నెట్‌వర్క్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందా? | Network information to be confidential? | Sakshi
Sakshi News home page

నెట్‌వర్క్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందా?

Published Sun, Nov 9 2014 1:15 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

నెట్‌వర్క్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందా? - Sakshi

నెట్‌వర్క్‌లో సమాచారం గోప్యంగా ఉంటుందా?

ఏదైనా సమాచారం ఒక నెట్‌వర్క్‌లోకి వెళ్లిన తరువాత దాని గోప్యతకు గ్యారంటీలేదు. 100 శాతం రహస్యంగా ఉంటుందన్న నమ్మకంలేదు. అమెరికా లాంటి దేశం కూడా తన సీక్రెట్లను కాపాడుకోలేకపోయింది. వికీలీక్స్‌ దెబ్బకు విలవిల్లాడిపోయింది. ఈ పరిస్థితుల్లో సమాచారాన్ని  రహస్యంగా ఉంచే నెట్‌వర్క్‌ను చైనా సిద్ధం చేస్తోంది. వికీలీక్స్‌ - ఎడ్వర్డ్‌ స్నోడెన్‌.. ఈ రెండు పేర్లు  వింటే అమెరికా ప్రభుత్వానికి కోపం నషాళానికి అంటుతుంది. ప్రపంచానికి పెద్దన్నగా తనకు తానుగా ప్రకటించుకుని అమెరికా చేస్తున్న దురాగతాలను వికీలీక్స్‌ ద్వారా స్నోడెన్‌ విడుదల చేశారు. దీంతో స్నోడెన్‌ను పట్టుకునేందుకు అగ్రరాజ్యం చేయని ప్రయత్నం లేదు. రష్యాతో పాటు మరి కొన్ని దేశాలు స్నోడెన్‌కు రక్షణ కల్పిస్తున్నాయి.

అమెరికా నెట్‌వర్క్‌ను స్నోడెన్‌ చేధించడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి.  స్నోడెన్నే కాదు, ఏ డెన్‌ వచ్చినా  చేధించలేని, హ్యాక్‌ చేయలేని నెట్‌వర్క్‌ను కొన్ని దేశాలు  డెవలప్‌ చేసుకునే పనిలో పడ్డాయి.  ఈ విషయంలో చైనా కాస్త ముందుంది. క్వాంటమ్‌ నెట్‌వర్క్‌లో సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్‌ చేసి పంపితే అందులోకి ఎవరూ చొరబడలేరు. ఈ నెట్‌వర్క్‌ను డెవలప్‌ చేసేందుకు 1980లలోనే ఐబీఎం  ప్రయత్నించింది. గడిచిన 30 ఏళ్లుగా దీని మీద రీసెర్చ్‌ అంతగా ముందుకు పోలేదు. వికీలీక్స్‌ నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా ప్రభుత్వం క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ పరిశోధన కోసం భారీగా నిధులు కేటాయించింది.

ఒక నిర్దిష్టమైన మార్గంలో క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతారు. ఆ మార్గంలో వెళ్లే సమాచారాన్ని ఎవరైనా హ్యాక్‌ చేయాలని, దొంగలించాలని ప్రయత్నిస్తే సమాచారం తన రూపాన్ని మార్చుకుంటుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్‌ను కాజేసినా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంత ప్రాధాన్యం ఉన్న క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ను మొదట  బీజింగ్‌, షాంఘై నగరాల మధ్య ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. 2016 కల్లా ఈ రెండు నగరాల మధ్య 2 వేల కిలో మీటర్ల మేర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కూడా చైనా లక్ష్యంగా పెట్టుకుంది.  ప్రపంచం వ్యాప్తంగా ఇలాంటి నెట్‌వర్క్‌ వేయాలంటే శాటిలైట్ల సహకారం అవసరమని చైనా  సైంటిస్టులు చెబుతున్నారు.  మొత్తం మీద ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు సేఫెస్ట్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌పై దృష్టి సారించాయి. అయితే తాడిని తన్నేవాడున్నప్పుడు దాని తల దన్నే వాడు కూడా ఉంటాడని మన పెద్దలు చెబుతుంటారు. అట్లాగే క్వాంటమ్‌ నెట్‌వర్క్‌ను కూడా చేధించే హ్యాకర్లు పుట్టుకొచ్చే అవకాశంలేకపోలేదు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement