బుసలు కొడుతూ ఓ తాచుపాము గోకవరం ప్రభుత్వాస్పత్రిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనతో ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం స్వీపరు ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేస్తుండగా తాచుపాము తారసపడింది. ఆమె భయంతో గట్టిగా కేకలు పెట్టడంతో.. ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.
ఆస్పత్రిలో తాచుపాము కలకలం
Published Sat, Aug 27 2016 8:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
గోకవరం :
బుసలు కొడుతూ ఓ తాచుపాము గోకవరం ప్రభుత్వాస్పత్రిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనతో ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం స్వీపరు ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేస్తుండగా తాచుపాము తారసపడింది. ఆమె భయంతో గట్టిగా కేకలు పెట్టడంతో.. ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పాము అక్కడున్న సిమెంటు దిమ్మ కిందకు చేరుకుంది. పడగవిప్పి బుసలు కొట్టడంతో దాని దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. విషయం తెలుసుకున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ పామును హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడు నెలల క్రితం కూడా ఆస్పత్రిలోకి ఇలాగే తాచుపాము ప్రవేశించగా అప్పట్లో కొట్టి చంపారు.
Advertisement
Advertisement