సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ నష్టాలనుంచి మరింత పతనమైన దలాల్ స్ట్రీట్ ఒక దశలో 1350 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో కీలక సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ ప్రధాన మద్దతు స్తాయిల దిగువకు చేరాయి. ముఖ్యంగా ఐటీ టాప్ లూజర్ గా వుంది. ఈ అలాగే ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్లను పతనం దిశగా లాక్కెళ్లాయి. కరోనా వైరస్ ప్రపంచ వృద్ధికి ముప్పు తెచ్చిపెడుతుందున్న అంచనాల మధ్య ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతి కూల సంకేతాలు, వేగంగా విస్తరిస్తున్న కరోనా భయాల మధ్య 2021 ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ప్రారంభించాయి. 1203 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ 28,265 వద్ద, నిఫ్టీ 344 పాయింట్లు కుప్పకూలి, 8253 వద్ద స్థిరపడింది. నిఫ్టీ బ్యాంక్ సూచీ 4.8 శాతం పడిపోయి 18,221 కు చేరుకుంది. మిడ్ క్యాప్ప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్, ఆటో, ఫార్మ నష్టాల్లోనే ముగిసాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బీఐ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 3-8 శాతం నష్టపోయాయి. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం నష్టపోయింది. యాక్సిస్, ఎస్బీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, టీసీఎస్ తదితరాలుకూడా నష్టపోయాయి. మరోవైపు, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, స్వల్పంగా లాభపడ్డాయి. అటు ముడి చమురు అతిపెద్ద త్రైమాసిక నష్టం తరువాత బుధవారం 21 సెంట్లు లేదా 0.8 శాతం తగ్గి 26.14 డాలర్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment