వికీలీక్స్ వ్యవస్థాపకుడు, సంపాదకుడు జూలియన్ అస్సాంజ్ సంచలన ప్రకనట చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే అధ్యక్ష పదవికి బరిలోఉన్న హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సంబంధించి ముఖ్యమైన, కీలకమైన సమాచారాన్ని వెల్లడిచేస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్ 8న జరగనున్న ఎన్నికలకంటే ముందే కొన్నికీలక అంశాలను బహిర్గతం చేయనున్నట్టు ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ శాటిలైట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను బుధవారం చెప్పారు. మీరు ప్రకటించే బోయే డేటా ఎన్నికలను ప్రభావితం చేయనుందా అని ప్రశ్నించినపుడు ఇది చాలా ముఖ్యమైందిగా తాను భావిస్తున్నాననీ, ప్రజలు, మీడియాలో రగిలే అగ్గి మీద ఈ సంచలనం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
Published Thu, Aug 25 2016 2:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement