టెలిఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీకోసం ఏపీ ప్రభుత్వం 2015 జనవరినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు అంతర్జాతీయ ఖ్యాతిపొందిన వికీలీక్స్ వెల్లడించింది. ట్యాపింగ్‌కు వినియోగించే హార్డ్‌వేర్ ఇంటర్‌సెప్టర్ ఉపకరణాల కొనుగోలుకు ఏపీ ఇంటలిజెన్స్ విభాగానికి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్ ఇటలీకి చెందిన హ్యాకింగ్‌టీమ్ సంస్థతో గత జనవరిలోనే సంప్రదింపులు జరిపినట్టు వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ వెల్లడిస్తున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థ ద్వారా రూ.7.5 కోట్లు వెచ్చించి ఈ టెక్నాలజీని కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వికీలీక్స్ ద్వారా స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే... ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని విక్రయించే సంస్థలు అంతర్జాతీయంగా అనేకం ఉన్నాయి. అందులో ఇటలీలోని మిలన్‌కు చెందిన హాకింగ్ టీమ్ ఒకటి. ఈ సంస్థకు చెందిన 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఆ మెయిల్స్‌ను లోతుగా పరిశీలించినప్పుడు ట్యాపింగ్ టెక్నాలజీకోసం బాబు సర్కారు తీవ్రంగా ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓట్లుకు కోట్లు కుంభకోణం వెలుగులోకి వచ్చాక దాన్నుంచి తప్పించుకునేందుకు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపిం చడం, కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతీ తెలిసిందే. అయితే అంతకుముందే... ఈ ఏడాది జనవరిలోనే ట్యాపింగ్ టెక్నాలజీ సమకూర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ హ్యాకింగ్‌టీమ్‌తో ఆ మేరకు ఈమెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఓటుకు కోట్లు కుంభకోణం వెల్లడయ్యాక ఏపీ ప్రభుత్వం ఈ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అత్యవసరంగా ట్యాపింగ్ టెక్నాలజీని సమకూర్చుకునే బాధ్యతను ఏపీ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి అప్పగించింది.ఇంటెలిజెన్స్ విభాగం హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్-7లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ విభాగం ఆర్డర్ మేరకు హ్యాకింగ్‌టీమ్.కామ్ సంస్థకు చెందిన సింగపూర్ రిప్రజెంటేటివ్ కార్యాలయం చీఫ్ డేనియల్ మగ్లీటాతోతో ఓర్టస్ డెరైక్టర్ ప్రభాకర్ కాసు జూన్ 9న బేరసారాలు ప్రారంభించారు. ట్యాపింగ్ టెక్నాలజీ పనితీరు, ధరలపై జూన్ 9 నుంచి జూలై 2 వరకూ 39 సార్లు మగ్లీటాతో సంప్రదింపులు జరిపారు. 25 నుంచి 50 సెల్‌ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు టెక్నాలజీ కావాలని హ్యాకింగ్‌టీమ్‌కు ఆర్డరు చేశారు.
Published Sun, Jul 12 2015 6:15 AM | Last Updated on Wed, Mar 20 2024 1:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement