Indian Express
-
ప్రధాని మా ఇంటికి వస్తే తప్పేముంది: సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణపతి పూజ కోసం తన నివాసానికి రావడంలో తప్పేముందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రధాని రాకలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి అంశాల్లో రాజకీయవర్గాలు పరిణితిని కనబర్చాలని పేర్కొన్నారు. సీజేఐ నివాసానికి ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఆస్కారం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ‘గణపతి పూజ నిమిత్తం ప్రధాని మోదీ నా నివాసానికి వచ్చారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరిగే సమావేశాల్లో ఇదో భాగమే. రాష్ట్రపతి భవన్‌లోనూ, గణతంత్ర దినోత్సవం.. ఇలా పలు సందర్భాల్లో కలుస్తుంటాం. ప్రధాని, మంత్రులతో మాట్లాడతాం. మా మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుల ప్రస్తావన రాదు. సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలపై చర్చ జరగుతుంది’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు నిర్వహించిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు ప్రధాన వ్యవస్థల మధ్య సుహుృద్భావ చర్చలుగా తమ భేటీలను చూడాలని పేర్కొన్నారు. -
దేశాన్ని విడదీస్తోంది
న్యూఢిల్లీ: విద్వేషం, మత దురభిమానం, అసహనం వంటి చెడు ధోరణులు దేశాన్ని నానాటికీ విడదీస్తున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ఈ ధోరణికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే సమాజం తిరిగి బాగు చేయలేనంతగా పాడవటం ఖాయం. తరాల తరబడి కష్టించి నిర్మించుకున్న విలువలన్నింటినీ ఈ విద్వేషాగ్ని భస్మీపటలం చేస్తుంది’’ అని హెచ్చరించారు. ప్రజలే ముందుకొచ్చి ఈ విద్వేషపు సునామీని అడ్డుకోవాలని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన వ్యాసంలో ఆమె పిలుపునిచ్చారు. ఇదంతా బీజేపీ పాపమేనని ఆరోపించారు. ‘‘భారత్ శాశ్వతంగా విభజనవాదంలో కూరుకుపోవాల్సిందేనా? ప్రస్తుత పాలకులు దీన్నే కోరుకుంటున్నారు. వస్త్రధారణ, ఆహారం, విశ్వాసాలు, పండుగలు, భాష వంటి అన్ని విషయాల్లోనూ పౌరులను పరస్పరం ఉసిగొల్పుతున్నారు. చరిత్రను వక్రీకరించి మరీ రెచ్చగొడుతున్నారు. అప్పడే తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేరతాయని భావిస్తున్నారు’’ అంటూ బీజేపీని దుయ్యబట్టారు. అపారమైన వైవిధ్యానికి మన దేశం నిలయమని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ, ప్రజలను విడదీసేందుకు ఆ వైవిధ్యాన్ని కూడా వక్రీకరిస్తున్నారన్నారు. ‘‘మైనారిటీలపై దాడులకు దిగేలా ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్నారు. వారిలో దుందుడుకుతనాన్ని, మత విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారు. మన ఉన్నత విలువలకు, సంప్రదాయాలకు పాతరేస్తున్నారు. పైగా అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను ఉక్కుపాదంతో అణచేసే ప్రమాదకర ధోరణిని వ్యవస్థీకృతం చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల పైకి పూర్తిస్థాయిలో ఉసిగొల్పి వారిని నిత్యం వేధిస్తున్నారు. హక్కుల కార్యకర్తలను బెదిరించి నోరు మూయించజూస్తున్నారు. విద్వేషపు విషాన్ని, పచ్చి అబద్ధాలను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియాను ఇష్టానికి దుర్వినియోగం చేస్తున్నారు’’ అని వాపోయారు. భయం, మోసం, బెదిరింపులే మోదీ ‘ఆదర్శ పాలన’కు మూలస్తంభాలుగా మారాయంటూ నిప్పులు చెరిగారు. ‘ఎక్కడైతే భయోద్వేగాలుండవో...’ అంటూ విశ్వకవి టాగూర్ రాసిన గీతాంజలి కవితా పంక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరముందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ సంస్కృతి వ్యాప్తి చేస్తున్న విద్వేషాగ్నికి ప్రతి భారతీయుడూ మూల్యం చెల్లిస్తున్నాడని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. సోనియా వ్యాసాన్ని ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. -
Leander Paes- Mahesh Bhupathi: విభేదాల్లోనూ విజయాలు!
Leander Paes- Mahesh Bhupathi Web Series Break Point: వ్యక్తిగతంగా ఒకరితో మరొకరికి పడకపోయినా కోర్టులో దిగితే మాత్రం కలిసి కట్టుగా అద్భుత విజయాలు సాధించడం తమకే చెల్లిందని భారత టెన్నిస్ స్టార్లు లియాండర్ పేస్, మహేశ్ భూపతి నిరూపించారు. దశాబ్దానికిపైగా భారత టెన్నిస్ ముఖ చిత్రంగా ఉన్న వీరిద్దరు 1994–2006, 2008–2011 మధ్య డబుల్స్ జోడీగా చిరస్మరణీయ ప్రదర్శన చేశారు. 1999లో జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్)నూ పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు చేరిన ఈ జంట... ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ల్లో విజేతలుగా నిలిచింది. అనంతరం 2001 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ జోడి మరోసారి చాంపియన్‌గా నిలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో వీరిని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అంటూ భారతీయులు కీర్తించారు. అయితే ఈ గొప్ప ఘనతలు సాధించే సమయంలో తమ మధ్య సఖ్యత లేదని వీరు వ్యాఖ్యానించారు. అయినా ఏదో తెలియని సోదరభావం తమని కలిసి ఆడేలా చేసిందని వీరు పేర్కొన్నారు. పేస్, భూపతిల ఆట, అనుబంధం, స్పర్ధలు, గెలుపోటములు... ఇలా ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని పలు ఆసక్తికర అంశాలతో ‘బ్రేక్ పాయింట్’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. దీనికి సంబంధించిన ట్రయిలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేస్, భూపతి అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. అశ్విని అయ్యర్ తివారి, నితీశ్ తివారిల దర్శకత్వంలో రూపొందిన ‘బ్రేక్ పాయింట్’ ‘జీ5’ ఓటీటీలో అక్టోబర్ 1న విడుదల కానుంది. -
'సెకండ్ వేవ్ ప్రభావం అప్పటి వరకు కొనసాగుతుంది'
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నెమ్మదించినట్లు కనిపిస్తోందని, అయితే, పూర్తిగా కిందకు దిగిరావడానికి మరింత సమయం పడుతుందని ప్రముఖ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్ పేర్కొన్నారు. రెండో వేవ్ ప్రభావం జూలై వరకు కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కొంతవరకు కొత్త వేరియంట్లు కారణం కావచ్చన్నారు. కానీ, ఈ అనువర్తిత వేరియంట్లు మరింత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు లేవన్నారు. జమీల్ ప్రస్తుతం అశోక యూనివర్సిటీలో త్రివేదీ స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ డైరెక్టర్‌గా ఉన్నారు. రెండో వేవ్ అత్యంత తీవ్ర స్థాయికి చేరిందని ఇప్పుడే అంచనా వేయడం తొందరపాటు అవుతుందని జమీల్ పేర్కొన్నారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సంస్థ మంగళవారం నిర్వ హించిన ఒక ఆన్లైన్ కార్యక్రమంలో వైరాలజిస్ట్ జమీల్ పాల్గొన్నారు. రెండో వేవ్‌లో కేసుల సంఖ్యలో తగ్గుదల కూడా మొదటి వేవ్ తరహాలో క్రమ పద్దతిలో ఉండదని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కోవిడ్ మరణాల డేటా కూడా తప్పేనని, అది ఎవరో కావాలని చేస్తోంది కాదని, మరణాలను గణించే విధానమే లోపభూయిష్టంగా ఉందని వివరించారు. డిసెంబర్ నాటికి కేసుల సంఖ్య భారీగా తగ్గిందని, దాంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని వివరించారు. పెళ్లిళ్లు, ఎన్నికల ర్యాలీ లు, మత కార్యక్రమాలు వైరస్ వ్యాప్తిని పెంచాయన్నారు. టీకాల వల్ల దుష్పరిమాణాలు వస్తాయన్న వార్తలు ప్రజలను భయపెట్టాయని, వ్యాక్సిన్లు సురక్షితమైనవని స్పష్టం చేశారు. చాలా దేశాలు చాలా ముందుగానే, ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్లను బుక్ చేసుకోగా.. భారత్ ఆ విషయంలో వెనుకబడిందన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేందుకు జనాభాలో కనీసం 75% మందికి ఇన్ఫెక్షన్ రావడం కానీ, వ్యాక్సిన్ ఇవ్వడం కానీ జరగాలన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల కంటే ముందున్న వైఎస్ జగన్
-
కృష్ణారావుకు తాపీ ధర్మారావు పురస్కారం
విశాఖపట్నం: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు (కృష్ణుడు)కు తాపీ ధర్మారావు పురస్కారం వరించింది. ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగే ఓ కార్యక్రమంలో కృష్ణారావు ఈ అవార్డును స్వీకరించనున్నారు. కృష్ణారావు ఇంతకుముందు పలు తెలుగు దిన పత్రికల్లో పనిచేశారు. -
బండారం బయటపెట్టిన వికీలీక్స్
-
బండారం బయటపెట్టిన వికీలీక్స్
హైదరాబాద్ : ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న చంద్రబాబు నాయుడు సర్కార్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించినట్లు వీకీలీక్స్ బయటపెట్టిందంటూ 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ఓ కథనం ప్రచురించింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు వీకిలీక్స్ పేర్కొంది., ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్‌లోని వార్టస్ అనే సంస్థతో ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వార్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి...హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో జరిపిన మెయిల్స్ సంభాషణలను వికీలీక్స్ బయటపెట్టింది. సుమారు రూ.7.5 కోట్లు చెల్లించి ఈ పరికరాలను కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్....తన కథనంలో పేర్కొంది. ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడిన తర్వాతే ఏపీ సర్కార్ ట్యాపింగ్ పరికరాల కోసం సంప్రదింపులు జరిపినట్లు, అత్యవసరంగా మొబైల్, మెయిల్స్ ట్రాక్ చేసే సదుపాయాలు కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ మెయిళ్లు, సెల్ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాప్ట్‌వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు పది లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో భాగంగానే చంద్రబాబు సర్కారు భాగోతం వెలుగు చూసింది. -
ఇక వారం వారం ‘జాతిహితం’
దేశంలోని అత్యుత్తమ శ్రేణి పాత్రికేయుల్లో ఒకరిగా లబ్ధప్రతిష్టుడైన శేఖర్‌గుప్తా ఇకపై ప్రతి శనివారం వర్తమాన సామాజిక, రాజకీయ పరిణామాలపై ‘సాక్షి’ పాఠకులతో తన ఆలోచనలనూ, అభిప్రాయాలనూ పంచుకుంటారు. శేఖర్‌గుప్తా పందొమ్మిదేళ్లపాటు జాతీయ దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించి, ప్రస్తుతం ‘ఇండియా టుడే’ గ్రూప్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి వారం ఎన్డీటీవీలో ‘వాక్ ది టాక్’ పేరిట విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత శేఖర్‌గుప్తా కాలమ్ ‘జాతిహితం’ -
లెన్స్ అండ్ లైఫ్
