gokavaram
-
సీఎం జగన్ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో పరిశ్రమలు
గోపవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో సెంచురీ ఫ్లై పరిశ్రమను నిర్మిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సజ్జన్ భజాంకా తెలిపారు. వైఎస్సార్ జిల్లా గోపవరం వద్ద నిర్మిస్తున్న పరిశ్రమ పనులను గురువారం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భజాంకా మాట్లాడుతూ తొలుత తమిళనాడులో యూనిట్ నెలకొల్పాలని భావించామని, అయితే వెనుకబడిన ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయడం వలన ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ తమకు చెప్పారని, దీంతో తాము ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు చకచక రావడంతో పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. 2024 డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేసి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ముందుగా రూ.600 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించామని, ఇప్పుడు రూ.1,600 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు భజాంకా తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటు కావడం వలన రెండు వేల మందికి ప్రత్యక్షంగాను, నాలుగు వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంని, 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వనున్నట్లు భజాంకా వెల్లడించారు. నిరుద్యోగులకు ఎలాంటి అనుభవం లేకున్నా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో సెంచురీ ప్యానల్ జీఎం రమేష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
అమెరికా అబ్బాయికి, ఆంధ్రా అమ్మాయికి నిశ్చితార్థం
సాక్షి, గోకవరం (తూర్పుగోదావరి): అమెరికా అబ్బాయి, ఆంధ్రా అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు వారి వివాహానికి గ్రీన్ సిగ్నల్ చెప్పడంతో నిశ్చితార్థ వేడుకకు గోకవరం మండలం కృష్ణునిపాలెం వేదికయింది. కాకినాడకు చెందిన రాజాలా ఉదయశంకర్, కుసుమ దంపతులు విజయవాడలో స్థిరపడ్డారు. వారి కుమార్తె నివేదిత 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. ఆమెతో పాటు పనిచేస్తున్న చికాగోకు చెందిన బైరాన్ ఆమెను ఇష్టపడ్డాడు. ఇదే విషయాన్ని యువతికి చెప్పగా తన తల్లిదండ్రులకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వారి ప్రేమను అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించడంతో గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని బంధువుల సందడి నడుమ మంగళవారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఈ నెల 11న విజయవాడలో వీరి వివాహం జరగనున్నట్టు వారి బంధువులు తెలిపారు. చదవండి: (AP: 7 ప్రభుత్వ స్కూళ్లకు బెస్ట్ స్కూల్ అవార్డులు) -
తూ. గో జిల్లా గోకవరంలో రేపు సీఎం జగన్ పర్యటన
-
చోరీకి వచ్చాడు.. గురకపెట్టి నిద్రపోయాడు!
గోకవరం: చోరీ చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన ఓ ఆగంతకుడికి నిద్ర ముంచుకురావడంతో అదే ఇంట్లో మంచం కింద గురకపెట్టి నిద్రపోయాడు. ఆ శబ్ధానికి మెలకువ వచ్చిన యజమాని పోలీసులకు ఫిర్యాదుచేసి దొంగను పట్టించిన ఘటన తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ► పెట్రోల్ బంక్ నిర్వాహకుడు సత్తి వెంకటరెడ్డి (పొగాకురెడ్డి) శుక్రవారం రాత్రి 10.15 గంటలకు బంక్ కార్యకలాపాలు పూర్తి చేసుకుని నగదు బ్యాగ్‌తో తన ఇంటికి చేరుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా అతని వెనుకే వచ్చిన ఓ వ్యక్తి గదిలోకి ప్రవేశించి మంచం కింద నక్కాడు. ► బంక్‌కు సంబంధించిన లావాదేవీలు చూసుకుంటూ వెంకటరెడ్డి రాత్రి 1 గంట వరకు మెలకువగానే ఉండడంతో ఈలోగా దొంగతనానికి వచ్చిన వ్యక్తి నిద్రలోకి జారుకున్నాడు. ► వెంకటరెడ్డికి తెల్లవారుజామున గురక శబ్ధం రావడంతో మెలకువ వచ్చి మంచం కింద చూడగా.. ముఖానికి మంకీ క్యాప్, చేతులకు గ్లౌసులు ధరించిన వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. వెంటనే వెంకటరెడ్డి తన భార్యతో కలిసి గది నుంచి బయటకు వచ్చి, తలుపుకు గడియ పెట్టి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి దొంగను అదుపులోకి తీసుకున్నారు. ► దొంగ మొహానికున్న ముసుగు తొలగించి చూడగా ఆ వ్యక్తి తనకు బాగా తెలిసిన సోడమిల్లి సూరిబాబు అని గుర్తించి వెంకటరెడ్డి కంగుతిన్నాడు. కాగా, తనకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉండటంతో దొంగతనం చేయాలనుకున్నానని ఆ వ్యక్తి పోలీసుల విచారణలో చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని విచారిస్తున్నారు. -
అయ్యో... రామ... చిలుకలు
సాక్షి, గోకవరం :రామచిలుక ఇంటి ఆవరణలో అరిస్తే చాలు ఆహ్లాదం ... ఇక కనుముందు కదలాడితే కనువిందే...అలాంటిది గాలివానకు చెట్టుపై నుంచి కింద పడి విలవిల్లాడుతూ గిలగిలా కొట్టుకుంటూ చనిపోతే...చూసినవారి మనసు చివుక్కుమంటుంది. అదే జరిగింది గోకవరం మండలంలో...బుధవారం కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి రామచిలుకల జంట మృత్యువాతపడ్డాయి. ఓ భారీ వృక్షం కొమ్మ తొర్రలో నాలుగు రామచిలుకలు తలదాచుకుంటుండగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో రెండు రామ చిలుకలు మృత్యువాత పడ్డాయి. మరో రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా స్థానిక యువకులు గుర్తించి సంరక్షించారు. -
సోషల్ మీడియాతో ఎన్నో అనర్థాలు
విషయంలో వాస్తవాన్ని పరిశీలించకుండా, బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని గుడ్డిగా నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ హితవు పలికారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యాన ‘సమా జంలో మార్పు – మీడియా పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అమర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గోకవరం (జగ్గంపేట): విషయంలో వాస్తవాన్ని పరిశీలించకుండా, బాధ్యతారహితంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియాతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, దీనిని గుడ్డిగా నమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ హితవు పలికారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యాన ‘సమా జంలో మార్పు – మీడియా పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సు మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో అమర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజే యూ) జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ, నేటి సమాజంలో సోషల్ మీడియా విస్తృతమైందన్నారు. సమాచారం వేగంగా అందజేయాలనే తపనలో మీడియా విశ్వసనీయతే ప్రమాదంలో పడిందన్నారు. సోషల్ మీడియా అసలు మీడియానే కాదన్నారు. పత్రికారంగంలో వేగం మంచిదే కానీ, ఆ తొందరలో పొరపాట్లకు తావీయకూడదని సూచించారు. మీడియాకు సామాజిక బాధ్యత ఉందని, ప్రతి అంశాన్నీ పరిశోధించి, వాస్తవాలను ప్రజల ముందుంచుతుందని చెప్పా రు. రాష్ట్రంలో నిరాదరణకు గురైన ప్రెస్ అకాడమీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభు త్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే ప్రెస్ అకాడమీకి చైర్మన్‌ను నియమించారని, త్వరలో సభ్యులను నియమించి విధివిధానాలను సిద్ధం చేస్తారని చెప్పారు. గతంలో ఓ వార్తను పత్రికా ప్రచురణ సంస్థకు పోస్టల్లో పంపించేవాళ్లమని, ఆ కవరు మూడు రోజుల తరువాత అందేదని, ఆ వార్త ప్రచురితమైన మూడు రోజుల తరువాత ఆ పత్రిక పట్టణాలకు చేరేదని పాత రోజుల పాత్రికేయ వృత్తిని గుర్తు చేశారు. తరువాత బస్సులు వచ్చాక, బస్సు డ్రైవర్‌కు రెండు రూపాయలు ఇచ్చి పంపించేవాళ్లమని, దీంతో వార్తల వేగం కొద్దిగా పెరిగిందని, ఇలా క్రమేపీ తన వేగా న్ని పెంచుకుంటూ నేడు జెట్ స్పీడుకు చేరిందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తోందని, టీవీలో ప్రత్యక్ష ప్రసారాలు వచ్చేస్తున్నాయని, దీంతో పత్రికల్లో తరువాత రోజు వచ్చిన వార్త పాచి వార్తగా తయారవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పత్రికలు అదే విషయాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి పోటీ పడుతున్నాయని, ఇది చాలెంజ్‌గా తయారైందని అమర్ అన్నారు. ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు బాధ్యత మీడియా పైనే ఉందని అన్నారు. గ్రామీణ పాత్రికేయులు వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలుత కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని అనేక అంశాలపై అవగాహన కలిగి ఉండి, సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి పాత్రికేయులు కృషి చేస్తున్నారన్నారు. పాలనా వ్యవస్థలోని నాలుగు ఎస్టేట్లలో పత్రికా రంగం ఒక భాగమన్నారు. ప్రజలకు మరిన్ని సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగానికి పాత్రికేయులు సహకారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ అస్మీ మాట్లాడుతూ, పోలీసు వ్యవస్థకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందిస్తున్నారన్నారు. ఏపి బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, చట్టాలపై పాత్రికేయులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, ఆదిత్య విద్యాసంస్థల తరఫున పాత్రికేయులకు జర్నలిజంపై శిక్షణ ఇచ్చేందుకు సహకారం అందిస్తామన్నారు. ఈ శిక్షణను ఐదు జిల్లాల్లోని తమ కళాశాలల్లో ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ నాయకుడు సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ తదితరులు కూడా ప్రసంగించారు. అనంతరం దేవులపల్లి అమర్, కె.శ్రీనివాస్‌రెడ్డిలను నల్లమిల్లి శేషారెడ్డి, సతీష్‌రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె.స్వాతిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్మూర్తి తదితరులు సన్మానించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యుడు డీఎస్ఎస్ రామాంజనేయరావు, జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు పాల్గొన్నారు. -
గోకవరంలో పర్యటించిన చిన్న జీయర్ స్వామిజీ
-
భక్తులతో పోటెత్తిన గోకవరం దేవీచౌక్
-
సం‘సారా’లు బుగ్గి..
సాక్షి, గోకవరం (తూర్పు గోదావరి): గ్రామాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. గ్రామాల్లో బెల్టుషాపుల నియంత్రణతో మద్యం ప్రియులు సారా వైపు చూస్తున్నారు. దీనిని అదునుగా చూసుకుని సారా వ్యాపారులు జోరుగా సారా తయారు, అమ్మకాలు సాగిస్తున్నారు. గోకవరం మండలంలో 14 పంచాయతీలు ఉండగా సుమారు 30 వరకు గ్రామాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా మారింది. సారా తయారీ దారులు సారా తయారీలో బెల్లం ఊటతో పాటు అమ్మోనియా వంటి పలు రసాయన పదార్థాలు కలపడంతో కల్తీ సారా తయారు కావడంతో తాగే వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఈ విషయం తెలిసినా అలవాటును వదులుకోలేనివారు సారాకు బానిసై ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. గోకవరంలోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీదారులు పోలీస్, ఎక్సైజ్ అధికారుల కళ్లుగప్పి సారాను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మండలంలో తంటికొండ, కామరాజుపేట, కొత్తపల్లి, మల్లవరం, గోకవరం, అచ్యుతాపురం, ఇటికాయలపల్లి, గోపాలపురం, గాదెలపాలెం, వెదురుపాక తదితర గ్రామాల్లో సారా తయారీ ఎక్కువగా జరుగుతోంది. ఆయా గ్రామాల్లో కాలువ గట్లు, మామిడి, జీడిమామిడి తోటల్లో భారీ స్థాయిలో సారా బట్టీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతిరోజూ వేల లీటర్ల సారా తయారవుతోంది. వీరికి గోకవరం, తదితర గ్రామాలకు చెందిన సారా బెల్లం వ్యాపారులు సారాను సరఫరా చేస్తున్నారు. గతంలో అర్ధరాత్రి సమయాల్లో సారాను తయారు చేసేవారు. సారా బెల్లం వ్యాపారులు నేరుగా బట్టీలకు సారా బెల్లాన్ని సరఫరా చేస్తుండడంతో పగటి పూటే ఈ సారా తయారీ జరుగుతోంది. విచ్చలవిడిగా సారా అమ్మకాలు మండలంలోని గోకవరం, తంటికొండ, ఇటికాయలపల్లి, అచ్యుతాపురం, కొత్తపల్లి, గాదెలపాలెం, గోపాలపురం, కామరాజుపేట, మల్లవరం తదితర గ్రామాల్లో సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పగలు రాత్రి అనే తేడా లేకుండా సారా అమ్మకాలు సాగుతుండడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా సారాకు బానిసలవుతున్నారు. కల్తీ సారా తాగడం వల్లన కొన్నేళ్ల క్రితం గుమ్మళ్లదొడ్డి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృత్యువాత పడగా, ఇటీవల తంటికొండకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. అలాగే అనేక మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇటీవల గోకవరం పోలీసులు పలు గ్రామాల్లో సారా అమ్మకాలు సాగిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఇంకా అనేక గ్రామాల్లో సారా అమ్మకాలు సాగుతున్నాయి. దీనిపై ఎక్సైజ్‌శాఖ అధికారులు స్పందించి మండలంలో సారా తయారీ, అమ్మకాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల అచ్యుతాపురం గ్రామంలో సారా తయారీ అమ్మకాలకు, తయారీకి వ్యతిరేకంగా గ్రామానికి చెందిన సీఐడీ యూత్ సభ్యులు ఉద్యమం చేపట్టారు. దీనిలో భాగంగా ఆదివారం సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ప్రతి గ్రామంలో ఈ విధంగా యువత ముందుకు వచ్చి సారాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే మంచి ఫలితం ఉంటుంది. నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తాం సారా తయారీ, అమ్మకాలపై నాలుగు నెలల్లో మార్పు తీసుకువస్తామని కోరుకొండ ఎక్సైజ్ శాఖ సీఐ కోలా వీరబాబు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. గ్రామాల్లో సారా వ్యాపారస్తులతో గ్రామపెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి వారిలో చైతన్యం తీసుకువస్తామన్నారు. ముందస్తుగా బైండోవర్లు నమోదు చేస్తున్నామని, అప్పటికీ మారకపోతే పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. -
వడదెబ్బతో బస్సులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి
సాక్షి, గోకవరం : వడదెబ్బతో ఓ ప్రభుత్వ ఉద్యోగి బస్సులోనే మృత్యువాత పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కాకినాడ అటవీశాఖలో పని చేస్తున్న మడి గంగరాజు ఇవాళ ఉదయం భార్యతో కలిసి కుమారుడి దగ్గరకు బయల్దేరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గంగరాజు మధ్యలోనే అస్వస్థతకు గురై... బస్సులోనే మృతి చెందారు. అప్పటివరకూ తనతో మాట్లాడిన భర్త విగతజీవిగా మారడంతో భార్య భోరున విలపించారు. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
గోకవరం ఎన్నికల ప్రచారంలో వైఎస్ విజయమ్మ
-
ఈసారి మోసపోవద్దు : విజయమ్మ
