ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు వీకిలీక్స్ పేర్కొంది., ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్లోని వార్టస్ అనే సంస్థతో ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వార్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి...హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో జరిపిన మెయిల్స్ సంభాషణలను వికీలీక్స్ బయటపెట్టింది. సుమారు రూ.7.5 కోట్లు చెల్లించి ఈ పరికరాలను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్....తన కథనంలో పేర్కొంది. ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడిన తర్వాతే ఏపీ సర్కార్ ట్యాపింగ్ పరికరాల కోసం సంప్రదింపులు జరిపినట్లు, అత్యవసరంగా మొబైల్, మెయిల్స్ ట్రాక్ చేసే సదుపాయాలు కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది.