వికీలీక్స్ మరో సంచలన ప్రకటన
వాషింగ్టన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు, సంపాదకుడు జూలియన్ అస్సాంజ్ సంచలన ప్రకనట చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే అధ్యక్ష పదవికి బరిలోఉన్న హిల్లరీ క్లింటన్ ప్రచారానికి సంబంధించి ముఖ్యమైన, కీలకమైన సమాచారాన్ని వెల్లడిచేస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్ 8న జరగనున్న ఎన్నికలకంటే ముందే కొన్నికీలక అంశాలను బహిర్గతం చేయనున్నట్టు ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ శాటిలైట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను బుధవారం చెప్పారు. మీరు ప్రకటించే బోయే డేటా ఎన్నికలను ప్రభావితం చేయనుందా అని ప్రశ్నించినపుడు ఇది చాలా ముఖ్యమైందిగా తాను భావిస్తున్నాననీ, ప్రజలు, మీడియాలో రగిలే అగ్గి మీద ఈ సంచలనం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
తన పనిని వదిలేదిలేదని స్పష్టం చేశారు. కానీ ఇది ఎన్నికల ప్రచారంతో ముడిపడి ఉంది. వివిధ రకాల సంస్థల నుంచి, పత్రాలు వివిధ వార్తలు, కొన్ని చాలా ఊహించని కోణాలు, కొన్ని చాలా ఆసక్తికరమైన, కొన్ని వినోదాత్మకంగా, వివిధ సంస్థలకు చెందిన విభిన్నమైన, వెరైటీ కథనాలను అందించనున్నట్టు ప్రకటించారు.
వికిలీక్స్ కొందరు ముఖ్యమైన వ్యక్తులు, ఎక్కువగా ప్రభుత్వాలకు సంబందించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేస్తూ సంచలనానికి తెర తీస్తుంది. ముఖ్యంగా 2010 లో అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలోనే సైనిక, దౌత్య పత్రాలకు సంబందించిన అతిపెద్ద సమాచారాన్ని బయటపెట్టింది.. వేలాది రహస్య పత్రాలను వికీలీక్స్ వెబ్సైట్ ద్వారా అసాంజ్ ప్రపంచానికి వెల్లడిస్తుండడంతో వాషింగ్టన్ ప్రభుత్వం అసాంజ్ ను అరెస్ట్ చేసింది. దీంతోపాటూ స్వీడన్ లో లైంగిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలుకు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అసాంజ్ ఈక్విడెరీయన్ ఎంబసీలో గత ఐదు సం.రాలుగా తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. మరి అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా సాగుతున్నఈ పోరులో వికీలీక్స్ వెల్లడించే అంశాలు ప్రభావితం చేయనున్నాయా? వేచి చూడాలి.