stroke
-
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..!
ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులందరిలోనూ వైకల్యాలు తెచ్చిపెట్టడంలో లేదా మరణానికి దారితీసే అంశాల్లో పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) ప్రధానమైంది. అయితే అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం పురుషులతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. దీనికి గల అనేక కారణాలను నిపుణులు వివరిస్తున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల హార్మోన్లలో మార్పులు రావడం చాలా సాధారణంగా జరుగుతుంటుంది. దీనికి అనేక అంశాలు కారణమవుతుంటాయి. అవి... మహిళల్లో తరచూ హార్మోన్లలో మార్పులు రావడం మామూలే. దీంతోపాటు నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రల వల్ల కూడా వాళ్లలో తరచూ హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. ఈ హార్మోన్ల మార్పులే పురుషులతో పోలిస్తే మహిళల్లో పక్షవాతం ఎక్కువగా వచ్చేందుకు కారణమవుతుంటాయి. ఇటీవల మానవులందరిలోనూ ఆయుఃప్రమాణాలు బాగా పెరిగాయి. ఇలా చాలాకాలం జీవిçస్తున్న క్రమంలో హైబీపీ, దాంతోపాటు అనేక రకాల గుండె జబ్బుల (ఉదాహరణకు గుండె స్పందనలు దెబ్బతినడం వల్ల వచ్చే గుండెదడ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె పైగదుల స్పందనల్లో వేగం పెరగడం వల్ల అక్కడ రక్తం గడ్డకట్టి అవి ప్రధాన ధమనుల ద్వారా మెదడుకు చేరడం) వంటి కారణాలు బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంటాయి. గర్భనివారణ మాత్రలు వాడేవాళ్లలో పొగతాగే అలవాటు ఉండటం స్ట్రోక్ ముప్పును మరింత పెంచుతుంది. ఇక మహిళల్లో గర్భధారణ సమయంలో రక్తపోటు బాగా పెరిగి΄ోయే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్ కూడా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. పురుషులతో పోలిస్తే పక్షవాతం వచ్చినప్పుడు లేదా రాబోయే ముందు కనిపించే సాధారణ లక్షణాలైన తీవ్రమైన అలసట, అయోమయం, వికారం లేదా వాంతుల వంటి లక్షణాలు మహిళల్లో అంత ప్రస్ఫుటంగా కనిపించవు. దాంతో సమస్యను గుర్తించడం, సమయానికి చికిత్స అందించడం వంటివి ఆలస్యమయ్యేందుకు అవకాశాలెక్కువ. ఇక పక్షవాతంలో ప్రస్ఫుటంగా కనిపించే లక్షణాలైన... మాటలు ముద్దముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు కిందికి జారినట్లుగా అయిపోవడం వంటివి స్త్రీ, పురుషులిద్దరిలోనూ కనిపించినప్పటికీ మహిళలల్లో ఈ లక్షణాలన్నీ తలతిరిగినట్లు ఉండటం, తీవ్రమైన అలసట, ఎక్కిళ్ల వంటి మాటున అంత స్పష్టంగా కనిపించవు. అయితే ఇలా తల తిరిగినట్లుగా ఉండటం, తీవ్రమైన అలసట, నీరసం వంటివి మహిళల్లో అప్పుడప్పుడూ కనిపించేవే కావడంతో ఈ లక్షణాల మాటున పక్షవాతం దాగుండిపోయినట్లుగా అవుతుంది. దాంతో మహిళల్లో చాలాసేపటికి గాని పక్షవాతాన్ని గుర్తించడం సాధ్యపడకపోవడంతో అసలు విషయం బయటపడేసరికి ఆలస్యమయ్యే ప్రమాదం ఎక్కువ.మహిళల చికిత్స విషయంలో మరింత ప్రాధాన్యం అవసరం.. పక్షవాతం (స్ట్రోక్) విషయంలో పురుషులకూ, మహిళలకూ ఇచ్చే చికిత్స అన్నివిధాలా సమానమే. అయితే కోలుకున్న తర్వాత వారి పనులు వారే చేసుకునే విధంగా ఇచ్చే రిహ్యాబిలిటేషన్ ్ర΄ోగ్రామ్ విషయంలో మాత్రం మహిళలపై మరింత శ్రద్ధ చూ΄ాల్సిన అవసరముంటుంది. ఎందుకంటే వారి రీ–హ్యాబ్, వారిలో తరచూ పునరావృతమయ్యే డిప్రెషన్, నైపుణ్యాలు నేర్చుకునే (కాగ్నిటివ్ స్కిల్స్) ప్రక్రియలు ఆలస్యం కావడం, మానసిక ఆరోగ్యం అన్ని విధాలా బాగుపడేలా చేయడం వంటి అంశాలన్నీ... మహిళలకు రీ–హ్యాబ్ సేవలు మరింత ఎక్కువకాలం అవసరమయ్యేలా చేస్తాయంటున్నారు నిపుణులు.నివారణ మార్గాలు అనుసరించండి... హైబీపీని అదుపులో పెట్టుకునేందుకు క్రమం తప్పకుండా మందులు వాడటం, ఆహారంలో కొవ్వులు తక్కువగా తీసుకోవడం, ఒకవేళ రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే వాటిని అదుపు చేసే మందులు వాడటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం తోపాటు సంతాన నిరోధక మాత్రలు వాడే మహిళలు, గర్భధారణ సమయంలో ప్రీ–ఎక్లాంప్సియా వచ్చిన వారు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం, అవసరాన్ని బట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ) వంటి చర్యలతో నివారణ మార్గాలు అనుసరిస్తుంటే అది స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందంటున్నారు వైద్య నిపుణులు.(చదవండి: మెల్ల ఉందని తెలుసుకోవడమెలా? ఎలా సరిదిద్దాలి..?) -
తల మసాజ్ వల్ల పక్షవాతం
బనశంకరి: కటింగ్ షాపులో తల మసాజ్ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాలు.. బెంగళూరులో హౌస్‌కీపింగ్ చేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు (30) ఓ కటింగ్ షాపునకు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్ చేస్తానంటే సరే అన్నాడు. ఈ సమయంలో ఆకస్మికంగా గొంతు తిప్పిన సమయంలో నొప్పి కలిగింది. మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు. వైద్యనిపుణుడు శ్రీకంఠస్వామి మాట్లాడుతూ బాధితుడు సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడు. బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తరువాత కోలుకుంటున్నాడు. -
ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఓమేగా3, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది చేపలను తినేందుకు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు అందులోని కొవ్వులను శరీరానికి అందించేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను వాడుతుంటారు. ఇదే కారణంతో ఫిట్నెస్ ఔత్సాహికులు, బాడీ బిల్డర్లు, వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఐతేఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనుకున్నంత సత్ఫలితాలు ఉండవని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. పైగా స్ట్రోక్ తోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. మంచి గుండె ఆరోగ్యం ఉన్న వ్యక్తులు చేపల నూనె సప్లిమెంట్స్ క్రమం తప్పకుండ ఉపయోగించడం వల్ల గుండె దడ వంటి ప్రమాదాలు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చాలా అరుదైన సందర్భాల్లోనే క్రమం తప్పకుండా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుందని డాక్టర్ ఆండ్రూ ఫ్రీమాన్ తెలిపారు.ప్రొఫెషనల్ మెడికల్ మార్గదర్శకాల్లో కూడా డైలీ ఈ సప్లిమెంట్స్‌ని వినయోగించాలని లేకపోయినా.. ప్రజలు వినియోగిస్తుంటారని అన్నారు. దీని వినియోగం గురించే తాము యూకేలో సుమారు నాలుగు లక్షల మందికి పైగా వ్యక్తులపై అధ్యయనం చేయగా.. చేపనూనె సప్లిమెంట్లు తీసుకున్న వారిలో క్రమరహిత హృదయస్పందన, గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తింనట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. అలాగే అసలు గుండె సమస్యలు లేని వ్యక్తుల్లో స్ట్రోక్‌లో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. దాదాపు 12 ఏళ్లపాటు ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కార్డియోవాస్కులర్ వ్యాధి ఉన్నవారిలో, రెగ్యులర్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ గుండె దడ నుంచి గుండెపోటు వచ్చే అవకాశం 15 శాతం, గుండె వైఫల్యం నుంచి మరణం వరకు 9 శాతం వరకు పురోగతిని తగ్గించాయని అధ్యయనం పేర్కొంది. వాస్సెపా, లోవాజా వంటి ఫిష్ ఆయిల్ ప్రిస్క్రప్షన్ వెర్షన్లు గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉన్న వారిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, ఒక రకమైన బ్లడ్ ఫ్యాట్కి దారితీసి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని ఫ్రీమాన్ చెబుతున్నారు. అలాగే అత్యంత శుద్ది చేసిన ఫిష్ ఆయిల్ వెర్షన్లలో కూడా హార్ట్ స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఐతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు వైద్యుల సిఫార్సు మేరకు ఈ సప్లిమెంట్స్ వాడొచ్చని చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి ఈ సప్లిమెంట్స్ సూచించే ముందు శరీరంలో ఓమెగా -3 ఫ్యాటీ యాసిడ్ స్టాయిలను పరీకించి సిఫార్సు చేయాలని చెబుతున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఈ ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను ఆహార వనరుల నుంచే పొందేందుకు ప్రయత్నించాలని చెప్పారు. చెప్పాలంటే..ఆల్గే, సీవీడ్, ఒమేగా 3 ఫిష్ మూలాలు. చియా విత్తనాల, ఎడామామ్, అవిసె గింజలు, హెంప్సీడ్లు, వాల్నట్లలో ఒమెగా -3 అధికంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ఆధారపడటం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!) -
ఆస్పత్రి బెడ్‌పై జెరోధా సీఈవో.. ఏం జరిగింది?
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ (Nithin Kamath) ఆస్పత్రి బెడ్‌పై కనిపించాడు. ఖంగారు పడకండి. ఇది ఆరు వారాల కిందటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను నితిన్ కామత్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను సుమారు ఆరు వారాల క్రితం "మైల్డ్ స్ట్రోక్" తో బాధపడ్డాడనని, కారణం స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ, రకరకాల కారకాల కలయిక దీనికి దోహదపడి ఉండవచ్చని పేర్కొన్నారు. "సుమారు 6 వారాల క్రితం, నాకు ఉన్నంటుండి తేలికపాటి స్ట్రోక్ వచ్చింది. నాన్న చనిపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, అలసట, డీహైడ్రేషన్, హెవీ వర్కవుట్.. వీటిలో ఏవైనా కారణాలు కావచ్చు" అని కామత్ తన ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్‌లో తెలియజేశారు. అప్పటి నుంచి చదవడానికి, రాయడానికి కూడా చాలా కష్టపడ్డానని, 3-6 నెలల్లో పూర్తి రికవరీని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఫిట్‌గా ఉండటమే కాకుండా ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేసే నితిన్ కామత్‌కు కూడా స్ట్రోక్ రావడంతో తన అలవాట్లు, అభ్యాసాలను మరోసారి సమీక్షించుకోవాల్సిన ఆవశ్యతను ఆయన గుర్తించారు. Around 6 weeks ago, I had a mild stroke out of the blue. Dad passing away, poor sleep, exhaustion, dehydration, and overworking out —any of these could be possible reasons. I've gone from having a big droop in the face and not being able to read or write to having a slight droop… pic.twitter.com/aQG4lHmFER — Nithin Kamath (@Nithin0dha) February 26, 2024 -
మిథున్ చక్రవర్తికి వచ్చిన ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే..?
ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి గత శనివారమే తీవ్ర అస్వస్థతకు గురయ్యిన సంగతి తెలిసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు కోల్‌కతాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆస్పత్రి విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. 73 ఏళ్ల మిధున్ తన పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. వైద్య పరీక్షల్లో మిథున్ బ్రెయిన్‌కి సంబంధించిన ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్‌కి గురయ్యినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని పేర్కొంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. అది జరిగిన కొద్దిరోజులకే మిథున్ ఇలా అస్వస్థతకు గురవ్వడం బాధకరం. అయితే మిథున్ చక్రవర్తి ఎదుర్కొంటున్న ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ అంటే ఏమిటీ? ఎందువల్ల ఇది వస్తుంది? ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే.. మెదడులో కొంత భాగానికి రక్త సరఫరా జరకపోయినా లేదా తగ్గినా ఈ ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ స్ట్రోక్ సంభవిస్తుంది. దీంతో మెదడు కణజాలానికి ఆక్సిజన్ వంటి పోషకాలు అందకుండా పోతాయి. వెంటనే మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభమవుతుంది. ఈ తర్వాత రోగి పరిస్థితి విషమంగా అయిపోతుంది. అలాగే మెదడుకు సంబంధించిన మరొక ప్రమాదకరమైన స్ట్రోక్ ఒకటి ఉంది. దీని గురించి తరుచుగా వింటుంటాం. అదే బ్రెయియన్ హెమరేజిక్ స్ట్రోక్. ఇది మెదడులోని రక్తనాళం లీక్ అయినప్పుడు లేదా పగిలిపోయి మెదడులో రక్తస్రావం జరిగితే ఈ స్ట్రోక్ రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తం మెదడు కణాలపై ఒత్తిడి పెంచి దెబ్బతీస్తుంది. చాలమందికి ఎదుర్కొనే స్ట్రోక్ ఇది. అయితే ఇస్కీమిక్ స్ట్రోక్ అనేది చాలా అరుదుగా వస్తుందని చెప్పొచ్చు. పైగా ఈ పరిస్థితి కాస్త క్రిటికల్ అనే చెప్పొచ్చు కూడా. లక్షణాలు.. BREAKING: PM @narendramodi dials #MithunChakraborty, inquiring about his health. https://t.co/MPrYMLT0J1 — Sai Ram B (@SaiRamSays) February 11, 2024 మాట్లాడటం, ఇతరులు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. ముఖం చేతులు లేదా కాలులో తిమ్మిరిగా లేదా పక్షవాతానికి గురవ్వడం ఒకటి లేదా రెండు కళ్లల్లో కనిపించే సమస్యలు తలనొప్పి నడకలో ఇబ్బంది ఆకస్మికంగా మైకం కమ్మడం ఏదీఏమైనా స్ట్రోక్ అనేది మెడికల్ ఎమర్జెన్సీ అనే చెప్పాలి. దీనికి వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో రోగికి అత్యవసరమైన వైద్య సహాయం త్వరగా పొందితే మెదడు పూర్తి స్థాయిలో దెబ్బతినకుండా ఇతర స్ట్రోక్‌లు రాకుండా నియత్రించగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. -
బ్రెయిన్ స్ట్రోక్‌తో ఎంపీడీఓ మృతి
కల్వకుర్తి: చారకొండ మండల ఎంపీడీఓ జయసుధ(46) బ్రెయి న్ స్ట్రోక్‌కు గురికావడంతో నాలు గు రోజులుగా చికిత్స పొందుతూ.. మృతిచెందారు. డిసెంబర్ 28 రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెల్దండ సమీపంలోని యన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. వారి మృతదేహాన్ని కల్వకుర్తిలోని వారి స్వగృహానికి తరలించారు. చారకొండ మండల ఎంపీడీఓగా ఆరేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆమెకు కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. ఆమె అకాల మరణంతో బంధువులు, స్నేహితులు మండలంలోని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్వగృహంలో వారి పార్థీవ దేహానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, మండలంలోని ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఆయా శాఖల అధికారులు, నాయ కులు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. -
ఏట్రియల్ ఫిబ్రిలేషన్! సైలెంట్‌గా దాడి చేసే డేంజరస్ వ్యాధి!
కొన్ని వ్యాధులు అంత తేలిగ్గా బయటపడవు. ఎటువంటి సంకేతాలు ఇవ్వవు. కానీ ఇతరత్ర వ్యాధులకు దారితీసేంత వరకు దాని వల్లే మనకు ఆ వ్యాధి వచ్చిందనేది కూడా తెలియదు. దీంతో పరిస్థితి విషమించిన సందర్భాలు కోకొల్లలుగా జరగుతున్నాయి. అలాంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(గుండెదడ). ఇదే స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులకు దారితీసి ప్రాణాంతకంగా మారుస్తోంది. అసలు ఏంటీ ఏట్రియల్ ఫిబిలేషన్(ఏఎఫ్)? ఎలా సైలెంట్‌గా దాడి చేసేంత డేంజరస్ వ్యాధి తదితరాల గురించే ఈ కథనం!. ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్(ఏఎఫ్)గుండెదడ)) బాధపడుతున్న రోగులలో దాదాపు 1/3వ వంతు రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం చాలామంది రోగుల్లో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యులు. ఇంతకీ ఏట్రియా అంటే గుండె గదులు. వీటిలో గుండె లయలు సక్రమంగా లేకపోతే గుండెలోని దిగువ గదులకు రక్తప్రవాహం సవ్యంగా జరగదు. దీంతో స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తంచారు వైద్యులు. నిజానికి భారతదేశంలో పలు ఆస్పత్రుల అధ్యయనాల ప్రకారం..దాదాపు 10 నుంచి 25% స్ట్రోకు రోగులకు అంతర్లీనంగా ఉన్న ఈ ఏట్రియల్ ఫిబ్రలేషన్ కారణమని చెబుతున్నారు. సుమారు మూడింట ఒక వంతు మందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. అందువల్ల ఆస్పత్రుల్లో చేరాల్సి రావడం, జీవన నాణ్యత దారుణంగా పడిపోయింది, ప్రాణాంతక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. ఈ ఏఎఫ్ని గనుక ముందుగా గుర్తించగలిగితే (ఓరల్ యాంటీ కోగ్యులెంట్ థెరపీ) నోటి ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారించే ఔషధాలతో స్ట్రోక్‌లు వంటివి రాకుండా నివారించొచ్చని చెబుతున్నారు. ఎవరికీ వచ్చే ఛాన్స్ ఎక్కువంటే.. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడినవారు, స్థూలకాయం, టైప్ 2 మధుమేహం, గుండె వైఫల్యం, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, సీఓపీడీ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు, స్లీప్ అప్నీయా లేదా హైపర్ థైరాయిడిజం వంటి వైద్య పరిస్థితులతో బాధపడుతున్నవారికి ఈ ఏఎఫ్ బారినపడే అవకాశం ఎక్కువుగా ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు మాట్లాడుతూ..చాలా సందర్భాలలో ఈ ఏఎఫ్ లక్షణ రహితంగా ఉంటుంది. ఈసీజీ, రొటీన్ చెకప్‌లు లేదా సంబంధిత స్ట్రోక్ కారణంగా యాదృచికంగా దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ ఏఎప్లో ముందుగా స్ట్రోక్ రాకుండా చూడటం అనేది అతి ముఖ్యం. ఈ వ్యాధి బారినపడిన రోగులు రక్తాన్ని పలుచగా చేసే మందులు లేదా గడ్డకట్టడాన్ని నిరోధించే మాత్రలు వాడటం అత్యంత కీలకం. సరైన చికిత్సా పద్ధతులను అనుసరించాలి. అలాగే రక్తపోటు, మధుమేహం, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఊబకాయం, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సక్రమమైన జీవనశైలిని పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలను అనుసరిస్తే స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా నివారించగలుగుతామని హైగ్రీవ్ రావు చెప్పారు. ఏఎఫ్ వచ్చిన రోగుల లక్షణాలు.. అలసట, హృదయ స్పందన సరిగాలేకపోవటం దడ, గుండెలు అదరటం మైకము, మూర్ఛ శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి తిమ్మిరి, నీరసం, గందరగోళం దృష్టి సమస్యలు నడకసమస్యలు మైకము, వివరించలేని తలనొప్పి వంటివి కనిపిస్తే స్ట్రోక్‌కి దారితీసే అవకాశం ఎక్కువగా ఉదని అర్థం. చికిత్స దీనికి మూడు ప్రధాన రకాల ఔషదాలు ఉన్నాయి, గుండె స్పందన రేటు నియంత్రణ మందులు (హృదయ స్పందన వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి), రిథమ్ నియంత్రణమందులు (సాధారణ గుండె లయను పునరుద్ధరించడానికి పని చేస్తాయి), చివరిగా రక్తంపలచబడటానికి ( రక్తం గడ్డకట్టడం మరియు స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగించేవి) మందులు ఉంటాయి . కొంతమంది రోగులకు ఎలక్ట్రికల్ కార్డియోవర్షన్ లేదా పల్మనరీ వీన్ అబ్లేషన్ వంటి శస్త్ర చికిత్సలు అవసరం. వీటితో పాటుగా , ధూమపానానికి దూరంగా ఉండటం, గుండె ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్నే తీసుకోవడం, బరువు పెరగకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవడం అత్యంత ముఖ్యం. వీటన్నింటిని పాటిస్తే ఈ ఏఎఫ్ సమస్య నుంచి సత్వరమే బయటపడొచ్చని అంటున్నారు కిమ్స్ వైద్యులు హైగ్రీవ్ రావు. --కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లోని పేసింగ్ అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ డైరెక్టర్ డాక్టర్ బి హైగ్రీవ్ రావు (చదవండి: ‘కొలాజెన్ వాస్క్యులార్ డిసీజెస్' అంటే? తలెత్తే సమస్యలు..) -
అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే..అన్యురిజమ్ నుంచి బయటపడాలంటే..?
