ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గత శనివారమే తీవ్ర అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 73 ఏళ్ల మిధున్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల్లో మిథున్ బ్రెయిన్‌కి సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్కి గురయ్యినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దిరోజులకే మిథున్ ఇలా అస్వస్థతకు గురవ్వడం బాధకరం. అయితే మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్న ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది?
ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..
మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరకపోయినా లేదా తగ్గినా ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందకుండా పోతాయి. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభమవుతుంది. ఈ తర్వాత రోగి పరిస్థితి విషమంగా అయిపోతుంది. అలాగే మెదడుకు సంబంధించిన మరొక ప్రమాదకరమైన స్ట్రోక్ ఒకటి ఉంది.
దీని గురించి తరుచుగా వింటుంటాం. అదే బ్రెయియన్ హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తం మెదడు కణాలపై ఒత్తిడి పెంచి దెబ్బతీస్తుంది. చాలమందికి ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. పైగా ఈ పరిస్థితి కాస్త క్రిటికల్ అనే చెప్పొచ్చు కూడా.
లక్షణాలు..
BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1
— Sai Ram B (@SaiRamSays) February 11, 2024
- మాట్లాడటం, ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి.
- ముఖం చేతులు లేదా కాలులో తిమ్మిరిగా లేదా పక్షవాతానికి గురవ్వడం
- ఒకటి లేదా రెండు కళ్లల్లో కనిపించే సమస్యలు
- తలనొప్పి
- నడకలో ఇబ్బంది
- ఆకస్మికంగా మైకం కమ్మడం
ఏదీఏమైనా స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అనే చెప్పాలి. దీనికి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో రోగికి
అత్యవసరమైన వైద్య సహాయం త్వరగా పొందితే మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ఇతర స్ట్రోక్‌లు రాకుండా నియత్రించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment