్థితిలో మంచి మార్పులు వస్తాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది తద్వారా మతిమరుపు వంటి బ్రెయిన్ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం ఏర్పడి తెలియని మానసికోల్లాసం వస్తుంది. నిజం చెప్పాలంటే చక్కెర వినియోచటం మానేయడం వల్ల చాలావరకు పాజిటివ్ మార్పులే చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో పంచదార తీసుకోకపోతే నీరసంగా అనిపిస్తుంది. ఎలాగైతే ఆల్కహాల్ అకస్మాత్తుగా వదిలేస్తే సమస్యలు ఎదురవ్వుతాయో అలాంటి లక్షణాలే పంచాదర మానేసిన వారిలోనూ కనిపిస్తాయట. అంతేగాదు నీరసం తోపాటు మానసికంగా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందట. అయితే శరీరంలో మెటబాలిజం మాత్రం పెరుగుతందట. ఫలితంగా ఎలాంటి దీర్ఘాకాలిక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు నిపుణులు.
అయితే ఇక్కడ చక్కెరను తగ్గించడం అంటే దానికి బదులుగా బెల్లం లేదా కృత్రిమ స్వీటెనర్లతో భర్తీ చేయడం కాదు. చక్కెర, బెల్లం రెండూ సమాన కేలరీలను కలిగి ఉంటాయనే విషయం గుర్తించుకోవాలి. అందువల్ల మనం తీసుకునే స్వీట్‌లు, పానీయాలు, శక్తి పానీయాలు వంటి వాటిల్లోని షుగర్ కంటెంట్ దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటేనే మంచింది. అలాగే ఈ నో షుగర్ డైట్‌ని ఫాలో అయ్యే మందు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుడిని సంప్రదించి వారి మార్గదర్శకంలో సరైన విధంగా ఈ డైట్‌ని ఫాలో అయ్యి సత్ఫలితాలను పొందడం మంచిది. ఏదీఏమైన చక్కెరను పరిమిత చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చనేది వాస్తవం.
(చదవండి: ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'! ఇప్పటికీ రాత్రిళ్లు అక్కడకు వెళ్తే హడలిపోవాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment