supplements
-
ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!
చేపల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఓమేగా3, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా లభిస్తాయి. వీటితోపాటు అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా మన శరీరానికి అందుతాయి. అయితే చాలా మంది చేపలను తినేందుకు ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారు అందులోని కొవ్వులను శరీరానికి అందించేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను వాడుతుంటారు. ఇదే కారణంతో ఫిట్నెస్ ఔత్సాహికులు, బాడీ బిల్డర్లు, వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఐతేఈ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనుకున్నంత సత్ఫలితాలు ఉండవని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. పైగా స్ట్రోక్ తోపాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. మంచి గుండె ఆరోగ్యం ఉన్న వ్యక్తులు చేపల నూనె సప్లిమెంట్స్ క్రమం తప్పకుండ ఉపయోగించడం వల్ల గుండె దడ వంటి ప్రమాదాలు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చాలా అరుదైన సందర్భాల్లోనే క్రమం తప్పకుండా ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుందని డాక్టర్ ఆండ్రూ ఫ్రీమాన్ తెలిపారు.ప్రొఫెషనల్ మెడికల్ మార్గదర్శకాల్లో కూడా డైలీ ఈ సప్లిమెంట్స్‌ని వినయోగించాలని లేకపోయినా.. ప్రజలు వినియోగిస్తుంటారని అన్నారు. దీని వినియోగం గురించే తాము యూకేలో సుమారు నాలుగు లక్షల మందికి పైగా వ్యక్తులపై అధ్యయనం చేయగా.. చేపనూనె సప్లిమెంట్లు తీసుకున్న వారిలో క్రమరహిత హృదయస్పందన, గుండె జబ్బుల ప్రమాదాన్ని గుర్తింనట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. అలాగే అసలు గుండె సమస్యలు లేని వ్యక్తుల్లో స్ట్రోక్‌లో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. దాదాపు 12 ఏళ్లపాటు ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల ఆరోగ్యాన్ని ట్రాక్ చేయగా ఈ విషయాలు వెల్లడయ్యినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కార్డియోవాస్కులర్ వ్యాధి ఉన్నవారిలో, రెగ్యులర్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ గుండె దడ నుంచి గుండెపోటు వచ్చే అవకాశం 15 శాతం, గుండె వైఫల్యం నుంచి మరణం వరకు 9 శాతం వరకు పురోగతిని తగ్గించాయని అధ్యయనం పేర్కొంది. వాస్సెపా, లోవాజా వంటి ఫిష్ ఆయిల్ ప్రిస్క్రప్షన్ వెర్షన్లు గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉన్న వారిలో అధిక ట్రైగ్లిజరైడ్స్, ఒక రకమైన బ్లడ్ ఫ్యాట్కి దారితీసి గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని ఫ్రీమాన్ చెబుతున్నారు. అలాగే అత్యంత శుద్ది చేసిన ఫిష్ ఆయిల్ వెర్షన్లలో కూడా హార్ట్ స్ట్రోక్‌లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఐతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు వైద్యుల సిఫార్సు మేరకు ఈ సప్లిమెంట్స్ వాడొచ్చని చెప్పారు. ముఖ్యంగా ఒక వ్యక్తికి ఈ సప్లిమెంట్స్ సూచించే ముందు శరీరంలో ఓమెగా -3 ఫ్యాటీ యాసిడ్ స్టాయిలను పరీకించి సిఫార్సు చేయాలని చెబుతున్నారు వైద్యులు. సాధ్యమైనంత వరకు ఈ ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలను ఆహార వనరుల నుంచే పొందేందుకు ప్రయత్నించాలని చెప్పారు. చెప్పాలంటే..ఆల్గే, సీవీడ్, ఒమేగా 3 ఫిష్ మూలాలు. చియా విత్తనాల, ఎడామామ్, అవిసె గింజలు, హెంప్సీడ్లు, వాల్నట్లలో ఒమెగా -3 అధికంగా ఉంటుందని, ఇలాంటి వాటిపై ఆధారపడటం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!) -
విటమిన్ ట్యాబ్లెట్లు వాడితే మంచిదా? ఎంతవరకు! డాక్టర్లు చెప్తున్నదేంటి?
ఇటీవల మనందరిలో పెరిగిన ఆరోగ్యస్పృహ గురించి తెలిసిందే. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రయత్నంలో ‘విటమిన్ల’ కోసం సప్లిమెంట్లు అతిగా తీసుకునేవారూ ఉన్నారు. జీవక్రియల కోసం విటమిన్లు కీలకమే. కానీ ‘ఆరోగ్య స్పృహ’ అంటూ అతిచేయడంతో విటమిన్ల మోతాదు పెరిగి ‘హైపర్ విటమినోసిస్’ కు గురయ్యే ప్రమాదమూ ఉంది. ఆ అనర్థాలేమిటో తెలిపే కథనమిది. మోతాదుకు మించి విటమిన్లు తీసుకోవడం వల్ల ‘హైపర్ విటమినోసిస్’ అనే కండిషన్ వస్తుందంటూ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కండిషన్‌ను ‘విటమిన్ టాక్సిసిటీ’గా కూడా పేర్కొంటున్నారు. నీటిలో కరిగేవాటికంటే... ఫ్యాట్లో కరిగేవే డేంజర్ విటమిన్లలో ఏ, బీ కాంప్లెక్స్, సీ, డీ, ఈ, కే అనే విటమిన్లు ఉంటాయి. వీటిల్లో ‘ఏ, డీ, ఈ, కే’ అనేవి కొవ్వు (ఫ్యాట్)లో కరిగితేనే దేహంలోకి ఇంకుతాయి. ఇక విటమిన్ ‘బీ–కాంప్లెక్స్’తో పాటు విటమిన్ ‘సీ’ మాత్రం నీళ్లలో కరుగుతాయి. ఈ బీ కాంప్లెక్స్, సీ విటమిన్లు నీళ్లలో కరగడం వల్ల కాస్త ఎక్కువైనా... మూత్రంతో పాటు బయటకు తేలిగ్గా వెళ్తాయి. దాంతో హానికి పెద్దగా అవకాశం ఉండదు. కానీ సమస్యల్లా విటమిన్ ఏ, డీ, ఈ, కే లు కొవ్వుల్లో కరగడం వల్ల... వీటి మోతాదు పెరిగినప్పుడు అంత తేలిగ్గా బయటకు వెళ్లడం సాధ్యపడదు. దాంతో ఎక్కువైనప్పుడు కొన్ని అనర్థాలు తెచ్చిపెడతాయి. విటమిన్–ఏ పెరిగితే... విటమిన్–ఏ లోపిస్తే రేచీకటి వంటి సమస్యలు వస్తాయి. విటమిన్– ఏ పెరగడం వల్ల ఒకే వస్తువు రెండుగా కనిపించడం (డిప్లోపియా), వికారం లేదా వాంతులు, తలనొప్పి, కండరాల–కీళ్ల నొప్పులు, మరీ మోతాదు ఎక్కువైతే కాలేయం తన విధులు నిర్వర్తించలేకపోవడం వంటి అనర్థాలు వస్తాయి. విటమిన్–డీ ఎక్కువైతే... ఆరుబయట చేసే ఉద్యోగాలు బాగా తగ్గడం, దాదాపుగా అందరూ ఆఫీసుల (ఇన్‌డోర్స్)కే పరిమితం కావడంతో ఇటీవల మన దేశంలో విటమిన్ ‘డీ’ లోపం బాగానే పెరిగింది. ఒక దశలో విటమిన్–డీ లోపం కేసులు చాలా పెద్ద సంఖ్యలో రావడంతో చాలామంది డాక్టర్లు చాలా సందర్భాల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విటమిన్–డీ సప్లిమెంట్లను ఇవ్వడం మొదలుపెట్టారు. డీ–విటమిన్ ఎక్కువైతే అది రక్తంలో క్యాల్షియమ్ మోతాదుల్ని పెంచుతుంది ఫలితంగా కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని మానసిక సమస్యలు కనిపించవచ్చు. అలాగే తలనొప్పి, తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ, జీర్ణవ్యవస్థకు (గ్యాస్ట్రో ఇంటస్టినల్) సమస్యలు రావచ్చు. అంటే ఉదాహరణకు వికారం, వాంతులు, మలబద్ధకం, కడుపునొప్పి వంటివి కనిపించే అవకాశాలున్నాయి. ఇక మూత్ర వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు... అంటే తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం, మూత్రపిండాల్లో క్యాల్షియమ్ ఎక్కువగా చేరే ‘నెఫ్రోక్యాల్సినోసిస్’ వంటి సమస్యలూ రావచ్చు. ఫలితంగా కిడ్నీ పనితీరు దెబ్బతినేందుకు అవకాశాలుంటాయి. విటమిన్–ఈ పెరగడం వల్ల దేహాన్ని అందంగా ఉంచడంతో పాటు కొంతమేరకు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడే ఇదే విటమిన్ దేహంలో పెరగడం వల్ల... అది మరో విటమిన్ అయిన విటమిన్–కే చేయాల్సిన విధుల్ని దెబ్బతీస్తుంది. దాంతో తేలిగ్గా రక్తస్రావం జరగడానికీ, అంతర్గత రక్తస్రావాలకూ అవకాశం ఏర్పడుతుంది. విటమిన్–కే పెరుగుదలతో దుష్ప్రభావాలివి... దేహంలో విటమిన్–కే పెరగడం అన్నది చాలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అయితే ఇలా పెరగడం వల్ల కామెర్లు, హీమోలైటిక్ అనీమియా వంటి కండిషన్లు ఏర్పడతాయి. చికిత్స : సమస్య నిర్ధారణలో హైపర్ విటమినోసిస్ వల్ల వచ్చిన అనర్థమే అన్నది చాలా కీలకం. దేహంలో ఏ విటమిన్లు ఎక్కువయ్యాయో దాన్ని బట్టి నిర్దుష్టమైన చికిత్స ఉంటుంది. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువైతే... దానికి విరుగుడుగా మూత్రం ఎక్కువగా వచ్చేందుకు ఉపకరించే ‘ఎసెటజోలమైడ్’ వంటి మాత్రలు సూచిస్తారు. ∙విటమిన్–డీ పెరిగినట్లు తెలిస్తే... దానికి విరుగుడుగా దేహంలోని క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు రక్తనాళం ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, చాలా ఎక్కువ మోతాదులో మూత్రం వచ్చేందుకు వాడే ‘లూప్ డైయూరెటిక్స్’ వంటివి వాడతారు. అలాగే క్యాల్షియమ్ మోతాదులు తగ్గించేందుకు కల్సిటోనిన్ వంటి ముక్కు ద్వారా ఇచ్చే స్ప్రేలు, బిస్ఫాస్ఫోనేట్ వంటివి ఇస్తారు. ► విటమిన్–ఈ పెరిగినట్లు నిర్ధారణ అయితే రక్తస్రావాలు, అంతర్గత రక్తస్రావాలు నివారించేందుకు విటమిన్–కే, ఎఫ్ఎఫ్పి (ఫ్రెష్ ఫ్రోజెన్ ΄్లాస్మా) వంటి ప్రక్రియలు చేస్తారు. ► విటమిన్–కే పెరిగినట్లు తెలిస్తే... దాని అనర్థాలు నివారించేందుకు వార్‌ఫేరిన్ వంటి మందులు లేదా కామెర్లకు వాడే మందులు ఉపయోగిస్తారు. నివారణ : దేహంలోని జీవక్రియలకు ఎంతో కీలకమైన విటమిన్లు చాలావరకు మనం తీసుకునే సమతులాహారంతోనే సమకూరుతుంటాయి. నిర్దుష్టంగా ఏవైనా విటమిన్ లోపాల వల్ల వచ్చే లక్షణాలను కనుగొంటే డాక్టర్లు వీటిని సూచిస్తారు. అంతేతప్ప... విటమిన్లు పెరిగితే ఆరోగ్యమూ పెరుగుతుందనే అపోహతో ‘ఆన్ కౌంటర్ మెడిసిన్’లలా విటమిన్ సప్లిమెంట్లు వాడటం ఎంతమాత్రమూ సరికాదు. - డాక్టర్ కె. శివరాజు ,సీనియర్ ఫిజీషియన్ -
ఈ సమయంలో హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
నా కూతురు ఎక్కువగా హెర్బల్–సప్లిమెంట్లు తీసుకుంటుంది. తాను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ సమయంలో హెర్బల్– సప్లిమెంట్లు తీసుకోవచ్చా? విటమిన్స్ తప్పనిసరి అంటారు కదా.... ఇవి సమకూరాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. హెర్బల్ సప్లిమెంట్లు, గర్భంలో ఉన్నప్పుడు తీసుకోకపోవడం మంచిది. వీటికి ప్రభుత్వ ఆమోదం లేదు. మామూలు సమయంలో తీసుకుంటే ఫర్వాలేదు కాని గర్భిణులు ఇవి తీసుకోవటం వల్ల, వాటిలో కొన్ని పదార్థాల వల్ల అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు, బ్లీడింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.కాబట్టి ప్రెగ్నెన్సీలో వాటిని తీసుకోకపోవడం మంచిది.ఫోలిక్ యాసిడ్ అనేది బి కాంప్లెక్స్ జాతికి చెందిన ఒక విటమిన్. దీన్ని ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల, బిడ్డ పెరుగుదలకు, అవయవాలు సరిగా ఏర్పడటానికి, నాడీవ్యవస్థలో లోపాలను చాలావరకు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది 5ఎంజీ మాత్ర రూపంలో దొరుకుతుంది. ఫోలిక్ యాసిడ్ తాజా ఆకుకూరలు, పప్పులు, బఠానీలు, బీన్స్, పండ్లలో ఎక్కువగా లభిస్తుంది. పైన చెప్పిన ఆహారంతో పాటు, ఫోలిక్ యాసిడ్ మాత్ర కూడా ప్రెగ్నెన్సీ రాకముందు మూడునెలల నుంచే వాడటం మంచిది. అలానే మొదటి మూడునెలలు తప్పనిసరిగా వాడటం వల్ల పిండం సరిగా పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతుంది. నాకు జనాంగాల మీద పొక్కులు వస్తున్నాయి. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. స్కేబీస్, ఫ్యూబిక్ లైస్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల పొక్కులు వస్తాయని ఎక్కడో చదివాను. ఇది నిజమేనా? వివరంగా తెలియజేయగలరు. జనాంగాల మీద పొక్కులు అనేక రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో సిఫిలిస్, స్కేబిస్, çప్యూబిక్లెన్ హెర్పిస్, వార్ట్స్ వంటి ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిలో చాలావరకు లైంగిక వ్యాధుల వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి.ఒక్కొక్క ఇన్ఫెక్షన్ని బట్టి జననాంగాల మీద రకరకాల పొక్కులులాగా, నీటిగుల్లలులాగా, చిన్న చీముగడ్డలులాగా ఉండవచ్చు.లైంగికంగా సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి కండోమ్స్ వాడుకోవడం మంచిది.అలాగే రక్తహీనత, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా, తొందరగా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామాలు చెయ్యడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు, ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే పొక్కులు ఎటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో పరీక్ష చేసి, నిర్ధారణ చేసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. ప్రసవమయ్యాక బాలింతల రొమ్ముల ఆకృతిలో మార్పులు వస్తాయని, వాపు వస్తుందని, ఇబ్బందిగా ఉంటుందని విన్నాను. ఇలా రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? ప్రసవమయ్యాక కంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచే శరీరంలో మార్పులలాగే, రొమ్ములలో కూడా పాలు తయారుకావటానికి అనుగుణంగా మార్పులు మొదలవుతాయి. ఇందులో భాగంగా రొమ్ములు సైజు పెరుగుతాయి. నిపుల్ చుట్టూ వలయాకారం నల్లగా ఏర్పడుతుంది. కొందరిలో నల్లగా లేక ఎర్రగా రొమ్ముపైన స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడుతాయి.కాన్పు తర్వాత పాలు పడటం మొదలయ్యి, రొమ్ములు నిండుగా సౌష్టవంగా తయారవుతాయి. పాలు సరిపడా ఉండి, బిడ్డ సరిగా పాలు తీసుకుంటే రొమ్ములో వాపు, ఇబ్బంది, నొప్పి ఏమీ ఉండవు.కొన్నిసార్లు బిడ్డ సరిగా పాలు తాగకపోవటం, పాలు ఎక్కువగా స్రవించడం వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే రొమ్ములు పాలతో గట్టిపడి వాపు, ఇబ్బంది, నొప్పి వస్తాయి. అప్పటికీ సరిగా పట్టించుకోకపోతే, చీము పట్టడం, జ్వరం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు.కాబట్టి బిడ్డ పుట్టిన తరువాత పాలు పడినా పడకపోయినా, రొమ్ము పట్టించి చీకేలా చేయాలి. మూడుగంటలకొకసారి పాలు పట్టాలి. పాలు ఎక్కువగా అనిపిస్తే వాటిని పిండి తీసివేయాలి. అలానే ఉంటే పైన చెప్పిన ఇబ్బందులు రావచ్చు. రొమ్ముల్లో వాపు ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి. సహజంగా రొమ్ములో వచ్చే మార్పులను అన్నీ నివారించలేము. అవి గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో జరిగే హార్మోన్లలో మార్పులకు అనుగుణంగా ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు లభించే పోషకాలు, ఇతర లాభాలతో పోలిస్తే ఈ మార్పుల గురించి భయపడటం తగదు. ఈ ప్రయోజనాలు వెలకట్టలేనివి. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ -
ఆ మందులు వృధానే..
లండన్ : హెల్త్ సప్లిమెంట్, విటమిన్ ట్యాబ్లెట్లతో సమయం, డబ్బు వృధా కావడంతో పాటు ఆరోగ్యానికి ముప్పు కొనితెచ్చుకున్నట్టేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ మందులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్న దాఖలాలు లేవని మందుల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేఫ్టీ ఆఫ్ మెడిసిన్స్ కమిటీ మాజీ సలహాదారు డాక్టర్ పౌల్ క్లేటన్ స్పష్టం చేశారు. వీటి నియంత్రణకు పటిష్ట నిబంధనలు, యంత్రాంగం అవసరమన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ పేలవమైన ఫార్ములాతో కూడిన మందులతో విపరీతమైన ప్రచారంతో అమ్మకాలు సాగిస్తున్నారని, వీటితో ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు, తక్కువ నాణ్యతతో వీటిని రూపొందించడంతో ఎలాంటి ఫలితాలు దక్కడం లేదన్నారు. హెల్త్ సప్లిమెంట్స్‌లో బహుళ ప్రాచుర్యం పొందిన చేప నూనెతో తయారయ్యే క్యాప్సూల్స్, మల్టీవిటమిన్స్ రెండూ ప్రోత్సాహకర ఫలితాలు ఇవ్వడం లేదని తమ పరిశోధనలో తేలిందని క్లేటన్ చెప్పారు. మల్టీవిటమిన్స్ తీసుకుంటే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పు తగ్గలేదని చెప్పుకొచ్చారు. ఇకబ్రిటన్ సహా ఐరోపా యూనియన్‌లో విక్రయించే సంస్ధలు స్ధానిక ఆహార చట్టానికి అనుగుణంగా ఆహార సప్లిమెంట్స్‌ను విక్రయించాలని డాక్టర్ ఎమ్మా డెర్బీషైర్ సూచించారు. -
పెద్దవాళ్లు విటమిన్–డి తీసుకున్నా వృథానే!
మెల్బోర్న్: పెద్ద వయస్కులు విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవటం వల్ల వారిలో ఎముకల సాంద్రత మెరుగు పడే అవకాశాలు లేవని తాజా అధ్యయనంలో తేలింది. ఎముకలు విరగటాన్ని ఈ సప్లిమెంట్లు నిరోధించలేవని వెల్లడైంది. పెద్ద వయస్కుల్లో ఎముకలు పెళుసుబారకుండా ఉండేందుకు గత కొంత కాలంగా డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్లను సిఫార్సు చేయడం తెల్సిందే. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్‌కు చెందిన పరిశోధకులు సుమారు 81 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి సమాచారాన్ని సేకరించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అసలు విటమన్–డి సప్లిమెంట్ల వల్ల అనుకున్నంత ప్రయోజనంలేదని తేలింది. ఈ సప్లిమెంట్లు వల్ల పూర్తిగా, పాక్షికంగా విరిగిన ఎముకలు కేవలం 15 శాతం అతుక్కుంటున్నట్లు తేల్చారు. -
విటమిన్ సప్లిమెంట్లతో రిస్కేనట!
పరిపరి శోధన విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఢోకా ఉండదని చాలామంది నమ్ముతారు. ఆ నమ్మకంతోనే క్రమం తప్పకుండా విటమిన్ బిళ్లలు, టానిక్‌లు వాడుతుంటారు. అయితే, ఆ నమ్మకం ఉత్త భ్రమేనని అమెరికన్ మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. విటమిన్ సప్లిమెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరగడం సంగతెలా ఉన్నా, వాటిని వాడేవారిలో ఆరోగ్యం గురించి మితిమీరిన ధీమా పెరుగుతుందని, దాంతో అనారోగ్యకరమైన దినచర్యను అలవాటు చేసుకుని, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని వారు చెబుతున్నారు. ఇతరులతో పోలిస్తే విటమిన్ సప్లిమెంట్లు తీసుకునే వారు వ్యాయామానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వరని, అంతేకాకుండా, ఏం తిన్నా తమకేమీ కాదనే ధీమాతో రుచిగా ఉన్నవన్నీ ఇష్టానుసారం లాగించేసి స్థూలకాయులుగా మారుతారని, స్థూలకాయం వల్ల గుండెజబ్బులు, బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులకు గురవుతారని తమ అధ్యయనంలో తేలినట్లు చెబుతున్నారు. వీరి పరిశోధన సారాంశం ‘సైకలాజికల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైంది. -
కోపాన్ని నియంత్రించుకుంటే మనల్ని ఎవరూ గెలవలేరు
ధ్యాన భావన మనలో చాలామంది ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్య... కోపం. జీవితంలో బాహ్యమైన సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ చాలావరకు తాత్కాలికమైనవే. కానీ కోపం అన్నది అంతర్గతమైన సమస్య. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన చివరి క్షణం వరకు. కోపం ఒక తీవ్రమైన సమస్య. ఎందుకంటే దాని వల్ల ఎన్నో దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. ఇటు కోపగించుకున్న వ్యక్తికీ బాధ కలుగుతుంది. అటు కోపానికి గురైన వ్యక్తికీ బాధ కలుగుతుంది. ఆ బాధ చేత్తో తీసేస్తే పోయేది కాదు. చాలాకాలం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అది మనల్ని చలనం లేకుండా చేయడంతో ఎక్కువ సేపు పని చేయలేకపోతాము. కోపం వల్ల ద్వేషం కలుగుతుంది. ద్వేషం కారణంగా చక్కటి అనుబంధాలు కూడా వీగిపోతాయి. ఈ అనుబంధాలు, స్నేహ సంబంధాలు ఎన్నో ఏళ్ల సాంగత్యం వల్ల బలపడేవి. అలాంటివి, కొన్ని క్షణాల కోపంతో చిటికెలో మాయమైపోతాయి. ఒకసారి అనుబంధం వీగిపోతే, మళ్లీ దాన్ని భర్తీ చేసుకోవడం అసాధ్యం. కోపంలో ఎంత మాట పడితే అంతమాట అనేస్తాం. ముందూ వెనుకా ఆలోచించం. తర్వాత, అలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ బాధపడిపోతుంటాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? అదీకాక, కోపం ఉన్నచోటుకు ప్రశాంతత రాలేదు. ప్రశాంతత లేని చోట ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కోపం మనలో దూరే ఒక శక్తిమంతమైన శత్రువు. కోపం వచ్చిందంటే అర్థం, మన మనసు బలహీనపడిందని! క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మనకు లేదని చెప్పకనే చెప్పినట్లు. అంటే కోపం ఒక వ్యాధి లక్షణం. మనసు బలహీనంగా ఉందని సూచించే లక్షణం. క్లిష్టమైన పరిస్థితులను మనసు ఎదుర్కోలేదని చెప్పే లక్షణం. అందుకని నేను కోపాన్ని అధిగమించాలంటే ముందుగా నాలోని ఈ బలహీనతలను అంగీకరించాలి. నాకు శక్తి లేదని ఒప్పుకోవాలి. కానీ, దురదృష్టవశాత్తూ నేను నా కోపాన్ని సమర్థించుకుంటూ వస్తున్నాను. ఎలా? ఎదుటివాళ్లను తప్పుపట్టడం ద్వారా. అంటే వాళ్ల ప్రవర్తనని, వాళ్ల మాటలని నిందించడం ద్వారా. ఎప్పుడైతే నా బలహీనతను నేను సమర్థించుకుంటానో, అప్పుడే నన్ను నేను మెరుగు పరుచుకోడానికి వీలు లేకుండా తలపులు మూసేస్తున్నాను. నా బలహీనత నుంచి నేను బయటికి వచ్చే మార్గాన్ని కోల్పోతున్నాను. అదే నేను నా బలహీనతను ఒప్పుకుంటే గనుక, ఒప్పుకునేంత సంకల్పశక్తి నాకు ఉంటే గనుక... నాకు నేను సలహా ఇచ్చుకోవడం ద్వారా నా మనసును నేను క్రమేపీ దృఢపరచుకోగలను. అలా నన్ను నేనే ఒక దృఢమైన వ్యక్తిగా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కలత చెందకుండా ఉండే వ్యక్తిగా ఊహించుకుంటాను. నన్ను నేనే ఒక క్షమాగుణం ఉన్న వ్యక్తిగా భావించుకుంటాను. కోపానికి మందు క్షమ. అది చూపించి నన్ను నేను శాంతమూర్తిగా మార్చుకుంటాను. నేను దృఢంగా ఉన్నాననీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చికాకు పడననీ, ఎవరూ నన్ను రెచ్చగొట్టలేరని; ఎదుటివారి ప్రవర్తన మీద నాకు అధికారం లేని మాట నిజమే కానీ, నన్ను నేను మాత్రం ప్రశాంతంగానే ఉంచుకుంటాననీ గట్టిగా నిర్ణయించుకుంటాను. - స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ)