ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు | E-cigarette users may be at higher risk of a life-threatening stroke than smokers, study finds | Sakshi
Sakshi News home page

ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు

Published Sat, Feb 25 2017 11:43 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు

ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు

లండన్: మామూలు సిగరెట్ కంటే ఈ-సిగరెట్తోనే ఎక్కువ దుష్ఫలితాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఎలుకలపై జరిపిన వేరువేరుగా జరిపిన పరిశోధనల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 10  రోజుల పాటు ఈ-సిగరెట్ పొగ ప్రభావానికి గురిచేసిన ఎలుకల్లో గుండె,  నరాలు బాగా దెబ్బతిన్నాయని, ఇది ఎలుకల్లో మామూలు సిగరెట్ పొగ చూపే దుష్ప్రభావం కంటే అధికంగా ఉందని టెక్సాస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు.
 
ఈ-సిగరెట్ ప్రభావానికి గురైన ఎలుకల్లో మెదడు గ్లూకోజ్ను తీసుకునే పరిమాణం బాగా తగ్గిపోయిందని, తద్వారా మెదడు యాక్టీవ్గా పనిచేయడం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఇక రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే ఎంజైమ్పై రెండు రకాల సిగరెట్లు తీవ్ర దుష్ఫలితాలు చూపుతున్నాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement