లండన్ : హెల్త్ సప్లిమెంట్, విటమిన్ ట్యాబ్లెట్లతో సమయం, డబ్బు వృధా కావడంతో పాటు ఆరోగ్యానికి ముప్పు కొనితెచ్చుకున్నట్టేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ మందులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్న దాఖలాలు లేవని మందుల భద్రతపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేఫ్టీ ఆఫ్ మెడిసిన్స్ కమిటీ మాజీ సలహాదారు డాక్టర్ పౌల్ క్లేటన్ స్పష్టం చేశారు. వీటి నియంత్రణకు పటిష్ట నిబంధనలు, యంత్రాంగం అవసరమన్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హెల్త్ సప్లిమెంట్స్ పేలవమైన ఫార్ములాతో కూడిన మందులతో విపరీతమైన ప్రచారంతో అమ్మకాలు సాగిస్తున్నారని, వీటితో ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు, తక్కువ నాణ్యతతో వీటిని రూపొందించడంతో ఎలాంటి ఫలితాలు దక్కడం లేదన్నారు.
హెల్త్ సప్లిమెంట్స్‌లో బహుళ ప్రాచుర్యం పొందిన చేప నూనెతో తయారయ్యే క్యాప్సూల్స్, మల్టీవిటమిన్స్ రెండూ ప్రోత్సాహకర ఫలితాలు ఇవ్వడం లేదని తమ పరిశోధనలో తేలిందని క్లేటన్ చెప్పారు. మల్టీవిటమిన్స్ తీసుకుంటే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పు తగ్గలేదని చెప్పుకొచ్చారు. ఇకబ్రిటన్ సహా ఐరోపా యూనియన్‌లో విక్రయించే సంస్ధలు స్ధానిక ఆహార చట్టానికి అనుగుణంగా ఆహార సప్లిమెంట్స్‌ను విక్రయించాలని డాక్టర్ ఎమ్మా డెర్బీషైర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment