ballywood actor
-
మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..?
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గత శనివారమే తీవ్ర అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 73 ఏళ్ల మిధున్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల్లో మిథున్ బ్రెయిన్‌కి సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్‌కి గురయ్యినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దిరోజులకే మిథున్ ఇలా అస్వస్థతకు గురవ్వడం బాధకరం. అయితే మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్న ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది? ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే.. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరకపోయినా లేదా తగ్గినా ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందకుండా పోతాయి. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభమవుతుంది. ఈ తర్వాత రోగి పరిస్థితి విషమంగా అయిపోతుంది. అలాగే మెదడుకు సంబంధించిన మరొక ప్రమాదకరమైన స్ట్రోక్ ఒకటి ఉంది. దీని గురించి తరుచుగా వింటుంటాం. అదే బ్రెయియన్ హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తం మెదడు కణాలపై ఒత్తిడి పెంచి దెబ్బతీస్తుంది. చాలమందికి ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. పైగా ఈ పరిస్థితి కాస్త క్రిటికల్ అనే చెప్పొచ్చు కూడా. లక్షణాలు.. BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1 — Sai Ram B (@SaiRamSays) February 11, 2024 మాట్లాడటం, ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖం చేతులు లేదా కాలులో తిమ్మిరిగా లేదా పక్షవాతానికి గురవ్వడం ఒకటి లేదా రెండు కళ్లల్లో కనిపించే సమస్యలు తలనొప్పి నడకలో ఇబ్బంది ఆకస్మికంగా మైకం కమ్మడం ఏదీఏమైనా స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అనే చెప్పాలి. దీనికి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో రోగికి అత్యవసరమైన వైద్య సహాయం త్వరగా పొందితే మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ఇతర స్ట్రోక్‌లు రాకుండా నియత్రించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. -
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నో షుగర్ డైట్!అలా చేయడం మంచిదేనా?
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ భారీ బడ్జెట్ మూవీ 'షెహజాదా'తో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత 'సత్యప్రేమ్‌కి కథ'తో ప్రేక్షకుల మన్ననలను పొంది నెమ్మది నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకునే యత్నం చేశాడు. మళ్లీ అలానే మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని తహతహలాడుతున్నాడు. ఆ నేపథ్యంలోనే ప్రఖ్యాత దర్శకుడు కబీర్ ఖాన్ నిర్మిస్తున్న 'చందు ఛాంపియన్' మూవీతో మన ముందుకొస్తున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈ మూవీ షూటింగ్ ఒక ఏడాదికి పైగా పట్టింది. పగలు, రాత్రి అనక జరిగిన నిర్విరామ షూటింగ్లో హీరో ఆర్యన్ చక్కెర జోలికే పోలేదట. ఈ చిత్ర నిర్మాణం దాదాపు పూర్తి అవ్వడంతో దర్శకుడు కబీర్ సింగ్ ఇప్పుడైన నోరీ తీపి చేసుకోమంటూ రసమమలై తీసుకొచ్చి హీరో ఆర్యన్‌కి తినిపించాడు. ఈ మూవీ షూటింగ్ ఎంతలా విజయవంతంగా పూర్తి అయ్యిందో, అలానే ఈ మూవీ నీకు మంచి పేరు తెచ్చిపెడుతుందంటూ ఆర్యన్‌కి శుభాకాంక్షలు తెలిపాడు. ఆర్యన్ తన కొత్త సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు అంటే..దాదాపు ఏడాదికి పైగా చక్కెర లేని ఆహారమే తీసుకున్నాడు. పైగా చక్కెరకు బదులు తాను సహజ ఉత్పత్తుల తీసుకున్నట్లు కొన్ని రహస్యాలు బయటపెట్టాడు. ఆ హీరోలా చేస్తే శరీరంలో సంభవించే మార్పేలేంటి తదితరాల గురించి తెలుసుకుందామా!. ఒక ఏడాది పాటు ఆ హీరోలా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, ఎవ్వరైన దీన్ని ప్రయ్నతించవచ్చా?. ఈ డైట్ కారణంగా శరీరంలో ఎలా ప్రభావితమవ్వుతుంది, ఇది మంచిదేనా? అంటే..పూర్తిగా చక్కెరకు దూరంగా ఉండటం లేదా చక్కెర లేని ఆహారం తీసుకుంటే శరీరం అనేక సానుకూల మార్పులకు దారితీస్తుంది. మొదట్లో ఈ డైట్ పాటించటం కాస్త ఇబ్బందిగా అనిపించినా.. క్రమేణ మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ సమ స్థాయిల్లో ఉండటం జరగుతుంది. తద్వారా మానసికోల్లాసం ఏర్పడి జీవక్రియ మెరుగుపడుతుంది. ఒబెసిటీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గి నిత్య యవ్వనంగా కనిపిస్తారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ డైట్ వల్లే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో సవివిరంగా చూద్దాం!. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది: ఒక టీస్పూన్ చక్కెరలో 20 కిలో కేలరీలు ఉంటాయి. కాబట్టి ఈ చక్కెరను పూర్తిగా దూరంగ పెట్టగలిగితే ఇన్సులిన్ సెన్సిటివిటీకీ సహాయపడుతుంది. టైప్ 2 డయబెటిస్ రాకుండా చేస్తుంది. ఒక రకంగా దంత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కావిటీస్, చిగుళ్ల వ్యాధులు దరిచేరవు. ఎప్పుడైతే పరిమిత కేలరీలు తీసుకుంటామో అప్పుడూ ఆటోమెటిక్‌గా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది: చక్కెర వినియోగం ఎప్పుడైతే తగ్గిస్తామో.. ముందుగా మానసిక స్థితిలో మంచి మార్పులు వస్తాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది తద్వారా మతిమరుపు వంటి బ్రెయిన్ సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం ఏర్పడి తెలియని మానసికోల్లాసం వస్తుంది. నిజం చెప్పాలంటే చక్కెర వినియోచటం మానేయడం వల్ల చాలావరకు పాజిటివ్ మార్పులే చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభంలో పంచదార తీసుకోకపోతే నీరసంగా అనిపిస్తుంది. ఎలాగైతే ఆల్కహాల్ అకస్మాత్తుగా వదిలేస్తే సమస్యలు ఎదురవ్వుతాయో అలాంటి లక్షణాలే పంచాదర మానేసిన వారిలోనూ కనిపిస్తాయట. అంతేగాదు నీరసం తోపాటు మానసికంగా కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందట. అయితే శరీరంలో మెటబాలిజం మాత్రం పెరుగుతందట. ఫలితంగా ఎలాంటి దీర్ఘాకాలిక వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇక్కడ చక్కెరను తగ్గించడం అంటే దానికి బదులుగా బెల్లం లేదా కృత్రిమ స్వీటెనర్లతో భర్తీ చేయడం కాదు. చక్కెర, బెల్లం రెండూ సమాన కేలరీలను కలిగి ఉంటాయనే విషయం గుర్తించుకోవాలి. అందువల్ల మనం తీసుకునే స్వీట్లు, పానీయాలు, శక్తి పానీయాలు వంటి వాటిల్లోని షుగర్ కంటెంట్ దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటేనే మంచింది. అలాగే ఈ నో షుగర్ డైట్‌ని ఫాలో అయ్యే మందు ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణుడిని సంప్రదించి వారి మార్గదర్శకంలో సరైన విధంగా ఈ డైట్‌ని ఫాలో అయ్యి సత్ఫలితాలను పొందడం మంచిది. ఏదీఏమైన చక్కెరను పరిమిత చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చనేది వాస్తవం. (చదవండి: ఆ వాటర్ ఫాల్ 'ఓ కన్నతల్లి గుండె కోత'! ఇప్పటికీ రాత్రిళ్లు అక్కడకు వెళ్తే హడలిపోవాల్సిందే!) -
ముంబైలో బాలీవుడ్ సెలబ్రెటీలతో యోగి భేటీ
ముంబైలో బాలీవుడ్ ప్రముఖ సెలబ్రెటీలతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం సమావేశమయ్యారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్‌ని చలన చిత్ర అనుకూల రాష్ట్రంగా తెలియజేస్తూ..సినీ నిర్మాణానికి గమ్యస్థానంగా మార్చడం కోసం యోగి ఆదిత్యనాథ్ బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖు సభ్యులను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం యోగి మాట్లాడుతూ...సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపీలుగా చేశాం అని చెప్పారు. అలాగే మీరు ఎదుర్కొంట్ను సమస్యలకు ఏం చేయాలో కూడా తమకు తెలుసు అని అన్నారు. అదీగాక సమాజాన్ని ఏకం చేయడానికి, దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో సినిమా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ చలనచిత్ర అనుకూలా రాష్ట్రంగా ఆవిర్భవించిందని, జాతీయ చలచిత్ర అవార్డుల్లో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్‌ఎప్‌ఐ)లో గుర్తింపు లభించిందని చెప్పారు. అంతేగాదు తమ ప్రభుత్వ సినిమా పాలసీ ప్రకారం..యూపీలో వెబ్‌సిరీస్ చిత్రీకరిస్తే 50% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అలాగే స్టూడియోలు, ఫిల్మ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 25 శాతం సబ్సిడీ ఇస్తమాని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బోనీకపూర్, గోరఖ్‌పూర్ లోక్‌సభ ఎంపీ, నటుడు రవికిషన్, భోజ్‌పురి నటుడు దినేష్ లాల్ నిర్హువా, నేపథ్య గాయకులు సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, నటుడు సునీల్ శెట్టి, సినీ నిర్మాతలు చంద్రప్రకాష్ ద్వివేది, మధుర్ భండార్కర్, రాజ్‌కుమార్ సంతోషి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: శబరిమలైలో విడిచిపెట్టినా..తిరిగొచ్చిన పావురం..బిత్తరపోయిన యజమాని) -
శశికపూర్‌కు దాదా ఫాల్కే పురస్కారం ప్రదానం
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు శశికపూర్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. ఆదివారం పశ్చిమ ముంబైలోని ఫృధీ థియేటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్‌కు అరుణ్ జైట్లీ అందజేశారు. ఈ కార్యక్రమానికి శశికపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 2013 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం శశికపూర్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శశికపూర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాను పురస్కారం అందుకోవడానికి న్యూఢిల్లీ రాలేనని ఆయన కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. దాంతో ఆదివారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదగా శశికపూర్ దాదా ఫాల్కే పురస్కారం అందుకున్నారు. 2011లో శశికపూర్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం విదితమే.