ఆస్పత్రి బెడ్‌పై జెరోధా సీఈవో.. ఏం జరిగింది? | Zerodha Nithin Kamath suffered mild stroke 6 weeks ago shares hospital pic | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి బెడ్‌పై జెరోధా సీఈవో.. ఏం జరిగింది?

Published Mon, Feb 26 2024 5:50 PM | Last Updated on Mon, Feb 26 2024 6:07 PM

Zerodha Nithin Kamath suffered mild stroke 6 weeks ago shares hospital pic - Sakshi

ప్రముఖ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ (Nithin Kamath) ఆస్పత్రి బెడ్‌పై కనిపించాడు. ఖంగారు పడకండి. ఇది ఆరు వారాల కిందటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. 

ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను నితిన్‌ కామత్‌ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. తాను సుమారు ఆరు వారాల క్రితం "మైల్డ్ స్ట్రోక్" తో బాధపడ్డాడనని, కారణం స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ, రకరకాల కారకాల కలయిక దీనికి దోహదపడి ఉండవచ్చని పేర్కొన్నారు.

"సుమారు 6 వారాల క్రితం, నాకు ఉన్నంటుండి తేలికపాటి స్ట్రోక్ వచ్చింది. నాన్న చనిపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, అలసట, డీహైడ్రేషన్‌, హెవీ వర్కవుట్‌.. వీటిలో ఏవైనా కారణాలు కావచ్చు" అని కామత్ తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) పోస్ట్‌లో తెలియజేశారు. అప్పటి నుంచి చదవడానికి, రాయడానికి కూడా చాలా కష్టపడ్డానని, 3-6 నెలల్లో పూర్తి రికవరీని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

తాను ఫిట్‌గా ఉండటమే కాకుండా ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేసే నితిన్‌ కామత్‌కు కూడా స్ట్రోక్‌ రావడంతో  తన అలవాట్లు, అభ్యాసాలను మరోసారి సమీక్షించుకోవాల్సిన ఆవశ్యతను ఆయన గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement