రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం | constable dead | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

Published Wed, Apr 5 2017 11:47 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం - Sakshi

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

గోకవరం (జగ్గంపేట) : 
మండల కేంద్రం గోకవరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక పోలీస్‌ స్టేష¯ŒSలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ యర్రా శ్రీనివాస్‌ (32) దుర్మరణం చెందాడు. ఏలేశ్వరానికి చెందిన ఐదేళ్లుగా ఆయన ఇక్కడ పని చేస్తున్నారు. ఇటీవల స్టేష¯ŒSకు సంబంధించిన కోర్టు బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారు. బుధవారం సాయంత్రం స్టేష¯ŒS నుంచి ఇంటికి బైక్‌పై వెళుతుండగా ఎల్‌ఐసీ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మధ్యలో ఉన్న మలుపులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్సై వెంకటసురేష్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని.. సహోద్యోగి ఇలా మృతి చెందడంతో కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. కోరుకొండ సీఐ మధుసూదనరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గోకవరం జెడ్పీటీసీ పాలూరి బోసుబాబు, అధిక సంఖ్యలో స్థానిక నాయకులు, గ్రామస్తులు ప్రమాద స్థలానికి చేరుకుని జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశిష్ట సేవా పురస్కార గ్రహీత... 
శ్రీనివాస్‌ ఇటీవల రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. కోరుకొండ తీర్థంలో కొండపై ఆయన విధులు నిర్వహిస్తుండగా కొండపై అస్వస్థతకు గురైన బాలికను శ్రీనివాస్‌ భుజంపై వేసుకుని కిందకు తీసుకువచ్చారు. ఇందుకు ఆయన అవార్డు అందుకున్నారు. స్టేష¯ŒSకు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించేవారని, ఈ నెలాఖరుకు బదిలీ అయ్యే అవకాశం ఉందని, ఈలోగా ఈ ప్రమాదంలో మృతి చెందారని సహచర కానిస్టేబు ళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌ పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement