స్ట్రోక్ వస్తే సత్వరమే చికిత్స అందుబాటులో ఉన్నా అవన్నీ తాత్కలికమే. ఎందుకంటే ఒక్కోసారి భవిష్యత్తులో మళ్లీ రావచ్చు లేదా రాకపోవచ్చు. అంతేగాదు రోగికి అలాంటి సమయంలో త్వరితగతిన కోలుకోవడం కూడా ఒక్కొసారి సమయం పడుతుంటుంది. పైగా రోగి అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇక నుంచి అలా కాకుండా రోగులను త్వరితగతిన కోలుకునేలా చేయవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు.
ఈ మేరకు స్వీడన్ యూనివర్శిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్‌లో ఆ పరిశోధనలు గురించి వెల్లడించింది. పరిశోధకులు అందుకోసం ఎలుకలపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రయోగంలో భాగంగా ఎలుకలకు నాసిల్ చికిత్స విధానం ఉపయోగించి.. నాసిక గుండా సీ3ఏ పెప్టైడ్ ఆస్ట్రోసైట్‌ల డ్రాప్స్‌ను ఇచ్చారు. ఈ చుక్కలను తీసుకున్న ఎలుకలు స్ట్రోక్ తర్వాత చాలా చురుకుగా యథావిధిగా ఉన్నట్లు గుర్తించారు.
ఈ మేరకు స్వీడన్, జర్మనీలలో చేసిన ప్రయోగాల్లో కూడా ఇలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ అధ్యయనాలు చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని న్యూరో ఇమ్యునాలజీ ప్రోఫెసర్ మార్సెలా పెక్నా మాట్లాడుతూ..ఈ చికిత్స క్లినిక్స్‌లో ఉపయోగించవచ్చన్నారు. స్ట్రోక్‌కి గురై ఆస్పత్రులకు వచ్చిన వారు కూడా అంగవైకల్యానికి గురి కాకుండా త్వరితగతిన కోలుకోగలుగుతారని పెక్నా చెప్పారు. అంతేగాదు ఈ నాసిల్ డ్రాప్ చికిత్స విధానం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించగలమని చెప్పారు.
(చదవండి: విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..)
Comments
Please login to add a commentAdd a comment