
లండన్: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి వివరాలతో పాటు పలు సంచలన రహస్యాలు బహిర్గతం చేసిన వికీలిక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజెకు యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కోర్టులో ఊరట లభించింది.అసాంజెను అమెరికాకు అప్పగించాలని కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లొచ్చని లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ తాజాగా తీర్పు చెప్పింది. తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది.
తదుపరి విచారణలో గనుక అసాంజెను ఎందుకు అప్పగించాలో సంతృప్తికర కారణాలు అమెరికా చెప్పలేకపోతే అసాంజె అప్పగింత విషయంలో కోర్టు మళ్లీ మొదటి నుంచి కేసు విచారిస్తుంది. దీంతో అసాంజె అప్పగింత సుదీర్ఘంగా వాయిదాపడే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్‌పై అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన పత్రాలను లీక్‌చేశారని అసాంజెపై అమెరికాలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసమే అసాంజెను అప్పగించాలని అమెరికా కోరుతోంది.
ఇదీ చదవండి.. మిస్ యూనివర్సిటీ పోటీలు.. సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment