Wikileaks
-
10 అత్యంత వివాదాస్పద ‘వికీలీక్స్’
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఐదేళ్లకు పైగా బ్రిటీష్ హై-సెక్యూరిటీ జైలులో, ఏడేళ్లపాటు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన తర్వాత బుధవారం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టారు. 2010లో వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్‌లో విడుదల చేయడంతో చిక్కుల్లో పడి న్యాయపోరాటం సాగించారు. ప్రపంచాన్ని కదిలించిన 10 వికీలీక్స్ ఇవే..1. ఇరాక్ యుద్ధం2010లో వికీలీక్స్ ఇరాక్ యుద్ధంలో పౌరుల ప్రాణనష్టం, వివాదాస్పద వ్యూహాలను బహిర్గతం చేసే రహస్య యూఎస్ఏ సైనిక పత్రాలను విడుదల చేసింది. దీంతో సైనిక కార్యకలాపాలలో పారదర్శకత ఆవశ్యకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అమెరికా సంకీర్ణ దళాల చర్యల కారణంగా చోటు చేసుకున్న పౌర మరణాలు వికీలీక్స్ కారణంగా వెల్లడయ్యాయి.2. గ్వాంటనామో ఫైల్స్వికీలీక్స్ గ్వాంటనామో బేలో జరుగుతున్న కార్యకలాపాలను వివరించే పత్రాలను ప్రచురించింది. ఖైదీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన ఇబ్బందులను దీనిలో బహిర్గతం చేసింది. ఇది అంతర్జాతీయ నిరసనలకు ఆజ్యం పోసింది. ఖైదీలను హింసించడం, వారి హక్కులను కాలరాడయం లాంటి వివరాలు దీనిలో వెల్లడయ్యాయి.3. ఆఫ్ఘన్ వార్ డైరీఆఫ్ఘన్ వార్ డైరీ పత్రాలను వికీలీక్స్ విడుదల చేసింది, పౌర మరణాలు, రహస్య కార్యకలాపాలు, తాలిబాన్ వ్యూహాలను దానిలో బహిర్గతం చేసింది. యూఎస్ఏ కాంట్రాక్టర్లు ఆఫ్ఘనిస్తాన్‌లో కుర్రాళ్లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్న తీరు దీనిలో వెల్లడయ్యింది. ఆఫ్ఘన్లో తాలిబాన్ బలోపేతమవుతున్నదని వికీలీక్స్ వెల్లడించింది.4. కొల్లేటరల్ మర్డర్ వీడియోబాగ్దాద్లో యూఎస్ అపాచీ హెలికాప్టర్ దాడికి సంబంధించిన ఒక రహస్య వీడియోను వికీలీల్స్ విడుదల చేసింది. హెలికాప్టర్ సిబ్బంది పౌరులను సాయుధ తిరుగుబాటుదారులుగా పొరపాటుగా గుర్తించి, వారితోపాటు రాయిటర్స్ ఫోటోగ్రాఫర్, అతని డ్రైవర్‌పై కాల్పులు జరుపుతున్నట్లు ఉన్న వీడియోను బయటపెట్టింది. నాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలంగా మారింది.5. ప్రపంచ నేతలపై ఎన్ఎస్ఏ టార్గెట్అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) ప్రపంచ నేతలను టార్గెట్ చేసిందని వికీలీక్స్ వెల్లడించింది. బెర్లిన్‌లో అప్పటి యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్-కీ-మూన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మధ్య జరిగిన ప్రైవేట్ సమావేశాన్ని ఎన్ఎస్ఏ బగ్ చేసిందని వికీలీక్స్ పత్రాలు వెల్లడించాయి.6. డీఎన్సీ ఈ మెయిల్ వివాదం2016లో వికీలీక్స్.. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ)కి చెందిన ఈ మెయిల్స్‌ను విడుదల చేయడం ద్వారా పార్టీ అంతర్గత విభేదాలు ప్రపంచం ముందు వెల్లడయ్యాయి. లీకైన ఈ మెయిల్స్‌లో డీఎన్సీ అధికారులు బెర్నీ సాండర్స్ కన్నా హిల్లరీ క్లింటన్‌కు ప్రాధాన్యతనిచ్చారని వెల్లడయ్యింది. ఈ వివాదం సాండర్స్ మద్దతుదారులలో అపనమ్మకాన్ని పెంచింది. ఇది అమెరికన్ రాజకీయ వ్యవస్థలో పారదర్శకతపై చర్చకు దారితీసింది.7. సౌదీ కేబుల్స్సౌదీ దౌత్య వ్యవహరాలకు సంబంధించిన కీలక విషయాలను వికీలీక్స్ బయటపెట్టింది. లీకైన పత్రాలలో సౌదీ వ్యూహాత్మక పొత్తులు, రహస్య కార్యకలాపాలు, దౌత్య వివరాలున్నాయి. ఈ లీక్‌లు సౌదీ అరేబియా విదేశీ విధానాలను, ప్రాంతీయ సంఘర్షణలను బహిర్గతం చేసింది.8. స్నోడెన్ ఎన్ఎస్ఏ పత్రాలుఎడ్వర్డ్ స్నోడెన్తో కలిసి, వికీలీక్స్ గ్లోబల్ నిఘా కార్యక్రమాలను బహిర్గతం చేసే క్లాసిఫైడ్ ఎన్ఎస్ఏ పత్రాలను ప్రచురించింది. ఇది గోప్యతా హక్కులు, ప్రభుత్వ పర్యవేక్షణ, విజిల్బ్లోయర్ల పాత్రపై చర్చలకు దారితీసింది. ఈ వెల్లడి జాతీయ భద్రత, పౌర స్వేచ్ఛల మధ్య సమతుల్యతపై పలు సందేహాలకు పురిగొల్పింది.9. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో వికీలీక్స్ హిల్లరీ క్లింటన్ ప్రచారం, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి చెందిన ఈ మెయిల్స్‌ను ప్రచురించింది. ఇది సైబర్ భద్రత, రాజకీయ పారదర్శకత, విదేశీ జోక్యంపై ఆందోళనలకు దారితీసింది.10. వాల్ట్ 72017లో వాల్ట్ 7 సిరీస్‌ను వికీలీక్స్ విడుదల చేసింది. దీనిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) హ్యాకింగ్ సాధనాలు, నిఘా పద్ధతులను బహిర్గతం చేసింది. ఇది ప్రభుత్వ నిఘా సామర్థ్యాలు, డిజిటల్ గోప్యతపై ఆందోళను లేవనెత్తింది. -
చెరవీడిన అసాంజ్ !
అగ్రరాజ్యంపై యుద్ధం చేయాలంటే మారణాయుధాలు అవసరం లేదని, ఒక ల్యాప్‌టాప్‌తో దాన్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చని గుక్కతిప్పుకోనీయకుండా చేయొచ్చని నిరూపించిన వికీలీక్స్ అధిపతి జూలియన్ అసాంజ్‌కు పద్నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. తన సాహసవంతమైన కార్యకలాపాల కారణంగా అయినవాళ్లకు దూరమై కొన్నాళ్లు లండన్‌లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో తలదాచుకుని, ఆ తర్వాత బ్రిటన్ చెరలో మగ్గిన అసాంజ్ నేరాంగీకార ప్రకటనకు సిద్ధపడి అమెరికా ఇవ్వజూపిన వెసులుబాటుకు తలొగ్గక తప్పని స్థితి ఏర్పడటం స్వేచ్ఛాప్రియులకూ, పాత్రికేయలోకానికీ చివుక్కుమనిపిస్తుంది. ఒప్పందం ప్రకారం పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని 14 దీవుల సముదాయమైన ఉత్తర మెరీనా ఐలాండ్స్ (ఎన్ఎంఐ)లో ఒకటైన సైపాన్ దీవిలోని న్యాయస్థానం ఎదుట అసాంజ్ హాజరై తన తప్పు ఒప్పుకున్నాడు. అమెరికాలో అడుగుపెట్టడానికి అసాంజ్ విముఖత చూపిన కారణంగా, సాంకేతికంగా దానిలోనే భాగమైన సైపాన్‌లో ఈ తతంగం పూర్తిచేయటానికి అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. అమెరికా ఆయనపై గూఢచర్యానికి సంబంధించి 18 ఆరోపణలు చేసింది. వాటి ఆధారంగా విచారణ జరిగితే అసాంజ్‌కు 175 ఏళ్ల శిక్షపడేది. కానీ ఒప్పందం ప్రకారం అందులో ఒకే ఒక నేరారోపణ మోపి, దానికింద అయిదేళ్ల శిక్షవిధించి బ్రిటన్ జైల్లో అనుభవించిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే విడుదల చేయటానికి ఒప్పందం కుదిరింది. వికీలీక్స్ ఎప్పటిలా పనిచేస్తుందా లేదా అన్నది తేలాల్సి వుంది.ఏం నేరం చేశాడు అసాంజ్? యుద్ధాలనూ, దురాక్రమణలనూ సమర్థించుకునేందుకు అగ్రరాజ్యాలు ప్రచారంలో పెట్టే అబద్ధాలను తుత్తినియలు చేశాడు. అమెరికా దురాక్రమణలో ఉన్న ఇరాక్‌లో ఒక మారుమూల పల్లెలో వీధిలో నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరు సాధారణ పౌరులనూ, రాయిటర్ జర్నలిస్టులు ఇద్దరినీ కేవలం సరదా కోసం బాంబులతో హతమార్చిన అమెరికా సైనికుల దురంతాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు. ఉగ్రవాదాన్ని అంతంచేసే పేరిట ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా కూటమి దేశాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాయో, ఎలా నరమేధాన్ని సాగించాయో తెలిపే లక్ష పత్రాలను బట్టబయలు చేశాడు. వర్ధమాన దేశాలే కాదు... సాటికి సరైన సంపన్న దేశాల విషయంలోనూ అమెరికాకు ఎంత చిన్న చూపున్నదో ఏకరువు పెట్టే కోట్లాది సందేశాలను బజారున పడేశాడు. అవన్నీ వేర్వేరు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన సందేశాలు. ఎక్కడి ప్రభుత్వం ఎటువంటిదో, సైనిక వ్యవస్థల తీరుతెన్నులేమిటో తెలిపే అంచనాలు వాటిల్లో ఉన్నాయి. ఆఖరికి దేశదేశాల పాలకులు తమ అక్రమార్జనను వేరే దేశాల బ్యాంకులకు తరలిస్తున్న వైనాన్ని ఆధారాలతో వెల్లడించాడు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2006లో జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ‘మన అనుకూలుర’ వివరాలు పంపిన సందేశం కూడా అసాంజ్ లీక్స్‌లో ఉంది. ఇవన్నీ గూఢచర్యం కిందికొస్తాయని ఇన్నేళ్లుగా అమెరికా చేసిన వాదనలో పసలేదు. ఆ దేశమైనా, పాశ్చాత్య దేశాలైనా సందర్భం ఉన్నా లేకపోయినా ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెబుతుంటాయి. తెరవెనక మాత్రం అందుకు విరుద్ధమైన పోకడలకు పోతుంటాయి. దీన్నే సాక్ష్యాధారాలతో అసాంజ్ వెల్లడించాడు. అప్రజాస్వామికమైన ఆ కార్యకలాపాలు తాము నమ్మే విలువలకూ, విధానాలకూ పూర్తి విరుద్ధమని ఆ దేశాల పౌరులు గ్రహించి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చివుంటే అంతిమంగా అక్కడి సమాజాలకూ, ప్రపంచానికీ మేలు జరిగేది. కానీ వంచకులను విశ్వసించటం, అబద్ధాలకు పట్టంగట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి. అసాంజ్ విలువను ఇలాంటి సమాజాలు ఏం గుర్తించగలవు? ఆయన ఇరాక్, అఫ్గాన్లలో అమెరికా దురంతాలను వెల్లడించినప్పుడు అమెరికా పౌరులు వెల్లువలా కదిలివుంటే ఇవాళ ఇజ్రాయెల్ గాజాను వల్లకాడు చేయసాహసించేది కాదు. మారణాయుధాలూ, మందుగుండు సరఫరా చేస్తూ ఆ నెత్తుటి క్రీడకు అమెరికా దోహదపడేది కాదు. అమెరికా ఆరోపిస్తున్నట్టు అసాంజ్ గూఢచారి కాదు. నికార్సయిన పాత్రికేయుడు. తన చర్యల ద్వారా మెరుగైన స్వేచ్ఛాయుత సమాజాన్ని ఆశించాడు తప్ప అందులో దురుద్దేశాలు లేవు. చేయని నేరానికి ఇలా గత అయిదేళ్లుగా అసాంజ్ దాదాపు 19 చదరపు అడుగుల సెల్లో రోజుకు 23 గంటలు ఏకాంతవాస ఖైదు అనుభవిస్తున్నాడు. బయటి ప్రపంచంతోగానీ, సహ ఖైదీలతోగానీ ఆయనకు సంబంధాల్లేవు. ఈ శిక్ష కారణంగా ఆరోగ్యం బాగా దెబ్బతింది. గుండెజబ్బు సోకింది. బహుశా అందుకే కావొచ్చు... ఆయన ఈ ఒప్పందానికి అంగీకరించి వుండొచ్చు.అసాంజ్ విడులను స్వాగతిస్తూనే పాత్రికేయ ప్రపంచం వ్యక్తం చేస్తున్న భయాందోళనలు సహేతుకమైనవి. తమ దేశ పౌరుడు కాకపోయినా తమ గుట్టుమట్లు వెల్లడించినందుకు అమెరికా ఆగ్రహించటం, ఇన్నేళ్లుగా ఆయన్ను వెంటాడటం... ప్రజాస్వామ్య దేశాలుగా డప్పు కొట్టుకునే స్వీడన్, బ్రిటన్లు అందుకు సహకరించటం ఏరకంగా చూసినా సిగ్గుచేటైన విషయం. అసాంజ్ కేసు చూపి భవిష్యత్తులో తమ చీకటి చర్యలను బట్టబయలు చేసే ఏ దేశ పాత్రికేయులనైనా అమెరికా తమ దేశానికి పట్టి అప్పగించమని కోరవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా అసాంజ్ వెనక దృఢంగా నిలబడి అటు అమెరికాపైనా, ఇటు బ్రిటన్‌పైనా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చింది. ఎన్ని దేశాలు ఆ పని చేయగలుగుతాయి? అసాంజ్ విడుదల ఆయన కుటుంబానికీ, మద్దతుదార్లకూ ఊరటనిస్తుందనటంలో సందేహం లేదు. కానీ ఇందులో అంతర్లీనంగా కనిపిస్తున్న పోకడలు ప్రమాదకరమైనవి. -
ఎట్టకేలకు స్వేచ్ఛ.. లండన్ జైలు నుంచి ‘వికీలీక్స్’ జులియన్ అసాంజే విడుదల
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. లండన్ బెల్మార్ష్ జైలు నుంచి సోమవారం ఆయన విడుదల అయ్యారు. అమెరికా గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆయన నేరం ఒప్పుకున్నారని, ఈ మేరకు అమెరికా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆయన బెయిల్ మీద విడుదలయ్యారని తెలుస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చిన ఆయనకు.. సొంత దేశం ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతి సైతం లభించినట్లు తెలుస్తోంది. జులియన్ అసాంజే(52) విడుదలను వికీలీక్స్ సంస్థ ఎక్స్ ద్వారా ధృవీకరించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘‘జులియన్ అసాంజే ఇప్పుడు స్వేచ్ఛా జీవి. బెల్మార్ష్ జైలులో 1901 రోజులు ఆయన గడిపారు. జూన్ 24 ఉదయం ఆయన విడుదలయ్యారు. లండన్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అక్కడి నుంచి ఆయన స్టాన్స్టెడ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు అని వికీలీక్స్ ఎక్స్ ద్వారా తెలియజేసింది. JULIAN ASSANGE IS FREEJulian Assange is free. He left Belmarsh maximum security prison on the morning of 24 June, after having spent 1901 days there. He was granted bail by the High Court in London and was released at Stansted airport during the afternoon, where he boarded a…— WikiLeaks (@wikileaks) June 24, 2024అంతేకాదు.. అసాంజే విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన వాళ్లకు వికీలీక్స్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇందులో ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల కృషి కూడా ఉందని తెలిపింది. అయితే అమెరికా న్యాయవిభాగంతో ఒప్పందం జరిగిందని ధృవీకరించిన వికీలీక్స్.. ఆ ఒప్పందం తాలుకా వివరాలు అధికారికంగా ఫైనలైజ్ కాలేదని తెలిపింది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. ఈలోపు.. ఉత్తర మరియానా దీవులలోని(US) కోర్టులో దాఖలైన పత్రాల సారాంశం సోమవారం రాత్రి బయటకు వచ్చింది. అందులో.. బ్రిటన్‌లో కస్టడీలో ఉన్న అసాంజే.. అమెరికా గూఢచర్య చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు అని ఉంది. అంతేకాదు ఆయనపై మోపబడ్డ 18 అభియోగాలన్నింటిని(17 అభియోగాలు+వికీలీక్స్‌పై కంప్యూటర్ దుర్వినియోగం కేసు).. ఒక్క కేసుగానే కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం సైపన్ కోర్టు ఎదుట అసాంజే విచారణకు హాజరవుతారని, కోర్టు ఆయనకు 62 నెలల శిక్ష విధించనుందని, అయితే బ్రిటన్‌లో ఆయన అనుభవించిన శిక్షా కాలాన్ని ఇందులో నుంచి మినహాయిస్తారని, ఆపై ఆయన్ను నేరుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అనుమతిస్తారన్నది ఆ పత్రాల సారాంశం. అసాంజేను అమెరికాకు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టులో ఇప్పటికే విచారణ జరుగుతోంది. మరో రెండు వారాల్లో ఈ అభ్యర్థనపై విచారణ జరగాల్సి ఉంది. ఈలోపే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. #JulianAssange is free!!! After 14 years of being detained, today he left the UK. I can’t wait to give him a hug and go on a walk with him. pic.twitter.com/sPwVrt1U9y— Juan Passarelli (@JuanAndOnlyDude) June 25, 2024భావ స్వేచ్చప్రకటన ద్వారా ప్రపంచవ్యాప్తంగా హీరోగా జేజేలు అందుకున్న అసాంజే.. అమెరికా పాలిట మాత్రం విలన్‌గా తయారయ్యాడు. ఇరాక్, అఫ్గనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన అమెరికా రక్షణ రంగ రహస్య పత్రాలను 2010లో ఆయన స్థాపించిన విజిల్ బ్లోయర్ వెబ్సైట్ వికీలీక్స్ విడుదల చేసింది. ఏప్రిల్ 2010లో.. హెలికాప్టర్ నుంచి చిత్రీకరించిన బాగ్దాద్ వైమానిక దాడికి సంబంధించిన వీడియో విడుదల చేసింది. అమెరికా చేసిన ఈ దాడిలో ఇద్దరు రాయిటర్స్ జర్నలిస్టులు సహా అనేక మంది పౌరులు మరణించారు. జులై 2010 - వికీలీక్స్ 91,000కు పైగా పత్రాలను విడుదల చేసింది. వీటిలో ఎక్కువగా అఫ్గానిస్థాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్య నివేదికలు ఉన్నాయి. అక్టోబర్ 2010లో ఇరాక్ యుద్ధాన్ని వివరించే 4,00,000 రహస్య సైనిక ఫైళ్లను వికీలీక్స్ విడుదల చేసింది.ఈ లీక్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో అమెరికా ఆయనపై అబియోగాలు మోపి.. విచారించేందుకు సిద్ధపడింది. అయితే ఈ అభియోగాలే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్ధతుదారుల్ని తెచ్చిపెట్టింది. అగ్రరాజ్య సైన్యంలోని లోపాలను ఎత్తి చూపేందుకు ఆయన ఓ జర్నలిస్టులా వ్యవహరించాడంటూ ప్రపంచవ్యాప్తంగా అసాంజేకు అభిమానులు పెరిగిపోయారు. మరోవైపు అసాంజేపై అమెరికా మోపిన నేరాభియోగాల్ని వాక్ స్వేచ్చకు తీవ్ర ముప్పుగా మేధోవర్గం అభివర్ణించింది. అమెరికా మాత్రం చాలా సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా పొంది లీక్ చేశారని ఆరోపిస్తూ వచ్చింది. అమెరికా వాదనకు సైతం ఓ వర్గం నుంచి మద్ధతు లభించింది. చివరకు.. 14 ఏళ్ల తర్వాత.. ఒక డీల్ ప్రకారమే ఆయన్ని విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.అసాంజే మీద కేసు ఏంటంటే..2010-11 మధ్య అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన అత్యంత గోప్యమైన విషయాల్ని వికీలీక్స్ బయటపెట్టింది. అందులో బాగ్దాద్‌పై జరిపిన వైమానిక దాడుల ఫుటేజీ కూడా ఉంది. అమెరికా ఆర్మీ ఇంటెలిజెన్స్ అనలిస్ట్(మాజీ) చెల్సీ మేనింగ్ సహకారంతోనే అసాంజే ఈ లీకులకు పాల్పడ్డారని తేలింది. దీంతో ఆమెకు 2013లో 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 2017లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమె శిక్షను తగ్గించారు. 2023లో ఓ ఇంటర్వ్యూలో చెల్సీ మేనింగ్ఇక.. 2019లో డొనాల్డ్ ట్రంప్ పాలనలో అసాంజేపై 18 నేరాభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికా గూఢాచర్య చట్టం ఉల్లంఘించారనేది ప్రధాన అభియోగం. ఐదేళ్లుగా జైల్లో.. ఈ వ్యవహారంతో.. అమెరికా నుంచి ప్రాణభయం ఉందన్న కారణంతో లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో కొంతకాలం ఆశ్రయం పొందారు. అదే సమయంలో స్వీడన్ నుంచి ఆయనపై లైంగిక దాడి విచారణ జరిగింది. ఇక ఈక్వెడార్ ఆశ్రయాన్ని విరమించుకున్న తర్వాత బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2011లో తన న్యాయ బృందంలో పని చేసిన మోరిస్‌తో అసాంజేకు చనువు పెరిగింది. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో నివసిస్తున్నప్పుడే.. ఆమెతో డేటింగ్ చేసి ఇద్దరుపిల్లల్ని కన్నారాయన. అసాంజే 2019 ఏప్రిల్ నుంచి లండన్‌లోని బెల్మార్ష్ జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయన స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోవడం గమనార్హం. 14 ఏళ్లుగా నాటకీయ పరిణామాలుపదేళ్ల క్రితం అమెరికా సైనిక, దౌత్య కార్యకలాపాలకు సంబంధించి వికీలీక్స్ సంస్థ బయటపెట్టిన రహస్యాలు సంచలనం సృష్టించాయి. అసాంజేపై గూఢచర్యానికి సంబంధించి 17 అభియోగాలు ఉన్నాయని.. వికీలీక్స్ సంస్థపై కంప్యూటర్ దుర్వినియోగం కేసు ఉందని అమెరికా వాదించింది. ఈ గూఢచర్యం కేసుకు సంబంధించి.. అతడిని తమ దేశానికి రప్పించాలని అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది కూడా. ఈ క్రమంలో ఆయనపై అభియోగాలు నిజమని తేలితే.. ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడేది. అయితే అటు ఆస్ట్రేలియా విజ్ఞప్తులు, ఇటు పాత్రికేయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గి బైడెన్ ప్రభుత్వం చివరకు ఆయన విడుదలకు సిద్ధమయ్యింది. -
London: వికిలీక్స్ ఫౌండర్‌కు యూకే కోర్టులో ఊరట
లండన్: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలతో పాటు పలు సంచలన రహస్యాలు బహిర్గతం చేసిన వికీలిక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజెకు యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కోర్టులో ఊరట లభించింది.అసాంజెను అమెరికాకు అప్పగించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లొచ్చని లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ తాజాగా తీర్పు చెప్పింది. తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణలో గనుక అసాంజెను ఎందుకు అప్పగించాలో సంతృప్తికర కారణాలు అమెరికా చెప్పలేకపోతే అసాంజె అప్పగింత విషయంలో కోర్టు మళ్లీ మొదటి నుంచి కేసు విచారిస్తుంది. దీంతో అసాంజె అప్పగింత సుదీర్ఘంగా వాయిదాపడే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌పై అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన పత్రాలను లీక్చేశారని అసాంజెపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసమే అసాంజెను అప్పగించాలని అమెరికా కోరుతోంది. ఇదీ చదవండి.. మిస్ యూనివర్సిటీ పోటీలు.. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం -
"వికీలీక్స్" వీరుడి కోసం వేట మొదలైంది!
జూలియన్ అసాంజ్ ‘వికీలీక్స్’ హీరో. స్మార్ట్‌గా ఉంటాడు. సాఫ్ట్‌గా ఉంటాడు. షార్ప్‌గా ఉంటాడు. ఇప్పుడు లండన్‌లో ఉన్నాడు. ‘ఆడు నాక్కావాలి’ అంటున్నాడు జో బైడెన్! ‘వస్తే తీసుకెళ్లు’ అంటోంది బ్రిటన్. పదేళ్ల క్రితం అమెరికాను పెద్ద దెబ్బ కొట్టాడు అసాంజ్. అదీ కోపం ఒబామాకు.. ట్రంప్‌కి.. బైడెన్‌కి. ఇప్పుడు అతడి కోసం వేట మొదలైంది. వేట కోసం ఒక యువతి పెదవులకు లిప్‌స్టిక్ అద్దుకుని, చేత్తో గన్ పట్టుకుని లండన్ బయల్దేరిందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్! అసాంజ్ అంటే అమ్మాయిల్లో క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను అసాంజ్‌పై ఒక వలగా అమెరికా విసరబోతోందా?! జైల్లో ఉన్నాడిప్పుడు జూలియన్ అసాంజ్. లండన్‌లోని ‘హర్ మెజెస్టీస్ ప్రిజన్’లో అసాంజ్! హర్ మెజెస్టీనా!! అసాంజ్ లైఫ్ అంతా అమ్మాయిలేనా?! అరెస్ట్ అవడానికి ముందు అమ్మాయిలు.. అరెస్ట్ అయ్యాక అమ్మాయిలు.. జైలు పేరు కూడా హర్ మెజెస్టీ! అప్పుడే ఏమైందీ! అతడిని హతమార్చేందుకు తయారవుతున్నది కూడా ఒక అమ్మాయే! ఇంటెలిజెన్స్ అంచనా. పదేళ్లుగా లండన్‌లోని జైళ్లలో ఉన్నాడు అసాంజ్. ఆ మాట కరెక్టు కాదు. పదేళ్లుగా అమెరికా అతడి కోసం వేటాడుతోంది. అతడొక సద్దాం హుస్సేన్ ఆ దేశానికి. ఒక ఒసామా బిన్ లాడెన్ కూడా. వాళ్లిద్దరినీ పట్టుకోగలిగింది. అసాంజ్ని మాత్రం పట్టుకోలేక పోయింది. అంతే తేడా. అమ్మాయిలకే అతడంటే ఇష్టం పదేళ్ల క్రితం.. అమెరికా విదేశాంగ కార్యాలయం. హిల్లరీ క్లింటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి. అసాంజ్ ఇష్యూని తేల్చేయమని చెప్పేశారు ప్రెసిడెంట్ ఒబామా. ‘అతడికి ఇష్టమైనవి ఏమిటి?’ ‘రహస్యాలు’ ‘అమ్మాయిలు కారా?’ ‘కారు. అమ్మాయిలకే అతడంటే ఇష్టం’ ‘అది చాలు’ అసాంజ్‌ను పట్టుకునేందుకు ప్లాన్ మొదలైంది. స్వీడన్లో ఇద్దరు మహిళలు అసాంజ్ తమపై అత్యాచారం చేశాడని కేసు పెట్టారు. అది నిలవలేదు! స్వీడన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తే నేరస్థులను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం కింద అతడిని తమ దేశం రప్పించాలని అమెరికా చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఒబామా పట్టుకోలేకపోయాడు. ట్రంప్ పట్టుకోవాలన్నంత కసి చూపించలేదు. జో బైడెన్ మరీ పట్టనట్లయితే లేరు. ఇక బ్రిటన్ తన పట్టు విడవడానికి సిద్ధంగా లేదు. ఆస్ట్రేలియాకు కూడా క్వీన్ ఎలిజబెత్తే రాణిగారు. అసాంజ్ ఆస్ట్రేలియా పౌరుడు. ఎంత లేదన్నా అదొకటి పనిచేస్తుంటుంది. అసాంజ్ మరెంత కాలం సురక్షితంగా ఉంటారు? అయితే ఎంతకాలమని ‘హర్ మెజెస్టీ ప్రిజన్’లో అసాంజ్ సురక్షితంగా ఉంటారు? అతడిని ప్రాణాలతో పట్టుకోవడం లేదంటే హతమార్చడం అనే లక్ష్యంతో ఒక అమెరికన్ టీమ్ బ్రిటన్‌లో పనిచేస్తోందని వస్తున్న వార్తల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడం లేదు. బ్రిటన్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘సీక్రెట్ ఇంటిలిజెన్స్ సర్వీస్’ దగ్గర కొంత సమాచారం ఉందనైతే అంటున్నారు. కానీ అమెరికన్ ఇంటిలిజెన్స్ సంస్థ ‘సి.ఐ.ఎ.’ దగ్గర ఉన్న సమాచారం అయితే కరెక్టే. అసాంజ్ జూలియన్‌కు స్త్రీ బలహీనత లేదు. స్త్రీలకు అతడి బలహీనత ఉందన్నది అతడిపై జోక్ కావచ్చు. అందంగా ఉంటాడు అతడు. నలభై తొమ్మిదేళ్లు ఇప్పుడు. పదేళ్ల క్రితం అతడి ముఖంపై చిరునవ్వు ఎలా ఉందో, ఇప్పుడూ అలానే ఉంది. అసాంజ్‌కు ప్రేమను పంచినవారంతా స్త్రీలే. ఆ శక్తి అతడిలో పని చేస్తోందా? ఇప్పుడు జైల్లో ఉండటానికి ముందు.. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో అండగా ఉన్నది, అతడికి తినడానికింత తెచ్చిపెట్టిందీ ఒక స్త్రీ మూర్తే. పమేలా ఆండర్సన్. కెనడియన్–అమెరికన్ నటి, మోడల్. టెలివిజన్ పర్సనాలిటీ. అతడి కంటే వయసులో నాలుగేళ్లు పెద్ద. అసాంజ్ని ఆమె ప్రేమిస్తున్నారని మూడేళ్ల క్రితం బ్రిటిష్ టాబ్లాయిడ్స్ అదే పనిగా కొన్నాళ్లు రాసి, అలసి ఊరుకున్నాయి. పమేలా మాత్రం ఇప్పటికే అసాంజ్ని కలుస్తూనే ఉన్నారు. ఆయన కోసం పిజ్జాలు, బర్గర్లు ప్యాక్ చేయించి తెస్తూనే ఉన్నారు. అతడిని ప్రపంచ ప్రసిద్ధుడిని చేసిన స్త్రీ మాత్రం చెల్సీ ఎలిజబెత్ మ్యానింగ్. అసాంజ్ కంటే పదిహేడేళ్లు చిన్న. యూఎస్ ఆర్మీలో సోల్జర్. చెల్సీ అబ్బాయిగా పుట్టి అమ్మాయి అయింది. ఆమె ద్వారా అమెరికన్ మిలటరీ రహస్యాలను సంపాదించాడు అసాంజ్. మొత్తం 7 లక్షల, 50 వేల ఫైల్స్. అంత పెద్ద మొత్తంలో సీక్రెట్లను చెల్సీ అతడికి ఎందుకు ఇచ్చిందనే దానికి కారణం లేదు. ఇచ్చింది. తెలిసో, తెలియకో ఇచ్చింది. పర్యవసానంగా ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించింది. అసాంజ్ ఎవరికైనా రుణపడి ఉన్నాడా అంటే ఆమెకే కావచ్చు. అతడు రుణపడి ఉండవలసిన వ్యక్తులు మరికొందరు కూడా ఉంటారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఈక్వెడార్ దేశాలలో తన నలుగురు సంతానాన్ని పెంచుతున్న అజ్ఞాత తల్లులు. అతడు బయటపెట్టే నిజాలు తప్ప, అతడి గురించిన నిజాలు బయటికి ప్రపంచానికి దాదాపుగా తెలియవు. అతడి జీవిత భాగస్వామి ఎవరో కూడా తెలియదు. అసాంజ్ జీవితంపై తల్లి ప్రభావం ఎక్కువ? అందరి కన్నా కూడా అసాంజ్ జీవితంపై ఎక్కువ ప్రభావం చూపిన స్త్రీ అతడి తల్లి.. క్రిస్టయిన్. కొడుకు జీవితానికి, తల్లి జీవితానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. తల్లికి వచ్చిన సమస్యే కొడుక్కీ వచ్చింది. క్రిస్టయిన్ తన రెండో భర్త బిడ్డ కోసం కోర్టుల చుట్టూ తిరిగారు. చివరికి అతడి నుంచి పిల్లల్ని దాచేశారు. అసాంజ్ కూడా తన ప్రియురాలి వల్ల తనకు కలిగిన కొడుకును దక్కించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరిగాడు. అసాంజ్ నుంచి విడిపోతూ ఆ అమ్మాయి తన బిడ్డను తనకు ఇప్పించమని కోర్టును ఆశ్రయించింది. ఈ రెండు అనుభవాల అనంతరం అసాంజ్ తన తల్లితో కలిసి... ఆస్ట్రేలియాలో బిడ్డల సంరక్షణ చట్టాలకు సంబంధించిన డేటాబ్యాంక్ (సమాచార నిధి) ఏర్పరిచారు. సమాచారం అందుబాటులో లేని సమాజం చీకట్లో ఉన్నట్లేని బలంగా నమ్మిన అసాంజ్.. దేశాల రహస్యాలను లీక్ చేయడాన్ని వృత్తిగా పెట్టుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?! ఇంటర్ నెట్ నిపుణుడు జూలియన్ అసాంజ్ జర్నలిస్టు. పబ్లిషర్. ఇంటర్నెట్ వ్యవహారాలలో నిపుణుడు. ‘వికీలిక్స్’ సంస్థకు ఎడిటర్ కమ్ ఛైర్మన్. దేశాలు తిరిగి రహస్యాలు సేకరించేవాడు. బయటపెట్టేవాడు. 2010 నవంబర్‌లో అమెరికా దౌత్య వ్యూహాల అధికార పత్రాలు తొలివిడతగా లీక్ కాగానే అసాంజ్ కోసం వేట మొదలైంది! అతడిని అరెస్ట్ చేసేందుకు ఇంటర్‌పోల్ ‘రెడ్ కార్నర్’ నోటీసు జారీ చేసింది. దాంతో అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత బ్రిటన్ పోలీసులకు లొంగిపోయాడు. వికీలీక్స్ ఒక వెబ్సైట్. 2006లో ప్రారంభం అయింది. అంతకు ముందు అసాంజ్ కంప్యూటర్ ప్రోగ్రామర్. హ్యాకర్ కూడా. ఫిజిక్స్, మేథ్స్ అతడి సబ్జెక్టులు. పత్రికా స్వాతంత్య్రం, సమాచార హక్కు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్... అతడి అభిమాన అంశాలు. కెన్యాలో అమాయక పౌరుల ఊచకోత, ఆఫ్రికా తీరం వెంబడి పేరుకుపోతున్న వ్యర్థ రసాయనాలు, గ్వాంటనామో జైలు దుర్భర పరిస్థితి వెనుక అమెరికా అమానుష విధానాలు, మల్టీనేషనల్ బ్యాంకుల అవకతవకల్ని రూఢీ పరిచే పత్రాలను సంపాదించి తన సైట్లో పెట్టేవాడు. ఆ క్రమంలోనే ఆఫ్ఘాన్, ఇరాక్ యుద్ధాలలో అమెరికా కుతంత్రాలను వెల్లడించే సమాచారాన్ని లీక్ చేయడంతో ప్రపంచం నివ్వెరపోయింది. అమెరికా నిశ్చేష్టురాలైంది. చదవండి: ఈ 20 పాస్వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ ఈ యాప్ ను వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి -
వికీలీక్స్ ఫౌండర్‌కు భారీ ఊరట
లండన్ : గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీస్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె కేసులో అమెరికాకు ఎదురు దెబ్బ తగిలింది. అసాంజెనే అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టు ప్రతికూలంగా స్పందించింది. అసాంజేను అమెరికాకు అప్పగించలేమని సోమవారం తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి వెనెస్సా బరైట్సర్ సోమవారం తన తీర్పును ప్రకటించారు. క్లినికల్ డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వ్యక్తిగా అసాంజె ఆత్మహత్య చేసుకునే ప్రమాదం గణనీయంగా ఉందని తాను నమ్ముతున్నానని, అందుకే అతన్ని అప్పగించలేమని ఆమె వ్యాఖ్యానించారు. తాజా తీర్పుతో అసాంజే అభిమానులు భారీ సంబరాల్లో మునిగిపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా హక్కుల సంఘాలు, జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశాయి. అయితే అమెరికాపై దీనిపై తిరిగి అప్పీల్ కు వెళ్లే అవకాశం ఉందని, దీంతో అసాంజే జైల్లోనే ఉండే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఫ్రీడం ఆఫ్ ది ప్రెస్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. మరోవైపు న్యాయమూర్తి తీర్పును స్వాగతించిన పరిశోధనాత్మక పాత్రికేయుడు స్టెఫానియా మౌరిజి స్వేచ్ఛా ప్రసంగం, జర్నలిజానికి మించి అసాంజే పనిచేశాడన్న అమెరికా వాదనలపై న్యాయమూర్తి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా 2010-11లో అమెరికా రక్షణ శాఖకు సంబంధించిన కీలక సమాచారం, రహస్య పత్రాలను వికిలీక్స్ బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఇరాక్, అఫ్ఘనిస్థాన్ దేశాల్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడిందని వికీలీక్స్ ఆధారాలతో బయటపెట్టడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపింది. ఈ కేసులో అసాంజె దోషిగా తేలినట్టయితే ఆయనకు 175 ఏండ్ల జైలుశిక్ష విధించే అవకాశముందని భావించారు. -
జైలులో వింత శబ్దాలు.. అదే జరిగితే
లండన్: తనకు వింత శబ్దాలు, మ్యూజిక్ వినిపిస్తున్నాయని వికీలీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ అసాంజే తనతో చెప్పినట్లు సైకియాట్రిస్ట్ మైఖేల్ కోపెల్మన్ తెలిపారు. ఆయన భ్రమల్లో బతుకుతున్నారని, తీవ్రమైన డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఒకే గదికి పరిమితమైతే పరిస్థితి చేజారుతుందన్నారు. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే ఆయన ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా అమెరికన్ సైనికులకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టి అగ్రరాజ్యంలో ప్రకంపనలు పుట్టించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే ప్రస్తుతం లండన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: బిజినెస్ టైకూన్‌కు జైలు, భారీ జరిమానా) ఈ నేపథ్యంలో అతడిపై గూఢచర్య ఆరోపణల కింద అభియోగాలు నమోదు చేసిన అమెరికా, అసాంజేను తమకు అప్పగించాల్సిందిగా బ్రిటన్ను కోరుతోంది. ఇందుకు సంబంధించి మంగళవారం ఓల్డ్ బెయిలీ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అమెరికా ప్రతినిధి జేమ్స్ లూయిస్ కోపెల్మన్ను ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. అసాంజే మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఇటువంటి సమయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకు బదులుగా, అసాంజే మాటలను నమ్మలేమని, అతడు అబద్ధం చెప్పి ఉండవచ్చు కదా అని జేమ్స్ వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయంపై అసాంజే సహచరి స్టెల్లా మోరిస్ గతంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాను భయపడినట్లుగా అసాంజే బలన్మరణం చెందితే తమ కొడుకులిద్దరు అనాథలై పోతారని ఆవేదన చెందారు. ఇక అమెరికాలో అసాంజేపై గూఢచర్య ఆరోపణల కింద నమోదైన అభియోగాలు రుజువైతే, ఆయనకు 175 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అతడు సౌత్‌వెస్ట్ లండన్‌లో అత్యంత భద్రతతో కూడిన బెల్మార్స్ జైలులో ఉన్నాడు. ఇక సైక్రియార్టిస్ట్ కోపెల్మన్ ఇప్పటికే దాదాపు 20 సార్లు అసాంజేను ఇంటర్వ్యూ చేశాడు. వీటి ఆధారంగా ఆయన మానసిక స్థితిని అంచనా వేసి ఈ మేరకు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. -
గ్రీన్‌లాండ్‌ను కొనేద్దామా!
వాషింగ్టన్/స్టాక్‌హోమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచంలోనే అదిపెద్ద ద్వీపమైన గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ‘డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం వీలవుతుందా?’ అని ట్రంప్ తన సలహాదారుల అభిప్రాయాన్ని కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అపారమైన సహజవనరులతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ దృష్టి సారించారు. డెన్మార్క్‌లో ప్రావిన్స్ అయిన గ్రీన్లాండ్కు స్వయంప్రతిపత్తి ఉంది. 20 లక్షల చదరపు కి.మీ విస్తీర్ణం గల గ్రీన్లాండ్ జనాభా 57వేలు. ఈ ద్వీపంలోని 85 శాతం భూభాగంపై 3 కి.మీ మందంతో మంచుదుప్పటి కప్పుకుంది. ట్రంప్ ప్రతిపాదనపై కొందరు సన్నిహితులు స్పందిస్తూ..‘గ్రీన్లాండ్లోని తూలేలో అమెరికాకు ఇప్పటికే వైమానిక స్థావరం ఉంది. కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం వ్యూహాత్మకమే’ అని తెలిపారు. అయితే అధికారం నుంచి తప్పుకునేలోపు తనపేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసేందుకే ట్రంప్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. 1946లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ గ్రీన్‌లాండ్‌ను తమకు అమ్మితే రూ.712.47 కోట్లు ఇస్తామని చెప్పగా, ఈ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది. గ్రీన్లాండ్లో విస్తారమైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు, అరుదైన ఖనిజాలు, తీర ప్రాంతంపై అమెరికా అమితాసక్తితో ఉన్నట్లు కొన్నేళ్ల క్రితం వికీలీక్స్ బయటపెట్టింది. మేం అమ్మకానికి లేం: గ్రీన్లాండ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్రీన్లాండ్ ఖండించింది. ఈ విషయమై గ్రీన్లాండ్ విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘అమెరికాతో వ్యాపారానికి మా తలుపులు తెరిచిఉంటాయి. కానీ గ్రీన్లాండ్ అమ్మకానికి మేం సిద్ధంగా లేం. సహజవనరులు, చేపలు, పునరుత్పాదక విద్యుత్, సాహస క్రీడలకు గ్రీన్లాండ్ నెలవు’ అని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ మాజీ ప్రధాని లార్స్ రాముస్సేన్ మాట్లాడుతూ..‘ట్రంప్ ఏప్రిల్ ఫూల్ జోక్ చేస్తున్నారనుకుంటా. కానీ ఇది సీజన్ కాదుగా’ అని వ్యాఖ్యానించారు. మూడుదేశాల వలస పాలనలో.. గ్రీన్‌లాండ్‌ను 13వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దంవరకూ నార్వే పాలించింది. 1499లో పోర్చుగీసు వారు ఈ ద్వీపం తమదని ప్రకటించుకున్నారు. 18వ శతాబ్దం ఆరంభంలో గ్రీన్‌లాండ్‌ను ఉమ్మడిగా పరిపాలించాలని డెన్మార్క్–నార్వే నిర్ణయించాయి. 1814లో నార్వే–స్వీడన్ విడిపోవడంతో గ్రీన్‌లాండ్‌పై అధికారాలు డెన్మార్క్‌కు దక్కాయి. గ్రీన్లాండ్లో మెజారిటీ ఇన్యుట్ జాతిప్రజలే. వీరంతా గ్రీన్లాండిక్ భాష మాట్లాడుతారు. దీంతో ఈ ప్రాంతంపై పట్టు పెంచుకోవడంలో భాగంగా కాలనీగా ఉన్న గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ 1953లో విలీనం చేసుకుంది. డానిష్ భాషను తప్పనిసరి చేసింది. దీంతో ఉన్నతవిద్య కోసం పలువురు గ్రీన్లాండ్ ప్రజలు డెన్మార్క్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతమైనా గ్రీన్లాండ్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బయలుదేరింది. దీంతో డెన్మార్క్ 1972లో హోంరూల్ చట్టం తీసుకొచ్చింది. విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, సహజవనరులు మినహా అన్ని అధికారాలను స్థానిక ప్రభుత్వానికి అప్పగించింది. 2008లో జరిగిన రెఫరెండంలో మరిన్ని అధికారాలు కావాలని గ్రీన్లాండర్లు తీర్పునిచ్చారు. దీంతో పోలీస్, న్యాయ వ్యవస్థలు, సహజవనరులు, విమానయానం, సరిహద్దు చట్టాలు చేసే అధికారం గ్రీన్లాండ్కు దక్కాయి. -
అసాంజేకు ఇంటర్నెట్ కట్
లండన్ : వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్టు ఈక్వెడార్ ప్రకటించింది. కాటాలోనియన్ వేర్పాటువాది అరెస్ట్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియా ద్వారా అసాంజే తన అభిప్రాయాన్ని తెలుపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈక్వెడార్ రాయబార కార్యాలయ అధికారులు తెలిపారు. యూరప్ దేశాలతో తమ దేశ సంబంధాలను అసాంజే చర్యలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు రఫెల్ కొరియా అధికారంలో ఉన్నప్పుడు అసాంజేకు మద్ధతుగా నిలిచినప్పటికీ, ప్రస్తుత అధ్యక్షుడు లెనిన్ మోరెనో రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోకూడదని ఆయనను హెచ్చరించారు. గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హిలరీ క్లింటన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన సమయంలో కూడా అసాంజేకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని తొలగించారు. అసాంజేపై స్వీడన్లో అత్యాచారం కేసు నమోదు కావడంతో ఆయన 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. బయటకు వస్తే పోలీసులు అరెస్టుచేసి స్వీడన్‌కు, తర్వాత అమెరికాకు అప్పగిస్తారన్నది అసాంజే భయం. ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో అమెరికా అకృత్యాల రహస్య సమాచారాన్ని ఆయన వికీలీక్స్ ద్వారా బయటపెట్టడం తెలిసిందే. -
అమెరికాకు ‘ఆధార్’ సమాచారం!
-
అమెరికాకు ‘ఆధార్’ సమాచారం!
- ట్వీటర్లో వికీలీక్స్ సంచలన వ్యాఖ్యలు - దుర్వినియోగమయ్యే అవకాశం లేదు: భారత్ వాషింగ్టన్: భారతీయుల ఆధార్ సమాచారం అమెరికాకు అందుబాటులో ఉందంటూ వికీలీక్స్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)కి చెందిన గూఢచారులకు ఆధార్ డేటాబేస్ అందుబాటులో ఉందని ట్వీటర్లో ఆరోపించింది. ఆధార్ డేటాబేస్‌ను అందుబాటులోకి తెచ్చుకునేందుకు సీఐఏ.. అమెరికాకు చెందిన క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ కంపెనీని వాడుకుంటున్నట్లు పేర్కొంది. గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వికీలీక్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని భారత్ ఖండించింది. ‘ఆధార్ డేటా చాలా సురక్షితంగా నిక్షిప్తమై ఉంది. వేరే ఏ ఏజెన్సీ కానీ, సంస్థ కానీ ఆ వివరాలను పొందే అవకాశమే లేదు’అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆధార్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ధ్రువీకరించిన బయోమెట్రిక్ పరికరాలను సరఫరా చేసే కంపెనీల్లో క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ ముందువరుసలో ఉంది. వేలిముద్రలు, ఐరిస్ రికార్డు చేసే పరికరాలను సరఫరా చేసేందుకు 2011లో ఈ కంపెనీ అనుమతులు పొందింది. రహస్యంగా డేటాను సేకరించేందుకు ‘ఎక్స్‌ప్రెస్ లేన్’అనే వ్యవస్థను సీఐఏ ఉపయోగించుకుంటోందని ‘గ్రేట్ గేమ్ ఇండియా’వెబ్సైట్ ఓ కథనంలో పేర్కొంది. సీఐఏకు చెందిన ఆఫీస్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్ వద్ద బయోమెట్రిక్ వివరాలను సేకరించే వ్యవస్థ ఉందని, దీని ద్వారా వివరాలను అక్రమంగా సేకరిస్తుందని వివరించింది. పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ జాడ వెతికేందుకు క్రాస్ మ్యాచ్‌కు సంబంధించిన పరికరాలను అమెరికా మిలిటరీ వాడుకుందని 2011లో వార్తలు వచ్చాయి. -
సీఐఏ కుట్ర.. ఆధార్ వివరాలు చోరీ!
సాక్షి, చెన్నై: కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అమెరికా ఇంటిలిజెన్స్ చేతుల్లోకి వెళ్లిందా?. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలను వెలికితీసిన వీకీలీక్స్ సంస్ధ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. అమెరికాకు చెందిన కేంద్ర నిఘా సంస్థ(సీఐఏ) ఆధార్ వివరాలను చోరి చేసినట్లు పేర్కొంది. క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన టూల్స్‌తో సీఐఏకు చెందిన ఆఫీస్ ఆఫ్ టెక్నికల్ సర్వీసెస్(ఓటీఎస్) ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. ఇదే క్రాస్ మ్యాచ్ టెక్నాలజీస్.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు బయోమెట్రిక్ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. దీంతో వీకీలీక్స్ చెప్పిన వివరాలు నిజమేననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గోప్యత ప్రాథమిక హక్కేనని భారతీయ సుప్రీంకోర్టు తీర్పు వెలువడి 72 గంటలైనా గడవకముందే ఇలాంటి వార్త వినడం బాధాకరం. గతంలో కూడా ఆధార్ వివరాలు లీకయ్యాయనే వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. అంతేకాకుండా క్రాస్ మ్యాచ్ భారతీయ భాగస్వామి అయిన స్మార్ట్ ఐడెంటిటీ డివైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు 12 లక్షల మంది భారతీయుల ఆధార్ వివరాలను నమోదు చేసింది. ఈ మేరకు ట్వీటర్ వేదికగా వీకీలీక్స్ పలుమార్లు పోస్టులు చేసింది. వీకీలీక్స్ ట్వీట్లపై స్పందించిన అధికారులు ఆధార్ కార్డుల సమాచారం తస్కరణకు గురైందనే మాట అవాస్తవమని అన్నారు. వీకీలీక్స్ అసలు దీనిపై ఎలాంటి పోస్టులు చేయలేదని చెప్పారు. ఓ గుర్తు తెలియని వెబ్సైట్లో ఈ రిపోర్టు ఉందని గుర్తించామని అన్నారు. క్రాస్ మ్యాచ్ కేవలం బయో మెట్రిక్ పరికరాలను సరఫరా చేసే కంపెనీయే తప్ప వేరే విషయాలతో దానికి సంబంధం లేదని చెప్పారు. ఆధార్ డేటాను పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేశామని.. దాన్ని యూఐడీఏఐ తప్ప మరే ఇతర ఏజెన్సీ డీక్రిప్ట్ చేయలేదని వెల్లడించారు. -
వికీలీక్స్ అసాంజేకు భారీ ఊరట
వికీలీక్స్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత విజిల్ బ్లోయర్ జూలియన్ అసాంజే (45) భారీ ఊరట లభించింది. అత్యాచార ఆరోపణ కేసులతో ఇబ్బందులపాలవుతున్న ఆయనకు స్వీడన్ భారీ ఉపశమనం కల్పించింది. అతనిపై అత్యాచార ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్న ఆసాంజేపై వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజ్ వ్యతిరేకంగా దాఖలైన అత్యాచార ఆరోపణల విచారణను ఏడు సంవత్సరాల తర్వాత విచారణ నిలిపివేయాలని నిర్ణయించిందని స్వీడిష్ ప్రాసిక్యూషన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అసాంజేపై ఏడు సంవత్సరాల విచారణకు తెరపడింది. జూలియన్ అస్సాంజ్కు ఇది పూర్తి విజయమని ఆయన కోరుకున్నప్పుడు రాయబార కార్యాలయం నుండి బయలుదేరవచ్చని, అస్సాంజ్ చాలా సంతోషంగా ఉన్నాడని ఆయన న్యాయవాది సామ్యూల్సన్ స్వీడిష్ రేడియోకి చెప్పారు. కాగా 2010లో అసాంజే వీకీలీక్స్ అమెరికాకు చెందిన అనేక సైనిక రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి అమెరికా ఆర్మీ నిఘా నిపుణుడు చెల్సియా మన్నింగ్ తస్కరించిన రహస్య పత్రాలను వీకీలీక్స్ బహిర్గతం చేసింది. లక్షలాది సైనిక రహస్య పత్రాలు లీక్ చేసిన ఎన్ఎస్ఏ మాజీ విశ్లేషకుడు ఎడ్వర్డ్ స్నోడన్ వెనుక ఉన్నది కూడా అసాంజేయేనని నిర్ధారణకు వచ్చినఅసాంజే అరెస్టుకు అమెరికా పావులు కదిపింది. దీంతో 2012లో అసాంజే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసినట్టుగా ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఆయన్ని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నసంగతి తెలిసిందే. -
రేప్ కేసు; ‘వికీలీక్స్’ అసాంజేకు ఊరట
స్టాక్‌హోమ్: ఏడేళ్లుగా వెంటాడుతున్న రేప్ కేసు నుంచి వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు, విచారణలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్విడన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులోనే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు.. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందిన అసాంజే, గడిచిన ఐదేళ్లుగా అక్కడే తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. స్విడన్ ప్రభుత్వం తన ఆరోపణలన్నింటినీ వెనక్కి తీసుకోవడంతో అసాంజేకు స్వేచ్ఛ లభించినట్లేనని వికీలీక్స్ అభిమానులు పేర్కొన్నారు. అయితే, అతను బయట అడుగుపెట్టిన మరుక్షణం అమెరికా అతణ్ని అరెస్ట్ చేసే అవాకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడప్పుడే అసాంజే ఈక్వెడార్ ఎంబసీ నుంచి బయటికిరాకపోవచ్చని పరిశీలకుల అభిప్రాయం. సమ్మతంతోనే సెక్స్.. 2012లో స్విడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో వికీలీక్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో పాల్గొన్న ఓ అమ్మాయిని తన గదికి పిలిపించుకున్న అసాంజే.. రేప్‌కు పాల్పడ్డాడని స్టాక్‌హోమ్‌లో కేసు నమోదయింది. అయితే తామిద్దరం పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని, కుట్రతోనే రేప్‌కేసు బనాయించారని అసాంజే వాదించారు. సదరు మహిళ సీఐఏ ఏజెంట్ అని కూడా అసాంజే నిరూపించే ప్రయత్నం చేశారు. అనంతరం స్టాక్‌హోమ్ అధికారులు అసాంజే అరెస్టుకు ఆదేశించారు. అరెస్టు నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆయన ఈక్వెడార్ ఎంబసీని ఆశ్రయించారు. ఆస్ట్రేలియాకు చెందిన జూలియన్ అసాంజే, వికీలీక్స్ ద్వారా కీలకమైన దేశాల కార్యకలాపాలకు సంబంధించిన రహస్య పత్రాలను లీక్ చేయడం భారీ సంచలనాలకు కారణమైన సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఇండియా, పాకిస్థాన్ లాంటి పెద్ద దేశాలెన్నో వికీలీక్స బాధితులే కావడం గమనార్హం. అందరికంటే ఎక్కువగా ఇబ్బందులు పడ్డ అమెరికా.. అసాంజే అంతుచూస్తానని బాహాటంగానే ప్రకటించింది. తాజాగా గురువారం కూడా సీఐఏ అధికారులు మాట్లాడుతూ ‘అజాంజేను అరెస్ట్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం’అని అన్నారు. అటు, సీఐఏని ‘టెర్రరిస్టుల స్నేహితుడి’గా అసాంజే అభివర్ణించారు. అమెరికా ప్రయత్నాల నేపథ్యంలో అసాంజే రాయబార కార్యాలయం నుంచి బయటికి వస్తారా? రారా? అనేదానిపై స్పష్టత రావాల్సింఉంది. -
జూలియన్ అసాంజ్ అరెస్టు??
-
జూలియన్ అసాంజ్ అరెస్టు??
న్యూయార్క్: వీకీలీక్స్ స్థాపకుడు, ప్రఖ్యాత విజిల్ బ్లోయర్ జూలియన్ అసాంజ్ అరెస్టుకు మరోసారి అమెరికా రంగం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు ఖరారు చేస్తున్నది. 2010లో అసాంజే, వీకీలీక్స్ అమెరికాకు చెందిన అనేక సైనిక రహస్యాలను వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి అమెరికా ఆర్మీ నిఘా నిపుణుడు చెల్సియా మన్నింగ్ దొంగలించిన రహస్య పత్రాలను వీకీలీక్స్ వెలుగులోకి తెచ్చింది. ఇలా దేశ రహస్యాలను వెలుగులోకి తెచ్చినందుకు అసాంజ్ ను చట్టపరంగా శిక్షించవచ్చా? లేదా? అన్నది మొదట తర్జనభర్జన పడ్డ అమెరికా అధికారులు ఇప్పుడు చట్టపరంగా ఆయనను అరెస్టు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చారు. లక్షలాది సైనిక రహస్య పత్రాలను లీక్‌చేసిన ఎన్ఎస్ఏ మాజీ విశ్లేషకుడు ఎడ్వర్డ్ స్నోడన్ వెనుక కూడా ఉన్నది అసాంజ్ అని నిర్ధారణకు వచ్చిన అమెరికా అధికారులు.. ఇక ఆయన కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని, అసాంజే అరెస్టుకు వీలుగా అభియోగాలు ఖరారును వేగవంతం చేయాలని నిర్ణయించారు. -
వాళ్లతో అమెరికాకు ముప్పే!
అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అలాంటి పెద్ద దేశం కూడా ఒకరిని చూసి భయపడుతోంది. వాళ్లతో తమకు ముప్పేనని చెబుతోంది. అది ఎవరో కాదు.. వికీలీక్స్!! ఆ సంస్థ ఇటీవల బయటపెట్టిన ఎలక్ట్రానిక్ గూఢచార పద్ధతుల సమాచారాన్ని సీఐఏ నిర్ధారించలేదు గానీ, అలాంటి సమాచారం వల్ల అమెరికన్లకు ముప్పేనని చెబుతోంది. ఇలాంటి సమాచారం వల్ల అమెరికా సిబ్బందికి, వారి కార్యకలాపాలకు ఆటంకాలు కలగడమే కాదు, తమ సమాచారం వల్ల తమకే ప్రమాదం కలుగుతుందని సీఐఏ అధికార ప్రతినిధి హీతర్ ఎఫ్ హో్ర్నయిక్ అన్నారు. జూలియన్ అసాంజే స్థాపించిన వికీలీక్స్ సంస్థ తాజాగా ఏడు బ్యాచ్‌ల పత్రాలను బయటపెట్టింది. వీటికి 'వాల్ట్ 7' అని పేరుపెట్టింది. ఇందులో మొత్తం 7,818 పేజీల సమాచారం ఉంది. దానికి 943 ఎటాచ్మెంట్ ఫైళ్లను జత చేశారు. ఇవన్నీ సీఐఏ రహస్య ఫైళ్లని వికీలీక్స్ చెప్పింది. అందులో.. సామాన్య ప్రజల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేయడానికి ప్రభుత్వం ఏయే టూల్స్ ఉపయోగిస్తోందో వివరంగా తెలిపింది. ఇవి ఎంతవరకు నిజమో తాము చెప్పలేము గానీ, వీటివల్ల తమకు ఇబ్బంది మాత్రం తప్పదని ఇప్పుడు సీఐఏ అంటోంది. ప్రమాదకరమైన దేశాలు, ఉగ్రవాదుల బారి నుంచి అమెరికన్లను రక్షించడం తమ పని అని, అందుకోసం పలు దేశాలకు సంబంధించిన సమాచారాన్ని తాము సేకరిస్తామని సీఐఏ చెబుతోంది. అంతేతప్ప అమెరికన్ల మీద మాత్రం నిఘా పెట్టబోమని అంటోంది. కానీ వికీలీక్స్ బయటపెట్టిన పత్రాలు చూస్తే మాత్రం.. దాదాపు అమెరికన్లందరి ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు.. ఇలా అన్నింటిమీదా సీఐఏ నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. -
వేలాది సీఐఏ పత్రాలను బయటపెట్టిన వికిలీక్స్
పారిస్: అమెరికా కేంద్ర నిఘా విభాగం(సీఐఏ)కు చెందినవిగా చెబుతున్న వేలకొద్దీ పత్రాలను సంచలనాల వికిలీక్స్ మంగళవారం విడుదల చేసింది. వీటిని సీఐఏకు చెందిన సెంటర్ ఫర్ సైబర్ ఇంటెలిజెన్స్ నుంచి సంపాదించామంది. వికిలీక్స్ బయటపెట్టిన పత్రాలు నిజంగా సీఐఏకు చెందినవా కాదా అని నిర్ధారించుకునేందుకు సీఐఏను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది. సీఐఏ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఆ పత్రాలు నిజమైనవో కాదో మేం చెప్పం’అని అన్నారు. ప్రభుత్వ రహస్య పత్రాలను చాలా కాలం నుంచి బయటపెడుతున్న రికార్డ్ వికిలీక్స్కు ఉండటం తెలిసిందే. పత్రాలను పరిశీలిస్తున్న నిపుణులు మాట్లాడుతూ అవన్నీ నిజంగా సీఐఏకు చెందిన వాటిలాగే అనిపిస్తున్నాయని చెప్పారు. -
వికీయే సఖియే...
అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం సహజమైన విషయం. అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం అందమైన విషయం. రెండ్రోజుల్లో వాలెంటైన్స్ డే. ఈ సందర్భంగా ఇవాళ మీకో అందమైన విషయం. పమేలా ఆండర్సన్ తెలుసు కదా! 49 ఏళ్ల అమెరికన్ నటి. ఆమె ఇప్పుడు ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆ అబ్బాయి పేరు జులియన్ అసాంజ్. వయసు 45. వికీలీక్స్ హీరో. ప్రేమకు వయసు లేదు కాబట్టి.. ప్రేమలో ఉన్నంత కాలం వీళ్లు అమ్మాయి, అబ్బాయే. ఇదిలా ఉంచితే, లండన్‌లోని ఈక్వెడర్ ఎంబసీలో నాలుగేళ్లుగా తలదాచుకున్న అసాంజ్‌ను చూడ్డానికి పమేలా తరచు అమెరికా నుంచి వచ్చి వెళుతున్నారు. గత నాలుగు నెలల్లో ఐదుసార్లు ఆమె అతడిని కలుసుకున్నారు. అంతవరకు ఎవరూ పట్టిపట్టి చూడలేదు కానీ, వచ్చిన ప్రతిసారీ పమేలా స్పెషల్‌గా డ్రెస్ చేసుకుని రావడం ఓ యాక్టివిస్టు కళ్లల్లో పడింది. యాక్టివిస్టులకు ఒకటే యాక్టివిటీ ఉండదు కదా! అతడి కోసం ఆమె సెక్సీగా డ్రెస్ చేసుకుని వస్తోంది ఏమిటి చెప్మా.. అని ఆరా తీసి, వాళ్లిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని ఊదేశాడు. ఇంతకీ అసాంజ్‌ను పమేలా ఎందుకు కలుస్తున్నట్లు? అది తెలీదు కానీ, ఇద్దరికీ రష్యా అంటే ఇష్టం. అసాంజ్ ఏదైనా ఇష్టంగా తింటుంటే అతడి కళ్లల్లోకి ఇష్టంగా చూస్తూ కూర్చోవడం పమేలాకు ఇష్టం. అతడి కోసం వచ్చే ప్రతిసారీ అతడికి ఇష్టమైన ఫుడ్ ప్యాక్ చేయించుకుని తెస్తుందట పమేలా. ‘వికీలీక్స్’ హీరో జర్నలిస్ట్ జులియన్ అసాంజ్ -
ట్విట్టర్ అకౌంట్ వెరిఫై అయ్యిందా.. జరభద్రం!
ట్విట్టర్ అకౌంటు ఉండటం ఒక ఎత్తయితే.. దాన్ని వెరిఫై చేయించుకుని అధికారికంగా 'బ్లూ టిక్' పెట్టించుకోవడం మరో ఎత్తు. సోషల్ మీడియాలో ప్రెజెన్స్ చూపించుకోవడంతో పాటు, తమకు సంబంధించి ఇదే సరైన అకౌంట్ అని, మిగిలినవన్నీ ఫేక్ అకౌంట్లని చెప్పుకోడానికి ఈ రకంగా వెరిఫై చేయించుకుంటారు. కానీ, ఇలా వెరిఫై చేయించుకున్న లక్షలాది ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను తాము బయట పెట్టేస్తామని వికీలీక్స్ హెచ్చరించింది. మొత్తం అన్ని వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు, వాళ్ల కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక అంశాలు, సంబంధాలు అన్నింటితో ఒక ఆన్లైన్ డేటాబేస్ ఏర్పాటుచేస్తామని వికీలీక్స్ ఒక ట్వీట్లో తెలిపింది. అయితే దాన్ని ట్విట్టర్ వెంటనే తీసేసింది. 'వికీలీక్స్ టాస్క్‌ఫోర్స్' అనే పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంటుద్వారా చెప్పిన ఈ వివరాలను న్యూయార్క్ డైలీ న్యూస్ బయటపెట్టింది. మొదటి ట్వీట్‌ను డిలీట్ చేసిన వెంటనే అదే అకౌంటుతో మరో ట్వీట్ కూడా చేశారు. అయితే ఈసారి తమ వ్యాఖ్యలలో ఘాటు కాస్తంత తగ్గించారు. తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వివరాలను బయట పెట్టాలనుకుంటున్నామని, ఎవరైనా సూచనలిస్తారా అని ఆ ట్వీట్లో తెలిపారు. ట్విట్టర్ అధికారికంగా గుర్తించిన అకౌంట్లను వెరిఫైడ్ అకౌంట్లు అంటారు. వాటికి ట్విట్టర్ ఐడీ పక్కన నీలిరంగు సర్కిల్లో ఒక టిక్ మార్క్ వస్తుంది. అయితే, ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టడం తమ నిబంధనలకు విరుద్ధమని ట్విట్టర్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వికీలీక్స్ చేసిన హెచ్చరికపై బ్రిటిష్ నటుడు ఎతాన్ లారెన్స్ తీవ్రంగా మండిపడ్డారు. ఎవరో ఒకరు మీ ఇంట్లోకి చొరబడిపోయి మీ సోఫా కుషన్లన్నింటినీ అటూ ఇటూ మార్చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు. -
ఒబామా వ్యక్తిగత ఈ మెయిల్స్ లీక్
-
ఒబామా వ్యక్తిగత ఈ మెయిల్స్ లీక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమాబా వ్యక్తిగత ఈ-మెయిల్స్‌ను వీకీలీక్స్ బయటపెట్టింది. ఆయన వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ నుంచి పంపిన సందేశాన్ని వీకీలీక్స్ బహిర్గతం చేసింది. రహస్య చిరునామా ద్వారా ఒబామా పంపిన మెయిల్స్ లో కొన్నింటిని తొలి విడతగా బయటపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాలను వీకీలీక్స్ ట్విట్టర్ లో పేర్కొంది. కాగా bobama@ameritech.net నుంచి ఒబామా పంపిన ఏడు సందేశాలను వీకీలీక్స్ తన వెబ్ సైట్లో ప్రచురించిందంటూ న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. వీటిలో జి-20 సమావేశాలకు వెళ్లొద్దంటూ 2008 ఎన్నికల సందర్భంగా ఒబామా బృందంలోని జాన్ పొడెస్టా పంపిన మెయిల్ కూడా ఉంది. 2008 నవంబర్ 4న పొడెస్టా ఈ మెయిల్ పంపించారు. ఇప్పటికే హిల్లరీ క్లింటన్ ఈ మెయిళ్ల వ్యవహారంతో డెమోక్రటిక్ పార్టీకి తల బొప్పి కడుతోంది. ఇప్పుడు ఏకంగా ఒబామాకు సంబంధించి ఈ మెయిల్స్ బహిర్గతం కావడంతో డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నారు. పొడెస్టా ప్రస్తుతం హిల్లరీ ప్రచార బృందం సారధిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు చెందిన దాదాపు 23 వేల ఈమెయిల్స్ అపహరణకు గురయ్యాయి. వీటిల్లో ఒబమాకు పంపినవే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మెయిల్స్ వ్యవహారం లీక్ అవ్వడం వెనుక రష్యా హస్తం ఉందేమోనని వైట్ హౌస్ అనుమానిస్తోంది. -
అసాంజేకు ఇంటర్నెట్ కట్
పారిస్: తమ సంస్థ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం నుంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని గుర్తు తెలియని అధికారులు తొలగించినట్లు వికీలీక్స్ తెలిపింది. అసాంజే నాలుగేళ్లకుపైగా లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న హిల్లరీకి సంబంధించి సంచలన వివరాలను వికీలీక్స్ బయటపెట్టడం తెలిసిందే. -
హిల్లరీ ‘పెయిడ్ స్పీచ్’ టేపులు విడుదల చేసిన వికీలీక్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయాలు కీలక దశకు చేరుకున్న సమయంలో డెమోక్రటిక్ పార్టీ అశ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీకి సంబంధించి హిల్లరీ మాట్లాడిన మూడు పెయిడ్ స్పీచెస్ (డబ్బు తీసుకుని ఇచ్చే ఉపన్యాసాలు)కు సంబంధించిన టేపులను వికీలీక్స్ విడుదల చేసింది. దీంతో వాల్‌స్ట్రీట్‌తో డెమోక్రటిక్ నేతలకున్న సంబంధాలు తేటతెల్లమయ్యాయి. హిల్లరీ ప్రచార సారథి జాన్ పొడెస్టా మెయిల్ ఎకౌంట్‌ను హ్యాక్ చేయ డం ద్వారా వికీలీక్స్ సేకరించిన భారీ సమాచారంలో ఈ వివరాలు ఉన్నాయి. ఈ లీకేజీకి రష్యానే కారణమని హిల్లరీ వర్గం ఆరోపిస్తోంది. తమ ప్రత్యర్థి ట్రంప్‌నకు సహకరించేందుకే వికీలీక్స్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. -
త్వరలో వికీలీక్స్ సంచలన వార్తలు
-
వికీలీక్స్ మరో సంచలన ప్రకటన
-
వికీలీక్స్ మరో సంచలన ప్రకటన
వాషింగ్టన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు, సంపాదకుడు జూలియన్ అస్సాంజ్ సంచలన ప్రకనట చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే అధ్యక్ష పదవికి బరిలోఉన్న హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సంబంధించి ముఖ్యమైన, కీలకమైన సమాచారాన్ని వెల్లడిచేస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్ 8న జరగనున్న ఎన్నికలకంటే ముందే కొన్నికీలక అంశాలను బహిర్గతం చేయనున్నట్టు ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ శాటిలైట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను బుధవారం చెప్పారు. మీరు ప్రకటించే బోయే డేటా ఎన్నికలను ప్రభావితం చేయనుందా అని ప్రశ్నించినపుడు ఇది చాలా ముఖ్యమైందిగా తాను భావిస్తున్నాననీ, ప్రజలు, మీడియాలో రగిలే అగ్గి మీద ఈ సంచలనం ఆధారపడి ఉంటుందని తెలిపారు. తన పనిని వదిలేదిలేదని స్పష్టం చేశారు. కానీ ఇది ఎన్నికల ప్రచారంతో ముడిపడి ఉంది. వివిధ రకాల సంస్థల నుంచి, పత్రాలు వివిధ వార్తలు, కొన్ని చాలా ఊహించని కోణాలు, కొన్ని చాలా ఆసక్తికరమైన, కొన్ని వినోదాత్మకంగా, వివిధ సంస్థలకు చెందిన విభిన్నమైన, వెరైటీ కథనాలను అందించనున్నట్టు ప్రకటించారు. వికిలీక్స్ కొందరు ముఖ్యమైన వ్యక్తులు, ఎక్కువగా ప్రభుత్వాలకు సంబందించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేస్తూ సంచలనానికి తెర తీస్తుంది. ముఖ్యంగా 2010 లో అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలోనే సైనిక, దౌత్య పత్రాలకు సంబందించిన అతిపెద్ద సమాచారాన్ని బయటపెట్టింది.. వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్ వెబ్సైట్ ద్వారా అసాంజ్ ప్రపంచానికి వెల్లడిస్తుండడంతో వాషింగ్టన్ ప్రభుత్వం అసాంజ్ ను అరెస్ట్ చేసింది. దీంతోపాటూ స్వీడన్ లో లైంగిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలుకు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసాంజ్ ఈక్విడెరీయన్ ఎంబసీలో గత ఐదు సం.రాలుగా తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా సాగుతున్నఈ పోరులో వికీలీక్స్ వెల్లడించే అంశాలు ప్రభావితం చేయనున్నాయా? వేచి చూడాలి. -
బ్రిటన్ పోలీసులకు లొంగిపోతా: అసాంజే
లండన్: ఐక్యరాజ్యసమితి తన పిటిషన్‌ను కొట్టేస్తే బ్రిటన్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్లు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే గురువారం ప్రకటించారు. స్వీడన్లో అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు. తన స్వేచ్ఛకు సంబంధించి 2014లో ఐరాసకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐరాస శుక్రవారం తీర్పును వెల్లడించనుంది. తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే పోలీసుల ముందు లొంగిపోతానని, అనుకూలంగా వస్తే పాస్‌పోర్టును పొందుతానన్నారు. ఐరాస నిర్ణయం అసాంజేకు అనుకూలంగా వస్తుందని బీబీసీ అంచనా వేస్తుండగా.. ఎంబసీని వదిలి బయటికొస్తే అరెస్టుచేస్తామని బ్రిటన్ చెబుతోంది. -
ఇంత దిగజారుడా?!
చెప్పే మాటలకూ, చేసే చేతలకూ పొంతన ఉండదని పదే పదే నిరూపించుకుం టున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘దొంగ చెవుల’ వ్యవహా రంలోనూ అడ్డంగా దొరికిపోయారు. అమెరికా మొదలుకొని దేశదేశాల అధినేతలూ తెరచాటున చేస్తున్న పాపాలేమిటో...అంతఃపుర కుట్రలేమిటో డాక్యుమెంట్ల ఆధారంతో వీధికీడుస్తున్న జూలియన్ అసాంజ్ నేతృత్వంలోని వికీలీక్స్ సంస్థే బాబు సంగతిని కూడా వెల్లడించి పుణ్యం కట్టుకుంది. లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో మూడేళ్లుగా అసాంజ్ ఆశ్రయం పొందుతుండగా... ఆయన మొదలెట్టిన పనిని ఇప్పుడు ఖండాంతరాల్లో అనేకులు కొనసాగిస్తున్నారు. కనుక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకే కాదు...బాబుకు కూడా ప్రస్తుతం వికీలీక్స్ కంట్లో నలుసే. నెల్లాళ్లక్రితం ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలోని ఆడియో, వీడియోలు బట్టబయలైనప్పుడు ఆయన పోద్బలంతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ వ్యవహారానికి సమాంతరంగా ఫోన్ ట్యాపింగ్నూ, దాంతోపాటు సెక్షన్ 8నూ తీసుకొచ్చి చేసిన రగడ అంతా ఇంతా కాదు. మీడియాలో గగ్గోలు పెట్టడంతో ఊరుకోక రాష్ట్రపతి మొదలుకొని అందరికీ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వికీలీక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆ రగడకు చాలాముందే...జనవరిలోనే ఆయన ట్యాపింగ్ పరికరాలు కొనడానికి సిద్ధపడినట్టు స్పష్టమవుతున్నది. జరగని ఫోన్ ట్యాపింగ్ గురించి పదే పదే గొడవచేసి అది చాలా అపవిత్రమన్నట్టు మాట్లాడినవారు తామే ట్యాపింగ్ టెక్నాలజీని కొనడానికి ప్రయత్నించడాన్నిబట్టి చూస్తే బాబు పాటిస్తున్న విలువలేమిటో అర్థమవుతుంది. ఇప్పుడు వెల్లడైన సమాచారం ప్రకారం బాబు ప్రభుత్వం కొనదల్చుకున్న ఉపకరణం ఉన్నత శ్రేణికి చెందినదని, అది ఇంతవరకూ దేశంలో కేంద్ర హోంశాఖ అధీనంలోనూ, ముంబై ఉగ్రవాద నిరోధక బృందం వద్ద ఉన్నదని చెబుతున్నారు. జాతీయభద్రత వంటి అంశాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండటం, అనుమానం వచ్చినవారిపై నిఘా పెట్టడం సాధారణమే. అయితే, దానికి కొన్ని విధానాలుంటాయి. చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ పౌరుడి జీవితాన్నీ, స్వేచ్ఛనూ హరించరాదని మన రాజ్యాంగం అంటోంది. విషాదమేమంటే మన ప్రభుత్వాలు ఇప్పటికీ బ్రిటిష్ వలస పాలకులు తీసుకొచ్చిన 1885నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని నిబంధనలనే అనుసరిస్తున్నాయి. కేంద్రానికీ, రాష్ట్రాలకూ ఫోన్ ట్యాపింగ్‌కు అధికారమిస్తున్న ఆ చట్టంలోని సెక్షన్ 5(2)కు 1971లో సవరణ తీసుకొచ్చినప్పుడే అందరూ భయాందోళనలు వ్యక్తంచేశారు. ఈ సవరణపై దాఖలైన పిటిషన్‌ను విచారించినప్పుడు ట్యాపింగ్ అనేది పౌరుల వ్యక్తిగత గోప్యత లోకి చొరబడటమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే సవరణ చెల్లదని చెప్పకుండా దాని నియంత్రణకు మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్రంలో నూ, రాష్ట్రాల్లోనూ హోం శాఖ కార్యదర్శులు ప్రతి కేసునూ పరిశీలించి సహేతుకమై నదని భావించినప్పుడే ట్యాపింగ్‌కు అనుమతించాలని, వీటి చట్టబద్ధత ను సమీక్షిం చడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని ఆ మార్గదర్శకాలు సూచిం చాయి. ఈ నియంత్రణలు అమల్లోకి రావడానికి కూడా మరో ముప్ఫై ఏళ్లుపట్టింది. తర్వాత చాలా సందర్భాల్లో సైతం ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. పెపైచ్చు నిబంధనల ప్రకారం ట్యాపింగ్ పరికరాలు కేంద్రానికి తెలియకుండా, చెప్పకుండా కొనడానికి వీల్లేదు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను అత్యంత పవిత్రమైనదిగా భావించి, ఎవరూ విచక్షణారహితంగా దానికి తూట్లు పొడవకుండా సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న జాగ్రత్తలన్నీ బాబు ముందు బలాదూరయ్యాయని వికీలీక్స్ వెల్లడించిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అడిగినవారికీ, అడగనివారికీ కొత్త రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నదని బాబు ఏడాదిగా చెబుతూనే ఉన్నారు. ఎవరు ఏం డిమాండ్ చేసినా డబ్బుల్లేవనే జవాబు వస్తున్నది. అంగన్వాడీ కార్యకర్తలకూ, మున్సిపల్ కార్మికులకూ వేతనాలు పెంచడా నికి దిక్కులేదుగానీ ఉన్నత శ్రేణి ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడానికి సిద్ధం...అది కూడా కేంద్రంనుంచి ముందస్తు అనుమతి లేకుండా! జనవరిలో చేసిన ఈ ప్రయత్నాలు... జూన్‌లో ‘ఓటుకు కోట్లు’ టేపులు వెల్లడయ్యాక మరింత వేగం పుంజుకున్నాయంటే చంద్రబాబు లక్ష్యం ఎవర న్నది సులభంగానే తెలుస్తుంది. ‘ఆశగలమ్మ దోషమెరగదు...పూటకూళ్లమ్మ పుణ్య మెరగద’ని సామెత. ఒకపక్క ట్యాపింగ్‌లో ఉన్న అప్రజాస్వామికత గురించి, ప్రభుత్వ పెద్దలపై నిఘా ఉంచడం గురించి బయట లెక్చెర్లు దంచుతూ అదే సమ యంలో ఆ టెక్నాలజీ కోసం చీకటి లావాదేవీలు జరపడం...దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని పాకులాడటం, ఆ దెబ్బతో ప్రత్యర్థుల్ని గుక్కతిప్పుకోకుం డా చేయాలని కలగనడం ఎలాంటి వ్యక్తిత్వానికి ప్రతీక? ఈ విషయంలో గురజాడ వారి గిరీశం కూడా బాబు ముందు పిపీలకం అవుతాడేమో! ‘ఓటుకు కోట్లు’ రట్టయ్యాక పైకి అన్నా అనకపోయినా...ఇలాంటి పద్ధతులకు ఇక స్వస్తి చెప్పడం మంచిదని బాబు ఆలోచించి ఉంటే అది టీడీపీకీ, ఆయనకూ కాస్తయినా మేలు చేసేది. కానీ ఆయన ఆ మార్గాన్ని వీడదల్చుకోలేదని ఆంధ్రప్రదేశ్‌లో ఈమధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించాయి. ఆ విషయంలో పరివర్తన సంగతలా ఉంచి అర్జెంటుగా ట్యాపింగ్ టెక్నాలజీని సంపాదించి తెలంగాణలోనూ, ఏపీలోనూ అందరినీ దొరకబుచ్చుకుని పైచేయి సాధించాలని తహతహలాడటం దురాశ అనాలా... దుర్మార్గమనాలా? ఆ క్రమంలో తాను ‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి మించిన తప్పు చేస్తున్నానని ఆయన తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశపడటం తప్పు కాదు...కానీ, అది దురాశ స్థాయికి చేరడం, అందులో దోషమేమి టో గుర్తించలేని స్థితికి చేరుకోవడం విడ్డూరం. ఇదంతా వ్యతిరేకుల ప్రచారమని ఏపీ మంత్రులు కొట్టిపారేస్తున్నారు. కానీ వెల్లడించిన వికీలీక్స్ నిప్పులాంటిది. దాని ధాటికి అగ్రరాజ్యాలే కుయ్యో మొర్రోమంటున్నాయి. ఈ సమాచార సాంకేతిక యు గంలో తప్పు చేయకపోవడంవల్ల మాత్రమే నిజాయితీపరులుగా గుర్తింపుపొం దవచ్చు తప్ప... చేసి తప్పించుకుందామనుకుంటే చెల్లదని...ఎవరేమిటో పసిగట్టి చెప్పేందుకు వికీలీక్స్వంటివి డేగ కళ్లతో చూస్తున్నాయని గ్రహిస్తే మంచిది. -
ట్యాపింగ్ కింగ్ బాబు!
-
ట్యాపింగ్ కింగ్ బాబు!
ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు ఈ-మెయిల్స్‌ను బయటపెట్టిన వికీలీక్స్ హైదరాబాద్: టెలిఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీకోసం ఏపీ ప్రభుత్వం 2015 జనవరినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఖ్యాతిపొందిన వికీలీక్స్ వెల్లడించింది. ట్యాపింగ్‌కు వినియోగించే హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్టర్ ఉపకరణాల కొనుగోలుకు ఏపీ ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన ఒక ఇన్స్పెక్టర్ ఇటలీకి చెందిన హ్యాకింగ్‌టీమ్ సంస్థతో గత జనవరిలోనే సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా రూ.7.5 కోట్లు వెచ్చించి ఈ టెక్నాలజీని కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వికీలీక్స్ ద్వారా స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే... ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని విక్రయించే సంస్థలు అంతర్జాతీయంగా అనేకం ఉన్నాయి. అందులో ఇటలీలోని మిలన్కు చెందిన హాకింగ్ టీమ్ ఒకటి. ఈ సంస్థకు చెందిన 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఆ మెయిల్స్‌ను లోతుగా పరిశీలించినప్పుడు ట్యాపింగ్ టెక్నాలజీకోసం బాబు సర్కారు తీవ్రంగా ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓట్లుకు కోట్లు కుంభకోణం వెలుగులోకి వచ్చాక దాన్నుంచి తప్పించుకునేందుకు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిం చడం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతీ తెలిసిందే. అయితే అంతకుముందే... ఈ ఏడాది జనవరిలోనే ట్యాపింగ్ టెక్నాలజీ సమకూర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ హ్యాకింగ్‌టీమ్‌తో ఆ మేరకు ఈమెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఓటుకు కోట్లు కుంభకోణం వెల్లడయ్యాక ఏపీ ప్రభుత్వం ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యవసరంగా ట్యాపింగ్ టెక్నాలజీని సమకూర్చుకునే బాధ్యతను ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగించింది.ఇంటెలిజెన్స్ విభాగం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్-7లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ విభాగం ఆర్డర్ మేరకు హ్యాకింగ్‌టీమ్.కామ్ సంస్థకు చెందిన సింగపూర్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ డేనియల్ మగ్లీటాతోతో ఓర్టస్ డెరైక్టర్ ప్రభాకర్ కాసు జూన్ 9న బేరసారాలు ప్రారంభించారు. ట్యాపింగ్ టెక్నాలజీ పనితీరు, ధరలపై జూన్ 9 నుంచి జూలై 2 వరకూ 39 సార్లు మగ్లీటాతో సంప్రదింపులు జరిపారు. 25 నుంచి 50 సెల్ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు టెక్నాలజీ కావాలని హ్యాకింగ్‌టీమ్‌కు ఆర్డరు చేశారు. ఏ అవసరాలకోసం తాము దాన్ని వినియోగించాలనుకుంటున్నామో ఈమెయిల్‌కు జతచేశారు. ధర ఎంతో చెబితే.. తన క్లయింట్ (ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు)కు చెప్పి ఒప్పిస్తానంటూ డేనియల్‌కు ప్రభాకర్ చెప్పారు. హ్యాకింగ్టీమ్నుంచి ఇతర టెక్నాలజీకూడా కొనుగోలు చేసేందుకు యత్నిస్తానని హామీ ఇచ్చారు. వీరిమధ్య అనేకసార్లు ఫోన్ల ద్వారా, స్కైప్‌లో మాట్లాడినట్టు వికీలీక్స్ బయటపెట్టిన మెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ప్రాథమికంగా 1 నుంచి 1.2 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.7.5కోట్లు) అవుతుందని డేనియల్ మగ్లీటా తేల్చారు. దీంతో తన క్లయింట్‌కు టెక్నాలజీ పనితీరుపై అవగాహన కల్పించడానికి (డెమాన్‌స్ట్రేషన్) హైదరాబాద్‌కు రావాలని మగ్లీటాను ప్రభాకర్ కోరారు. ఈ విషయమై జూన్ 16,17 తేదీల్లో ప్రభాకర్‌రెడ్డి, మగ్లిట్టా స్కైప్‌లో మాట్లాడుకున్నారు. ఆ మేరకు జూలై 7న తాను హైదరాబాద్‌కు రావడానికి ఏర్పాట్లు చేసుకున్నానని మగ్లీటా చెప్పారు. ‘హైదరాబాద్‌లో ఏ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు.. జూలై 7న ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు కలుద్దాం.. అక్కడే క్లయింట్‌కు డెమాన్‌స్ట్రేషన్ ఇవ్వవచ్చు’ అంటూ మగ్లీటాకు ప్రభాకర్ సూచించారు. ఇక్కడికి రావడానికి అవసరమైన వీసా ఏర్పాట్లపై ప్రభాకర్ వారికి సూచనలు, ఇవ్వడమే కాకుండా ఆహ్వాన పత్రం పంపించారు. ఈ మేరకు సింగపూర్‌నుంచి బయలుదేరి జూలై 6 నుంచి 8 వరకు హైదరాబాద్‌లో ఉంటామని మగ్లీటా చెప్పారు. హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్లో వీరి మధ్య సంప్రదింపులకు ఏర్పాట్లు జరిగాయి. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలోని అధికారులకు హ్యాకింగ్‌టీమ్ డెమాన్స్స్ట్రేషన్కు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఈ సమావేశం జరిగిందా? లేదా? అన్న వివరాలు బయటకు రాలేదు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసులు కోసం ఓర్టస్ డెరైక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి హ్యాకింగ్‌టీమ్‌తో జూన్ 9 నుంచి జూలై 2 వరకు జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఈ-మెయిల్స్‌ను వికీ లీక్స్ బయటపెట్టింది. ఏమిటీ హ్యాకింగ్‌టీమ్?: ఇటలీలోని మిలన్ కేంద్రంగా హ్యాకింగ్‌టీమ్ సంస్థ పనిచేస్తోంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు సంఘవిద్రోహక శక్తుల ఆటకట్టించడానికి లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీలకు, ప్రైవేటు సంస్థలకు అత్యాధునిక ట్యాపింగ్ టెక్నాలజీను ఈ సంస్థ విక్రయిస్తుంది. దీనిద్వారా ఫోన్లను ట్యాప్‌చేయడం, ఈమెయిళ్లను హాక్ చేయడంతోపాటు కంప్యూటర్లలోని మైక్రోఫోన్, కెమెరాలను రహస్యంగా యాక్టివేట్ చేయవచ్చు. ఈ సంస్థకు అమెరికాలోని అనాపోలిస్, సింగపూర్‌లో బ్రాంచీలు ఉన్నాయి. సింగపూర్ కార్యాలయానికి మగ్లీటా చీఫ్‌గా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ఇచ్చే టెక్నాలజీ ద్వారా ఫోన్‌కాల్స్, ఎస్సెమ్మెస్, ఫోటోలతోపాటు ఫేస్బుక్, ఈ మెయిల్స్, ట్విటర్, వ్యాట్సప్, స్పైప్... ఒకటేమిటి సమస్త సమాచారాన్ని ట్యాప్ చేయవచ్చు. వికీలీక్స్ చెప్పిన సమాచారం మేరకు ఈ సంస్థ లెబనీస్ సైన్యం, సూడాన్, బహ్రెయిన్‌లకూ ట్యాపింగ్ టెక్నాలజీని విక్రయించినట్లు స్పష్టమైంది. ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడానికి? తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలను అడ్వాన్సుగా ఇస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని మే 30న తెలంగాణ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాక... ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తమ ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆధారాలున్నాయని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అదేసమయంలో అలాంటి టెక్నాలజీ కోసం అగమేఘాలపై సంప్రదింపులు జరపడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం సెల్యూలార్ ఇంటర్సెప్షన్ హార్డ్‌వేర్ సొల్యూషన్స్ సమకూర్చుకోవడం ద్వారా ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడానికి కుట్ర పన్నారన్నది చర్చనీయాంశంగా మారింది. ఓటుకు నోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పడ్డుపడిన తర్వాత కాలంలో ఈ ఆధునిక టెక్నాలజీ సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం గమనిస్తే తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఫోన్లపై నిఘా పెట్టడానికా? లేక వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ సంభాషణల్లో అక్కడక్కడా చెబుతున్నట్టు సొంత రాష్ట్రంలో నిఘా కోసమైతే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సెల్యులార్ ఇంటర్సెప్షన్ హార్డ్‌వేర్ సొల్యూషన్స్ సమకూర్చమని కోరుతూనే మరోవైపు తక్షణ అవసరం కింద కీలకమైన ఒక మొబైల్ ఫోన్ ట్రాక్ చేయాలని, ప్రాధాన్యతా క్రమంలో 25 నుంచి 50 మొబైల్ లెసైన్సులను ట్రాక్ చేయాల్సి ఉంటుందని హ్యాకింగ్‌టీమ్‌కు ప్రభాకర్ పంపిన ఈ మెయిల్స్‌లో పేర్కొన్న విషయం మరింత సంచనం రేపుతోంది. హ్యాకింగ్ టీమ్‌ను సంప్రదించిన ఇన్స్పెక్టర్ హైదరాబాద్: ట్యాపింగ్‌కు వినియోగించే హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్టర్ ఉపకరణాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన ఒక ఇన్స్పెక్టర్ గత జనవరిలోనే సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ వెల్లడిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ విభాగంలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ ‘రిమోట్ కంట్రోల్ సిస్టమ్’ కోసం హ్యాకింగ్ టీమ్‌ను గతంలోనే సంప్రదించినట్టు తెలుస్తోంది. ‘మేము భారత ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏజెన్సీకి చెందినవారం. రిమోట్ కంట్రోల్ సిస్టమ్వంటి సొల్యూషన్స్ కోసం చూస్తున్నాం. దానికి సంబంధించిన సమాచారం, దాన్ని అందించడానికయ్యే ఖర్చెంతో వివరాలు పంపండి’... అని కోరుతూ దుర్గాప్రసాద్ హ్యాకింగ్ టీమ్ సీఈవోకు ఈ-మెయిల్ పంపారు. ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అయిన దుర్గాప్రసాద్ ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక నిఘా విభాగమైన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) సెల్లో టెక్నికల్ వింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ముష్కర మూకలపై నిఘాకు అవసరమైన సాంకేతిక పరికరాలు, ఉపకరణాలు కొనుగోలు చేయడం ఈ టెక్నికల్ వింగ్ ప్రధాన విధి. సుదీర్ఘకాలంలో సీఐ సెల్లో విధులు నిర్వర్తిస్తున్న దుర్గాప్రసాద్‌కు దేశవ్యాప్తంగా ఉన్న పలు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సంస్థలతో పరిచయాలు ఉన్నాయని అధికారులు ధ్రువీకరించారు. కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరీదు చేయాలని భావించిన హార్డ్‌వేర్ ఇంటర్సెప్షన్ ఉపకరణం ‘సెప్టయ్యర్’ రకానికి చెందినది. ఈ తరహాకు చెందినవి ప్రస్తుతం దేశంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఆధీనంలో ఒకటి, ముంబైలోకి యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) వద్ద ఒకటి మాత్రమే ఉన్నాయి. వీటిని అధికారికంగా కొనుగోలు చేయాలంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి, ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమతిని కచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాకాకుండా కొనుగోలు చేస్తే కేంద్రం తీవ్రంగా పరిగణిస్తుంది. దేశ సరిహద్దులో నిఘా ఉంచే మిలటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎంఐబీ) కొన్నేళ్ళ కిందట జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులపై, మిలటరీలో ఉన్న ‘ఇంటి దొంగలపై’ నిఘా ఉంచడానికి హార్డ్‌వేర్ ఇంటర్సెప్షన్ ఉపకరణాలు అవసరమని భావించింది. కేంద్రం అనుమతి లేకుండా వాహనంలో ఉంచి ఎక్కడికైనా తీసుకువెళ్ళి ఆయా పరిధిల్లో ఉన్న సెల్ఫోన్లను ట్రాక్ చేయడానికి, ఇంటర్సెప్ట్ చేయడానికి ఉపకరించే హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్టర్ మాదిరి ఫేక్ బేస్‌స్టేషన్‌ను ఖరీదు చేసింది. ఏడాదిన్నర తరవాత ఈ విషయం గుర్తించిన సర్వీసు ప్రొవైడర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం ద్వారా కేంద్ర హోం శాఖ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్ళారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం అప్పటి జనరల్‌తోపాటు పలువురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు సిబ్బందితోపాటు జనరల్ స్థాయి అధికారిపైనా చర్యలకు సిఫార్సు చేసింది. కుట్రమయ సర్కారులకు సింహస్వప్నం! ప్రపంచదేశాల దౌత్యసంబంధాల్లో నెలకొని ఉన్న కుట్రలు, కుయుక్తులు, అమానవీయ కార్యకలాపాలను, హక్కుల హననాలను బహిర్గతం చేసిన సంచలనం వికీలీక్స్. ప్రధానంగా అమెరికా ప్రభుత్వం అనుసరించిన కుట్రపూరిత, దుర్మార్గపు విధానాలను ధ్రువపరిచే పత్రాలను బయటపెట్టడం వికీలీక్స్ ఘనత. ప్రజాస్వామ్య యోధుడుగా పేరుపొందిన ‘జూలియన్ అసాంజ్’ ఆధ్వర్యంలోని వికీలీక్స్ భారతదేశానికి సంబంధించిన అంతర్జాతీయ వ్యవహారాలను అనేకం వెలుగులోకి తీసుకొచ్చింది. అనేక అంతర్జాతీయ ప్రముఖ పత్రికలు, వార్తాసంస్థలతోపాటు.. దేశీయంగా ‘ది హిందూ’ వంటి ఆంగ్ల దినపత్రికలు కూడా వికీలీక్స్ విడుదల చేసిన కేబుల్స్‌ను విలువైనవిగా భావించి ప్రాధాన్యతనివ్వడం తెలిసిందే. 2006లో ప్రారంభమైన వికీలీక్స్ యూరప్, ఆస్ట్రేలియా, తైవాన్, దక్షిణాఫ్రికా, అమెరికాతోపాటు వివిధ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణుల, జర్నలిస్టుల, ప్రభుత్వ అధికారుల రహస్యసహకారంతో నడుస్తోంది. వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజ్ మూడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలోనే రాజకీయ ఆశ్రయం పొందుతున్నారు. వికీలీక్స్ కథనాలు పూర్తిగా అవాస్తవాలు: యనమల సాక్షి,హైదరాబాద్: వికీలీక్స్ వెల్లడించినట్లుగా కొన్ని చానళ్లలో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవాలు, నిరాధారాలని ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు సింగపూర్ హ్యాకింగ్ టీమ్‌కు బాధ్యతలు అప్పగించినట్లుగా జరుగుతున్నది దుష్ర్పచారంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కొందరు సొంత చానళ్లను అడ్డం పెట్టుకుని ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
బండారం బయటపెట్టిన వికీలీక్స్
-
బండారం బయటపెట్టిన వికీలీక్స్
హైదరాబాద్ : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు వీకిలీక్స్ పేర్కొంది., ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్‌లోని వార్టస్ అనే సంస్థతో ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వార్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి...హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో జరిపిన మెయిల్స్ సంభాషణలను వికీలీక్స్ బయటపెట్టింది. సుమారు రూ.7.5 కోట్లు చెల్లించి ఈ పరికరాలను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్....తన కథనంలో పేర్కొంది. ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడిన తర్వాతే ఏపీ సర్కార్ ట్యాపింగ్ పరికరాల కోసం సంప్రదింపులు జరిపినట్లు, అత్యవసరంగా మొబైల్, మెయిల్స్ ట్రాక్ చేసే సదుపాయాలు కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ మెయిళ్లు, సెల్ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాప్ట్‌వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు పది లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో భాగంగానే చంద్రబాబు సర్కారు భాగోతం వెలుగు చూసింది. -
'అతని' కాపలా ఖర్చు రూ.94 కోట్లు..
లండన్: ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో శరణార్ధిగా ఉన్న వీకీలిక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే(43)ను కాపలా కాసేందుకు బ్రిటన్ ప్రభుత్వం పెద్దమెత్తంలో ఖర్చు చేస్తోంది. 2012లో అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయాన్ని ఆశ్రయించినప్పటినుంచి ఇంతవరకు అయిన మెత్తం ఖర్చు దాదాపు 94 కోట్ల 60 లక్షల రూపాయలుగా తేలింది. స్వీడన్లో లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్న అసాంజే దౌత్య కార్యాలయం బయటకు వస్తే అరెస్టు చేసేందుకు స్కాట్లాండ్ యార్డు పోలీసులు నిరంతర పహారా ఏర్పాటు చేశారు. గతేడాది అక్టోబరు నాటికి దీనికైన ఖర్చు రూ.85 కోట్లుగా స్కాట్లాండ్ యార్డ్ ధ్రువీకరించింది. అసాంజే కాపలాకు రోజువారీ ఖర్చు రూ.9 లక్షల 50 వేలుగా ఎల్బీసీ రేడియో సమాచార చట్టం ద్వారా సేకరించింది. విదేశీ దౌత్య కార్యాలయాల రక్షణ కింద ఈ నిధులు పొందుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వం ఇరాక్ యుద్ధంలో వేలమంది మరణించినప్పుడు దర్యాప్తు కోసం చేసిన ఖర్చును మించి ఒక రాజకీయ శరణార్ధికోసం ఖర్చు చేయడం దిగ్భ్రాంతికరమని వీకీలిక్స్ ఆధికార ప్రతినిధి క్రిష్టీన్ రఫెన్సన్ విమర్శించారు. -
నెట్‌వర్క్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందా?
ఏదైనా సమాచారం ఒక నెట్‌వర్క్‌లోకి వెళ్లిన తరువాత దాని గోప్యతకు గ్యారంటీలేదు. 100 శాతం రహస్యంగా ఉంటుందన్న నమ్మకంలేదు. అమెరికా లాంటి దేశం కూడా తన సీక్రెట్లను కాపాడుకోలేకపోయింది. వికీలీక్స్ దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఈ పరిస్థితుల్లో సమాచారాన్ని రహస్యంగా ఉంచే నెట్‌వర్క్‌ను చైనా సిద్ధం చేస్తోంది. వికీలీక్స్ - ఎడ్వర్డ్ స్నోడెన్.. ఈ రెండు పేర్లు వింటే అమెరికా ప్రభుత్వానికి కోపం నషాళానికి అంటుతుంది. ప్రపంచానికి పెద్దన్నగా తనకు తానుగా ప్రకటించుకుని అమెరికా చేస్తున్న దురాగతాలను వికీలీక్స్ ద్వారా స్నోడెన్ విడుదల చేశారు. దీంతో స్నోడెన్‌ను పట్టుకునేందుకు అగ్రరాజ్యం చేయని ప్రయత్నం లేదు. రష్యాతో పాటు మరి కొన్ని దేశాలు స్నోడెన్‌కు రక్షణ కల్పిస్తున్నాయి. అమెరికా నెట్‌వర్క్‌ను స్నోడెన్ చేధించడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. స్నోడెన్నే కాదు, ఏ డెన్ వచ్చినా చేధించలేని, హ్యాక్ చేయలేని నెట్‌వర్క్‌ను కొన్ని దేశాలు డెవలప్ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ విషయంలో చైనా కాస్త ముందుంది. క్వాంటమ్ నెట్‌వర్క్‌లో సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి పంపితే అందులోకి ఎవరూ చొరబడలేరు. ఈ నెట్‌వర్క్‌ను డెవలప్ చేసేందుకు 1980లలోనే ఐబీఎం ప్రయత్నించింది. గడిచిన 30 ఏళ్లుగా దీని మీద రీసెర్చ్ అంతగా ముందుకు పోలేదు. వికీలీక్స్ నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా ప్రభుత్వం క్వాంటమ్ నెట్వర్క్ పరిశోధన కోసం భారీగా నిధులు కేటాయించింది. ఒక నిర్దిష్టమైన మార్గంలో క్వాంటమ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతారు. ఆ మార్గంలో వెళ్లే సమాచారాన్ని ఎవరైనా హ్యాక్ చేయాలని, దొంగలించాలని ప్రయత్నిస్తే సమాచారం తన రూపాన్ని మార్చుకుంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ను కాజేసినా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంత ప్రాధాన్యం ఉన్న క్వాంటమ్ నెట్‌వర్క్‌ను మొదట బీజింగ్, షాంఘై నగరాల మధ్య ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. 2016 కల్లా ఈ రెండు నగరాల మధ్య 2 వేల కిలో మీటర్ల మేర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. క్వాంటమ్ నెట్‌వర్క్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచం వ్యాప్తంగా ఇలాంటి నెట్వర్క్ వేయాలంటే శాటిలైట్ల సహకారం అవసరమని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సేఫెస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌పై దృష్టి సారించాయి. అయితే తాడిని తన్నేవాడున్నప్పుడు దాని తల దన్నే వాడు కూడా ఉంటాడని మన పెద్దలు చెబుతుంటారు. అట్లాగే క్వాంటమ్ నెట్‌వర్క్‌ను కూడా చేధించే హ్యాకర్లు పుట్టుకొచ్చే అవకాశంలేకపోలేదు. ** -
గుండెజబ్బుతో.. లొంగుబాటుకు సిద్ధమైన అసాంజ్
పలు దేశాలకు చెందిన అధికారిక రహస్యాలను బట్టబయలు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ గుండెజబ్బుతో బాధపడుతున్నారు. దాంతో ఆయన లొంగిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. చాలా కాలంగా లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న ఆయన.. అనారోగ్యం కారణంగానే బయటకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. తన మీద ఎలాంటి ఆరోపణలు లేవని, తాను ఈక్వెడార్ రాయబార కార్యాలయం నుంచి త్వరలోనే బయటకు వస్తానని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. దాంతో అసాంజ్ లొంగిపోతారన్న ఉద్దేశంతో రాయబార కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గత రెండేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అసాంజ్ (43)కి గుండెజబ్బుతో పాటు తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య కూడా మొదలైంది. అయితే.. బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారన్న కారణంతో ఇంతవరకు ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ప్రధానంగా విటమిన్ డి లోపం వల్లనే అసాంజ్ ఈ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండేళ్లుగా సూర్యరశ్మి సోకకపోవడం వల్లే డి విటమిన్ లోపం బాగా ఎక్కువైంది. దాంతో ఆయనకు ఆస్థమా, మధుమేహం, ఎముకలు బలహీనం కావడం, చివరకు మతిమరుపు కూడా వచ్చాయని అంటున్నారు. అసాంజ్‌ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనప్పుడు లాటిన్ అమెరికా దేశమైన ఈక్వెడార్ ఒక్కటి మాత్రమే ఆయనకు ఆశ్రయం ఇవ్వడానికి 202 ఆగస్టులో ముందుకొచ్చింది. ఓ లైంగిక దాడి కేసులో అసాంజ్‌ను ప్రశ్నించేందుకు ఆయనపై యూరోపియన్ అరెస్టు వారెంటు ఒకటి జారీ అయింది. దాంతో ఆయనను స్వీడన్‌కు నేరగాళ్ల అప్పగింత ఒప్పందంపై పంపాలని బ్రిటన్ భావిస్తోంది. స్వీడన్ నుంచి తనను అమెరికాకు పంపుతారని స్వతహాగా ఆస్ట్రేలియాకు చెందినర అసాంజ్ ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అమెరికాకు పంపితే, అక్కడి అధికారిక రహస్యాలను బయటపెట్టినందుకు ఆయనకు 35 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది. -
పిల్లాడికి 'వికీలీక్స్' పేరు పెట్టొద్దు!!
పిల్లాడికి ఇష్టమైన పేరు పెట్టాలన్నా కూడా తప్పేనా? అవునంటోంది జర్మనీ ప్రభుత్వం. అక్కడ ఓ జంట తమకు కొత్తగా పుట్టిన పిల్లాడికి వికీలీక్స్ అనే పేరు పెట్టాలనుకుంది. కానీ, ఆ పేరు పెట్టడానికి వీల్లేదంటూ ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. ఆ పేరు పెడితే భవిష్యత్తులో పిల్లవాడికి ప్రమాదం కలగొచ్చన్నది వారి అభ్యంతరం. ఇరాక్‌కు చెందిన హజర్ హమాలా అనే పాత్రికేయుడు జర్మనీలో ఉంటాడు. అతడు తన పిల్లాడికి జూలియన్ అసాంజ్ స్థాపించిన 'వికీలీక్స్' అనే పేరు పెట్టాలనుకున్నాడు. అయితే, మార్చి 14న పుట్టిన ఆ పిల్లాడికి ఆ పేరు పెట్టడానికి, రిజిస్టర్ చేయడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డుపడ్డారు. పిల్లల సంక్షేమానికి, భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని భావిస్తే ఆయా పేర్లను పెట్టకుండా అడ్డుకోవచ్చని అక్కడి జనన ధ్రువీకరణ అధికారులకు హక్కులు ఇచ్చారు. దాంతోనే ఇప్పుడు వికీలీక్స్ పేరును సదరు అధికారి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. -
సమాచార యోధుడికి ఖైదు
సంపాదకీయం: నిజం చెప్పడం నేరమైంది. ఇక్కడ సరిగా లేదని చెప్పడం ద్రోహమైంది. అమాయకుల్ని పొట్టనబెట్టుకుంటున్నారని వెల్లడించడం తప్పయింది. ఇరాక్, అఫ్ఘానిస్థాన్లలో అమెరికా సైన్యం సాగిస్తున్న యుద్ధ నేరాలపై ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేసిన అమెరికా సైనికుడు బ్రాడ్లీ మానింగ్‌కు అక్కడి సైనిక న్యాయ స్థానం బుధవారం 35 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అమెరికా రహస్యాలను బట్ట బయలు చేస్తున్న జూలియన్ అసాంజ్ నేతృత్వంలోని వికీలీక్స్‌కు అతను 7 లక్షల రహస్య పత్రాలు అందించాడని, యుద్ధక్షేత్రంలో జరిగిన ఘటనలకు సంబంధించి వీడియోలను, దౌత్యసంబంధమైన కేబుల్స్‌ను ఆ సంస్థకు చేరవేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వీటివల్ల అల్‌కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలకు దేశం రహస్యాలన్నీ తెలిసిపోయాయని, పర్యవసానంగా వాటినుంచి పెనుముప్పు ఏర్పడిందని అభియోగం మోపింది. తన చర్యల ద్వారా అతను శత్రువుకు సహకరించాడని పేర్కొంది. వికీలీక్స్‌కు ఇలాంటి పత్రాలన్నీ చేరవేసే సమయానికి మానింగ్ బాగ్దాద్‌లో సైనిక అనలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను బయటపెట్టిన పత్రాల్లో ఉన్న అంశాలు అసాధారణమైనవి. నాగరిక సమాజం ఏమాత్రం హర్షించలేనివి. ఇరాక్‌లోని అమెరికా బలగాలు 2007లో హెలికాప్టర్ నుంచి బాంబులు విసిరి రాయ్‌టర్స్ వార్తాసంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులతోసహా డజనుమంది సాధారణ పౌరులను చంపడానికి సంబంధించిన విడియోను మానింగ్ బయటపెట్టాడు. అఫ్ఘాన్‌లోని కాందహార్‌లో ఒక ప్రయాణికుల బస్సును చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరపడం, చెక్పోస్టులవద్దా, రహదారులపైనా పౌరులను హింసించడం, కాల్చిచంపడం, ఉన్మాదంతో కేరింతలు కొట్టడంవంటివి వెల్లడించాడు. ఏమీ జరగనట్టు, ఎరగనట్టు ఉండిపోతున్న అమెరికా ప్రభుత్వ తీరుపై కలత చెందాడు. ప్రపంచ ప్రజలకు ఇవన్నీ తెలిసేలా చేస్తే తప్ప ఈ అమానుషాలకు తెరపడదన్న నిర్ణయానికొచ్చాడు. మానింగ్‌కు పడిన శిక్ష ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్నలెన్నో! సైన్యమంటే ఉక్కు క్రమశిక్షణ కలిగి ఉండాలని, పైనుంచి వచ్చిన ఆదేశాలను పొల్లుపోకుండా పాటించడమే తప్ప ప్రశ్నించనేరాదని చాలా మంది నమ్ముతారు. సైనికులకు హృదయం కాక మెదడు మాత్రమే పనిచేయాలని, అలా చేస్తేనే అంకితభావంతో వ్యవహరించినట్టని విశ్వసిస్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్, ముసోలిని ఉన్మాద చర్యలను గేలిచేస్తూ చార్లీ చాప్లిన్ నిర్మించిన ‘గ్రేట్ డిక్టేటర్’ చిత్రం సైనికులను మరలుగా బతకొద్దని చెబుతుంది. మనుషులుగా ఆలోచించ మంటుంది. యుద్ధోన్మాదుల తరఫున పోరాడవద్దని ఉద్బోధిస్తుంది. సరిగ్గా మానింగ్ చేసింది అదే. తమ దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యమని, కనుక అది ఏం చేసినా సరైందే అవుతుందని అతను భావించలేదు. ఉగ్రవాదులనుంచి ఇరాక్, అఫ్ఘాన్ ప్రజల్ని రక్షిస్తామని అడుగుపెట్టిన తమ సైన్యమే ఉగ్రవాదిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సాధారణ సైనికుడిలా ఆదేశాలందిన వెంటనే ముందుకు ఉరకడం తప్ప మరేమీ ఆలోచించకపోతే మానింగ్ దేశం కోసం పోరాడిన ధీరుడిగా ప్రభుత్వ మన్ననలు అందుకొనేవాడేమో! కానీ, 23 ఏళ్ల వయస్సుకే అతను పరిణతి ప్రదర్శించాడు. తాము వచ్చింది దేనికో, చేస్తున్నదేమిటో, ప్రపంచానికి చెబుతున్నదేమిటోనన్న విచికిత్సలో పడిపోయాడు. తమ చర్యలను ప్రపంచానికి తెలియజెబితేతప్ప ఇది ఆగేలా లేదని విశ్వసించాడు. 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత అమెరికా సమాజం కరడుగట్టిందని, ‘నువ్వు మాతో లేకపోతే మా శత్రువుతో ఉన్నట్టేన’న్న బుష్ తాత్వికతను తలకెక్కించుకుని మీడియా మౌనం వహిస్తున్నదని గుర్తించలేకపోయాడు. అందుకే, మీడియా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతుందని, కనీసం అప్పుడైనా ఇరాక్, అఫ్ఘానిస్థాన్ ప్రజలపై సాగుతున్న అమానుషాలకు తెరపడుతుందనుకున్నాడు. తనకు తెలిసిన భోగట్టాను ‘వాషింగ్టన్ పోస్ట్’ వంటి పత్రికలకు అందజేశాడు. ఆ పత్రికలు నిరాసక్తత కనబరచడంతో గత్యంతరంలేక వికీలీక్స్‌కు అందజేశాడు. మానింగ్ చర్యలవల్ల అమెరికా ప్రజలకూ, అమెరికాకు సమాచారం అందించిన ఆయా దేశాల్లోని పౌరులకూ ముప్పు ఏర్పడిందని ప్రభుత్వం ఆరోపించింది. అనేక దేశాల్లో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాల్సివచ్చిందని, కొందరు రాజీనామాలు చేశారని తెలిపింది. అయితే, అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలనూ సమర్పించలేదు. తన చర్యలు దేశానికిగానీ, ప్రజలకుగానీ హాని కలిగించివుంటే పశ్చాత్తాపపడుతున్నానని అధ్యక్షుడు ఒబామాకు రాసిన లేఖలో మానింగ్ కూడా చెప్పాడు. ప్రజలకు సాయపడటమే తప్ప, ఎవరినైనా బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నాడు. దేశంపై ప్రేమతో, కర్తవ్యదీక్షతో ఈ పని చేశానన్నాడు. నిజానికి శిక్ష ఖరారుకు ముందే మానింగ్ దారుణ నిర్బంధాన్ని చవి చూశాడు. మూడేళ్ల నిర్బంధంలో దాదాపు పది నెలలు అతన్ని ఒంటరి ఖైదు చేశారు. నిద్రపోనీయకుండా గంటల తరబడి ప్రశ్నించారు. మానింగ్ జులాయి అయినట్టయితే, అతనికేమీ ఉన్నతాదర్శాలు లేనట్టయితే తనకు అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని కోట్లాది డాలర్లకు అమ్ముకునేవాడు. లేదా సైన్యం నుంచి తప్పుకున్నాక వాటి ఆధారంగా సంచలన గ్రంథాలు రాసి డబ్బు, ప్రచారం పొందేవాడు. అతను అదేమీ చేయలేదు. ప్రభుత్వం ఆరోపించినట్టు అతను దేశద్రోహి కాదు...ఉగ్రవాది అంతకన్నా కాదు. స్ఫటిక స్వచ్ఛమైన హృదయంతో, వజ్ర సదృశమైన సంకల్పంతో ఉన్నతమైన సమాజాన్ని కాంక్షించిన సమాచార యోధుడు. ఇప్పుడు మానింగ్ క్షమాభిక్ష కోరుతూ రాసిన లేఖ ఒబామా చేతిలో ఉంది. దాన్ని ఆమోదించి అమెరికాలో ఔన్నత్యం ఇంకా మిగిలే ఉన్నదని నిరూపిస్తారో, లేదో తేల్చుకోవాల్సింది ఆయనే. ఒబామా అలా వ్యవహరించేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ ప్రజానీకంపైనా, మరీ ముఖ్యంగా అమెరికా పౌరులపైనా ఉంది.