ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు! | Study Said Fish Oil Supplements May Increase Risk Of Stroke Heart Issues, Know More Details | Sakshi
Sakshi News home page

ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు!

Published Fri, May 24 2024 11:40 AM | Last Updated on Fri, May 24 2024 12:35 PM

Study Said Fish Oil Supplements May Increase Risk Of Stroke Heart Issues

చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఓమేగా3, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది చేపలను తినేందుకు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు అందులోని కొవ్వులను శరీరానికి అందించేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను వాడుతుంటారు. ఇదే కారణంతో ఫిట్‌నెస్ ఔత్సాహికులు, బాడీ బిల్డర్లు, వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. 

ఐతేఈ ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనుకున్నంత సత్ఫలితాలు ఉండవని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. పైగా  స్ట్రోక్ తోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. మంచి గుండె ఆరోగ్యం ఉన్న వ్యక్తులు చేపల నూనె సప్లిమెంట్స్‌ క్రమం తప్పకుండ ఉపయోగించడం వల్ల గుండె దడ వంటి ప్రమాదాలు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చాలా అరుదైన సందర్భాల్లోనే క్రమం తప్పకుండా ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుందని డాక్టర్‌ ఆండ్రూ ఫ్రీమాన్‌ తెలిపారు.

ప్రొఫెషనల్ మెడికల్ మార్గదర్శకాల్లో కూడా డైలీ ఈ సప్లిమెంట్స్‌ని వినయోగించాలని లేకపోయినా.. ప్రజలు వినియోగిస్తుంటారని అన్నారు. దీని వినియోగం గురించే తాము యూకేలో సుమారు నాలుగు లక్షల మందికి పైగా వ్యక్తులపై అధ్యయనం చేయగా.. చేపనూనె సప్లిమెంట్‌లు తీసుకున్న వారిలో క్రమరహిత హృదయస్పందన, గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తింనట్లు  తెలిపారు శాస్త్రవేత్తలు. అలాగే అసలు గుండె సమస్యలు లేని వ్యక్తుల్లో స్ట్రోక్‌లో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. 

దాదాపు 12 ఏళ్లపాటు ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల ఆరోగ్యాన్ని ట్రాక్‌ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కార్డియోవాస్కులర్ వ్యాధి ఉన్నవారిలో, రెగ్యులర్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ గుండె  దడ నుంచి గుండెపోటు వచ్చే అవకాశం 15 శాతం,  గుండె వైఫల్యం నుంచి మరణం వరకు 9 శాతం వరకు పురోగతిని తగ్గించాయని అధ్యయనం పేర్కొంది. వాస్సెపా, లోవాజా వంటి ఫిష్‌ ఆయిల్‌ ప్రిస్క్రప్షన్‌ వెర్షన్‌లు గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉన్న వారిలో అధిక ట్రైగ్లిజరైడ్స్‌, ఒక రకమైన బ్లడ్‌ ఫ్యాట్‌కి దారితీసి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని ఫ్రీమాన్‌ చెబుతున్నారు. అలాగే అత్యంత శుద్ది చేసిన ఫిష్‌ ఆయిల్‌ వెర్షన్‌లలో కూడా హార్ట్‌ స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. 

ఐతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు వైద్యుల సిఫార్సు మేరకు ఈ సప్లిమెంట్స్‌ వాడొచ్చని చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి ఈ సప్లిమెంట్స్‌ సూచించే ముందు శరీరంలో ఓమెగా -3 ఫ్యాటీ యాసిడ్‌ స్టాయిలను పరీకించి సిఫార్సు చేయాలని చెబుతున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఈ ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను ఆహార వనరుల నుంచే పొందేందుకు ‍ప్రయత్నించాలని చెప్పారు. చెప్పాలంటే..ఆల్గే, సీవీడ్‌, ఒమేగా 3 ఫిష్‌ మూలాలు. చియా విత్తనాల, ఎడామామ్‌, అవిసె గింజలు, హెంప్సీడ్‌లు, వాల్‌నట్‌లలో ఒమెగా -3 అధికంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ఆధారపడటం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.

(చదవండి: ఎంటర్‌ప్రెన్యూర్‌ కమ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన లాయర్‌! ఏకంగా ఆరుసార్లు కేన్స్‌..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement