
అసాంజేకు ఇంటర్నెట్ కట్
పారిస్: తమ సంస్థ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు సోమవారం నుంచి ఇంటర్‌నెట్ సదుపాయాన్ని గుర్తు తెలియని అధికారులు తొలగించినట్లు వికీలీక్స్ తెలిపింది. అసాంజే నాలుగేళ్లకుపైగా లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న హిల్లరీకి సంబంధించి సంచలన వివరాలను వికీలీక్స్ బయటపెట్టడం తెలిసిందే.