పిల్లాడికి ఇష్టమైన పేరు పెట్టాలన్నా కూడా తప్పేనా? అవునంటోంది జర్మనీ ప్రభుత్వం. అక్కడ ఓ జంట తమకు కొత్తగా పుట్టిన పిల్లాడికి వికీలీక్స్ అనే పేరు పెట్టాలనుకుంది. కానీ, ఆ పేరు పెట్టడానికి వీల్లేదంటూ ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. ఆ పేరు పెడితే భవిష్యత్తులో పిల్లవాడికి ప్రమాదం కలగొచ్చన్నది వారి అభ్యంతరం. ఇరాక్కు చెందిన హజర్ హమాలా అనే పాత్రికేయుడు జర్మనీలో ఉంటాడు.
అతడు తన పిల్లాడికి జూలియన్ అసాంజ్ స్థాపించిన 'వికీలీక్స్' అనే పేరు పెట్టాలనుకున్నాడు. అయితే, మార్చి 14న పుట్టిన ఆ పిల్లాడికి ఆ పేరు పెట్టడానికి, రిజిస్టర్ చేయడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డుపడ్డారు. పిల్లల సంక్షేమానికి, భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని భావిస్తే ఆయా పేర్లను పెట్టకుండా అడ్డుకోవచ్చని అక్కడి జనన ధ్రువీకరణ అధికారులకు హక్కులు ఇచ్చారు. దాంతోనే ఇప్పుడు వికీలీక్స్ పేరును సదరు అధికారి అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
పిల్లాడికి 'వికీలీక్స్' పేరు పెట్టొద్దు!!
Published Thu, Apr 3 2014 4:19 PM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
Advertisement