
ప్రతీకాత్మక చిత్రం
హోసూరు: పెయింటర్ తలను నరికి మారియమ్మ ఆలయం ముందు ఉంచిన ఘటన కలకలం రేపింది. హోసూరు తాలూకా బాగలూరు సమీపంలోని ఎలువపల్లి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కొడుకు ప్రదీప్ (25). ఇతనికి చంద్రిక అనే యువతితో పెళ్లయింది, ఇద్దరు పిల్లలున్నారు. ప్రసవం కోసం భార్య పుట్టింటికెళ్లింది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రదీప్ తలను నరికి అదే ప్రాంతంలోని మారియమ్మ ఆలయం ముందు ఉంచి వెళ్లారు.
బాగలూరు పోలీసులు పరిశీలించగా దేహం కొంచెం దూరంలో కనిపించింది. ఎస్పీ సాయ్‌చరణ్ తేజస్వి, హోసూరు డీఎస్పీ శివలింగం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అదే ప్రాంతానికి చెందిన బంధువులు సంతోష్, మురళితో ప్రదీప్‌కు గత 15 ఏళ్లుగా ఆస్తి తగాదాలున్నాయని, వారే హత్య చేసి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను తీవ్ర విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment