అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంపదలో భారీగా కిందికి పడిపోయారు. అధ్యక్షపదవిని చేపట్టిన సంవత్సరం తరువాత ట్రంప్ సంపద 400 మిలియన్ డాలర్ల కిందికి పడిపోయింది. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో ట్రంప్ 3.1బిలియన్ డాలర్లుగా నిలిచింది. అంతేకాదు గత ఏడాది అక్టోబర్‌లో ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యంత ధనవంతులైన 400 అమెరికన్ల జాబితాలో నిలిచిన ట్రంప్ పేరు ఈ సారి మిస్ అయింది.
తగ్గుదలకు కారణమేమిటి?
అమెరికా మార్కెట్ల ప్రభావం పాక్షికంగా ప్రభావం చూపించగా న్యూయార్క్ నగరంలో రిటైల్ రియల్ ఎస్టేట్ సంక్షోభం ఆయన సంపదను దెబ్బతీసిందని నిపుణులు పేర్కొన్నారు. పుంజుకున్న ఇ-కామర్స్ బిజినెస్ ట్రంప్ టవర్ విలువను తగ్గించింది. ట్రంప్ విలువైన భవనం విలువ గత సంవత్సరంలో 41 మిలియన్ డాలర్లు తగ్గిందని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఈ మార్కెట్ సవాళ్లకు తోడు దీర్ఘకాలం అద్దెదారుగా ఉన్న నైక్ సుమారు 65వేల చదరపు అడుగుల భవనాన్ని ఖాళీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది కూడా భారీ ప్రభావాన్నిచూపించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment