
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ఆరంభించింది. అనంతరం నష్టాల్లోంచి మరింత బలహీనపడింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 722 పాయింట్ల నష్టంతో 28745 వద్ద, నిప్టీ 209 పాయింట్లు పతనమై 8381 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 29వేల దిగువకు చేరగా, నిఫ్టీ 84 వేల స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉండగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌లు లాభపడుతున్నాయి. అలాగే గత 2 రోజులుగా నష్టాల్లో ఉన్న ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో షార్ట్ కవరింగ్ కనిపిస్తోంది. ఎస్ బ్యాంకు పది శాతం ఎగసింది. బ్రిటానియా, సిప్లా, హెచ్‌యూఎల్, నెస్లేలు నిఫ్టీ లాభపడుతుండగా, కోటక్ మహీంద్రా, ఒఎన్‌జీసీ, అదాని పోర్ట్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్‌లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లకు సెలవు.
Comments
Please login to add a commentAdd a comment