సాక్షి, తూర్పుగోదావరి : చంద్రబాబు అబద్దపు హామీలకు మరోసారి మోసపోవద్దని, రాజశేఖర్ రెడ్డి పాలన మళ్లీ రావాలంటే.. వైఎస్ జగన్ ద్వారానే అది సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని చంద్రబాబుపై మండిపడ్డారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీ ఇచ్చాడు.. కానీ ఏ ఒక్కరికీ మేలు జరగలేదని అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా గోకవరంలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్ విజయమ్మ ప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. కాంగ్రెస్‌కు అది నచ్చలేదు.. రాజశేఖర్ రెడ్డి మరణవార్త తెలియగానే చాలామంది చనిపోయారు. చనిపోయిన కుటుంబాలకు సాయం చేయాలనుందని జగన్ బాబు అన్నారు. వారి కుటుంబాలను ఓదార్చాలని అనుకున్నాడు. అయితే దీనికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అయినా ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. ఈ గోదావరి జిల్లాలోనే ఓదార్పును మొదలుపెట్టారు.. నా బిడ్డ మిమ్మల్ని ఓదార్చడానికి వస్తే.. మీరే నా బిడ్డకు ఓదార్పునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి కోసం అంతమంది చనిపోవడం.. జగన్ ఓదార్పు చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు. జగన్ చేసే ఓదార్పుకు ఎమ్మెల్యేలు, ఎంపీలను వెళ్లొద్దని హెచ్చరించారు. అలా చాలా మంది నాయకులు మాకు దూరమయ్యారు. అప్పుడూ ఇప్పుడూ మీరే అండగా ఉన్నారు. మా కుటుంబం మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటుంది. మీరంతా అండగా ఉన్నారు.. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడైనా, జగన్, షర్మిల పాదయాత్ర చేసినప్పుడైనా.. మీరంతా అండగా ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు కూడా మీరు అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే కాంగ్రెస్.. అనే స్థాయికి మహానేత ఎదిగారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుటి నుంచి మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి పార్టీకి జీవం పోశారు. అలాంటి వైఎస్కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగారు. మా కోసం బయటకు వచ్చిన 18ఎమ్మెల్యేలను, ఎంపీని గెలిపించుకోవాల్సి వచ్చింది. అప్పుడు మేము బయటకు వచ్చాము. నాకు, షర్మిలకూ మీరు అండగా నిలిచారు. మా కుటుంబం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఈ కట్టె కాలేవరకు.. రాజశేఖర్ రెడ్డి లేని లోటు నాకైతే ఉంటుంది. కానీ, మీకు రాజన్న పాలనను మళ్లీ అందించడానికి జగన్ ఉన్నాడు. ఇన్నేళ్లు ఎక్కడికి పోయావు ముఖ్యమంత్రి మాటకు, సంతకానికి విలువ లేకుండాపోతుంది. ఆ రోజు రుణమాఫీ చేయమని జగన్‌కు అందరూ చెప్పారు.. చేయలేనిది చేయలేననే చెబుతాను అబద్దం చెప్పడం మా నాన్న నాకు నేర్పించలేదు.. అని తన అన్న మాటకు జగన్ కట్టుబడిఉన్నాడు. మాట ఇస్తే కట్టుబడి ఉండాలి. కానీ చంద్రబాబు ఎన్ని అబద్దపు హామీలు ఇచ్చారు. జగన్ నవరత్నాల్లో భాగంగా.. రైతు చేతుల్లో ఏడాది 12,500 పెడతానంటే.. చంద్రబాబుకు అన్నదాత సుఖీభవ గుర్తొచ్చింది. తనకు కోటిమంది అక్కాచెల్లెలు అని..తాను పెద్దన్నయ్య అని చెప్పుకుంటున్నాడు. మరి ఇన్నేళ్లు ఎక్కడికి పోయావు. ఈ రోజు కొత్తగా పసుపు-కుంకుమ అని చెబుతున్నావు. 6400కోట్ల వడ్డీ కట్టకుండా ఇప్పుడు పదివేలు ఇస్తున్నారు. రెండు రూపాయాలకే 20లీటర్ల నీళ్లు అన్నాడు.. ఈ రాష్ట్రంలో నీళ్ల కన్నా మద్యం ఎక్కువగా కనిపిస్తోంది. బాబు పాలనలో ఆడవాళ్లకు ఏ విధమైనటువంటి భద్రత లేదు. సంధ్యారాణి, శిల్పా డాక్టర్లు చనిపోయినా.. ప్రభుత్వాధికారిణి వనజాక్షిని జుట్టపట్టుకుని లాగినా.. ఎటువంటి యాక్షన్లు తీసుకోరు. పైగా ఆ పని చేసిన వారికే మళ్లీ టిక్కెట్లు ఇస్తారు. 2.40లక్షల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఆరోగ్య శ్రీ , ఫీ రీయింబర్స్‌మెంట్‌ను గాలికొదిలేశారు. రైతులకు ఏడాదికి 12500, ఉచిత విద్యుత్, రైతు ప్రమాదవశాత్తు చనిపోతే 7లక్షలు.. గిట్టుబాటు, మద్దతు ధరలు రావాలంటే.. మళ్లీ సంక్షేమ రాజ్యం కావాలంటే.. జగన్ అధికారంలోకి రావాలి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల చంటిబాబును, ఎంపీ అభ్యర్థి వంగా గీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాబు పాలనలో ఆడవాళ్లకు భద్రత లేదు
-
వడ్డీకి తీసుకున్న వ్యక్తే హతమార్చాడు
తూర్పుగోదావరి : పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన ఫైనాన్సియర్ పోతంశెట్టి విష్ణుఈశ్వర్లు(50) అదృశ్యం కేసును పోలీసులు చేధించారు. గోకవరం మండలం తిరుమలాయపాలెంలో వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తే హత్య చేశాడని తేల్చారు. వివరాలు..గుడివాడకు చెందిన విష్ణుఈశ్వర్లు వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన షేక్షావలీకి సుమారు రూ.50 వేలు వడ్డీకి ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం విష్ణుఈశ్వర్లు, షేక్షావలీకి ఇచ్చిన డబ్బులు వసూలు చేసేందుకు తిరుమలాయపాలెంనకు వెళ్లాడు. అప్పటి నుంచి విష్ణు జాడ తెలియలేదు. విష్ణు కుటుంబ సభ్యులు శుక్రవారం షేక్షావలీ ఇంటి వద్దకు వచ్చి విచారిస్తుండగా వారికి కుళ్లిన వాసన రావడంతో వారికి అనుమానం మొదలైంది. లెట్రిన్ కోసం తవ్విన బావిలో వాసన రావడంతో పరిశీలించారు. అందులో తవ్విచూడగా విష్ణు శవమై కనిపించాడు. దీంతో విష్ణు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి షేక్‌షావలీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జనపథం - గోకవరం
-
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
గోకవరం (జగ్గంపేట) : మండల కేంద్రం గోకవరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక పోలీస్ స్టేష¯ŒSలో పని చేస్తున్న కానిస్టేబుల్ యర్రా శ్రీనివాస్ (32) దుర్మరణం చెందాడు. ఏలేశ్వరానికి చెందిన ఐదేళ్లుగా ఆయన ఇక్కడ పని చేస్తున్నారు. ఇటీవల స్టేష¯ŒSకు సంబంధించిన కోర్టు బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారు. బుధవారం సాయంత్రం స్టేష¯ŒS నుంచి ఇంటికి బైక్‌పై వెళుతుండగా ఎల్ఐసీ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యలో ఉన్న మలుపులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్సై వెంకటసురేష్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని.. సహోద్యోగి ఇలా మృతి చెందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కోరుకొండ సీఐ మధుసూదనరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గోకవరం జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, అధిక సంఖ్యలో స్థానిక నాయకులు, గ్రామస్తులు ప్రమాద స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశిష్ట సేవా పురస్కార గ్రహీత... శ్రీనివాస్ ఇటీవల రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. కోరుకొండ తీర్థంలో కొండపై ఆయన విధులు నిర్వహిస్తుండగా కొండపై అస్వస్థతకు గురైన బాలికను శ్రీనివాస్ భుజంపై వేసుకుని కిందకు తీసుకువచ్చారు. ఇందుకు ఆయన అవార్డు అందుకున్నారు. స్టేష¯ŒSకు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించేవారని, ఈ నెలాఖరుకు బదిలీ అయ్యే అవకాశం ఉందని, ఈలోగా ఈ ప్రమాదంలో మృతి చెందారని సహచర కానిస్టేబు ళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్ పరామర్శించారు. -
గర్భిణిపై పోలీసు జులుం
పోలీస్‌స్టేషన్ ఎదుట గ్రామస్తుల బైఠాయింపు పురుగు మందు తాగిన యువకుడు ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి ఉద్రిక్తం గోకవరం (జగ్గంపేట) : కోడిపందేల అణచివేతకు పోలీసులు అతిగా ప్రవర్తించడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మండలంలోని గంగంపాలెంలో శుక్రవారం ఉదయం ఒక ఇంటో కోడిపుంజులు ఉన్నాయని, బెల్టు షాపు నిర్వహిస్తున్నారంటూ వెన్నముద్దల గణపతిని అదుపులోకి తీసుకునేందుకు ఎస్సై వెంకటసురేష్, కానిస్టేబుల్ త్రిమూర్తులు ప్రయత్నించారు. ప్రశ్నించిన గణపతి భార్య, గర్భిణి సుబ్బలక్ష్మి మెడపై చేయి వేసి పోలీసులు నెట్టివేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గోకవరం పోలీస్‌స్టేçÙ¯ŒS ఎదుట బైఠాయించారు. ఇదిలా ఉండగా, గ్రామానికి చెందిన యువకుడు సరకణ నాగు పురుగు మందు తాగడంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఇతడిని గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు తదితరులు ఆస్పత్రికి వెళ్లి అతడి పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, గంగంపాలెం ఎంపీటీసీ మాజీ సభ్యుడు సాలపు నలమహారాజు, ఎంపీటీసీ దొడ్డి నాగేశ్వరరావు, నాయకులు కర్రి సూరారెడ్డి, మంగరౌతు రామకృష్ణ, కన్నబాబు తదితరులు స్టేష¯ŒS వద్దకు చేరుకుని బాధితులు, పోలీసులతో మాట్లాడారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా నార్త్ జో¯ŒS డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, కోరుకొండ సీఐ మధుసూదనరావు స్టేష¯ŒSకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సంఘటనపై విచారణ చేస్తామని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు తావేలేకుండా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సుమారు మూడు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగడంతో పెద్ద సంఖ్యలో వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
క్లస్టర్ విధానంలో సేంద్రియ సాగు
రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు విజయ్‌కుమార్ గోకవరం : క్లస్టర్ విధానం ద్వారా రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతిసేద్య సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.విజయ్‌కుమార్ తెలిపారు. గోకవరం మండలం వీరలంకపల్లిలోని కొరిపల్లి అప్పలస్వామి అనే రైతు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 131 క్లస్టర్లలో రెండు లక్షల మంది రైతులతో సేంద్రియ సాగు చేపట్టామన్నారు. సుమారు 300 రైతులతో మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న మూడేళ్లలో ఒక్కొక్క క్లస్టర్ నుంచి 30 మంది రైతులను ఎంపిక చేసి, వారి ద్వారా మిగిలిన చోట్ల సేంద్రియ సాగును విస్తరిస్తామన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువులు వాడుతున్న పొలాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోలేకపోతున్నాయని విజయ్‌కుమార్ తెలిపారు. వాటితో పోలిస్తే సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలే ప్రకృతి వైపరీత్యాల వల్ల సోకుతున్న అనేక చీడపీడలను తట్టుకుని నిలబడగలుగుతున్నాయన్నారు. సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాల విక్రయ షాపులను త్వరలో అన్నిచోట్లా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జేడీఏ కేఎస్వీ ప్రసాద్, వ్యవసాయశాఖ సంచాలకుడు లక్ష్మణ్‌రావు, ఆత్మా పీడీ పద్మజ, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ సుబ్బారావు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ యువతా ప్రకృతి సాగు వైపు.. ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన యువత కూడా సేంద్రియ సాగుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి కనబరుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రకృతి సేద్య సలహాదారు, రైతు సాధికారిక సంస్థ ఉపాధ్యక్షుడు పి.విజయ్‌కుమార్ అన్నారు.రైతులంతా సేంద్రియ సాగుపై మక్కువ చూపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయనన్నారు. వ్యవసాయశాఖ, కదలిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని చందా సత్రంలో నిర్వహిస్తున్న సహజ సేద్యం కళాజాతాలో బుధవారం సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా నిరోధించి నాణ్యమైన దిగుబడిలే లక్ష్యంగా రాష్ట్రంలో వివిధ గ్రామాల్లో ప్రకృతి సేద్య ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.జేడీఏ కేఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి సేద్యం కోసం వివిధ మండలాల్లో క్లస్టర్ గ్రామాలను ఎంపిక చేశామన్నారు. అనంతరం ఆర్అండ్ బీ అతిథి గృహంలో జిల్లాలోని ఏడీఏలు, ఏవోలు, ఏఈవో, ఎంపీఈవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ పద్మజ, ప్రకృతి సేద్య నిపుణులు వైవీ సుబ్బారావు, పవన్, రాజమహేంద్రవరం ఏడీఏ సూర్య రమేష్ పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో తాచుపాము కలకలం
గోకవరం : బుసలు కొడుతూ ఓ తాచుపాము గోకవరం ప్రభుత్వాస్పత్రిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటనతో ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది హడలిపోయారు. శనివారం ఉదయం స్వీపరు ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేస్తుండగా తాచుపాము తారసపడింది. ఆమె భయంతో గట్టిగా కేకలు పెట్టడంతో.. ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పాము అక్కడున్న సిమెంటు దిమ్మ కిందకు చేరుకుంది. పడగవిప్పి బుసలు కొట్టడంతో దాని దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించ లేదు. విషయం తెలుసుకున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ పామును హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడు నెలల క్రితం కూడా ఆస్పత్రిలోకి ఇలాగే తాచుపాము ప్రవేశించగా అప్పట్లో కొట్టి చంపారు. -
యువతి మృతదేహంతో పీఎస్ ఎదుట ధర్నా
గోకవరం (తూర్పుగోదావరి) : వేధింపులు తాళలేక ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న యువతికి న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలవారు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గురువారం సాయంత్రం గోకవరం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలి బంధువులతో కలిసి ధర్నాకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బాల స్వాతి(22) పాల్టెక్నిక్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్‌బాబు తనను ప్రేమించాల్సిందిగా వెంటపడి వేధిస్తుండేవాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేశారు. అయినా ఆనంద్ వేధింపులు మానుకోకపోగా తన స్నేహితులు శివ, వీరబాబులతో కలిసి మరింత ఎక్కువగా వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురైన స్వాతి ఈ నెల 15న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి బుధవారం శవమై తేలింది. వేధింపుల వల్లే యువతి మృతిచెందిందని ఆగ్రహించిన మహిళా సంఘాలవారు గురువారం మృతదేహంతో గోకవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. -
మద్యంపై పోరే నేరమా?
గోకవరం మండలం గంగంపాలెంలో మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా ఎగసిన ఉద్యమంలో పాలు పంచుకున్న క్రమంలో.. కొందరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైకేసు నమోదు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకుడు, గ్రామ సర్పంచ్ భర్త, మరో యువకుడు ఆత్మాహుతికి యత్నించారు. పోలీసుల అనుచిత వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జోక్యంతో శాంతించారు. గోకవరం : మండలంలోని గంగంపాలెంలో యువకులు ఇటీవల మద్యంపై ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలోని సారా బట్టీలపై దాడులు నిర్వహించి సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో బెల్టు షాపులపైనా నిఘా పెట్టి ఎక్సైజ్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో బెల్టు షాపు మూసేయాలని నిర్వాహకుడైన ఆరుగొల్లి రాంబాబును హెచ్చరించారు. దీంతో తనపై గ్రామానికి చెందిన పలువురు యువకులు దాడి చేశారని రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముక్కా రాజు, వెలమశెట్టి శ్రీను, మరో ఐదుగురిపై రాజమండ్రి అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ జి.మురళీకృష్ణ బుధవారం ఉదయం విచారణ నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా తమ వర్గీయులపై అక్రమంగా అట్రాసిటీ కేసు బనాయించారని ఆరోపిస్తూ సర్పంచ్ సాలపు గంగాభవాని భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు నలమహారాజు పంచాయతీ కార్యాలయంలో తలుపులు వేసుకుని పెట్రోల్ క్యాన్ వెంట ఉంచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నలమహారాజును అనునయించారు. ఆయన ఎంతకీ బయటకు రాకపోవడంతో నెహ్రూ వెంట ఉన్న నాయకులు తలుపులు పగులగొట్టి బయటకు తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన మహిళలు విచారణ సందర్భంగా డీఎస్పీ తమతో అనుచితంగా వ్యవహరించారని, అసభ్య పదజాలంతో దూషించారని నెహ్రూ వద్ద వాపోయారు. ఆగ్రహం వ్యక్తం చేసిన నెహ్రూ గోకవరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్సై ఆర్.శివాజీతో మాట్లాడారు. డీఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుపట్టారు. విషయం తెలిసి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, గంగంపాలెం మహిళలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఓ యువకుడు పెట్రోల్ ఒంటిపై పోసుకుని స్టేషన్లోకి చొరబడి డీఎస్పీ రాకపోతే ఆత్మహత్యకు పాల్పడతానడంతో ఉద్రిక్తత నెలకొంది. కోరుకొండ సీఐ సన్యాసిరావు, ఎస్సై తదితరులు ఆ యువకుడిని వారించి పెట్రోల్ క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కేసులను సహించం : జ్యోతుల సుమారు రెండు గంటల ఆందోళన అనంతరం డీఎస్పీ మురళీకృష్ణ పోలీస్‌స్టేషన్ వచ్చి నెహ్రూతో మాట్లాడారు. మద్యంపై ఉద్యమించిన యువకులపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టడంపై నెహ్రూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామ మహిళలతో అనుచితంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందని నిలదీశారు. సర్పంచ్ భర్త ఆత్మహత్యకు యత్నించినాకనీసం స్పందించలేదన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని, తాను వచ్చాకే తమ వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారని విమర్శించారు. రెండు కేసులనూ వెంటనే తొలగించి, పరిస్థితులు చక్కబడే వరకు గ్రామంలో బందోబస్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ సానుకూలంగా స్పందించడంతో నెహ్రూ బయటకు వెళ్లి ధర్నాకు దిగిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. న్యాయం జరుగుతుందని ఆయన ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. ఆందోళనతో గ్రామంలోని ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. -
గోకవరం స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో చోరీకి యత్నం
గోకవరం : స్థానిక స్టేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి దొంగలు యత్నించారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామంలో ఎంపీపీ ప్రధాన పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. ఏటీఎంలో రెండు మెషీన్లు ఉండగా, ఒకదానిని తెరిచేందుకు తీవ్రంగా యత్నించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. ఏటీఎంలో నగదు ఉంచేందుకు రాజమండ్రికి చెందిన రైటర్స్ సేఫ్ గార్డ్స్ అనే ప్రైవేటు సంస్థకు చెందిన సిబ్బంది బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఏటీఎం వద్దకు వచ్చారు. ఏటీఎం మెషీన్ అడుగు భాగం, సీసీ కెమెరా ధ్వంసమై ఉండడాన్ని గుర్తించి వారు ఏటీఎం ఆఫీసర్ జి.ఆనంద్ విజయ్‌కుమార్‌కు సమాచారం అందించారు. దీనిపై ఆయన గోకవరం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై ఆర్.శివాజీ సిబ్బందితో ఏటీఎం వద్దకు చేరుకుని పరిశీలించారు. ఏటీఎంలో ధ్వంసమైన సీసీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
రుణమాఫీపై అసెంబ్లీలో తీర్మానించాలి
గోకవరం : సంపూర్ణ రుణమాఫీ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం గోకవరం వచ్చిన ఆయనను కృష్ణునిపాలెం రైతులు కలుసుకున్నారు. బాకీ తీర్చమంటూ బ్యాంకు నుంచి వచ్చిన నోటీసులను వారు ఎమ్మెల్యేకు చూపించారు. తాము ఈ బకాయిలు చెల్లించే స్థితిలో లేమని, తమను ఆదుకోవాలని వారు కోరారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ తాను సీఎం అయిన తరువాత తొలి సంతకం రైతు రుణమాఫీపైనే చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నమ్మబలికారన్నారు. ఆయన మాటలను విశ్వసించి ఆయనను ప్రజలు గెలిపిస్తే రుణమాఫీపై కమిటీ వేస్తూ సంతకం చేశారన్నారు. దాంతో బ్యాంకు అధికారులు అన్ని రకాల వ్యవసాయ రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు. ఇప్పటికైనా సీఎం తన హామీకి కట్టుబడి రుణమాఫీని అమలు చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో సంపూర్ణ రుణమాఫీకి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. బకాయిలను తీర్చమని రైతులపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండేలా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఖరీఫ్ సాగుకు బ్యాంకుల ద్వారా కొత్త రుణాలను అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడతామన్నారు. -
చౌక బంగారం పేరుతో టోకరా
రూ. 2.80 లక్షలతో పరారైన మోసగాళ్లు బాధిత మహిళలు గుంటూరు వాసులు గోకవరం, న్యూస్‌లైన్ : గోకవరంలో సర్వసాధారణమైన చౌక బంగారం మోసం కేసులు స్థానిక పోలీసు స్టేషన్లో యథావిధిగా నమోదవుతున్నాయి. పోలీసులు వీటిని అరికట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేయకపోవడంతో మోసగాళ్ల వలలో పడి పలువురు మోసపోతూనే ఉన్నారు. చౌకగా బంగారం విక్రయిస్తామని చెప్పి ఇద్దరు మహిళలను మోసగించిన ఘటన తాజాగా జరిగింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నమోదైన ఈ కేసు వివరాలు ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. గుంటూరుకు చెందిన కోపూరి లక్ష్మి, ఆమె పెదనాన్న కుమార్తె కృష్ణవేణిలకు రాజు అనే వ్యక్తి పరిచయమై తక్కువ మొత్తానికి ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మబలికాడు. అతడి మాట నిజమోకాదో తేల్చుకునేందుకు లక్ష్మి, కృష్ణవేణి ఈనెల 4న గోకవరం వచ్చారు. వీరిని రాజు గోకవరంలోని డ్రైవర్స్‌కాలనీకి తీసుకువెళ్లి ఓ ఇంట్లో బంగారం చూపించాడు. అప్పుడు అతడితోపాటు మరికొందరు వ్యక్తులు ఉన్నారు. దీంతో ఆ మహిళలిద్దరూ గుంటూరు వెళ్లి ఈనెల 6న రూ. 2.80 లక్షలతో తిరిగివచ్చారు. వీరిని డ్రైవర్స్‌కాలనీలో ఆ ఇంటి వద్దకు తీసుకువెళ్లిన కొందరు వ్యక్తులు ముందుగా నగదు తీసుకున్నారు. బంగారం తెచ్చే సమయానికి ‘పోలీసులు, పోలీసులు.. ’అంటూ కేకలు వేస్తూ అక్కడి నుండి పారిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఇద్దరు మహిళలు గోకవరం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోకవరంలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నా నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసగాళ్లెవరో పోలీసులకు తెలిసినా పట్టించుకోకుండా వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
బస్సు కింద పడి యువకుడి దుర్మరణం
గోకవరం, న్యూస్‌లైన్ : గోకవరంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు దుర్మరణం చెందాడు. దేవీపట్నం మండలం పోతవరం గ్రామానికి చెందిన కారం కృష్ణ ప్రసన్నదొర (23), తన స్నేహితుడు మడకం రమేష్దొరతో కలసి రంపచోడవరం మండలం పోలవరం గ్రామానికి వ్యవసాయ పనులకు బైక్‌పై బయలుదేరాడు. గోకవరం చేపల మార్కెట్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కృష్ణప్రసన్నదొర ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడిపోయాడు. అతని స్నేహితుడు మరో పక్కకు పడిపోయ ూడు. బస్సు కింద పడిన కృష్ణప్రన్నదొరను బస్సు కొంత దూరం ఈడ్చుకుపోవడంతో శరీరం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుడు సుమారు 20 నిమిషాలు మృత్యువుతో పోరాడాడు. పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రుడిని ఆటోపై స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే క్షతగాత్రుడు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తల్లి కారం నాగమణి ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టించింది. నాగమణికి ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్దకుమారుడైన కృష్ణ ప్రసన్నదొర ఇటీవల పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. చేతికి అందివచ్చిన కొడుకు ఈ విధంగా ప్రమాదంలో మృతి చెందాడని ఆమె విలపించింది. సంఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గోకవరం ఎస్సై జీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 వాహనాల సేవలను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని వారు కోరారు.