మితిమీరిన ఆలోచనా ధోరణితో గుండెకు చేటు!
లండన్:జరిగితే జరుగక మానదు.. జరగనది ఎన్నటికీ జరుగదు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అనవసర విషయాలపై ఆందోళనలతో పాటు, ఆదుర్దా పడితే వచ్చే లాభాలకంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. అది ఒక్క చెడు అంశాలపైనే కాదు.. మనకు సానుకూలంగా ఉన్న అంశాలపై కూడా ఎక్కువ గాభర పడితే మాత్రం అది గుండె పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తాజే సర్వేలో వెలుగుచూసింది. ఈ తరహా ధోరణితో అతిగా ఆలోచించే వారిలో గుండె, మెదడులో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై లండన్ శాస్త్రవేత్తలు ఒక సర్వే నిర్వహించారు.
ఓ కార్డియాక్ రీహబిషన్ కార్యక్రమంలో10 సంవత్సరాల నుంచి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 1,000 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. వీరంతా 60 సంవత్సరాల ఒడిలో పడ్డవారే. స్థానికంగా ఏర్పడే పరిస్థితులతో పాటు, సానుకూల అంశాలపై ఎక్కువగా గాభరా పడటంతోనే వారి గుండె చాలా బలహీనంగా మారినట్లు గ్రహించారు. రెండు సార్లు గుండెలో నొప్పి వస్తే మాత్రం అది ఖచ్చితంగా గుండె పోటుకు దారి తీసే అవకాశం ఉంటుందని, అదే నాలుగు సార్లు వస్తే మాత్రం అది వారి మరణానికి దారితీస్తుందన్నారు.