రావూరి కోటేశ్వరరావు... తండ్రి రావూరి భరద్వాజ జాడలను అనుసరించినా అడుగులేసింది మాత్రం సొంతదారిలోనే! తండ్రి సాహితీసేద్యం ఆయనకు స్ఫూర్తిగా నిలిచినా సొంత చిరునామా ఏర్పర్చుకుంది ఛాయా చిత్ర విన్యాసంతోనే! ఆర్వీకేగా సుప్రసిద్ధుడైందీ ఆ కళతోనే! ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా సేవలందిస్తున్న ఆయన తీసిన ఓ బెస్ట్ ఫొటోగ్రాఫ్ మీదే నేటి ‘లెన్స్ అండ్ లైఫ్’ ఫోకస్.. సందర్భం.. ఓల్డ్‌సిటీలో ఘర్షణ. ఈ ఫొటోలో ఎడమవైపు కొందరు వ్యక్తులున్నారు. పొగమాటున మక్కా మసీదు. ఆ పొగ.. టియర్ గ్యాస్. ఇటువైపు పోలీసుల లాఠీచార్జి.. దాదాపు గంటన్నర సేపు ఘర్షణ సాగింది. అల్లరి మూకను నిలువరించడానికి చివరకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. పోలీసులకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఈ బుర్ఖా పర్సన్.. అమ్మాయి కాదు. అబ్బాయి! అప్పటిదాకా గుంపులో ఒకడిగా రాళ్లురువ్విన ఈ వ్యక్తి.. తర్వాత బుర్ఖావేసుకొని టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులతో ‘ఇక్కడున్న వాళ్లమంతా అమాయకులం.. టియర్ గ్యాస్ ఆపేయండి’ అని చెబుతున్నాడు. యాంగిల్.. అప్పుడంతా మాన్యువల్ కెమెరాలే. ఫిల్మ్ కెమెరాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకోవాల్సి వచ్చేది. దీన్ని పోలీసుల వెనకాల ఉండి కాప్చర్ చేశాను. ఎదురుగా రాళ్లదాడి.. పోలీసుల వెనకాల ఉంటే కాస్త ప్రొటెక్షన్. అప్పటికీ తలకి హెల్మెట్ పెట్టుకున్నాను. కెమెరాకు రాళ్ల దెబ్బ తగలకుండా దాన్ని కాపాడుకుంటూ.. అనుకున్న ఫ్రేమ్ మిస్సవకుండా లెన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫొటోకి లైఫ్ ఇచ్చాను. టెక్నికల్ యాస్పెక్ట్స్.. ఈ ఫొటోకి నేను వాడిన కెమెరా నికాన్ ఎఫ్ఎమ్2. లెన్స్ 80 ౌ్ట 200ఝఝ. షట్టర్ స్పీడ్ 125, అపర్చర్-8, సింగిల్ ఫిల్మ్ స్పీడ్ 400 అఅ(అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్). అంతా మాన్యువలే కాబట్టి లైట్ ఎంతపడాలో కూడా మాన్యువల్‌గానే అడ్జస్ట్ చేసుకొని ఫొటో తీశాను. కాంప్లిమెంట్ ఈ ఫొటో తెల్లవారి మొదటిపేజీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్)లో ఫైవ్ కాలమ్స్‌లో డిస్ప్లే చేశారు. అంత కష్టానికి తగిన ఫలితం అది. ఆ ఫొటో చూసుకునేసరికి ముందురోజు నేను పడిన కష్టమంతా పోయినట్టనిపించింది. ఆ కష్టానికి కానుకన్నట్టుగా వరల్డ్ ఫొటోగ్రఫీ డే నాడు నా ఈ ఫొటోకి స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. ఇన్నేళ్ల నా కెరీర్లో ఎన్నో ఫొటోలు తీశాను. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్స్‌గా నిలిచింది. -
గురవింద కేజ్రీవాల్
కాంగ్రెస్ మద్దతుతో తాను ఢిల్లీ రాష్ట్రానికి యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి అయినట్టే, మే మాసంలో ఆ కాంగ్రెస్ మద్దతుతోనే నిబిడాశ్చర్యం నింపుతూ ప్రధాని పదవిని కూడా చేపట్టవచ్చునన్న భ్రమలో కేజ్రీవాల్ కొట్టుమిట్టాడుతున్నారు. పత్రికా రచయితలని జైలుకు పంపిన ఆఖరి భారత రాజకీయవేత్త ఇందిరాగాంధీయే. కేవలం ఒక్క పత్రికా రచయితే అని కాదుగానీ, అలా జైలుకు వెళ్లిన వారిలో రామ్‌నాథ్ గోయెంకా యాజమాన్యంలోని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు చెందిన కులదీప్ నయ్యర్ చాలా ప్రముఖులు. ఆమె తన అధికారాన్ని రక్షించుకోవడానికి 1975లో ఎమర్జెన్సీ విధించి, ఆ కారణాన్ని చూపించే నయ్యర్‌ను కారాగారానికి పంపారు. 1977 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి, ఇలాంటి నియంతల పట్ల తమ అభిప్రాయం ఏమిటో భారతీయ ఓటర్లు దీటుగా చెప్పారు. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు అలాంటి రాజకీయవేత్త - అరవింద్ కేజ్రీవాల్ - వచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక భారీ సంఖ్యలో పత్రికా రచయితలకి జైలు తలుపులు తీయిస్తానని హామీ ఇచ్చారు. ఎందుకంటే భారతీయ పత్రికా రచయితలంతా అమ్ముడు పోయినందుకట. అయితే దర్యాప్తు తరువాతే వాళ్లని జైలుకు పంపుతానని కూడా భరోసా ఇచ్చారు. కానీ తన తీర్పు పట్ల ఎలాంటి సందేహానికీ తావు లేదన్నట్టు, తను విధించబోయే శిక్షలో ఉండే తీవ్రతలో ఎలాంటి రాజీ లేదన్నట్టే చెప్పారు. రాజకీయవేత్తలందరిలాగే వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ తాను అలా అనలేదని యథాప్రకారం కేజ్రీవాల్ అన్నారు. తనని తాను అతిగా ఊహించుకోవడం ద్వారా వచ్చిన, అదికూడా సౌకర్యంగా ఉండే మరపు రోగంతో కేజ్రీవాల్ బాధపడుతూ ఉండి ఉండాలి. గడచిన డిసెంబర్ మాసం శీతకాల మధ్యాహ్న వేళ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు టీవీలలో వినిపించిన జయజయ ధ్వానాలు, పత్రికల నిండా పరుచుకున్న అభినందన పరంపరలని కేజ్రీవాల్ మరచిపోయారు. ఇప్పుడు ఉన్నదీ ఆ పత్రికా రచయితలే. మీడియా సంస్థల అధిపతులు కూడా అప్పటివారే. ఇక మారినది ఏదీ అంటే లోలోపలి కేజ్రీవాలే. ఆ కేజ్రీవాలే ఇప్పుడు కనిపిస్తున్నాడు. కేజ్రీవాల్ ఆకాంక్షల స్థాయిలో కాకుండా, ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం చాలా ఇరుకుగా కనిపించడంతో ఆయనలో ఆ మార్పు సంతరించుకోవడం మొదలయింది. కాంగ్రెస్ మద్దతుతో తాను ఢిల్లీ రాష్ట్రానికి యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి అయినట్టే, మే మాసంలో ఆ కాంగ్రెస్ మద్దతుతోనే నిబిడాశ్చర్యం నింపుతూ ప్రధాని పదవిని కూడా చేపట్టవచ్చునన్న భ్రమలో కేజ్రీవాల్ కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీ అంగరంగ వైభవంగా నిర్వర్తించవలసిన బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదన్న నమ్మకంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను భ్రష్టు పట్టించే బృహత్కార్యాన్ని కేజ్రీవాల్ నెత్తికెత్తుకున్నారు. అందుకే పాపం, రాబర్ట్ వాద్రా (రాహుల్ గాంధీ బావగారు) కేజ్రీవాల్ దృష్టి పథం నుంచి నిష్ర్కమించారు. భూ కుంభకోణాల నుంచి రాహుల్‌ను రక్షించిన ఉన్నతోద్యోగి హర్యానాలో కేజ్రీవాల్ పార్టీ ఆమ్ఆద్మీ తరఫు అభ్యర్థి కూడా అయ్యాడు. కేజ్రీవాల్ ప్రత్యర్థుల వ్యవహారాలలో దుర్భిణీ వేసి చూసినట్టే ఆయన పార్టీలోని జగడాల గురించి కూడా జర్నలిస్టులు అదే ఉత్సుకతతో వెతికారు. ప్రభుత్వేతర సంస్థల విరాళాలు, కేజ్రీవాల్ శిబిరంలోని సీనియర్ల మీద ఆరోపణలకు సంబంధించిన కథనాలు ఉన్నాయి. సచ్ఛీలత గురించి ప్రచారం చేసే పార్టీని ఇలాంటివన్నీ ఇరుకున పెడతాయి. అలాగే మీడియాలో మోడీకి లభిస్తున్న విస్తృత ప్రచారం చూసి కూడా కేజ్రీవాల్ నైరాశ్యానికి గురయ్యారు. ఎన్నికల వేళ నిగ్రహం ఒత్తిడికి గురౌతూ ఉంటుంది. ఆగ్రహంతో ఉన్న నాయకుడు సమాచార సేకర్తను తుద ముట్టించాలన్న కాంక్షకి లోనవుతూ ఉంటాడు. అయితే ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇలాంటి నిర్ణయానికి రావడం నేరం. వాళ్ల విశ్వసనీయతని వారే దెబ్బ తీసుకోవడం మినహా దీనితో ఒరిగేదేమీ ఉండదు. ఇక్కడే కేజ్రీవాల్ బుర్రకు పదును పెట్టాలి. భారతీయ మాధ్యమాలన్నీ కూడా అమ్ముడు పోతే ఏ ప్రభుత్వానికీ కూడా సమస్యలనేవే ఉండవు. అలాగే ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో, ఏదో ఒక అంశం ప్రాతిపదికగానో భారతీయ మీడియా అంతా ఏకమైపోతోందని నమ్మడం ఇంకా వికృతమైన ఆలోచన. ఇలా చెప్పడం అంటే భారతీయ మాధ్యమం నిత్యం ఉదయాన్నే పుణ్య తీర్థాలలో స్నానమాచరించాలని కాదు. ‘‘ఎన్నికల సమయంలో ‘పెయిడ్ న్యూస్’ (అమ్మకానికి వార్తా స్థలం) బెడద నివారణకు భారత ఎన్నికల సంఘం అందరికీ ఆమోదయోగ్యమైన కొన్ని చర్యలు చేపట్టింది’’ అంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ పత్రికా సంపాదకులకి ఒక లేఖ రాశారు. దేశంలో ఉన్న పత్రికా రచయితలంతా లేదా మీడియా సంస్థల అధిపతులంతా దేవతలేమీ కాదు. వార్తా సేకరణకీ, వ్యాపార ప్రకటనల సేకరణకీ మధ్య విభజన రేఖని చెరిపేసినందుకు కొందరిని సత్కరించాలి. కానీ గుజరాత్ ఆర్థిక వ్యవస్థ గురించి దేశ వ్యాప్తంగా వివిధ సంస్థలు ఇచ్చిన వార్తా కథనాలు, విద్యా సంస్థలు ఇచ్చిన వివరాలు ఏవీ కూడా పెయిడ్ న్యూస్ కాదు. ఇలాంటి కథనాలు, వివరాలు ఇవ్వడం ఎన్నికల నేపథ్యంలో మొదలయినది కూడా కాదు. పత్రికల సంపాదకులకు భారత ఎన్నికల కమిషనర్ రాసిన లేఖ ప్రతిని కేజ్రీవాల్ పూర్తిగా చదవడం అవసరం. ‘మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థకు పునరుత్తేజం కల్పించడంలో భారత మాధ్యమాలు నిర్వహించిన అసమానమైన పాత్రకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ’నే అంటూ మొదటి పేరాలో ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు. అలాగే ‘విశ్వసనీయతకు ప్రతీకగా ఉన్న ప్రతి ఎన్నికల సమయంలోను కూడా కమిషన్ తన బాధ్యతను నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి సహకరించినందుకు గాను’ కూడా ఆయన మీడియాకు కృతజ్ఞత ప్రకటించారు. భారత మాధ్యమాలు దేశప్రజల మద్దతు కలిగి ఉన్నాయి. ఎందుకంటే, ఏవో కొన్ని సందర్భాలలో రేగిన రచ్చ మినహాయిస్తే, అవి నిర్వర్తించవలసిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాయి. కేజ్రీవాల్ ఇక్కడ మీడియా మీద గుప్పించిన ఆరోపణలు కొత్త కాదు. ఇతర దేశాలలో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఒక అభ్యర్థి విజయాన్ని లేదా అపజయాన్ని గురించి ఆసత్య ప్రచారం నిర్వహించడాన్ని అరికడుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒహియో రాష్ట్రం ఒక చట్టం తీసుకు వచ్చిందని ‘ది ఎకనమిస్ట్’ నివేదించింది. అంటే దీనర్థం అమెరికాకు చెందిన ప్రతి పత్రికా రచయిత దోషి అని కాదు. అబద్ధారోపణలు చేసిన వారి మీద, అలాంటివి ప్రచురించిన వారి మీద మాత్రమే ఆ చట్టం చర్యకు ఆదేశిస్తున్నది. ప్రత్యర్థుల శీల హననమే ధ్యేయంగా రాజకీయవేత్తలు చేస్తున్న ప్రకటనలే అమెరికా ప్రజాస్వామ్యానికి శిలాక్షరాలుగా మారిపోతున్నాయని వాదిస్తూ ఆ దేశ ప్రముఖ వ్యంగ్య రచయిత పీజే ఒరౌర్కే అక్కడి సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ గమనించి ఉండకపోవచ్చు. అవసరమైనప్పుడు కులదీప్ నయ్యర్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తీక్షణంగా ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) ఎంజే అక్బర్ -
పాతికేళ్ల దాసి
తెలుగులో ఇదొక స్పెషల్ కేటగిరీ సినిమా. సమాంతర చిత్రాలు తీయడంలో మనకూ ఓ మొనగాడు ఉన్నాడని గర్వంగా చెప్పుకునేలా చేసిన సినిమా. విశాలమైన గడీల్లోని ఇరుకుతనాన్ని, ఆ వెలుతురులో ఇరుక్కున్న చీకటిని నగ్నంగా ఆవిష్కరించిన సినిమా. బి.నరసింగరావు చేసిన ఈ సెల్యులాయిడ్ సృజనకు ఇప్పుడు పాతికేళ్లు నిండాయి.‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆఫీస్. బి.నరసింగరావుని ఫేమస్ జర్నలిస్ట్ జి.కృష్ణ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ‘మా భూమి’ నిర్మాతగా, ‘రంగుల కల, ది సిటీ (డాక్యుమెంటరీ), ‘మావూరు (డాక్యుమెంటరీ) దర్శకునిగా నరసింగరావు పేరు మార్మోగిపోతున్న సమయమది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కూర్చుని సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకోసాగారు. జి.కృష్ణ తను ఒకప్పుడు గద్వాల్ సంస్థానానికి వెళ్లినప్పటి అనుభవాలు చెప్పసాగారు. ఆ గడీలో ఆయనకో స్పెషల్ రూమ్ ఇచ్చారట. ఓ అందమైన అమ్మాయి నీళ్లు తీసుకువచ్చి కాళ్లు కడగబోయిందట. జి.కృష్ణ కంగారుపడి ‘‘ఇదేంటి!’’ అనడిగారట. ‘‘ఇక్కడకు వచ్చినవాళ్లు మాతో చాలా చేయించుకుంటారు. మీరు కాళ్లు కడిగించుకోవడానికే ఇబ్బంది పడిపోతారేంటి?’’ అందట. ఆమె ఒక దాసి. ఈ ఇన్సిడెంట్ బి.నరసింగరావుని చాలా రోజులపాటు వెంటాడింది. నరసింగరావు ఇంట్లో కూడా దాసీలు ఉండేవారు. అయితే వారిని గౌరవంగానే చూసేవారు. తల్లి దగ్గరకు వెళ్లి ఈ దాసీ వ్యవస్థ గురించి ఆరా తీశారు. కొన్ని నెలల తర్వాత... బొంబాయిలో ఉన్న స్నేహితుని దగ్గర్నుంచీ ఓ టెలిగ్రామ్ వచ్చింది. ‘‘ఫలానా వాళ్లు సినిమా చేయాలనుకుంటున్నారు. డెరైక్టర్ గురించి సెర్చ్ చేస్తుంటే నీ పేరు రికమెండ్ చేశాను. రెండ్రోజుల్లో వాళ్లకు స్టోరీ ఐడియా చెప్పాలి’’ అనేది ఆ టెలిగ్రామ్ సారాంశం.రెండ్రోజుల్లో కథ ఎలా? నరసింగరావు ఆలోచనలో పడ్డారు. ఆ సాయంత్రం కవి దేవీప్రియతో బోట్ క్లబ్లో స్టోరీ సిట్టింగ్‌కి కూర్చున్నారు. ఏ ఐడియా తట్టలేదు. ఇక బయలుదేరదామనుకుంటున్న సమయంలో నరసింగరావుకి ‘దాసి’ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. రచయిత కె.ఎన్.టి.శాస్త్రిని తెలంగాణ మారుమూలల్లోకి వెళ్లి దాసీలను ఇంటర్వ్యూలు చేసి తీసుకు రమ్మని పురమాయించారు. తీరా ఇంటర్వ్యూలు చూసి నరసింగరావు షాక్. తానేదో ఓ పరిధిలో ఊహిస్తే, అంతకుమించి డెప్త్‌తో చాలా వేదనాభరితంగా, దారుణాతి దారుణంగా ఉన్నాయి దాసీల గాథలు. సాదాసీదా వ్యవహారం కాదని అర్థమైపోయిందాయనకు. బోలెడంత రీసెర్చ్ చేయాల్సిన పరిస్థితి. తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన సమయంలో... వాళ్లకి సహాయకులుగా జాగిర్దార్లు ఉండేవాళ్లు. వాళ్ల కింద ఊరికో దొర పెత్తనం. ఆ దొరల దయాదాక్షిణ్యాల మీదే ప్రజల బతుకులు. దొరగారికి పెళ్లయితే, వధువు వెంట తోడులాగ, తోకలాగా ఓ దాసీ వస్తుంది. ఇంటిపని, వంట పని, చివరకు వంటి పని కూడా చేయాల్సిందే. అడిగినవారికి అడిగిందల్లా ఇవ్వడమే దాసీ పని. 24 గంటలూ అంతే. విశ్రాంతిలేని జీవితం. కఠిన కారాగారవాసం. నిజంగా ఏ జన్మలోనో చేసుకున్న పాపం. అలాంటి ఓ దాసీ కథ ఇది. పేరు కమలాక్షి.ఫైనల్‌గా స్క్రిప్ట్ రెడీ. ఆ తర్వాత మరో యజ్ఞం మొదలు. ‘దాసి’గా ఎవరు బావుంటారు? అన్వేషణ మొదలైంది. అప్పుడే నేషనల్ అవార్డులు అనౌన్స్ చేశారు. బాలూ మహేంద్ర డెరైక్ట్ చేసిన తమిళ సినిమా ‘వీడు’లో యాక్ట్ చేసిన ‘అర్చన’కు ఉత్తమ నటి అవార్డు. ఆమె ఫొటో చూడగానే ‘దాసి’ పాత్రకు తనే కరెక్ట్ అనిపించింది. ఇలాంటి సినిమాలంటే అర్చనకు ఒకటే హుషారు. తను రెడీ.