వికీయే సఖియే... | Love does not age | Sakshi
Sakshi News home page

వికీయే సఖియే...

Published Fri, Feb 10 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

అమెరికన్‌ నటి పమేలా ఆండర్సన్‌

అమెరికన్‌ నటి పమేలా ఆండర్సన్‌

అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం సహజమైన విషయం. అమ్మాయి అబ్బాయిని ప్రేమించడం అందమైన విషయం. రెండ్రోజుల్లో వాలెంటైన్స్‌ డే. ఈ సందర్భంగా ఇవాళ మీకో అందమైన విషయం. పమేలా ఆండర్సన్‌ తెలుసు కదా! 49 ఏళ్ల అమెరికన్‌ నటి. ఆమె ఇప్పుడు ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. ఆ అబ్బాయి పేరు జులియన్‌ అసాంజ్‌. వయసు 45. వికీలీక్స్‌ హీరో. ప్రేమకు వయసు లేదు కాబట్టి.. ప్రేమలో ఉన్నంత కాలం వీళ్లు అమ్మాయి, అబ్బాయే. ఇదిలా ఉంచితే, లండన్‌లోని ఈక్వెడర్‌ ఎంబసీలో నాలుగేళ్లుగా తలదాచుకున్న అసాంజ్‌ను చూడ్డానికి పమేలా తరచు అమెరికా నుంచి వచ్చి వెళుతున్నారు.

గత నాలుగు నెలల్లో ఐదుసార్లు ఆమె అతడిని కలుసుకున్నారు. అంతవరకు ఎవరూ పట్టిపట్టి చూడలేదు కానీ, వచ్చిన ప్రతిసారీ పమేలా స్పెషల్‌గా డ్రెస్‌ చేసుకుని రావడం ఓ యాక్టివిస్టు కళ్లల్లో పడింది. యాక్టివిస్టులకు ఒకటే యాక్టివిటీ ఉండదు కదా! అతడి కోసం ఆమె సెక్సీగా డ్రెస్‌ చేసుకుని వస్తోంది ఏమిటి చెప్మా.. అని ఆరా తీసి, వాళ్లిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని ఊదేశాడు. ఇంతకీ అసాంజ్‌ను పమేలా ఎందుకు కలుస్తున్నట్లు? అది తెలీదు కానీ, ఇద్దరికీ రష్యా అంటే ఇష్టం. అసాంజ్‌ ఏదైనా ఇష్టంగా తింటుంటే అతడి కళ్లల్లోకి ఇష్టంగా చూస్తూ కూర్చోవడం పమేలాకు ఇష్టం. అతడి కోసం వచ్చే ప్రతిసారీ అతడికి ఇష్టమైన ఫుడ్‌ ప్యాక్‌ చేయించుకుని తెస్తుందట పమేలా.

‘వికీలీక్స్‌’ హీరో జర్నలిస్ట్‌ జులియన్‌ అసాంజ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement