ఎల్ఐసీ ఫలితాలు సూపర్
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రోత్సాహకర ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక ఫలితాల్లో 20 శాతం నికర లాభాలను నమోదుచేసింది. క్యూ2 లో రూ. 495 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. మొత్తం ఆదాయం కూడా 13 శాతం వృద్ధి చెంది రూ. 3490 కోట్లుగా రిపోర్టు చేసింది. క్యూ2(జూలై-సెప్టెంబర్)లో కంపెనీ నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 21 శాతం పెరిగి రూ. 866 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు మాత్రం రూ. 30 కోట్లవద్దే నిలిచాయి.
మార్కెట్ సమయంలో ఫలితాలు ప్రకటించడంతో మదుపర్ల కొనుగోళ్లతో రికార్డు గరిష్టాన్ని నమెదు చేసినా చివర్లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది.