లెన్స్ అండ్ లైఫ్ | The Government has given First Prize for that photo | Sakshi
Sakshi News home page

లెన్స్ అండ్ లైఫ్

Published Sun, Sep 21 2014 1:10 AM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

లెన్స్ అండ్ లైఫ్ - Sakshi

లెన్స్ అండ్ లైఫ్

రావూరి కోటేశ్వరరావు... తండ్రి రావూరి భరద్వాజ జాడలను అనుసరించినా అడుగులేసింది మాత్రం సొంతదారిలోనే! తండ్రి సాహితీసేద్యం ఆయనకు స్ఫూర్తిగా నిలిచినా సొంత చిరునామా ఏర్పర్చుకుంది ఛాయా చిత్ర విన్యాసంతోనే! ఆర్‌వీకేగా సుప్రసిద్ధుడైందీ ఆ కళతోనే!  ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో చీఫ్ ఫొటోగ్రాఫర్‌గా సేవలందిస్తున్న ఆయన తీసిన ఓ బెస్ట్ ఫొటోగ్రాఫ్ మీదే నేటి ‘లెన్స్ అండ్ లైఫ్’ ఫోకస్..
 
సందర్భం.. ఓల్డ్‌సిటీలో ఘర్షణ. ఈ ఫొటోలో ఎడమవైపు కొందరు వ్యక్తులున్నారు. పొగమాటున మక్కా మసీదు. ఆ పొగ.. టియర్ గ్యాస్. ఇటువైపు పోలీసుల లాఠీచార్జి.. దాదాపు గంటన్నర సేపు ఘర్షణ సాగింది. అల్లరి మూకను నిలువరించడానికి చివరకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు. పోలీసులకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఈ బుర్ఖా పర్సన్.. అమ్మాయి కాదు. అబ్బాయి! అప్పటిదాకా గుంపులో ఒకడిగా రాళ్లురువ్విన ఈ వ్యక్తి.. తర్వాత బుర్ఖావేసుకొని టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులతో ‘ఇక్కడున్న వాళ్లమంతా అమాయకులం.. టియర్ గ్యాస్ ఆపేయండి’ అని చెబుతున్నాడు.

యాంగిల్..
అప్పుడంతా మాన్యువల్ కెమెరాలే. ఫిల్మ్ కెమెరాలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేసుకోవాల్సి వచ్చేది. దీన్ని పోలీసుల వెనకాల ఉండి కాప్చర్ చేశాను. ఎదురుగా రాళ్లదాడి.. పోలీసుల వెనకాల ఉంటే కాస్త ప్రొటెక్షన్. అప్పటికీ తలకి హెల్మెట్ పెట్టుకున్నాను. కెమెరాకు రాళ్ల దెబ్బ తగలకుండా దాన్ని కాపాడుకుంటూ.. అనుకున్న ఫ్రేమ్ మిస్సవకుండా లెన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఫొటోకి లైఫ్ ఇచ్చాను.

టెక్నికల్ యాస్పెక్ట్స్..
ఈ ఫొటోకి నేను వాడిన కెమెరా నికాన్ ఎఫ్‌ఎమ్2. లెన్స్ 80 ౌ్ట 200ఝఝ. షట్టర్ స్పీడ్ 125, అపర్చర్-8, సింగిల్ ఫిల్మ్ స్పీడ్ 400 అఅ(అమెరికన్ స్టాండర్డ్ అసోసియేషన్). అంతా మాన్యువలే కాబట్టి లైట్ ఎంతపడాలో కూడా మాన్యువల్‌గానే అడ్జస్ట్ చేసుకొని ఫొటో తీశాను.
 
కాంప్లిమెంట్
ఈ ఫొటో తెల్లవారి మొదటిపేజీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్)లో ఫైవ్ కాలమ్స్‌లో డిస్‌ప్లే చేశారు. అంత కష్టానికి తగిన ఫలితం అది. ఆ ఫొటో చూసుకునేసరికి ముందురోజు నేను పడిన కష్టమంతా పోయినట్టనిపించింది. ఆ కష్టానికి కానుకన్నట్టుగా వరల్డ్ ఫొటోగ్రఫీ డే నాడు నా ఈ ఫొటోకి స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో ఎన్నో ఫొటోలు తీశాను. ఇది వన్ ఆఫ్ మై బెస్ట్స్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement