
వేలాది సీఐఏ పత్రాలను బయటపెట్టిన వికిలీక్స్
పారిస్: అమెరికా కేంద్ర నిఘా విభాగం(సీఐఏ)కు చెందినవిగా చెబుతున్న వేలకొద్దీ పత్రాలను సంచలనాల వికిలీక్స్ మంగళవారం విడుదల చేసింది. వీటిని సీఐఏకు చెందిన సెంటర్ ఫర్ సైబర్ ఇంటెలిజెన్స్ నుంచి సంపాదించామంది.
వికిలీక్స్ బయటపెట్టిన పత్రాలు నిజంగా సీఐఏకు చెందినవా కాదా అని నిర్ధారించుకునేందుకు సీఐఏను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది. సీఐఏ ప్రతినిధి మాట్లాడుతూ ‘ఆ పత్రాలు నిజమైనవో కాదో మేం చెప్పం’అని అన్నారు. ప్రభుత్వ రహస్య పత్రాలను చాలా కాలం నుంచి బయటపెడుతున్న రికార్డ్ వికిలీక్స్‌కు ఉండటం తెలిసిందే. పత్రాలను పరిశీలిస్తున్న నిపుణులు మాట్లాడుతూ అవన్నీ నిజంగా సీఐఏకు చెందిన వాటిలాగే అనిపిస్తున్నాయని చెప్పారు.