జూలియన్‌ అసాంజ్‌ అరెస్టు?? | US prepares charges to seek arrest of Assange | Sakshi
Sakshi News home page

జూలియన్‌ అసాంజ్‌ అరెస్టు??

Published Fri, Apr 21 2017 8:52 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

జూలియన్‌ అసాంజ్‌ అరెస్టు?? - Sakshi

జూలియన్‌ అసాంజ్‌ అరెస్టు??

న్యూయార్క్‌: వీకీలీక్స్‌ స్థాపకుడు, ప్రఖ్యాత విజిల్‌ బ్లోయర్‌ జూలియన్‌ అసాంజ్‌ అరెస్టుకు మరోసారి అమెరికా రంగం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అభియోగాలు ఖరారు చేస్తున్నది. 2010లో అసాంజే, వీకీలీక్స్‌ అమెరికాకు చెందిన అనేక సైనిక రహస్యాలను వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి అమెరికా ఆర్మీ నిఘా నిపుణుడు చెల్సియా మన్నింగ్‌ దొంగలించిన రహస్య పత్రాలను వీకీలీక్స్‌ వెలుగులోకి తెచ్చింది.

ఇలా దేశ రహస్యాలను వెలుగులోకి తెచ్చినందుకు అసాంజ్‌ ను చట్టపరంగా శిక్షించవచ్చా? లేదా? అన్నది మొదట తర్జనభర్జన పడ్డ అమెరికా అధికారులు ఇప్పుడు చట్టపరంగా ఆయనను అరెస్టు చేయవచ్చునని నిర్ధారణకు వచ్చారు. లక్షలాది సైనిక రహస్య పత్రాలను లీక్‌చేసిన ఎన్‌ఎస్‌ఏ మాజీ విశ్లేషకుడు ఎడ్వర్డ్‌ స్నోడన్‌ వెనుక కూడా ఉన్నది అసాంజ్ అని నిర్ధారణకు వచ్చిన అమెరికా అధికారులు.. ఇక  ఆయన కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని, అసాంజే అరెస్టుకు వీలుగా అభియోగాలు ఖరారును వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement