in hospital
-
ఆస్పత్రి బెడ్‌పై జెరోధా సీఈవో.. ఏం జరిగింది?
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ (Nithin Kamath) ఆస్పత్రి బెడ్‌పై కనిపించాడు. ఖంగారు పడకండి. ఇది ఆరు వారాల కిందటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను నితిన్ కామత్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను సుమారు ఆరు వారాల క్రితం "మైల్డ్ స్ట్రోక్" తో బాధపడ్డాడనని, కారణం స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ, రకరకాల కారకాల కలయిక దీనికి దోహదపడి ఉండవచ్చని పేర్కొన్నారు. "సుమారు 6 వారాల క్రితం, నాకు ఉన్నంటుండి తేలికపాటి స్ట్రోక్ వచ్చింది. నాన్న చనిపోవడం, సరిగా నిద్ర లేకపోవడం, అలసట, డీహైడ్రేషన్, హెవీ వర్కవుట్.. వీటిలో ఏవైనా కారణాలు కావచ్చు" అని కామత్ తన ‘ఎక్స్’ (ట్విటర్) పోస్ట్‌లో తెలియజేశారు. అప్పటి నుంచి చదవడానికి, రాయడానికి కూడా చాలా కష్టపడ్డానని, 3-6 నెలల్లో పూర్తి రికవరీని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఫిట్‌గా ఉండటమే కాకుండా ఫిట్నెస్ ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెలియజేసే నితిన్ కామత్‌కు కూడా స్ట్రోక్ రావడంతో తన అలవాట్లు, అభ్యాసాలను మరోసారి సమీక్షించుకోవాల్సిన ఆవశ్యతను ఆయన గుర్తించారు. Around 6 weeks ago, I had a mild stroke out of the blue. Dad passing away, poor sleep, exhaustion, dehydration, and overworking out —any of these could be possible reasons. I've gone from having a big droop in the face and not being able to read or write to having a slight droop… pic.twitter.com/aQG4lHmFER — Nithin Kamath (@Nithin0dha) February 26, 2024 -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్ మృతి
మడకశిర : గుడిబండ మండలం హిరేతుర్పి వద్ద మంగళవారం టిప్పర్, కారు ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ హనుమంతరాయప్ప(55) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు గుడిబండ పోలీసులు తెలిపారు. మృతుడు కర్ణాటక రాష్ట్రంలోని శిర తాలూకా కరిదాసనహళ్లి గ్రామానికి చెందినవాడు కావడంతో గుడిబండ ఎస్ఐ ఖాజాహుస్సేన్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని ఆ గ్రామానికి తరలించారు. ఇదిలా ఉండగా ఇదే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలిసింది. -
‘కాళ్లవాపు’పై కదలిక
అన్నవరానికి వైద్య నిపుణుల బృందం బాధితుల రక్త నమూనాల సేకరణ కాకినాడకు జీజీహెచ్‌కు తరలింపు వీఆర్‌పురం : ‘మరణశయ్యపై మన్యం’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చిం ది. అంతుపట్టని కాళ్లవాపు వ్యాధితో వీ ఆర్‌పురం మండలం అన్నవరం గ్రామంలో 20 రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు, మరో గ్రామంలో మరొకరు మృతి చెందగా, అవే లక్షణాలతో మరి కొందరు మంచాన పడ్డ సంగతి తెలిసిందే. గిరిజనులను గజగజ వణికిస్తున్న ఈ వ్యాధిపై కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శాఖ అధికారులు అన్నవరంపై దృష్టి సారించారు. అసలు ఈ వ్యాధికి మూలమేమిటో నిర్ధారించేందుకు సమాయత్తమవుతున్నారు. నిపుణులు గ్రామానికి వచ్చి పలువురి రక్త నమూనాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ఈ బృందాలు కొన్ని రోజులు ఇక్కడే ఉండి చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రమేష్‌కిషోర్, రంపచోడవరం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కార్తీక్, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ ప్రసన్నకుమార్ తదితరులు అన్నవరం వచ్చి వివరాలు సేకరించారు. కాళ్ల వాపుతో బాధపడుతున్న 20 మందిని రెండు ప్రత్యేక అంబులెన్స్‌లలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఆస్పత్రిలో తాచుపాము కలకలం
గోకవరం : బుసలు కొడుతూ ఓ తాచుపాము గోకవరం ప్రభుత్వాస్పత్రిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనతో ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం స్వీపరు ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేస్తుండగా తాచుపాము తారసపడింది. ఆమె భయంతో గట్టిగా కేకలు పెట్టడంతో.. ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పాము అక్కడున్న సిమెంటు దిమ్మ కిందకు చేరుకుంది. పడగవిప్పి బుసలు కొట్టడంతో దాని దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. విషయం తెలుసుకున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ పామును హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడు నెలల క్రితం కూడా ఆస్పత్రిలోకి ఇలాగే తాచుపాము ప్రవేశించగా అప్పట్లో కొట్టి చంపారు. -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
ఎమ్మెల్సీ బోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు కాకినాడ సిటీ : బస్సు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు వైద్యులను కోరారు. ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడి, కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పారు. అలాగే క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి లింగం రవి, నాయకులు కోమలి సత్యనారాయణ, విత్తనాల రమణ, కడియాల చిన్నబాబు తదితరులు ఉన్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శ క్షతగాత్రులను కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. వీరికి అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకుని, వీరికి మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాయపడిన 12 మందిలో ముగ్గురిని డిశ్చార్జి చేశారని, మిగిలిన 9 మంది వైద్యం పొందుతున్నారని తెలిపారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవలను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ఆలీం బాషా, ఆర్డీఓ బీఆర్ అంబేద్కర్ ఉన్నారు. -
చికిత్స పొందుతూ రైతు మృతి
కొత్తచెరువు: మండలంలోని కేశాపురం గ్రామానికి చెందిన రైతు పుల్లప్ప(65) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అప్పులబాధ తాళలేక అతడు జూలై 30న పురుగులు మందు తాగిన విషయం విదితమే. అతడికి కొన్ని రోజులు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరెడ్డి తెలిపారు. సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
విజృంభించిన అతిసారం
ఆనూరులో 15 మంది బాధితులు అప్రమత్తమైన వైద్య యంత్రాంగం పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో రోగులకు చికిత్స కలుషిత జలాలే కారణమంటున్న వైనం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సీజనల్ వ్యాధులొస్తున్నాయని, పంచాయతీల్లో మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని వైద్యులు పదేపదే చెబుతున్నా, అధికారులు పెడచెవిన పెట్టడంతో.. పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో అతిసారం జడలు విప్పింది. ఈ గ్రామంలో సుమారు 15 మంది అతిసార వ్యాధి బారినపడడంతో వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. – ఆనూరు (పెద్దాపురం) గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామానికి చెందిన 12 మంది ఇటీవల అతిసారం బారిన పడ్డారు. తాజాగా మెట్ట గ్రామమైన ఆనూరులో సుమారు 15 మంది అతిసార వ్యాధికి గురై, పెద్దాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గండేపల్లి మండలానికి చెందిన బాధితులు కూడా ఇదే ఆస్పత్రిలో ఉన్నారు. ఆనూరు గ్రామానికి చెందిన నూకతట్టు శ్యామల, వల్లూరి అబ్బులు, పైడిమళ్ల గణేష్, పైడిమళ్ల చిన్నారావు, పైడిమళ్ల ముసలయ్య, కనిపే ఆంజనేయులు, పైడిమళ్ల అప్పాయ్యమ్మ, నూకతట్టు మంగ, కనిపే ఆంజనేయలక్ష్మి తదితరులు బాధితుల్లో ఉన్నారు. అలాగే నాయకంపల్లి గ్రామానికి చెందిన పల్లిపాటి రమ్య, గందం సత్యనారాయణ, మ్యురాల అప్పారావు, సప్పా వీరబాబు, గండేపల్లికి చెందిన దారా తలుపులమ్మ, వరలహాలయ్యపేటకు చెందిన పెద్దింటి వినోద్, మర్రిపూడికి చెందిన అడ్డల తాతారావు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్యాధికారులు ఆనూరు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆస్పత్రికి చేరుకుని, రోగులను పరామర్శించారు. రోగులకు సకాలం వైద్య సేవలందించాలని,, సంఘటనకు కారణమైన మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చాలని అధికారులనుlకోరారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ ఆస్పత్రిలో రోగుల పరిస్థితిపై ఆరా తీశారు. వారికి అవసరమైన మందులను అందుబాటులోకి ఉంచాలని, వైద్య సేవలను మెరుగుపర్చాలని వైద్యులను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు కూడా రోగులను పరామర్శించారు. కాచిన నీటిని మాత్రమే తాగాలి వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆస్పత్రిలో అతిసారం కేసులు అధికంగా ఉన్నాయని, ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు. మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని చెప్పారు. వైద్యులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి! సంఘటనకు కలుషిత జలాలు కారణం కాదని, కలుషితాహారం వల్లే ఇలా జరిగిందని చెప్పండంటూ కొందరు వైద్యులపై పలువురు అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. కలుషిత తాగునీటి వల్లే తాము అస్వస్థతకు గురయ్యామని రోగులు స్పష్టం చేయడం, వైద్యుల విచారణలో కూడా ఇదే విషయం వెలుగు చూడడంతో వారి పాచిక పారలేదు. ఆనూరు గ్రామం రంగంపేట పీహెచ్సీ పరిధిలోది కావడంతో అక్కడి వైద్యురాలు శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. క్లిష్టమైన కేసులను పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఓ దళితపేటలో వాటర్ ట్యాంక్‌ను పరిశుభ్రం చేయకపోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.