దేహంలోని రక్తనాళాలు కొన్ని చోట్ల బలహీనంగా ఉండవచ్చు. మెదడులో అలా జరిగినప్పుడు బలహీనమైన చోట రక్తనాళం ఉబ్బి...ఒక్కోసారి ఆ ఉబ్బిన రక్తనాళంలోని లోపలి పొర మీద ఒత్తిడి పెరిగిపోయి, అది మరింత పలచబారి అకస్మాత్తుగాచిట్లిపోవచ్చు. ఈ పరిణామం మెదడులో జరిగితే అక్కడ జరిగే రక్తస్రావంతో మరిన్ని దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఇలా మెదడులోని రక్తనాళాల్లో బలహీనమైన చోట రక్తం పేరుకుని, అది బుడగలా మారడాన్ని ‘అన్యురిజమ్స్’ అంటారు. అప్పటివరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తూ... అకస్మాత్తుగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఈ కండిషన్‌పై అవగాహన కోసం ఈ కథనం. మెదడు చుట్టూరా ఆవరించుకుని ఉండే స్థలాన్ని సబర్కనాయిడ్ ప్రాంతంగా చెబుతారు. అన్యురిజమ్ కేసుల్లో దాదాపు 90 శాతం మందిలో ఆ ప్రాంతంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి దాన్ని ‘సబర్కనాయిడ్ హేమరేజ్’ (ఎస్ఏహెచ్) అంటారు. రక్తనాళాలు చిట్లిన ప్రతి ఏడుగురిలోనూ నలుగురిలో ఏదో ఒకరకమైన వైకల్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. రక్తస్రావం కాగానే పక్షవాతం (స్ట్రోక్), కోమాలోకి వెళ్లే అవకాశాలెక్కువ. అన్యురిజమ్స్ ఉన్న చాలామందిలో మెదడులో రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు వారి జీవితకాలంలో అవి చిట్లకపోవచ్చు. కొందరిలో ఉబ్బు చాలా చిన్నగా ఉండవచ్చు. కానీ మరికొందరిలో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ‘జెయింట్ అన్యురిజమ్స్’ అంటారు. ఇలాంటివి అకస్మాత్తుగా చిట్లే అవకాశాలుంటాయి. దాంతో బాధితుల్లో అకస్మాత్తుగా పక్షవాతం కనిపించవచ్చు. హార్ట్ ఎటాక్స్లోలాగే ‘సబర్కనాయిడ్ హ్యామరేజ్’ అకస్మాత్తుగా సంభవిస్తుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడిక చేరడం వల్ల అడ్డంకులతో గుండెపోటు వస్తే... అప్పటికే అన్యురిజమ్స్కు గురైన రక్తనాళాలు చిట్లడం వల్ల సబర్కనాయిడ్ హ్యామరేజ్ వస్తుంది. కారణాలు ►పొగాకు వాడకం, అనియంత్రితమైన రక్తపోటు, డయాబెటిస్ వంటివి ►రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా కలిగే దుష్పరిణామాలు (కాంప్లికేషన్స్) ►చాలావరకు పుట్టుకతో వచ్చే (కంజెనిటల్), అలాగే జన్యుపరమైన కారణాలు. ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉన్నప్పుడు ముప్పు ఎక్కువ ∙క్రమబద్ధంగా / ఆరోగ్యకరంగా లేని ►జీవనశైలి ∙ ►ఏదైనా ప్రమాదం కారణంగా రక్తనాళాలు గాయపడటం. ►కొన్ని అరుదైన కేసుల్లో... ఫైబ్రో మస్క్యులార్ డిస్ప్లేసియా వంటి కండరాల జబ్బు, మూత్రపిండాల్లో నీటితిత్తుల్లా ఉండే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్... అన్యురిజమ్‌కు దారితీసే అంశాలు. చిట్లినప్పుడు కనిపించే లక్షణాలు∙ జీవితంలో ఎప్పుడూ రానంత అత్యంత బాధతో కూడిన తలనొప్పి స్పృహ కోల్పోవడం పక్షవాతం / ఫిట్స్ కూడా మాట్లాడలేకపోవడం, మూతి వంకరపోవడం చికిత్సా ప్రత్యామ్నాయాలు శస్త్రచికిత్స కాకుండా మందులిస్తూ చేసే చికిత్స (నాన్ సర్జికల్ మెడికల్ థెరపీ) ∙శస్త్రచికిత్స లేదా క్లిప్పింగ్ ∙ఎండోవాస్క్యులార్ థెరపీ లేదా కాయిలింగ్ (అడ్జంక్టివ్ డివైస్ లేకుండా చేసే చికిత్స / వీలునుబట్టి డివైస్ వాడటం). వీటి గురించి వివరంగా... మెడికల్ థెరపీ: రక్తనాళాలు చిట్లకముందు చేసే చికిత్స ఇది. రక్తపోటును అదుపులో ఉంచేందుకు మందులిస్తూ, కొని ఆహారాలు, వ్యాయామాలు సూచిస్తారు. అన్యురిజమ్స్ సైజు తెలుసుకోడానికి నిర్ణీత వ్యవధుల్లో తరచూ ఎమ్మారై / సీటీ స్కాన్/యాంజియోగ్రఫీ) చేయించడం అవసరం. శస్త్రచికిత్స / క్లిప్పింగ్: పుర్రె తెరవడం ద్వారా చేసే శస్త్రచికిత్స (క్రేనియాటమీ) ద్వారా ఉబ్బిన రక్తనాళాల్ని నేరుగా పరిశీలిస్తూ, పరిస్థితిని అంచనా వేస్తారు. అన్యురిజమ్లను గుర్తించి, శస్త్రచికిత్సతో వాటిని జాగ్రత్తగా వేరుచేస్తారు. ఉబ్బిన చోట క్లిప్పింగ్ జరిపాక మళ్లీ మునపటిలా రక్తప్రసరణ జరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. ఎండోవాస్క్యులార్ కాయిలింగ్ : తొడ ప్రాంతంలోని రక్తనాళం నుంచి ఒక పైప్ (క్యాథెటర్)ను ప్రవేశపెట్టి... అందులోంచి మరింత చిన్నపైప్లతో మెదడులోని అన్యురిజమ్స్కు చేరి, అక్కడ రక్తనాళాన్ని చుట్టలుచుట్టలుగా చుట్టుకుపోయేలా చేస్తారు. దాంతో ఉబ్బిన ప్రాంతానికి రక్తసరఫరా ఆగుతుంది. ఫలితంగా చిట్లడం నివారితమవుతుంది. ప్రస్తుతం ఉన్నవాటిల్లో దీన్ని మేలైన చికిత్సగా పరిగణిస్తున్నారు. ఇందులోనే బెలూన్ కాయిలింగ్ అనే ప్రక్రియలో అన్యురిజమ్ ఉన్న ప్రాంతానికి దగ్గర్లో బెలూన్ లాంటి దాన్ని ఉబ్బేలా చేసి, అటు తర్వాత కాయిలింగ్ చేస్తారు. ఇలా పెద్ద రక్తనాళాల దగ్గరున్న ఉబ్బును చిట్లకుండా రక్షిస్తారు. ఇవిగాక... దాదాపు ఏడేళ్ల నుంచి రక్తప్రవాహపు దిశ మళ్లించడానికి ‘ఫ్లో డైవర్టర్ స్టెంట్స్’ ఉపయోగిస్తున్నారు. వీటితో అన్యురిజమ్లోని రక్తపు దిశను మళ్లించి క్రమంగా ఉబ్బు తగ్గిపోయేలా చేస్తారు. బాధితుల పరిస్థితిని బట్టి చికిత్సా ప్రత్యామ్నాయాలను డాక్టర్లు ఎంచుకుంటారు. ముందే తెలిస్తే ముప్పు నివారణకు అవకాశం... అన్యురిజమ్స్ ప్రాణాంతకమే అయినా ముందే తెలిస్తే బాధితుల్ని రక్షించుకునేందుకు అవకాశాలు పెరుగుతాయి. మెదడు సీటీ స్కాన్, మెదడు ఎమ్మారై పరీక్షల ద్వారా తలలోని రక్తనాళాలను పరిశీలించినప్పుడు ఈ సమస్య బయటపడే అవకాశం ఉంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీలో ఈ ముప్పు ఉన్నవారు సీటీ, ఎమ్మారై పరీక్షలు చేయించడం ఒకరకంగా నివారణ చర్యలాంటిదే అనుకోవచ్చు. ఈ పరీక్షల్లో సెరిబ్రల్ అన్యురిజమ్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే... గుండెకు చేసినట్టే మెదడుకూ యాంజియోగ్రామ్ చేస్తారు. ‘సెరిబ్రల్ యాంజియో’ అనే ఈ పరీక్షతో అన్యురిజమ్స్ను ముందుగానే నిర్ధారణ చేయడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదాల్ని చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ పెళ్లూరు కన్సల్టెంట్ న్యూరో సర్జన్ (చదవండి: గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!) -
బ్రెయిన్ స్ట్రోక్..నెల రోజుల ముందుగానే ఇలా గుర్తించవచ్చు
ఈ మధ్యకాలంలో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా చనిపోతున్నారన్న వార్తలు తరచు వింటున్నాం. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్య రాకముందే దీని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇంతకీ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు చూద్దాం. మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్తం సరఫరా నిలిచిపోవడంతో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్. ఈ వ్యాధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు సమస్యను ముందే పసిగడితే ప్రమాదం నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్య నిపుణులు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలపై అవగాహన ఏర్పరచుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ ఎన్ని రకాలు? బ్రెయిన్ స్ట్రోక్‌ను సాధారణంగా ఐస్కీమిక్ స్ట్రోక్, హీమోరజిక్ స్ట్రోక్, ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్‌లుగా మూడు రకాలుగా గుర్తించవచ్చు. ఐస్కీమిక్ స్ట్రోక్: ఇది మెదడుకు దారితీసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాల్లో వచ్చే స్ట్రోక్‌ని ఐస్కీమిక్ స్ట్రోక్‌గా పిలుస్తారు. హీమోర్హజిక్ స్ట్రోక్: మెదడు రక్తనాళాలు దెబ్బతినడం వల్ల కలిగే స్ట్రోక్ ఇది. రక్తస్రావం జరగడంతో మెదడులోని కణాలు దెబ్బతింటాయి. ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్: ఉన్నట్టుండి రక్త సరఫరా ఆగిపోతుంది. మళ్ళీ దానంతట అదే తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ స్థితినే ట్రాన్సియంట్ ఐస్కీమిక్ అటాక్ అంటారు. ఒకరకంగా దీన్ని బ్రెయిన్ స్ట్రోక్‌కి హెచ్చరికగా భావించవచ్చు. ఈ లక్షణాన్ని నిర్దిష్ఠ కాలంలో గుర్తించి, చికిత్స అందిస్తే బ్రెయిన్ స్ట్రోక్‌ను అడ్డుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ►ఏ రకమైన స్ట్రోక్ వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి.కరోటిడ్ ఆర్టరీ నుండి స్ట్రోక్ మొదలవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ముఖం ఓ వైపుకి వంగిపోవవడం,రెండు చేతులు పైకి ఎత్తకపోవడం,ఓ చేయి తిమ్మిరి, బలహీనంగా మారడం, నడవలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ►అలాగే శ్వాసలో సమస్య ఏర్పడుతుంది. ఛాతీనొప్పి, శ్వాసలో సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే అది స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని జాగ్రత్తపడాలి. ► ఎక్కిళ్లు కూడా ఎక్కువగానే వస్తుంటాయి. ఒక సర్వే ప్రకారం.. 10శాతం మంది మహిళలలకు ఎక్కిళ్లు ఎక్కువగా వస్తాయని గుర్తించారు. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు మార్పులు.. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంటుంది. మహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పులు గమనించవచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్టుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో మార్పులు తెలుస్తుంటాయి. అంతేకాకుండా వికారం, వాంతులు, మెదడులో కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు, వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి. ఇక చూపులో సమస్యతో పాటు భ్రమ పడుతున్నట్లు కూడా అనిపిస్తుంటుందట. ఈ స్ట్రోక్ వచ్చే ముందు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల మెదడులో రక్త గడ్డ కట్టే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తు గర్భస్రావాలు జరుగుతుంటాయి. అది స్ట్రోక్ రిస్క్ ను పెరిగేలా చేస్తుంది. అడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని వల్ల ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌కు గల కారణాలు అధిక రక్తపోటు,డయాబెటిస్,అధిక కొలెస్ట్రాల్,ధూమపానం, మధ్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, వీటితో పాటు ఎక్కువగా ఆందోళన చెందడం, గుండె వ్యాధులు, అధిక ప్లాస్మా లిపిడ్స్ వంటివి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు. ముందుగానే సమస్యను గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. కానీ జన్యు సంబంధిత కారణాలు, వృద్ధాప్యం,ఇంతకుముందే బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటం వంటివి స్ట్రోక్ ముప్పును శాశ్వతంగా కలిగిస్తాయి. వీటి నుంచి మనం తప్పించుకోలేం. చికిత్స ఇలా.. పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. సాధ్యమైనంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా బరువును అదుపులో ఉంచుకోవాలి. స్ట్రోక్ నుంచి నెల ముందే కాపాడొచ్చు బ్రెయిన్ స్ట్రోక్‌కు నెల ముందు వచ్చే లక్షణాలను పసిగడితే ప్రాణాపాయం నుంచి కాపాడుకోవచ్చు. ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం వంటివి సాధారణ లక్షణాలే అయినా, బ్రెయిన్ స్ట్రోక్‌కు ముందు ఇలా జరుగుతుంది. ముఖం, చేతులు, కాళ్లు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం కూడా జరగుతుంది. కంటి చూపులో తేడా వస్తుంది. కళ్లు మసకబారడం లాంటివి జరుగుతుందని యూకేలో 1300మందిపై ఇటీవలె జరిపిన ఓ సర్వేలో వెల్లడైంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన మరో లక్షణం తలనొప్పి. ఒక్కో సమయంలో స్పృహ కూడా కోల్పోయి పడిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు అంటున్నారు. - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
Stroke: ఈ చికిత్స అందిస్తే..ఈజీగా రికవరీ అవ్వచ్చు!
స్ట్రోక్ వస్తే సత్వరమే చికిత్స అందుబాటులో ఉన్నా అవన్నీ తాత్కలికమే. ఎందుకంటే ఒక్కోసారి భవిష్యత్తులో మళ్లీ రావచ్చు లేదా రాకపోవచ్చు. అంతేగాదు రోగికి అలాంటి సమయంలో త్వరితగతిన కోలుకోవడం కూడా ఒక్కొసారి సమయం పడుతుంటుంది. పైగా రోగి అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇక నుంచి అలా కాకుండా రోగులను త్వరితగతిన కోలుకునేలా చేయవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్వీడన్ యూనివర్శిటీ ఆఫ్ గోథెన్బర్గ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్‌లో ఆ పరిశోధనలు గురించి వెల్లడించింది. పరిశోధకులు అందుకోసం ఎలుకలపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రయోగంలో భాగంగా ఎలుకలకు నాసిల్ చికిత్స విధానం ఉపయోగించి.. నాసిక గుండా సీ3ఏ పెప్టైడ్ ఆస్ట్రోసైట్ల డ్రాప్స్‌ను ఇచ్చారు. ఈ చుక్కలను తీసుకున్న ఎలుకలు స్ట్రోక్ తర్వాత చాలా చురుకుగా యథావిధిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వీడన్, జర్మనీలలో చేసిన ప్రయోగాల్లో కూడా ఇలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ అధ్యయనాలు చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని న్యూరో ఇమ్యునాలజీ ప్రోఫెసర్ మార్సెలా పెక్నా మాట్లాడుతూ..ఈ చికిత్స క్లినిక్స్‌లో ఉపయోగించవచ్చన్నారు. స్ట్రోక్‌కి గురై ఆస్పత్రులకు వచ్చిన వారు కూడా అంగవైకల్యానికి గురి కాకుండా త్వరితగతిన కోలుకోగలుగుతారని పెక్నా చెప్పారు. అంతేగాదు ఈ నాసిల్ డ్రాప్ చికిత్స విధానం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించగలమని చెప్పారు. (చదవండి: విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
మెదడు ఆరోగ్యానికి మేలుచేసే చేపలు! స్ట్రోక్ సమస్యకు కూడా..
Regularly Consuming Fish May Protect Brain Health: సెరెబ్రోవాస్కులర్ లేదా వాస్కులర్ బ్రెయిన్ డిసీజ్ గురించే ఇప్పుడు అంతటా చర్చజరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో సెరెబ్రోవాస్కులర్ రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏట అమెరికాలోని ప్రతి లక్ష మందిలో 37.6 మరణాలు ఈ వ్యాధివల్లనే సంభవిస్తున్నాయి. మెదడులోని రక్త నాళాలు, రక్త ప్రసరణను ప్రభావితం చేసే స్ట్రోక్ వంటి సమస్యలకు ఈ వ్యాధి కారణమవుతుందట. ఏమిటీ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్? సెరెబ్రోవాస్కులర్ అనేది రక్త ప్రవాహాన్ని, మెదడులోని రక్త నాళాలను ప్రభావితం చేసే ఓ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రక్త నాళాలు కుంచించుకుపోవడం, గడ్డకట్టడం, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం.. వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారుతుంది. మెదడు సమస్యలతో ప్రారంభమై.. ప్రారంభ దశలో ఈ వ్యాధి తాలూకు ప్రాథమిక లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ముదిరితే డిమెన్షియాకు దారితీస్తుంది. చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! చేపలకు - ఈ వ్యాధికి మధ్య సంబంధం ఏమిటి? జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు, శారీరక వ్యాయామం, ఆరోగ్య ఆహారపు అలవాట్లు, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో సెరెబ్రోవాస్కులర్ వ్యాధి తాలూకు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రోక్ ప్రమాదానికి, అధికంగా చేపలను తినడానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! ఇది మెదడుకు, సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి మధ్య వారధిగా పనిచేస్తుందట. ఏదిఏమైనప్పటికీ అధికంగా చేపలు తినడం వల్ల మెదడు దెబ్బతినడం తగ్గుముఖం పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అధ్యయన నివేదికల ఫలితాలు ఇలా.. క్రాస్ సెక్షనల్ అధ్యయనాల తాజా నివేదిక ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వృద్ధులపై చేసిన పరిశోధనల్లో చేపల వినియోగం, మెదడు దెబ్బతినడం మధ్య సంబంధాన్ని పరిశోధించింది. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినేవారిలో సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి కారణమయ్యే మెదడు సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఫ్రాన్స్‌లోని బోడో యూనివర్సిటీకి చెందిన సీనియర్ రీసెర్చర్ డా. సిసిలియా సమీరి ఏంచెబుతున్నారంటే.. ప్రతి వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తినడం వల్ల మెదడు గాయాలు తగ్గుముఖం పట్టడం పరిశోధనల్లో కనుగొన్నాము. ఐతే 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో చేపలు తినడం వల్ల కలిగే ఈ రక్షణా ప్రభావం అంతగా కనిపంచలేదని పేర్కొన్నారు. అంటే చిన్నతనం నుంచే క్రమంతప్పకుండా చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. చేపలు అధికంగా తినేవారితో పోల్చితే తక్కువగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు అధికమని డా. సిసిలియా సమీరి సూచించారు. చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!! -
అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా..
రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోయేవారిలో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 6-8 గంటలు నిద్రపోయే వారితో పోల్చితే వీరిలో ఈ సమస్య ఎక్కువట. స్ట్రోక్‌కు గురైన వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారినపడి అకాల మరణాలకు గురౌతారని అధ్యయనాలు వెల్లడించాయి. Effects & Health Risks of Oversleeping in Telugu: అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. సగటున 62 ఏళ్ల వయస్సున్న దాదాపు 32,000 మందిపై జరిపిన అధ్యయనాల్లో స్ట్రోక్ రిస్క్ గురించి పరిశోధకులు వివరించారు. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం కలిగితే మెదడు కణజాలాలు దెబ్బతింటాయి. ఫలితంగా స్ట్రోక్ వస్తుంది. రాత్రి పూట ఎనిమిది గంటల కంటే తక్కువ నిద్రపోయే వారితో పోలిస్తే, తొమ్మిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు స్ట్రోక్ ముప్పు 23% ఎక్కువని ఈ అధ్యయనం తెల్పుతోంది. ఐతే అతి తక్కువగా నిద్రపోతే వారిలో స్ట్రోక్ ప్రమాదం 82% ఎక్కువని ఈ నివేదిక తెల్పుతోంది. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అధిక నిద్ర స్ట్రోక్‌కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ, స్ట్రోక్ వచ్చినవారిలో తరచుగా నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు తెల్పాయి. అంతేకాకుండా జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం వంటి రుగ్మతలు తలెత్తుతాయట. ఫోర్టిస్ హాస్పిటల్ షాలిమార్ బాగ్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జైదీప్ బన్సాల్ ఏమంటున్నారంటే.. అధిక నిద్రకు, స్ట్రోక్ సంభవించడానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా తెలియరాలేదు. ఐతే ఎక్కువగా నిద్రించేవారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు, బరువు పెరుగుతున్నాయని.. ఈ రెండూ కారణాల వల్లే స్ట్రోక్ ప్రమాదం వస్తుందని వివరించారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే 80% వరకు స్ట్రోక్ ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలికి బదులు వ్యాయామాలు చేయడం, జంక్ ఫుడ్, ధూమపానం, అధిక మద్యపానాలకు దూరంగా ఉండటం, తరచూ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం వంటివి అలవర్చుకోవాలని చెబుతున్నారు. చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి.. -
నిప్పుల కొలిమిలో సమిధలు
- గత వారంలో మరణించిన వారు 30 మంది - అధికారికంగా మృతులు ఏడుగురేనట - ఆపద్బంధు పథకం కింద ఆదుకుంటున్న తెలంగాణా సర్కారు - ఆ ఊసే ఎత్తని బాబు ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిప్పుల కుంపటిగా జిల్లా మారింది. భానుడి ఉగ్రరూపంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఒకేసారి అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులైతే ప్రాణాలు అరచేతపట్టుకుని దిదదిన గండంగా గడుపుతున్నారు. గత వారం రోజులుగా వేడి గాలులతో ఉదయం 11 గంటల తరువాత ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. రోడ్డుమీదకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇళ్లల్లో ఉన్నా ఎండ వేడి తట్టుకోలేక కకావికలమవుతున్నారు. ఎండల తీవ్రత ఒకేసారి పెరిగిపోవడంతో వడదెబ్బ మృతుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. సామాన్య, మధ్య తరగతి అనే తేడాలేకుండా కూలీ నాలీ చేసుకునే వారు కూడా పనుల్లోకి వెళ్లలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. గడచిన వారం రోజులుగా మృతుల సంఖ్య కలవరపెడుతోంది. ప్రతి రోజూ వడ దెబ్బకు గురై ఐదు నుంచి పది మంది చనిపోతున్నారంటే గ్రీష్మ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గడచిన వారం రోజులుగా జిల్లాలో వడదెబ్బతో మృతి చెందిన వారి సంఖ్య 30కి పైగానే ఉంది. బుధవారం ఒక్కరోజే పది మంది మృతి చెందగా, గురువారం ఐదుగురు వరకు మృతి చెందారు. వడదెబ్బ మృతుల్లో ఉపాధి కూలీలు కూడా నమోదవుతున్నారు. ఎండలు పెరిగిపోతున్న క్రమంలో ఉదయం 11 గంటలకే ఉపాధి పనులు కట్టేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఇటీవల ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ప్రకటన జారీచేసి మూడు రోజులైనా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో 12 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నట్టు మండలాల నుంచి అందుతున్న సమాచారం రుజువు చేస్తోంది. సాయం ఊసెత్తని సర్కారు... ఎండలు తీవ్రత పెరిగిపోయి మృతుల సంఖ్య పెరుగుతున్నా కనీసం మానవతా దృక్పధంతో బాధిత కుటుంబాలను ఆదుకోవల్సిన ప్రభుత్వం ‘సాయం’ ఊసెత్తడం లేదు. గత ఏడాది వడదెబ్బ మృతులకు ప్రభుత్వం రూ.లక్ష ప్రకటించింది. సవాలక్ష నిబంధనలతో చివరకు కంటితుడుపు చర్యగా నామమాత్రపు పరిహారమే అందజేసింది. ఈ ఏడాది మృతుల విషయంలో ఏమి చేస్తుందో స్పష్టం చేయడం లేదు. తెలంగాణా ప్రభుత్వం వడదెబ్బ మృతులకు ఆపద్బంధు పథకం ద్వారా పరిహారం ఇవ్వాలని నిర్ణయించగా మన సర్కార్ ఇప్పటికీ బయటపడకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా వడదెబ్బ మృతుల నిర్ధారణ కోసం బంధువులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మృతదేహానికి రెవెన్యూ శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించి త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వడదెబ్బ మృతిగా నమోదు చేస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా ఆ విధానం సక్రమంగా అమలు కావడం లేదు. స్థానికులకు అవగహన లేకపోవడం కూడా ఇందుకు మరో కారణంగా కనిపిస్తోంది. త్రిసభ్య కమిటీ గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత మృతుల ఇళ్లకు వెళ్లి విచారించి నిర్ధారించి మృతుల వివరాలను కలెక్టరుకు నివేదిక అందజేయాలి. అలా కలెక్టరేట్‌కు వెళ్లిన నివేదికలు చూస్తే ఇంతవరకు కేవలం ఏడుగురు మాత్రమే మృతి చెందినట్టు లెక్కలున్నాయి. పరిహారం మాటేమిటి.. రెవెన్యూ, ఉపాధిహామీ అధికారులు మృతుల వివరాలు సేకరించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంతో వడదెబ్బకు గురై మృతి చెందినా మృతులు బంధువులు అధికారులకు సమాచారం ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వడదెబ్బ మృతులకు పరిహారం ప్రకటించి, మృతుల వివరాలను అధికారికంగా ధ్రువీకరించాలని స్థానికులు కోరుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా అధికారికంగా జిల్లాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నామ్కేవాస్తేగా పనిచేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5,483 చలివేంద్రాలు ఏర్పాటుకు ... వీటి నిర్వహణకు ప్రభుత్వం ఇంతవరకు రూ.60 లక్షలు విడుదల చేసినా అవసరాలకు మాత్రం ఉపయోగపడడం లేదన్న విమర్శలున్నాయి. వీటిని సక్రమంగా నిర్వహించినా కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. అధికారికంగా మృతులు ఏడుగురే... గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వడగాల్పులకు ఏడుగురు మృతి చెందారని జిల్లా యంత్రాంగం చెబుతోంది. త్రిసభ్య కమిటీ నివేదిక ఇంకా తమకు చేతికందితే కానీ మృతుల సంఖ్య స్పష్టంగా చెప్పలేమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి చంద్రయ్య చెబుతున్నారు. వడగాల్పులకు మృతి చెందినట్లు స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి, తహసీల్దార్, సబ్ ఇనస్పెక్టర్లు నిర్థారించి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా వడదెబ్బ మృతులను నిర్థారిస్తామన్నారు. . . . -
వడదెబ్బకు వ్యవసాయ కూలీ మృతి
అల్లవరం(అమలాపురం) : అల్లవరం మండలం దేవగుప్తం గ్రామం నల్లగుంట ప్రాంతానికి చెందిన అయితాబత్తుల కోటేశ్వరరావు వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన పొలానికి ఉదయం వ్యవసాయ పని కోసం వెళ్లాడు. 11.30 గంటలకు పొలంలో వరి పనలు తీస్తుండగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు కోటేశ్వరరావుని గట్టుకి తీసుకొచ్చి సపర్యలు చేశారు. అప్పటికే తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. తహసీల్దార్, పోలీస్, ఆరోగ్య సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. తహసీల్దార్ వడ్డి సత్యవతి, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఆర్ఐ దుర్గారామచంద్రమూర్తి, ఆరోగ్య సిబ్బంది మట్టపర్తి వెంకటేశ్వరరావు, సాధనాల వెంకట్రావు, పెచ్చెట్టి వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. -
ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు
లండన్: మామూలు సిగరెట్ కంటే ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఎలుకలపై జరిపిన వేరువేరుగా జరిపిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 10 రోజుల పాటు ఈ-సిగరెట్ పొగ ప్రభావానికి గురిచేసిన ఎలుకల్లో గుండె, నరాలు బాగా దెబ్బతిన్నాయని, ఇది ఎలుకల్లో మామూలు సిగరెట్ పొగ చూపే దుష్ప్రభావం కంటే అధికంగా ఉందని టెక్సాస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఈ-సిగరెట్ ప్రభావానికి గురైన ఎలుకల్లో మెదడు గ్లూకోజ్‌ను తీసుకునే పరిమాణం బాగా తగ్గిపోయిందని, తద్వారా మెదడు యాక్టీవ్‌గా పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఇక రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ఎంజైమ్‌పై రెండు రకాల సిగరెట్లు తీవ్ర దుష్ఫలితాలు చూపుతున్నాయని వెల్లడించారు. -
సెస్ బాదుడు
గొప్పలు ఆర్టీసీకి... భారం ప్రయాణికులకు సెస్ పేరుతో అదనపు చార్జీ వసూలు ఇబ్బందుల్లో ప్రయాణికులు ధర్మవరంటౌన్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉంటోంది. ప్రమాద బాధితులను ఆదుకోవడం ఆర్టీసీకి తలకుమించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రమాద భాదితులకు ప్రమాద పరిహారం అందించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ సెస్ చార్జీల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రమాదానికి గురై మరణిస్తే ఆ బాధితులకు 24 గంటలలోపే రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తారు. ఈ విధానం 6 నెలలుగా అమలవుతోంది. దీని ద్వారా ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, గరుడా, అల్ట్రా డీలక్స్ తదితర సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణీకులకు టిక్కెట్ ధర కన్నా రూ.1 ని అదనంగా వసూలు చేస్తారు. పల్లె వెలుగుబస్సులకు మాత్రం సెస్ చార్జీలు మినహాయింపు ఉంది. దీని ద్వారా ధర్మవరం డిపో పరిధిలో నెలకు దాదాపు రూ.7 లక్షల దాకా అదనంగా వసూలవుతోంది. ఈ మొత్తాన్ని ప్రమాద భాదితులకు అందించేందుకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రమాద బాధితులకు పరిహారం అందించాల్సిన బాధ్యత ఆర్టీసి సంస్థతో పాటు ప్రభుత్వాలకు సంబంధించిన విషయమని వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రయాణికులతో వసూలు చేయడం సమంజసం కాదని పలువురు ప్రయాణీకులు చెబుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం : బాబా, ప్రయాణికుడు, ధర్మవరం తరచూ మేం ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుంటాం. ఇప్పటికే పెంచిన చార్జీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనికితోడు సెస్ పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నా రు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలి చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి : ఎస్‌హెచ్‌బాషా, సీపీఎం డివిజన్ కార్యదర్శి సెస్ విధానం ద్వారా భాదితులకు సత్వర నష్టపరిహారం అందించడం స్వాగతించగదగ్గ విషయం. అయితే ఆ భారాన్ని ప్రజలపై మోపకుండా ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వమే భరించాలి. పెంచిన ఆర్టీసీ ధరలను తగ్గించి సెస్ చార్జీలను ఉపసంహరిస్తే ప్రయాణికులకు ఎంతో మేలు. -
నిద్ర ప్రియులకు హెచ్చరిక
న్యూయార్క్: నిద్ర ప్రియులకు హెచ్చరిక. అతి నిద్ర ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఎనిమిది గంటలు మించి నిద్రపోతూ ఉంటే వారు ఏక్షణమైనా సమస్యల వలయంలో చిక్కుకోవచ్చని హెచ్చరిస్తున్నారు. వీరికి గుండెపోటు వచ్చేందుకు 146శాతం అధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోయి తప్పనిసరిగా వ్యాయామం చేసేవారు మాత్రం జీవితాంతం ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోకుండా హాయిగా బతికేయొచ్చని కూడా వారు సెలవిస్తున్నారు. ఇప్పటి వరకు అత్యంత ప్రాణాలు హరించే వాటిల్లో తొలి రెండు స్థానాల్లో గుండెపోటు, క్యాన్సర్ ఉండగా దాని అనంతరం కూడా అతి నిద్ర వల్ల వచ్చే గుండె పోటేనని చెప్తున్నారు. ప్రతి ఏడాది బ్రిటన్‌లో దాదాపు లక్షమంది గుండెపోటుకు గురవుతుండగా వీరిలో సగానికిపైగా అతి నిద్రకు అలవాటైన వారే ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనను అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అధ్యయనకారులు చేశారు. ఎంతలేదన్నా కనీసం రోజుకు 30 నుంచి 60 నిమిషాలపాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి సురక్షితం అని చెప్పారు. -
స్ట్రోక్‌ను గుర్తించే కొత్త పరీక్ష..!
వైద్యరంగంలో రక్త పరీక్షలు కీలకపాత్ర పోషిస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, సీజనల్ వ్యాధుల లాంటి ఏ చిన్న సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళ్తే ముందుగా రక్త పరీక్షలు చేయించడం.. వ్యాధి నిర్ధారణ చేయడం మనకు తెలుసు. అయితే ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ లాంటి పెద్ద సమస్య అయినా ఇప్పుడు కేవలం కొన్ని చుక్కల రక్తంతో తెలుసుకోవచ్చంటున్నారు సైంటిస్టులు. పది నిమిషాల్లో స్ట్రోక్‌ను గుర్తించే 'గేమ్ ఛేంజర్' గా ఈ కొత్త టెస్టును చెబుతున్నారు. సమస్యను త్వరగా గుర్తించగలిగితే అపాయం నుంచి ప్రాణాన్ని రక్షించడం సులభం అవుతుంది. అందుకే చవకైన, సులభంగా వ్యాధిని గుర్తించేందుకు కనిపెట్టిన ఈ కొత్త బ్లడ్ టెస్టును పరిశోధకులు 2018 లో అందుబాటులోకి తేనున్నారు. ఈ టెస్టులో ఎంజైమ్స్ పూత కలిగిన ప్లేట్లు.. స్ట్రోక్ తర్వాత రక్తంలో పెరిగే రసాయనాలను గుర్తించేందుకు ఉపయోగపడతాయని, త్వరితగతిన వైద్యం అందించగలిగితే వైకల్యాలు దరి చేరకుండా రోగులు దీర్ఘకాలం స్వతంత్రంగా బతికే అవకాశం ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. బిగ్గెస్ట్ కిల్లర్ గా చెప్పే బ్రెయిన్ స్ట్రోక్... బ్రిటన్‌లో తీవ్రమైన వైకల్యాలకు ప్రధాన కారణమౌతోంది. దాదాపు 1.50 లక్షల మంది స్త్రీ, పురుషులు.. కండరాల బలహీనత, పెరాలసిస్ వంటి వ్యాధులతో జీవిస్తున్నారు. మెదడులో ఏర్పడే క్లాట్స్ వల్ల కలిగే స్ట్రోక్‌కు 3-4 గంటల్లోపు చికిత్స అందించగలిగితే నష్టాన్ని పరిమితం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు మెదడులో రక్తస్రావాన్ని బట్టి స్ట్రోక్ ఎలాంటిదో గుర్తిస్తారు. అయితే ఆస్పత్రిలో స్కాన్ చేయకుండా మాత్రం చికిత్స అందించడం సాధ్యం కాదని, వ్యాధిని గుర్తించకుండా మందు వాడటం ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకే ఆ తేడాలను కీలకంగా గుర్తించి వైద్యం అందించాల్సి వస్తుందని పరిశోధకులు అంటున్నారు. అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం టెస్టును కనుగొన్నారు. అంబులెన్సులో కూడా ఈ టెస్టు చేసే అవకాశం ఉండటంతో ఖర్చు తగ్గడంతో పాటు, విలువైన సమయాన్ని ఆదా చేయచ్చంటున్నారు. గతంలోనూ బ్రెయిన్ స్ట్రోక్‌ను గుర్తించే రక్తపరీక్షలు ఉన్నా, అవి గంటల కొద్దీ సమయం తీసుకోవడంతో విస్తృతంగా వినియోగంలో లేవు. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ టెస్టు.. ఆధునిక టెక్నాలజీని వినియోగించడంతో కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలు ఇస్తుందని, కొన్ని చుక్కల రక్తంతోనే సాధ్యమౌతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్షతో ప్రస్తుతం మెదడు ఏదైనా కారణాల వల్ల డ్యామేజ్ అయిందా? ఇతర అనారోగ్య కారణాలున్నాయా అన్న విషయాలను కూడా తెలుసుకోవచ్చంటున్నారు. ఈ రక్త పరీక్ష 2018లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో ఎన్నో జీవితాలను రక్షించవచ్చని పరిశోధనలో పాల్గొన్న అలెక్స్ ట్రావిస్ చెబుతున్నారు. స్ట్రోక్‌తో బాధపడే రోగుల్లో మూడు వంతుల మంది ఇషెమిక్ స్ట్రోక్‌తో (మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్) బాధపడుతున్నారని పరిశోధనకు నేతృత్వం వహించిన రాయ్ కోహెన్ అంటున్నారు. సరైన సమయంలో వైద్యం అందించడం వల్ల మెదడుకు నష్టం తగ్గుతుందని, అత్యవసర చికిత్ప అందించే అవకాశం ఉంటుందని స్ట్రోక్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ షామిమ్ క్వాడ్రిక్ అంటున్నారు. ఈ కొత్త రక్తపరీక్షతో స్ట్రోక్ ను తెలుసుకోవడమే కాక.. డిమెన్షియా, క్యాన్సర్ల గురించి కూడా తెలుసుకునే అవకాశం ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. -
మితిమీరిన ఆలోచనా ధోరణితో గుండెకు చేటు!
లండన్:జరిగితే జరుగక మానదు.. జరగనది ఎన్నటికీ జరుగదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అనవసర విషయాలపై ఆందోళనలతో పాటు, ఆదుర్దా పడితే వచ్చే లాభాలకంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అది ఒక్క చెడు అంశాలపైనే కాదు.. మనకు సానుకూలంగా ఉన్న అంశాలపై కూడా ఎక్కువ గాభర పడితే మాత్రం అది గుండె పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజే సర్వేలో వెలుగుచూసింది. ఈ తరహా ధోరణితో అతిగా ఆలోచించే వారిలో గుండె, మెదడులో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై లండన్ శాస్త్రవేత్తలు ఒక సర్వే నిర్వహించారు. ఓ కార్డియాక్ రీహబిషన్ కార్యక్రమంలో10 సంవత్సరాల నుంచి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 1,000 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. వీరంతా 60 సంవత్సరాల ఒడిలో పడ్డవారే. స్థానికంగా ఏర్పడే పరిస్థితులతో పాటు, సానుకూల అంశాలపై ఎక్కువగా గాభరా పడటంతోనే వారి గుండె చాలా బలహీనంగా మారినట్లు గ్రహించారు. రెండు సార్లు గుండెలో నొప్పి వస్తే మాత్రం అది ఖచ్చితంగా గుండె పోటుకు దారి తీసే అవకాశం ఉంటుందని, అదే నాలుగు సార్లు వస్తే మాత్రం అది వారి మరణానికి దారితీస్తుందన్నారు. -
సి రామచంద్రయ్యకు తాకిన సమైక్య సెగ