వికీలీక్స్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత విజిల్ బ్లోయర్ జూలియన్ అసాంజే (45) భారీ ఊరట లభించింది. అత్యాచార ఆరోపణ కేసులతో ఇబ్బందులపాలవుతున్న ఆయనకు స్వీడన్ భారీ ఉపశమనం కల్పించింది. అతనిపై అత్యాచార ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న ఆసాంజేపై వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్ వ్యతిరేకంగా దాఖలైన అత్యాచార ఆరోపణల విచారణను ఏడు సంవత్సరాల తర్వాత విచారణ నిలిపివేయాలని నిర్ణయించిందని స్వీడిష్ ప్రాసిక్యూషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అసాంజేపై ఏడు సంవత్సరాల విచారణకు తెరపడింది.
జూలియన్ అస్సాంజ్‌కు ఇది పూర్తి విజయమని ఆయన కోరుకున్నప్పుడు రాయబార కార్యాలయం నుండి బయలుదేరవచ్చని, అస్సాంజ్ చాలా సంతోషంగా ఉన్నాడని ఆయన న్యాయవాది సామ్యూల్‌సన్ స్వీడిష్ రేడియోకి చెప్పారు.
కాగా 2010లో అసాంజే వీకీలీక్స్ అమెరికాకు చెందిన అనేక సైనిక రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి అమెరికా ఆర్మీ నిఘా నిపుణుడు చెల్సియా మన్నింగ్ తస్కరించిన రహస్య పత్రాలను వీకీలీక్స్ బహిర్గతం చేసింది. లక్షలాది సైనిక రహస్య పత్రాలు లీక్ చేసిన ఎన్‌ఎస్‌ఏ మాజీ విశ్లేషకుడు ఎడ్వర్డ్ స్నోడన్ వెనుక ఉన్నది కూడా అసాంజేయేనని నిర్ధారణకు వచ్చినఅసాంజే అరెస్టుకు అమెరికా పావులు కదిపింది. దీంతో 2012లో అసాంజే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టుగా ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నసంగతి తెలిసిందే.