బ్రిటన్ పోలీసులకు లొంగిపోతా: అసాంజే
లండన్: ఐక్యరాజ్యసమితి తన పిటిషన్‌ను కొట్టేస్తే బ్రిటన్ పోలీసుల ముందు లొంగిపోనున్నట్లు వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే గురువారం ప్రకటించారు. స్వీడన్‌లో అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో తలదాచుకుంటున్నారు.
తన స్వేచ్ఛకు సంబంధించి 2014లో ఐరాసకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఐరాస శుక్రవారం తీర్పును వెల్లడించనుంది. తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తే పోలీసుల ముందు లొంగిపోతానని, అనుకూలంగా వస్తే పాస్‌పోర్టును పొందుతానన్నారు. ఐరాస నిర్ణయం అసాంజేకు అనుకూలంగా వస్తుందని బీబీసీ అంచనా వేస్తుండగా.. ఎంబసీని వదిలి బయటికొస్తే అరెస్టుచేస్తామని బ్రిటన్ చెబుతోంది.