drops
-
వివాదానికి తెర.. వెనక్కి తగ్గిన దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో వైద్యులు- ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మెకు దిగిన వైద్యుల లైసెన్స్‌లు సస్పెండ్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఈ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.సమ్మె చేస్తున్న వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఆరోగ్య మంత్రి చౌ క్యో హాంగ్ తెలిపారు. వారు తిరిగి విధుల్లో చేరాలని ఆయన కోరారు. అయితే ప్రభుత్వ ప్రకటన తర్వాత ఎన్ని వేల మంది వైద్యులు విధుల్లోకి వస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అత్యవసర చికిత్సలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు చికిత్స అందించే వైద్యుల కొరతను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌ క్యో హాంగ్ పేర్కొన్నారు. కాగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచాలన్న ప్రభుత్వ యోచనకు నిరసనగా ఫిబ్రవరి నుంచి మెడికల్ ట్రైనీలుగా పనిచేస్తున్న 13వేల మంది జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్స్ సమ్మెకు దిగారు. ఇది ఆసుపత్రుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రభుత్వ ప్రణాళికకు మద్దతుగా మేలో సియోల్ కోర్టు తీర్పు ఇవ్వడంతో సమ్మెకు దిగిన వైద్యులకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఆ దరిమిలా ఆసుపత్రుల్లో విధుల నిర్వహణకు తిరిగివచ్చే వైద్యుల లైసెన్సులను సస్పెండ్ చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించేందుకు 2035 నాటికి 10 వేల మంది వైద్యులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నదని అధికారులు తెలిపారు.అయితే దేశంలో వైద్య విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో, ఇది అంతిమంగా దేశంలోని వైద్య సేవలపై ప్రభావం చూపుతుందని వైద్యులు ఆరోపిస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలో అత్యధిక వేతనం పొందే వృత్తులలో వైద్య వృత్తి ఒకటి. వైద్యుల సంఖ్య పెరిగితే తమ ఆదాయాలు తగ్గిపోతాయని పలువురు వైద్యులు ఆందోళన చెందున్నారు. -
ఐదు విడతల్లో భారీగా తగ్గిన పోలింగ్
-
దేశంలో తగ్గిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: భారత్‌లో జూలై 2022–జూన్ 2023 మధ్యకాలంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల నిరుద్యోగితా రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయిలో 3.2 శాతంగా నమోదయ్యింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఎన్ఎస్ఎస్ఓ విడుదల చేసిన ఆరవ సర్వే నివేదిక ఇది. (ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!) సర్వేకు ముందు 365 రోజుల కాలాన్ని ‘నిరుద్యోగ రేటు’కు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే, ఒక్క గ్రామీణ ప్రాంతాన్ని తీసుకుంటే, 2017–18లో 5.3 శాతం ఉన్న నిరుద్యోగితా రేటు 2022–23లో 2.4 శాతానికి దిగివచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 7.7 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. పురుషుల విషయంలో ఇదే కాలంలో నిరుద్యోగితా రేటు 6.1 శాతం నుంచి 3.3 శాతానికి దిగివస్తే, మహిళల విషయంలో 5.6 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది. గత నాలుగేళ్లలో ఇలా.. కాలం రేటు (శాతంలో) 2022–23 3.2 2021–22 4.1 2020–21 4.2 2019–20 4.8 2018–19 5.8 2017–18 6.0 -
Stroke: ఈ చికిత్స అందిస్తే..ఈజీగా రికవరీ అవ్వచ్చు!
స్ట్రోక్ వస్తే సత్వరమే చికిత్స అందుబాటులో ఉన్నా అవన్నీ తాత్కలికమే. ఎందుకంటే ఒక్కోసారి భవిష్యత్తులో మళ్లీ రావచ్చు లేదా రాకపోవచ్చు. అంతేగాదు రోగికి అలాంటి సమయంలో త్వరితగతిన కోలుకోవడం కూడా ఒక్కొసారి సమయం పడుతుంటుంది. పైగా రోగి అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇక నుంచి అలా కాకుండా రోగులను త్వరితగతిన కోలుకునేలా చేయవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్వీడన్ యూనివర్శిటీ ఆఫ్ గోథెన్బర్గ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్‌లో ఆ పరిశోధనలు గురించి వెల్లడించింది. పరిశోధకులు అందుకోసం ఎలుకలపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రయోగంలో భాగంగా ఎలుకలకు నాసిల్ చికిత్స విధానం ఉపయోగించి.. నాసిక గుండా సీ3ఏ పెప్టైడ్ ఆస్ట్రోసైట్ల డ్రాప్స్‌ను ఇచ్చారు. ఈ చుక్కలను తీసుకున్న ఎలుకలు స్ట్రోక్ తర్వాత చాలా చురుకుగా యథావిధిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వీడన్, జర్మనీలలో చేసిన ప్రయోగాల్లో కూడా ఇలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ అధ్యయనాలు చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని న్యూరో ఇమ్యునాలజీ ప్రోఫెసర్ మార్సెలా పెక్నా మాట్లాడుతూ..ఈ చికిత్స క్లినిక్స్‌లో ఉపయోగించవచ్చన్నారు. స్ట్రోక్‌కి గురై ఆస్పత్రులకు వచ్చిన వారు కూడా అంగవైకల్యానికి గురి కాకుండా త్వరితగతిన కోలుకోగలుగుతారని పెక్నా చెప్పారు. అంతేగాదు ఈ నాసిల్ డ్రాప్ చికిత్స విధానం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించగలమని చెప్పారు. (చదవండి: విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
ఆటోగ్రాఫ్ ఇవ్వని ధోని బతిమాలుకున్న చాహర్..!
-
Covid-19: ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తయారీ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్.. ఐఎన్‌కోవ్యాక్ (బీబీవీ164)ను 18 ఏళ్లుపైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు మంజూరుచేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవీయ మంగళవారం ట్వీట్ చేశారు. ముక్కు ద్వారా చుక్కల రూపంలో తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ తయారీ వ్యాక్సిన్.. ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ కావడం విశేషం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 4,000 మంది వలంటీర్లపై జరిపిన పరీక్షల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా చెప్పారు. క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాధి నిరోధకతను వ్యాక్సిన్ సమర్థవంతంగా ప్రేరేపించిందని వెల్లడించారు. ప్రపంచ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ టెక్నాలజీలో నూతన ఒరవడి మొదలవనుందని ఆయన అన్నారు. -
ఈలాన్ మస్క్‌కు టెస్లా షాక్, ఆ క్లబ్‌నుంచి ఔట్..అయినా
టెస్లా సహ వ్యవస్థాపకుడు, సీఈవో ఈలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ఎలైట్ 200 బిలియన్ డాలర్ల క్లబ్‌లోంచి తాజాగా కిందకి జారుకున్నాడు. మంగళవారం టెస్లా షేర్లు దాదాపు 7 శాతం కుప్పకూలడంతో మస్క్ సంపద కూడా అదే స్థాయిలో నష్టపోయింది. ఈలాన్ మస్క్ నికర విలువ 5.40 శాతం క్షీణించి 192.7 బిలియన్ల డాలర్లు చేరుకుంది. ఈ పరిణామం తరువాత మస్క్ సంపద 2021, ఆగస్టు స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. అయినా మస్క్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండటం విశేషం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 127.80 బిలియన్ల డాలర్ల సంపదతో రెండవ స్థానంలో నిలిచారు. గ్లోబల్ మార్కెట్లో కరెక్షన్తో దిగ్గజ కంపెనీలు నెట్ వాల్యూ బాగా క్షీణించింది. ముఖ్యంగా అమెజాన్ స్టాక్ ఈ ఏడాదిలో 35.4 శాతం నష్టపోగా, టెస్లా షేరు 36.1 క్షీణించింది. మస్క్ విలువ ఇప్పుడు 204 బిలియన్ డాలర్లు కాగా, బెజోస్ నికర విలువ 131 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చి 2022లో ఈలాన్ మస్క్ నికర విలువ 200 బిలియన్ డాలర్ల కిందికిపడిపోయింది. అయితే ఆ తరువాత నష్టాలనుంచి మార్కెట్లు బలంగా పుంజుకోవడంతో మస్క్ నికర విలువ తిరిగి ఎగిసి ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో 288 బిలియన్ డాలర్లకు చేరింది. గ్లోబల్ రిచెస్ట్ మాన్‌గా అవతరించిన తరువాత ట్విటర్లో 9 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించాడు. కానీ ప్రస్తుతం ఈ డీల్ పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. -
తోటలో పనిలో ఉండగా.. విమానంలోంచి, యాక్!!
మానవ వ్యర్థాలు ఈ మాట వింటేనే జనం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా. బ్రిటన్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది. గార్డెన్లో పనిచేసుకుంటున్న మనిషి అటుగా వెళ్తున విమానం నుంచి మానవ వ్యర్థాలు గుమ్మరించిన వ్యవహారం కలకలం రేపింది. (TV Channel : షాకింగ్ వెదర్ రిపోర్ట్‌లో.. ఆ క్లిప్పింగ్) తోటలో హాయిగా పనిచేసుకుంటున్న తరుణంలో విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అలాగే అతని గార్డెన్లో ఉన్న పలు మొక్కలు, పైకప్పులపై కూడా పడ్డాయి. దీంతో వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. 2021 ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లోని విండ్సర్ సమీపంలో హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కారెన్ డావిస్ జోక్యం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టడం విశేషం. మరోవైపు ఆ విమానం పేరును బయటపెట్టడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా బాధితుడు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. (kidney transplantation: సంచలనం) విండ్సర్ అండ్ మేడెన్ హెడ్‌కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్‌తో కారెన్ డావిస్ ఈ భయంకరమైన అనుభవాలను షేర్ చేశారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం తోటంతా చాలా అసహ్యకరమైన రీతిలో పడ్డాయని వివరించారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే విమానంలోంచి జారవిడిచే మానవ వ్యర్థాలకు సంబంధించి ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు నమోదవుతూ ఉంటాయన్నారు. సాధారణంగా విమానాల నుంచి వదిలినపుడు ఎత్తైన ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతకు తక్షణమే గట్ట కట్టి, కింత పడతాయని డావిస్ చెప్పారు. కానీ తాజా ఘటనలో మాత్రం దీనికి భిన్నంగా జరగడం అరుదైనదని చెప్పారు. కాగా సాధారణంగా విమానాల్లో టాయిలెట్స్ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత వాటిని తొలగిస్తారు. ఆధునిక విమానాలలో వాక్యూమ్ టాయిలెట్లు సాధారణంగా విమానాలతో పోలిస్తే చాలా సురక్షితమైనవి భావిస్తారు. -
కరోనా సెగ : పసిడి డిమాండ్ ఢమాల్!
సాక్షి, ముంబై: బంగారం డిమాండ్ జూలై-సెప్టెంబర్ మధ్య ఇటు భారత్‌లో అటు ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోయింది. కరోనా మహమ్మారి దీనికి ప్రధాన కారణం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్ మధ్య భారత్‌లో డిమాండ్ 30 శాతం పడిపోతే, ప్రపంచవ్యాప్తంగా ఈ క్షీణత 19 శాతంగా ఉంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ పసిడి డిమాండ్ పరిమాణంలో 123.9 టన్నుల (2019 సెప్టెంబర్) నుంచి 86.6 టన్నులకు పడిపోయింది. ఇక విలువ రూపంలో చూస్తే, పసిడి డిమాండ్ 4 శాతం పడిపోయి రూ.41,300 కోట్ల నుంచి రూ.39,510 కోట్లకు తగ్గింది. ఆభరణాల డిమాండ్, పరిమాణంలో 48 శాతం క్షీణించి 101.6 టన్నుల నుంచి 52.8 టన్నులకు చేరింది. విలువలో చూస్తే, 29 శాతం పడిపోయి, రూ.33,850 కోట్ల నుంచి రూ.24,100 కోట్లకు దిగింది. మొత్తం రీసైకిల్డ్ గోల్డ్ పరిమాణం 14 శాతం ఎగసి 36.5 టన్నులకు 41.5 టన్నులకు చేరింది. యల్లో మెటల్ అధిక ధరలూ దీనికి కారణం. పెట్టుబడుల డిమాండ్ అప్... ఇక పెట్టుబడుల విషయంలో (పరిమాణం) మాత్రం డిమాండ్ 22.3 టన్నుల నుంచి 33.8 టన్నులకు ఎగసింది. విలువలో చూస్తే, 107 శాతం పెరిగి రూ.7,450 కోట్ల నుంచి రూ.15,410 కోట్లకు ఎగసింది. ప్రపంచ డిమాండ్ 892.3 టన్నులు : ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమండ్‌ను సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశీలిస్తే, 2019 ఇదే కాలంతో పోల్చితే పరిమాణంలో 19 శాతం పతనమైంది. 1,100.2 టన్నుల నుంచి 892.3 టన్నులకు డిమాండ్ పడిపోయింది. అయితే పెట్టుబడుల డిమాండ్ మాత్రం 21 శాతం పెరిగి 494.6 టన్నులకు చేరింది. ఆభరణాలకు డిమాండ్ 29 శాతం పడిపోయి 333 టన్నులుగా నమోదయ్యింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలానికి చూస్తే, ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ హోల్డింగ్స్ విలువ ఏకంగా 1,003.3 టన్నులుగా ఉండడం గమనార్హం. 2009 తరహా పరిస్థితి ఖాయం... : బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడుతుందన్న గట్టి నమ్మకం ఉంది. కోవిడ్–19 తరువాత డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నాటి రోజులను తీసుకుంటే, 2009లో పసిడి డిమాండ్ 642 టన్నులుగా ఉంది. 2010లో ఇది భారీగా 1,002 టన్నులకు చేరింది. 2011, 2012లో డిమాండ్ మరింత పెరిగింది.-సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) -
దిగొచ్చిన ట్రంప్ సర్కార్ : వారికి భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి వివాదాస్పద నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఆన్లైన్ క్లాస్‌లకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులకు షాక్ ఇస్తూ గత నెలలో తీసుకొచ్చిన ఆర్డర్లను తాజాగా రద్దు చేశారు. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఐసీఈ) ఆదేశాలను వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు. తద్వారా లక్షలాది విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. (ఆన్లైన్ క్లాసులా...? మీ దేశాలకు వెళ్లిపోండి!) కరోనా వ్యాప్తి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైతే, విదేశీ విద్యార్థులు దేశంలోఉండటానికి వీల్లేదని, అమెరికా విడిచి వెళ్లాల్సిందేనంటూ చేసిన జులై 6 నాటి ప్రకటన జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులకు హాజరయ్యే వారికి వీసాలు జారీ చేయబోమని ప్రకటించి పెద్ద దుమారాన్ని రేపింది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఎఫ్-1, ఎం-1పై ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న వారు కూడా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని ఐసీఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై అటు ప్రతిపక్షం, ఇటు అమెరికాలోని పలు యూనివర్శిటీలు విద్యార్థులు, టెక్ దిగ్గజాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వీటిని సవాలు చేస్తూ పలు వ్యాజ్యాలు కూడా దాఖలు చేశాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ సర్కారు దిగి రాక తప్పలేదు. -
కరోనా సంక్షోభం : ముకేశ్ అంబానీ నష్టం ఎంతంటే
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి ప్రకంపనలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలవుతున్నాయి. కోవిడ్ -19 ను అడ్డుకునే క్రమంలో దేశంలో 21 రోజుల లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆర్థిక కష్టాల్లోకి జారుకుంటున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు భారీగా ప్రభావితమవుతోంది. ఫలితంగా అటు ప్రపంచ స్టాక్ మార్కెట్లు, ఇటు దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేస్తున్నాయి. దేశీయ మార్కెట్లలో వచ్చిన ఈభారీ దిద్దుబాటు కారణంగా మార్చి 31 నాటికి భారతీయ కుబేరుడు, రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద భారీగా పడిపోయింది. అంబానీ నికర విలువ రెండు నెలల్లో 28 శాతం లేదా 300 మిలియన్ డాలర్లు తగ్గి 48 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఒక నివేదిక సోమవారం తెలిపింది. అతని సంపద 19 బిలియన్ డాలర్లు క్షీణించడంతో, ప్రపంచ ర్యాంకింగ్ లో ఎనిమిది స్థానాలు తగ్గి, 17 వ స్థానానికి పడిపోయారని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తెలిపింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తాజా నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలల్లో ముకేశ్ నికర విలువలో దాదాపు 19 బిలియన్ డాలర్లు (రూ.1.44 లక్షల కోట్లు) నష్టాన్ని మూటగట్టుకున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో రూ.1,400గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల విలువ ఏప్రిల్ 3వ తేదీ నాటికి 1,077కి పడిపోయింది. కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నష్టపోయిన ధనికుల్లో అంబానీ రెండో స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నాడ్ అర్నౌల్ట్ ఉన్నారు. ఈయన సంపద 28 శాతం లేదా 30 బిలియన్ డాలర్లు తగ్గి 77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక అమెజాన్ జెఫ్ బెజోస్ 131 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. గత రెండు నెలల్లో కేవలం 9 శాతం మాత్రమే పడిపోయింది. బిల్ గేట్స్ 91 బిలియన్ డాలర్ల (14 శాతం తగ్గింది)గా వుంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నివేదిక ప్రకారం నికర విలువలో గౌతమ్ అదానీ 5 బిలియన్ డాలర్లు (37 శాతం) , హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్ నడార్ 5 బిలియన్ డాలర్లు (26 శాతం), ఉదయ్ కోటక్ 4 బిలియన్ డాలర్ల (28 శాతం) నష్టపోయారు. అంతేకాదు ఓయో రూమ్స్ రితేష్ అగర్వాల్ ఇకపై బిలియనీర్ కాదు అని రిచ్ లిస్ట్ తెలిపింది. గత రెండు నెలల్లో భారతదేశంలో వ్యాపారవేత్తలు స్టాక్‌మార్కెట్లలో దాదాపు 25శాతం నష్టాలు చవిచూశారు, అంతేకాక.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5.2శాతానికి పడిపోయింది. ముఖ్యంగా అంబానీకి ఇది గడ్డుకాలం.. ఆయన ఆస్తిలో దాదాపు 28శాతం నష్టం వచ్చిందని హురున్ ఎండీ అనస్ రహ్మన్ వెల్లడించారు. టాప్ 100 జాబితా నుంచి ముగ్గురు భారతీయులు తప్పుకోగా, ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయుడుగా అంబానీ నిలిచారు. బెర్క్‌షైర్ హాత్వేకు చెందిన వారెన్ బఫెట్ కూడా గత రెండు నెలల్లో 19 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. అయితే 19 శాతం వద్ద ఇది స్వల్ప పతనమని నివేదిక తెలిపింది. సంపదను కోల్పోయిన వారి టాప్ -10 జాబితాలో కార్లోస్ స్లిమ్, వారి కుటుంబం, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, లారీ పేజ్, సెర్గీ బ్రిన్ , మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ ఉన్నారు. గత రెండు నెలల్లో చైనా బిలియనీర్లు కొద్దిమంది లాభాలలో ఉన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ , పంది మాంసం ఉత్పత్తి చేసే సంస్థల ప్రమోటర్లు కూడా ఉన్నారు. టాప్ -100 ర్యాంకింగ్స్‌లో భారత్ మూడు ర్యాంకింగ్స్‌ను కోల్పోగా, ఆరుగురు చైనా బిలియనీర్లు ఈ జాబితాలో చేరడం విశేషం. చదవండి : రికార్డు కనిష్టానికి బంగారం దిగుమతులు దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి: రాజన్ -
బ్యాంకుల దెబ్బ, మరో మహాపతనం
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత పతనమైన దలాల్ స్ట్రీట్ ఒక దశలో 1350 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో కీలక సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ ప్రధాన మద్దతు స్తాయిల దిగువకు చేరాయి. ముఖ్యంగా ఐటీ టాప్ లూజర్ గా వుంది. ఈ అలాగే ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్లను పతనం దిశగా లాక్కెళ్లాయి. కరోనా వైరస్ ప్రపంచ వృద్ధికి ముప్పు తెచ్చిపెడుతుందున్న అంచనాల మధ్య ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలు, వేగంగా విస్తరిస్తున్న కరోనా భయాల మధ్య 2021 ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ప్రారంభించాయి. 1203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 28,265 వద్ద, నిఫ్టీ 344 పాయింట్లు కుప్పకూలి, 8253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 4.8 శాతం పడిపోయి 18,221 కు చేరుకుంది. మిడ్ క్యాప్ప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఆటో, ఫార్మ నష్టాల్లోనే ముగిసాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బీఐ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 3-8 శాతం నష్టపోయాయి. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం నష్టపోయింది. యాక్సిస్, ఎస్బీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, టీసీఎస్ తదితరాలుకూడా నష్టపోయాయి. మరోవైపు, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, స్వల్పంగా లాభపడ్డాయి. అటు ముడి చమురు అతిపెద్ద త్రైమాసిక నష్టం తరువాత బుధవారం 21 సెంట్లు లేదా 0.8 శాతం తగ్గి 26.14 డాలర్లకు చేరుకుంది. -
కొత్త ఏడాది : కీలక సూచీలు ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ఆరంభించింది. అనంతరం నష్టాల్లోంచి మరింత బలహీనపడింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 722 పాయింట్ల నష్టంతో 28745 వద్ద, నిప్టీ 209 పాయింట్లు పతనమై 8381 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 29వేల దిగువకు చేరగా, నిఫ్టీ 84 వేల స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉండగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌లు లాభపడుతున్నాయి. అలాగే గత 2 రోజులుగా నష్టాల్లో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్‌లో షార్ట్ కవరింగ్ కనిపిస్తోంది. ఎస్ బ్యాంకు పది శాతం ఎగసింది. బ్రిటానియా, సిప్లా, హెచ్‌యూఎల్, నెస్లేలు నిఫ్టీ లాభపడుతుండగా, కోటక్ మహీంద్రా, ఒఎన్జీసీ, అదాని పోర్ట్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్‌లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. -
దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమందగమనం, వినియోగదారుల డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై మాసంతో పోలిస్తే, ఆగస్టుమాసంలో ఉద్యోగాల కల్పన దారుణంగా పడిపోయింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) పేరోల్ డేటా ప్రకారం ఆగస్టులో సుమారు 13 లక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రం రాగా, అంతకుముందు నెలలో (జూలై) ఈ సంఖ్య 14.49 లక్షలు. 2018-19లో ఇఎస్ఐసితో కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఒక నివేదికలో తెలిపింది. 2017 సెప్టెంబర్ నుండి 2019 ఆగస్టు వరకు సుమారు 2.97 కోట్ల మంది కొత్త చందాదారులు ఈ పథకంలో చేరినట్లు కూడా నివేదిక వివరించింది. ఇఎస్ఐసీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించే వివిధ సామాజిక భద్రతా పథకాల్లో చేరిన కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ నివేదికను రూపొందిస్తుంది. సెప్టెంబర్ 2018 నుండి ప్రారంభమయ్యే కాలాన్ని కవర్ చేస్తూ ఏప్రిల్ 2018 నుండి ఈ మూడు సంస్థల పేరోల్ డేటా లేదా కొత్త చందాదారుల డేటాను విడుదల ఎన్ఎస్ఓ చేస్తోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు ఇఎస్ఐసీ లో కొత్త నమోదులు 83.35 లక్షలుగా ఉందని నివేదిక చూపించింది. ఈ ఏడాది జూలైలో 11.71 లక్షలతో పోలిస్తే ఆగస్టులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) తో 10.86 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే నమోదయ్యాయి. 2018-19లో నికర ప్రాతిపదికన 61.12 లక్షల మంది కొత్త చందాదారులు ఇపిఎఫ్ఓ నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో చేరారు. అదేవిధంగా, నికర కొత్త నమోదులు (సెప్టెంబర్ 2017 - మార్చి 2018 వరకు) 15.52 లక్షలు. కాగా సెప్టెంబర్ 2017 - 2019 ఆగస్టులో ఇపీఎఫ్ పథకంలో చేరిన కొత్త చందాదారులు సుమారు 2.75 కోట్ల మంది. చందాదారుల సంఖ్య వివిధ వనరుల నుండి వచ్చినందున, ఈ అంచనాలు సంకలితం కాదని ఎన్ఎస్ఓ నివేదిక పేర్కొంది. -
హిందీపై కేంద్రం వెనక్కి
న్యూఢిల్లీ: హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలన్న నిబంధనపై కేంద్రం వెనక్కి తగ్గింది. శనివారం విడుదలయిన జాతీయ విద్యా విధానం ముసాయిదాలో హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని ప్రతిపాదించారు.దీనిపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని డీఎంకే వంటి పార్టీలు హెచ్చరించాయి. దాంతో కేంద్రం ముసాయిదాలోంచి ఈ నిబంధనను తొలగించింది. సవరించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను సోమవారం విడుదల చేసింది.‘ తాము నేర్చుకుంటున్న మూడు భాషల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్ధులు 6, 7 గ్రేడుల్లో (తరగతులు) ఆ పని చేయవచ్చు. మాధ్యమిక పాఠశాల బోర్డు పరీక్షల్లో మూడు భాషల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలిగిన విద్యార్ధులు ఆరు లేదా ఏడు తరగతుల్లో భాషను మార్చుకోవచ్చు.’అని సవరించిన ముసాయిదాలో పేర్కొన్నారు. భాషా నైపుణ్యంపై బోర్డు నిర్వహించే పరీక్షల్లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది. హిందీయేతర ప్రాంతాల్లో హిందీని తప్పనిసరి భాషగా బోధించాలని ఇంతకు ముందు ముసాయిదాలో పేర్కొన్నారు. దీనిని తమిళనాడులోని డీఎంకే పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. తాము ఐదు దశాబ్దాలుగా ద్విభాషా సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నామని, ఇప్పుడు త్రిభాషా సిద్ధాంతం పేరుతో తమపై బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే సహించబోమని డీఎంకే నేత స్టాలిన్ హెచ్చరించారు. బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే కూడా ఈ ప్రతిపాదనను తొలగించాలని డిమాండు చేసింది. ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, అందరి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే తుది విధానం రూపొందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పినా వ్యతిరేకత ఆగలేదు. దాంతో ఆ ప్రతిపాదనను తొలగించి కొత్త ముసాయిదాను కేంద్రం విడుదల చేసింది. హిందీ నిబంధనను తొలగించడం పట్ల డీఎంకే హర్షం వ్యక్తం చేసింది. తమ పార్టీ అధినేత కరుణానిధి సజీవంగానే ఉన్నారనడానికి కేంద్రం సవరణే నిదర్శనమన్నారు. కరుణానిధి 95వ జయంతి సందర్భంగా స్టాలిన్ పార్టీ జిల్లా కార్యదర్శులు,ఎంపీలు, ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. త్రిభాషా సిద్ధాంతం ప్రతిపాదనను తిరస్కరిస్తూ సమావేశం తీర్మానం ఆమోదించింది. జాతీయ విద్యా విధానం ముసాయిదా నుంచి హిందీ తప్పనిసరి నిబంధనను తొలగించడం పట్ల కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి ఫలానా భాష వల్ల తనకు లాభముందని అనుకుంటే ఆ భాష నేర్చుకోవచ్చని అంతేకాని వారిపై బలవంతంగా ఏ భాషనూ రుద్దరాదని హైదరాబాద్‌లో అన్నారు. గతంలో త్రిభాషా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు, దానికెదురైన వ్యతిరేకతలను ఆయన గుర్తు చేశారు. దక్షిణాదిన హిందీ భాషను ప్రచారం చేస్తున్న దక్షిణ హిందీ ప్రచార సభను మరింత పటిష్టం చేయాలని ఆయన సూచించారు. బలవంతంపు హిందీ భాష ప్రతిపాదనను తొలగించడం పట్ల కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతోషం వ్యక్తం చేశారు.‘ త్రిభాషా సిద్ధాంతం అవసరం లేదు. మాకు కన్నడ, ఇంగ్లీషు ఉన్నాయి. అవి చాలు. కన్నడకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’అని మైసూరులో అన్నారు. -
టెక్ జెయింట్ల పోరుకు ఫుల్స్టాప్
అమెరికా టెక్ జెయింట్లు యాపిల్, క్వాల్కామ్ తమ మధ్య ఉన్న వైరానికి ముగింపు పలికాయి. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన రాయల్టీ చెల్లింపుల యుధ్దానికి ఫుల్స్టాప్ పెట్టాయి. ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరిందని యాపిల్, అమెరికన్ మైక్రోచిప్ తయారీదారు క్వాల్కామ్ సంయుక్తంగా మంగళవారం ప్రకటించాయి. పరస్పర దాఖలు చేసుకున్న అన్ని వ్యాజ్యాలను ఉపసంహరించుకున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఇందుకు ఇరు కంపెనీల మధ్య ఆరు సంవత్సరాల లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ లెసెన్స్‌ను అవసరమైతే మరో రెండేళ్లపాటు విస్తరించుకునే ఆప్షన్‌కు కూడా ఇందులో జోడించాయి. ఈ ఒప్పందం వైర్లెస్ పరిశ్రమకు లబ్ది చేకూరుస్తుందని విశ్లేషకుడు ప్రాటిక్ మూర్హెడ్ వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో కోర్టులో వాదనల చివరి నిమిషంలో యాపిల్, క్వాల్కామ్ ఈ పరిష్కారానికి రావడం విశేషం. గత రెండు సంవత్సరాలుగా, కంపెనీ మధ్య న్యాయ పోరాటం జరుగుతోంది. దీంతో కోట్లాది రూపాయలకు చెల్లింపులనుంచి క్వాల్కామ్ బయటపడింది. దీంతో వాల్‌స్ట్రీట్‌లో క్వాల్కం 23 శాతానికి పైగా పెరిగింది. దాదాపు 20 ఏళ్లలో ఇది ఉత్తమమైన లాభంగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. టెక్ దిగ్గజం యాపిల్, చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ మధ్య పేటెంట్, లైసెన్సింగ్ విధానంపై పోరు న్యాయ స్థానానికి చేరింది. 2017 ఆరంభంలో, అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమీషన్ వద్ద క్వాలాకామ్ తమతో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు లైసెన్సుల విక్రయంలో యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ దావా వేసింది. క్వాల్ కామ్ కంపెనీ మోనోపలి చెలాయిస్తోందన్నది యాపిల్ ఆరోపణ. -
పదినెలల కనిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పది నెలల కనిష్టానికి దిగి వచ్చింది. జనవరి నెలలో 2.76 శాతానికి పడిపోయింది. తయారీ వస్తువులు, ఇంధన ఉత్పత్తుల ధరలు ప్రభావంతో ఈ పరిణామం చోటు చేసుకుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. టోకుధరల ధరలు జనవరి నెలలో గత నెలతో పోలిస్తే 0.07 శాతం పెరగ్గా, వార్షిక ప్రాతిపదికన 1.84 శాతం పెరిగాయి. -
ఫోర్బ్స్ జాబితా: ట్రంప్ సంపద పెరిగిందా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంపదలో భారీగా కిందికి పడిపోయారు. అధ్యక్షపదవిని చేపట్టిన సంవత్సరం తరువాత ట్రంప్ సంపద 400 మిలియన్ డాలర్ల కిందికి పడిపోయింది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో ట్రంప్ 3.1బిలియన్ డాలర్లుగా నిలిచింది. అంతేకాదు గత ఏడాది అక్టోబర్‌లో ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత ధనవంతులైన 400 అమెరికన్ల జాబితాలో నిలిచిన ట్రంప్ పేరు ఈ సారి మిస్ అయింది. తగ్గుదలకు కారణమేమిటి? అమెరికా మార్కెట్ల ప్రభావం పాక్షికంగా ప్రభావం చూపించగా న్యూయార్క్ నగరంలో రిటైల్ రియల్ ఎస్టేట్ సంక్షోభం ఆయన సంపదను దెబ్బతీసిందని నిపుణులు పేర్కొన్నారు. పుంజుకున్న ఇ-కామర్స్ బిజినెస్ ట్రంప్ టవర్ విలువను తగ్గించింది. ట్రంప్ విలువైన భవనం విలువ గత సంవత్సరంలో 41 మిలియన్ డాలర్లు తగ్గిందని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఈ మార్కెట్ సవాళ్లకు తోడు దీర్ఘకాలం అద్దెదారుగా ఉన్న నైక్ సుమారు 65వేల చదరపు అడుగుల భవనాన్ని ఖాళీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది కూడా భారీ ప్రభావాన్నిచూపించినట్టు తెలుస్తోంది. -
అదానీకి మరోషాక్
సాక్షి, ముంబై: భారత్‌లో అతిపెద్ద ఓడరేవుల నిర్వహణ సంస్థ అదానీ పోర్ట్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాలో చేపట్టిన కార్మైకేల్ బొగ్గు గని ప్రాజెక్టు విషయంలో మరోసారి అదానీకి భంగపాటు తప్పలేదు. ఆస్ట్రేలియాలోని డోనర్ ఈడీఐ లిమిటెడ్‌కు చెందిన ప్రాజెక్టును వదులుకుంటున్నట్టు ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు అదానీ, డోర్ కంపెనీలు వెల్లడించాయి. వివాదాస్పద బొగ్గుగని ప్రాజెక్టును రద్దు చేసుకుంటున్నట్టు సోమవారం వెల్లడించింది. దీంతో దీర్ఘకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న కార్మైకేల్ గనికి తాజాగా మరో షాక్ తగిలింది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 16.5 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు కోసం ప్రభుత్వ రుణాలను పొందడంలో విఫలమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు, చైనా బ్యాంకులు కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు నో చెప్పాయి. ఇక చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో దీంతో అదానీ ఆశలు వదులకుంది. కాగా 16,500 కోట్ల డాలర్ల విలువైన కార్మైకేల్ ప్రాజెక్టు ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు గనుల్లో ఒకటి. అయితే అంతర్జాతీయ బ్యాంకులు సహా, చైనాకు చెందిన రెండు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఈ ప్రాజెక్టుకు రుణాన్ని నిరాకరించాయి. మరోవైపు స్థానికులు, పర్యావరణవేత్తలు, పలు సామాజిక సంఘాలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది. -
చిన్న‘చూపు’!
‘‘చిన్నారుల కంటిచూపు మెరుగునకు వేసే విటమిన్–ఏ ద్రావణం గడ్డకట్టింది. చివరి క్షణంలో విషయం బహిర్గతం కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వెంటనే జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సమాచారమిచ్చింది. సోమ, మంగళవారాల్లో వేయాల్సిన చుక్కల మందు పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం చిన్నారుల కంటి చూపు మెరుగు కోసం విటమిన్–ఏ ద్రావణం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 4.06లక్షల మంది 9నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు కంటిచుక్కల మందు వేయాలని భా వించింది. జిల్లావ్యాప్తంగా 10,500 బాటిళ్లను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ద్రా వణం నాసిరకంగా తయారుకావడంతో పంపిణీకి ముందే బాటిళ్లలో గడ్డ కట్టినట్లు అధికారులు గుర్తించారు. అది కూడా ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాటిళ్లను సరఫరా చేసే సమయంలో గుర్తించినట్లు తెలిసింది. చిన్నారుల ప్రాణాలతో ముడిపడిన ఈ ద్రావణంలో ఉన్నత ప్రమాణాలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఫార్మా కంపెనీలు నాణ్యతను పాటించలేదని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ద్రావణం గడ్డ కట్టిందని చర్చించుకుంటున్నారు. షాక్ అయిన వైద్యబృందం.. గడ్డ కట్టిన విటమిన్–ఏ ద్రావణాన్ని చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ద్రావణాన్ని పరిశీలించకుండా చిన్నారులకు పంపిణీ చేసి ఉంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని వైద్య సిబ్బంది చర్చించుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. పీహెచ్‌సీలకు ఈ విషయాలేమీ తెలియపరచకుండా కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ఆదేశాలిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. 9నెలలు నిండి 5సంవత్సరాల లోపు పిల్లలకు ఈ ద్రావణం వేయడం వల్ల కలిగే ప్రయాజనాల గురించి అవగాహన కల్పించారు. 9నెలల నుంచి ఏడాది లోపు వయస్సు కలిగిన పిల్లలకు ఒక ఎంఎల్, ఏడాది దాటి ఐదేళ్ల లోపు చిన్నారులకు 2ఎంఎల్ మోతాదుగా ద్రావణం పోయాలని నిర్ణయించారు. ఈ మేరకు గ్రామస్థాయిలో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లను అప్రమత్తం చేశారు. సోమ, మంగళవారాల్లో పంపిణీ చేయాలని డీఎం అండ్ హెచ్‌వో నుంచి పీహెచ్‌సీలకు ఆదేశాలందాయి. కొన్ని పీహెచ్‌సీలకు ఇప్పటికే సరఫరా.. విటమిన్–ఏ ద్రావణాన్ని ఈనెల 23, 24 తేదీలలో పంపిణీ చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసిన అధికారులు కొన్ని పీహెచ్‌సీలకు ఇప్పటికే సరఫరా చేశారు. మరికొంత డీఎంహెచ్‌వో కార్యాలయంలోనే స్టాకు ఉండిపోయింది. తమ వద్దనున్న స్టాకును కూడా పరీక్షించగా గడ్డకట్టి వినియోగానికి పనికిరాదని వైద్యాధికారులు నిర్ధారించారు. వెంటనే అప్రమత్తమై పంపిణీ వాయిదా వేయాలని ఆదేశించారు. -
పసిడి ధరలు వెల వెల
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. వరుసగా సెషన్లుగా క్షీణిస్తున్న పుత్తడి ధరలు మంగళవారం మరింత దిగి వచ్చాయి. విదేశీ ధోరణి, స్థానిక నగల దుకాణదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో పసిడి దిగి వస్తోంది. అయితే వెండి ధరలుమాత్రం స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న కారణంగా ఇకపై ద్రవ్యోల్బణం బలపడనున్నట్లు ఫెడ్ అధికారులు తాజాగా పేర్కొనడంతో డాలరు ఇండెక్స్ 97కు బలపడింది. ఇది పరోక్షంగా దేశీయ కరెన్సీ, పసిడిలో అమ్మకాలకు కారణమైంది. అటు ఫ్రాన్స్‌లోనూ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, బ్రెక్సిట్ చర్చలు మొదలుకావడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నివ్వగా పసిడిపట్ల విముఖతను పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత పది గ్రాముల ధర రూ. 100 తగ్గి రూ. 29,000, రూ .28,850 వద్ద ఉన్నాయి. నిన్న రూ. 70 పడిపోయింది. అయితే సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 24,400 గా నమోదైంది. మరోవైపు వెండి కేజీ ధర రూ. 38,700 వద్ద ఉంది. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.60 పెరిగి కు రూ .38,300 కి చేరుకుంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. బంగారం ధర రూ. 28, 547 వద్ద ఉంది. -
వికీలీక్స్ అసాంజేకు భారీ ఊరట
వికీలీక్స్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత విజిల్ బ్లోయర్ జూలియన్ అసాంజే (45) భారీ ఊరట లభించింది. అత్యాచార ఆరోపణ కేసులతో ఇబ్బందులపాలవుతున్న ఆయనకు స్వీడన్ భారీ ఉపశమనం కల్పించింది. అతనిపై అత్యాచార ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న ఆసాంజేపై వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్ వ్యతిరేకంగా దాఖలైన అత్యాచార ఆరోపణల విచారణను ఏడు సంవత్సరాల తర్వాత విచారణ నిలిపివేయాలని నిర్ణయించిందని స్వీడిష్ ప్రాసిక్యూషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అసాంజేపై ఏడు సంవత్సరాల విచారణకు తెరపడింది. జూలియన్ అస్సాంజ్కు ఇది పూర్తి విజయమని ఆయన కోరుకున్నప్పుడు రాయబార కార్యాలయం నుండి బయలుదేరవచ్చని, అస్సాంజ్ చాలా సంతోషంగా ఉన్నాడని ఆయన న్యాయవాది సామ్యూల్సన్ స్వీడిష్ రేడియోకి చెప్పారు. కాగా 2010లో అసాంజే వీకీలీక్స్ అమెరికాకు చెందిన అనేక సైనిక రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి అమెరికా ఆర్మీ నిఘా నిపుణుడు చెల్సియా మన్నింగ్ తస్కరించిన రహస్య పత్రాలను వీకీలీక్స్ బహిర్గతం చేసింది. లక్షలాది సైనిక రహస్య పత్రాలు లీక్ చేసిన ఎన్ఎస్ఏ మాజీ విశ్లేషకుడు ఎడ్వర్డ్ స్నోడన్ వెనుక ఉన్నది కూడా అసాంజేయేనని నిర్ధారణకు వచ్చినఅసాంజే అరెస్టుకు అమెరికా పావులు కదిపింది. దీంతో 2012లో అసాంజే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టుగా ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నసంగతి తెలిసిందే. -
డాక్టర్ రెడ్డీస్.. మళ్లీ తుస్!
న్యూఢిల్లీ : దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మరోసారి పడిపోయింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసిక ఫలితాల్లోనూ కంపెనీ కన్సాలిడేట్ నికరలాభాలు 17 శాతం మేర క్షీణించాయి. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు రూ.483.40 కోట్లగా నమోదయ్యాయి. 2015 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ డ్రగ్ మేకర్ లాభాలు రూ.579.30 కోట్లగా ఉన్నాయి. ఇతర సమగ్ర ఆదాయలు రూ.119.40 కోట్లగా నమోదయ్యాయి. కంపెనీ నికర విక్రయాలు కూడా మందగించినట్టు కంపెనీ నేడు నమోదుచేసిన బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 7 శాతం డౌన్ అయి రూ.3,653.40 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. నిర్వహణ లాభాలు(ఈబీఐటీడీఏలు) కూడా ఏడాది ఏడాదికి 13.06 శాతం క్షీణించి, రూ.879.3 కోట్లగా రికార్డు అయ్యాయి. అయితే మూడో త్రైమాసికంలో కంపెనీకి గ్రాస్ ప్రాపిట్ మార్జిన్లు మంచిగా 59.10 శాతం పెరిగాయని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఈ క్వార్టర్లో రూ.500 కోట్లను ఖర్చుచేసినట్టు పేర్కొంది. -
ఎల్ఐసీ ఫలితాలు సూపర్
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రోత్సాహకర ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాల్లో 20 శాతం నికర లాభాలను నమోదుచేసింది. క్యూ2 లో రూ. 495 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 13 శాతం వృద్ధి చెంది రూ. 3490 కోట్లుగా రిపోర్టు చేసింది. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో కంపెనీ నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 21 శాతం పెరిగి రూ. 866 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు మాత్రం రూ. 30 కోట్లవద్దే నిలిచాయి. మార్కెట్ సమయంలో ఫలితాలు ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లతో రికార్డు గరిష్టాన్ని నమెదు చేసినా చివర్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది. -
కొబ్బరి ధర పతనం
కాయకు మిగిలేది రూపాయే... ∙ అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ. 3,500 తీరప్రాంత మండలాల్లో రూ.2,500 ∙ గొల్లుమంటున్న కొబ్బరి రైతులు అమలాపురం/ అంబాజీపేట : ఆశించితి నత్తగారా.. అన్నట్టుగా ఉంది కొబ్బరి రైతుల పరిస్థితి. ఇటీవల కాలంలో కొబ్బరి కాయ ధర తగ్గిపోయింది. పండగ సీజన్లో పెరగవచ్చంటూ రైతులు ఆశలు పెంచుకున్నారు. అయితే ఈ సీజన్లో కూడా ధర కనిష్ట స్థాయికి దిగజారిపోయింది. దాంతో డీలా పడిన రైతు దింపులు తీసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇది పండగల సీజన్.. ఇప్పుడు దసరా.. నెలాఖరున దీపావళి.. వెంటనే కార్తీకమాసం. సాధారణంగా ఈ సీజన్లో కొబ్బరికి ఎనలేని డిమాండ్ ఉంటుంది. ధర పెరుగుతుంటుంది. అయితే ఈ ఏడాది పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో వెయ్యి పచ్చికొబ్బరి కాయల ధర రూ.3,400 నుంచి రూ.3,500 వరకు ఉంది. నెల్లాళ్లుగా ఇదే ధర నిలకడగా ఉంది. ధర పెరుగుతుందని రైతులు ఆశించారు. అయితే ధరలు పెరగకపోవడంతో వారు నీరుగారిపోయారు. ఉప్పలగుప్తం, అల్లవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం తదితర ప్రాంతాల్లో వెయ్యి కాయల ధర రూ.2,500 పలుకుతోంది. మార్కెట్లో డిమాండ్ లేనందున ధర తగ్గినా వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపడడం లేదు. దీంతో ధర పెరుగుతుందనే నమ్మకం రైతులకు కలగడం లేదు. మిగిలేది రూపాయే తీర ప్రాంత మండలాల్లో కొబ్బరి కాయ ధర రూ.2.50 పలకడం రైతులను నిర్వేదానికి గురి చేస్తోంది. దింపునకు కాయకు 90 పైసలు, కాయలు పోగుపెట్టి రాశులుగా పోయడానికి మరో 40 పైసలు అడుగుతున్నారు. అంటే కాయకు రూ.1.30 పైసలన్నమాట. కాయకు వచ్చేది రూ.2.50. అంటే రైతుకు మిగిలేది రూ.1.20 మాత్రమే. శనగ కాయలు (100 కాయలకు 4 కాయలు), మోతమోసే కూలీలకు రెండు కాయలు ఇవి కాకుండా తొట్టి, చిన్నకాయలు పోగా రైతుకు కాయకు ఒక్క రూపాయి మాత్రమే మిగులుతోంది. దీంతో దింపులు మొత్తం ఆగిపోయాయి. ఏడాదిలో ఎంత మార్పు గత ఏడాది దసరా సీజన్లో కొత్తకొబ్బరి (తయారీ కొబ్బరి) మినహా మిగిలిన కొబ్బరి ఉత్పత్తుల ధరలు భారీగానే ఉన్నాయి. గత ఏప్రిల్ నుంచే అంబాజీపేట మార్కెట్లో కొబ్బరి ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల కేవలం కొత్తకొబ్బరి ధర మాత్రమే పెరిగింది.