ఈ సినిమాకి నిర్మాత కాని నిర్మాత ఎవరంటే - హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం. 85 శాతం ఫైనాన్స్ వాళ్లదే. ఫస్ట్ దూరదర్శన్‌లోనే ప్రసారమయ్యాకే, రిలీజ్‌లూ గట్రా. అదీ అగ్రిమెంట్. నల్గొండ జిల్లాలో చింతపల్లి అనే ఊళ్లో ఓ గడీ ఉంది. గడీ అంటే దొర నివాస భవనం అన్నమాట. సినిమా అంతా అక్కడే షూటింగ్. ఖర్చు పదకొండున్నర లక్షలు. దీనికి మ్యూజిక్కూ నరసింగరావే. ‘దాసి’ పక్కాగా ముస్తాబయ్యింది. ఫైనల్ అవుట్‌పుట్ చూశాక ఇదేదో తన కెరీర్‌ని మలుపు తిప్పుతుందని నరసింగరావుకి అర్థమైపోయింది. జాతీయ అవార్డులకు పంపించారు. హిందీ, బెంగాలీ, మలయాళీ సినిమాలన్నింటినీ పక్కకు నెట్టేసి విజేతగా వెలిసింది ‘దాసి’. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా అయిదు అవార్డులు. 1989 ఉత్తమ ప్రాంతీయ చిత్రం... ఉత్తమ నటి (అర్చన)... ఉత్తమ ఛాయాగ్రహణం (ఎ.కె.బీర్)... ఉత్తమ కళాదర్శకత్వం (వైకుంఠం)... ఉత్తమ వస్త్రాలంకరణ (సుదర్శన్). తెలుగు సినిమా పంట పండింది. మనసు నిండింది. ఎప్పుడూ చూడలేదు ఇన్ని అవార్డులు. మళ్లీ చూస్తామోలేదో కూడా తెలీదు. పండగే పండగ. ‘దాసి’కి ప్రశంసల వెల్లువ. అటు నేషనల్ వైడ్. ఇటు ఇంటర్నేషనల్ వైడ్. ఎక్కడ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరిగినా ‘దాసి’ ఉండి తీరాల్సిందే. దాదాపు 20 ఫెస్టివల్స్‌లో ‘దాసి’ హవా నడిచింది. దూరదర్శన్‌లో ‘దాసి’ ప్రసారమైనప్పుడు చూడాలి... అంతా టీవీల ముందే.అసలు దాసిగా అర్చన నటనకు వందకు నూటయాభై మార్కులు వేసి తీరాల్సిందే! అంతకన్నా గొప్పగా ఎవ్వరూ చేయలేరన్నట్టుగా చేసిందామె. మిగతా ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ ప్రాణం పెట్టేశారు. ఈ చిత్రానికి అసలు హీరో నరసింగరావే. ఇలాంటి కథ ఎంచుకోవడమే రిస్కు అనుకుంటే, ఈ తరహాలో తీయడం మహా మహా రిస్కు. స్పైసీగా, చాలా బీభత్సంగా ఉండే దృశ్యాలను కూడా కళాత్మకంగా తీశారాయన. అసలు కొన్ని కొన్ని సీన్లు అయితే ఎక్స్ట్రార్డినరీ. దాసి నెల తప్పుతుంది. దొర భార్య గర్భం తీయించుకోమని ఆజ్ఞ ఇస్తుంది. దొర చెల్లెలు గర్భవతి అయిన సందర్భంగా పండగ జరుగుతుంటే, ఇటేమో కమలాక్షి గర్భ విచ్ఛిత్తి. బాధ భరించలేక కేకలు పెడుతుంది. ఆ కేకలన్నీ ఆ సంబరంలో కలగలిసిపోతాయి. దాసీల కన్నీళ్ల వెనుక ఉన్న రక్తపాతాన్ని, గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతాన్ని చాలా అద్భుతంగా ఒడిసిపట్టి 24 ఫ్రేముల్లో నింపారు. సినిమాలో ఎక్కడా అతి కనపడదు. మెలోడ్రామా ఉండదు. ఓ గడీలో కెమెరా పాతేసి తీసినంత లైవ్లీగా అనిపిస్తుంది. ఈ ఒక్క సినిమా చాలు... నరసింగరావు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడానికి. ఒక్కటి మాత్రం నిజం... ‘దాసి’లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. ‘‘ ‘దాసి’ నెగటివ్ పాడైపోయింది. దాన్ని రిస్టోర్ చేసే పనిలో ఉన్నాను. చాలా లక్షలు ఖర్చవుతున్నాయి. శాటిలైట్ చానెల్స్‌లో ప్రసారం చేసే ఆలోచన ఉంది. గుల్జార్లాంటి వాడే ఈ సినిమా వీడియో తన లైబ్రరీలో పెట్టుకున్నాడు. వాళ్లమ్మాయి ఆ వీడియో పోగొడితే, నాకు ఫోన్ చేసి మళ్లీ తీసుకెళ్లారు’’. - బి.నరసింగరావు - పులగం చిన్నారాయణ