న్యూఢిల్లీ: భారత్‌లో జూలై 2022–జూన్ 2023 మధ్యకాలంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల నిరుద్యోగితా రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయిలో 3.2 శాతంగా నమోదయ్యింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022–23 వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ విడుదల చేసిన ఆరవ సర్వే నివేదిక ఇది.
(ప్చ్.. విప్రో ఉద్యోగులకు తప్పని నిరాశ!)
సర్వేకు ముందు 365 రోజుల కాలాన్ని ‘నిరుద్యోగ రేటు’కు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే, ఒక్క గ్రామీణ ప్రాంతాన్ని తీసుకుంటే, 2017–18లో 5.3 శాతం ఉన్న నిరుద్యోగితా రేటు 2022–23లో 2.4 శాతానికి దిగివచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 7.7 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. పురుషుల విషయంలో ఇదే కాలంలో నిరుద్యోగితా రేటు 6.1 శాతం నుంచి 3.3 శాతానికి దిగివస్తే, మహిళల విషయంలో 5.6 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది.
గత నాలుగేళ్లలో ఇలా..
కాలం రేటు (శాతంలో)
2022–23 3.2
2021–22 4.1
2020–21 4.2
2019–20 4.8
2018–19 5.8
2017–18 6.0
Comments
Please login to add a commentAdd a comment