మెడ తిప్పడంతో ఆస్పత్రిపాలు
బనశంకరి: కటింగ్ షాపులో తల మసాజ్ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాలు.. బెంగళూరులో హౌస్‌కీపింగ్ చేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు (30) ఓ కటింగ్ షాపునకు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్ చేస్తానంటే సరే అన్నాడు.
ఈ సమయంలో ఆకస్మికంగా గొంతు తిప్పిన సమయంలో నొప్పి కలిగింది. మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు.
వైద్యనిపుణుడు శ్రీకంఠస్వామి మాట్లాడుతూ బాధితుడు సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడు. బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తరువాత కోలుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment